Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 057 (Is Israel Responsible for their Unbelief?)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు, ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)
4. దేవుని నీతి కేవలము విశ్వాసము ద్వారానే కలుగును, మరియు ధర్మశాస్త్రమును లోబడునట్లు కాదు (రోమీయులకు 9:30 - 10:21)

d) ఇశ్రాయేలీయులు వారి అవిశ్వాసమును బట్టి బాధ్యతకలిగి ఉన్నారా? (రోమీయులకు 10:16-21)


రోమీయులకు 10:16-21
16 అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా? 17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును. 18 అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా?వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను. 19 మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా?జనము కానివారివలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగ జేతును. అని మొదట మోషే చెప్పుచున్నాడు. 20 మరియు యెషయా తెగించినన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. 21 ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు.

రోమా లో ఉన్న స్నాఘమునకు పౌలు ఈవిధముగా చెప్పెను, యూదులలో ఎక్కువమంది మెస్సయ్య కొరకు ఎదురుచూసారు, అయితే వారికి శుభవార్త రాలేదు కనుక వారు దేవుని వాక్యమును ఎప్పుడు వ్యతిరేకించిరి. 2700 సంవత్సరాల క్రితము ఈ విధముగానే ప్రవక్త అయినా యెషయా వారి కొరకు బాధపడి శ్రమపొంది ఉన్నాడు: " మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? (యెషయా 53:1)

యూదులలో అనేకులు సువార్తను విన్నారు. అయితే వారు దానిని విశ్వసించలేదు మరియు అర్ధము చేసుకొనలేదు. వారిలో కొంతమంది కృప వచ్చేనని అనుకొనిరి అయితే దానిని బట్టి లోబడుటకు ఇష్టపడకపోయిరి. వారు రక్షించు ప్రభువు కంటే వారి అవిశ్వాసమును మరియు వారి కఠినమైన పరిస్థితులను మాత్రమే ప్రేమించిరి, మరియు వారు సృష్టికర్తను కంటే ఎక్కువగా మనుషులకే భయపడిరి.

పౌలు వీటిని బట్టి అతను మునుపు చెప్పిన మాటలను బట్టి సమాధానమును ఇచ్చెను; అదే విశ్వాసము అనునది కేవలము వినుటవలనే వచ్చును అని. ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏమనగా, సువార్త అనునది నీకు ఒక పాట ద్వారా, లేక బైబిల్ వచనము ద్వారా వచ్చినదా అన్నది కాదు ముఖ్యము అయితే ఎప్పుడైతే దేవుడు నీ హృదయమును తట్టునో అప్పుడే నీవు నీ హృదయ వాకిలిని తెరవాలి, లేని యెడల నీవు అపాయములోనికి వెళ్లినట్లు. కనుక ఎవరైతే సువార్తను ఇతరులకు వివరించునప్పుడు పెద్ద పెద్ద అర్థాలు లేని మాటలచేత కాక వారు హృదయములలో అర్థము కలిగి వెళ్లునట్లుగా ప్రకటించాలి. చెప్పువాడు వినువారికి అర్థము కలిగే భాషలో చెప్పాలి. దానిలోని అర్థమును తేటగా వివరించాలి. కనుక ఎవరైతే ప్రకటించుటకు సిద్దపడునో వాడు ముందుగానే నేర్చుకొని సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యమును మరియు ఆయన చిత్తమును వివరించునప్పుడు అతనికి ప్రార్థన కూడా తోడుగా ఉండాలి; మరియు ప్రకటించువాడు ఏమి ప్రకటించుచున్నాడో ముందుగా అతను నమ్మాలి అప్పుడు సాక్ష్యముద్వారా దేవునికి కృతజ్ఞత చెప్పాలి.

ప్రకటించుట మరియు బోధించుట అనునవి సహజముగా వచ్చునవి కావు, అయితే అది ప్రభువు నుంచి వచ్చిన పిలుపులు, మరియు అతని శక్తిచేత మరియు అతని ఆజ్ఞ చేత పునాది వేయబడినవి. కనుక మన సువార్త మీద మన నమ్మకము కంటే యేసు పైన మనకున్న విశ్వాసమే గొప్పది, ఎందుకంటె దేవుడు తన వాక్యమును ఎవరైతే వింటారో వారికి తెలియపరచుటకు మనకు యిచ్చియున్నాడు; వారిని హెచ్చరించి, నేర్పించి, పిలిచి, మరియు వారిని ఉత్తేజపరచుటకు మనకు ఇవ్వబడినది. ప్రకటించువాడు క్రీస్తుకు బదులుగా ప్రకటించకూడదు అయితే అతనికి ఒక ప్రతినిధిగా అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు ప్రకటించాలి: "కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమైదేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము" (కొరింతి 5:20)

పౌలు ఆశ్చర్యము కలిగి: యూదులలో అనేకులు ఒకవేళ క్రీస్తు రక్షణను బట్టి వినలేదు. వారికి ఒకవేళ యెవ్వరుకూడా రక్షకునిని బట్టి చెప్పలేదు. దానికి మనము కీర్తన 19:5 లో సమాధానమును మనము చూడగలము; దేవుని యొక్క వాక్యము సూర్యుని కాంతివలె ఉండును, అది ఒక దిక్కునుంచి ప్రారంభమయ్యి వేరే దిక్కునకు వ్యాపించునట్లు; మరియు అతని వేడిలో ఏవిధమైన మర్మము లేదు. యేసు సమయములో అతని అద్భుతములను చూచుటకు అక్కడున్న ప్రజలు పరిగెత్తుకుని వస్తూ ఉండిరి. ఈ దినాలలో మనము ఎవరైనా వినాలనుకుంటే వినవచ్చు అని చెప్పగలము; మరియు ఎవరైతే వెతుకుతారో వారు కనుగొనెదరు. ఒకవేళ సువార్తను వినాలని అనుకుంటే ఈ దినాలలో రేడియోలలో మరియు టీ వీ లలో చూడవచ్చు మరియు వినవచ్చును.

ఈ దినము మనిషి ఆశ్చర్యపోతున్నారు: నేను ఏమి ఎన్నుకోవాలి: ధనము లేక ఆత్మ? ధనమా లేక దేవుడా? నేను ఘనతను, శక్తిని, వాంచ్చా మరియు వినోదమును వెతుకుతున్నానా? ఎందుకంటె మనుషులు వారి జీవితములలో వారికొరకు సమర్పించుకుంటారు. అయితే ఎవరు విని సృష్టికర్తకు సేవ చేస్తారు? పౌలు ఆశ్చ్యర్యపోతున్నాడు: యాకోబు పిల్లలకు చెప్పినది వారికి ఒకవేళ అర్థము కాలేదేమో! లేకా వారికి సువార్త సంపూర్ణముగా వారికి తీసుకొని రాలేదేమో! అయితే దేవుడు ఈ ప్రశ్నలకు మోషే ద్వారా ముందుగానే సమాధానము చెప్పెను. "వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టిం చిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టిం తును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును" (ద్వితీ 32:21)

ఈ వాక్యంలో దేవుని యొక్క ఉద్దేశము ఏమనగా: " నీవు నా మాటలను వినుటకు సిద్ధపడలేదు కనుక, నన్ను నేను ఏర్పరచుకొనని వారికి మరియు విద్యలేని వారికి బయలుపరచుకొని నా ప్రేమను వారిని పంచెదను. ఎన్నికలేని వారు ఏవిధముగా నన్ను అంగీకరించెదరో నీకు చూపెదను, ఎందుకంటె వారు చాల ఖఠినస్తులు. వారు నన్ను ప్రేమించునట్లు మరియు నన్ను ఘనపరచునట్లు నేను వారిని నడిపించెదను.”

" నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను " అని దేవుడు యెషయా ప్రవక్తకు 600 సంవత్సరాల క్రితమే వివరించెను (యెషయా 65:1; రోమా 9:30)

ఈ దినాలలో దేవుడు అవిశ్వాసులు అతను ఉన్నాడని తెలుకొనునట్లు వారు మార్గములను దేవుడు వ్యతిరేకిస్తున్నారు. ఎవరైతే అతనిని పట్టించుకోరో వారితో కలలో, కార్యములద్వారా మరియు రోగములద్వారా మాట్లాడును. ఈ లోకములో ఉన్న ఏ ఒక్క సైంటిస్ట్ కూడా సృష్టికర్త మాదిరి దేనిని కూడా సృష్టించలేదు. అయితే అదే సమయములో దేవుని యందు విశ్వాసము కలిగిన వారు దేవుని యొక్క గొప్ప సృష్టిని బట్టి నిర్లక్ష్యము కలిగి మరియు అతని నుంచి ప్రక్కకు తిరుగుతున్నారు. ఈ పరిస్థితినే పౌలు తన సువార్త ప్రయాణములలో చూసిన మరియు అనుభవించిన శ్రమలను సంతోషముతో స్వీకరించి ఉన్నాడు (అపొస్తలుల 28:24-31).

యెషయాకు కూడా దేవుడు చెప్పినాడు: "తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు నా భయములేక నాకు నిత్యము కోపము కలుగజేయు చున్నారు" (యెషయా). ఈ మాట ద్వారా దేవుడు తన చేతులను ఎవరైతే లోబడి ఉంటారో వారికొరకు చాచునని, ఒక తల్లి తన పిల్లలను నాశనములోనికి పడిపోకుండా ఏవిధముగా తన చేతులను చాచునో అదేవిధముగా దేవుడు తన చేతులను చాచును. కనుక ప్రభువు తన ప్రజలను కాపాడుటకు ఇష్టపడెను, అయితే అందుకు వారు సిద్ధముగా లేరని అతను అనుభవించెను. కనుక వారు ఇష్టపూర్వకంగానే అతనికి లోబడక అతని మాటలను వ్యతిరేకించిరి.

ఎవరైతే దేవుని విడిచి ప్రత్యేకముగా ఉన్నారో వారి యెడల తన ప్రేమ గొప్పదై ఉన్నది. దానికి బదులుగా దేవుడు వారికి తన ప్రేమను ఎల్లప్పుడూ దయచేసెను. అయితే చివరిలో తీర్పుతీర్చువాడు అతను ఎవరినైతే ఎన్నుకొన్నాడో వారిని తన తీర్పుదినమునకు తీసుకొనివచ్చును. వారు ఉద్దేశ్యముతో అతనికి లోబడక, వారిని అతను రక్షించుట అతనికి ఇష్టములేకపోయెను. వారు ఒక గొయ్యి గూర్చి ముందే హెచ్చరించబడిన గ్రుడ్డివారైరి, అప్పుడు అందులో వారు ఇష్టపూర్వకంగానే పడిపోవుదురు. అప్పుడు ప్రభువు తన ప్రేమకంటే ఎక్కువగా ఇశ్రాయేలీయుల చెడ్డ కార్యములను బట్టి వారే బద్యులని చెప్పెను.

ప్రార్థన: యేసు క్రీస్తు తండ్రి నీవు మాకొరకు నీ చేతులను చాచిన తండ్రివి, ఒక తల్లి తన కుమారుడు పడిపోకుండునట్లు తన చేతులతో చాచినట్లు. నీ ప్రేమను బట్టి మేము నిన్ను ఆరాధిస్తున్నాము, మరియు యాకోబు పిల్లల యొక్క చెవులను తెరువుము అప్పుడు వారు యేసు వాక్యమును వింటారు, అప్పుడు వారు దానిని ఆనందముతో కృతజ్ఞతతో లోబడి ఉండెదరు.

ప్రశ్నలు:

  1. ఈ దినాలలో మనుషులు ఇష్టపూర్వకంగా విని, అర్థము చేసుకొని, సువార్తను ఎలా అంగీకరిస్తున్నారు?
  2. దేశమంతటిలో దేవుడు ఎందుకు కొందరిని మాత్రమే ఎన్నుకొన్నారు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:23 AM | powered by PmWiki (pmwiki-2.3.3)