Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 056 (The Absolute Necessity of the Testimony of the Gospel)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు, ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)
4. దేవుని నీతి కేవలము విశ్వాసము ద్వారానే కలుగును, మరియు ధర్మశాస్త్రమును లోబడునట్లు కాదు (రోమీయులకు 9:30 - 10:21)

c) యాకోబు సంతతికి కావలసిన సువార్త యొక్క సాక్ష్యము (రోమీయులకు 10:9-15)


రోమీయులకు 10:9-15
9 అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. 10 ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. 11 ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. 12 యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు. 13 ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. 14 వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు? 15 ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారిపాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది 

రోమా లో ఉన్న సంఘ క్రైస్తవులకు పౌలు ఆత్మీయ యుద్ధమును గూర్చి చెప్పెను. ప్రకటించుటలో రకరకాల మార్గములు ఉన్నాయని చెప్పెను. నిజమైన విశ్వాసము హృదయములో కలుగును కనుక ఎంతో మంది హృదయమందు విస్వసించెదరు. విశ్వాసము అనగా అతని యందు సంపూర్ణముగా విశ్వాసము కలిగి ఉండుట.

విశ్వాసమునకు మంచి సాక్ష్యము కూడా అవసరము ఎందుకంటె సత్యము అనునది చీకటిని పారద్రోలును కనుక. విశ్వాసము మరియు సాక్ష్యము రెండు కలిగి ఉంటాయి. సాక్ష్యము అనునది విశ్వాసమును గూర్చి మాటలాడును మరియు వినువారికి అర్థము కలుగునట్లు మరియు సాక్ష్యమును ఆ విశ్వాసము స్థిరపరచును.

విశ్వాసమును గూర్చి పౌలు మరియు క్రీస్తు సాక్ష్యులు కొన్ని రకాలుగా చెప్పి ఉన్నారు:

1. యేసు ప్రభువై ఉన్నాడు. అతను సృష్టినంతటినీ స్వాధీనములో ఉంచుకొన్నాడు, మరియు సర్వాధికారము ఆయనకు ఇవ్వబడినది. దావీదు చెప్పినట్లు: ప్రభువు నా ప్రభువుతో చెప్పెను: " ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము" (కీర్తన 110:1) అపొస్తలుడైనా యోహాను చెప్పినట్లు దేవుని గొర్రెపిల్ల ఆ సింహాసనము కుడి వైపును కూర్చున్నది అని (ప్రకటన 5:1-14); మరియు పౌలు చెప్పినట్లు మహిమ కలిగిన సిలువ ద్వారా క్రీస్తు మరణమునుండి తిరిగి లేచెను, అప్పుడు యేసు నామములో ప్రతి మోకాలు వంగును, పరలోకమందును మరియు ఈ భూమియందును, మరియు ఈ భూమి క్రిందనో, మరియు యేసు క్రీస్తే ప్రభువని మరియు తండ్రి అయినా దేవుని మహిమని ప్రతి నాలుకా ఒప్పుకొనును (ఫిలిప్పి 2:5-11)

"యేసు ప్రభువు" అనే మాట క్రైస్తవులకు వారి విశ్వాసముతో ఒక వెన్నెముకలాంటిది. దాని అర్థము ఏమిటంటే త్రిత్వములో యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని. అతను తన పరలోకమందున్న తండ్రితో సమాధానము కలిగి ఉన్నాడు.

2. ఎప్పుడైతే క్రీస్తు మృతి నుంచి లేచాడో అప్పుడు క్రీస్తు యొక్కముక్తి అన్నది సత్యముగా పరిశుద్ధ దేవునిలో జరిగినది, అతను సిలువ వేయబడి మృతిపొంది తిరిగి జీవించెను. క్రీస్తు యొక్క పునరుత్తనము అనునది క్రైస్తవ విశ్వాసులకు ఒక రెండవ పునాదిగా విశ్వాసమునకు ఉన్నది; ఒకవేళ మానిష్యకుమారుడు నిజముగా మృతిని గెలిచి లేవకుండునట్లైతే అతని శరీరము సంపూర్ణముగా కుళ్లిపోయేది. అయితే అతను తన పరిశుద్ధ శరీరముచేత మృతిని గెలిచి లేచి, బండ్ల ద్వారా మరియు గోడల ద్వారా లేచి ఉన్నాడు. ఇతర మతస్తుల వారు చనిపోయి వారి శరీరములు కుళ్లిపోయినప్పుడు క్రీస్తు మృతిని జయించి లేచాడు. క్రీస్తు యొక్క పునరుత్తనము పరిశుద్ధతకు ఒక రుజువుగా ఉన్నది, మరియు అతని విజయము, శక్తి తన రక్షణకు సంపూర్ణమై ఉన్నవి.

3. ఎవరైతే ఈ సత్యములను తన హృదయమందు విశ్వసించునో వారు నిజముగా రక్షించబడెదరు. ఈ విధమైన సంరక్షణ ప్రతి విశ్వాసికి కూడా యేసు నిజమైన విజయము కలవాడని చెప్పుకొందురు. అతని సాక్ష్యములో క్రీస్తు జీవమును, ఆత్మను పొందియున్నారు. ఎవరైతే క్రీస్తును కనుగొని అతని మీద ఆధారపడి ఉన్నట్లయితే అతను ఎన్నటికిని ఓడిపోడు.

4. పౌలు తన మాటలను చేపట్టు, ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారు పరిశుద్ధ దేవునితో సమాధానపరచబడి ఉన్నతారని చెప్పెను, మరియు అతని పాపములన్నిటినుంచి విడుదల పొంది, తీర్పు దినమందు తప్పించుకొని దేవుని యొక్క కుటుంబములో చేర్చబడతాడని చెప్పెను, మరియు క్రీస్తు యేసు యొక్క ఆత్మీయ శరీరములో పాలుపంచుకొనును. కనుక ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు యేసులో నిత్యమూ నిలుచును. సంపూర్ణ రక్షణ మరియు సమాధానము కేవలము విశ్వాసము ద్వారానే పొందుకొనగలము, అప్పుడు మాత్రమే రక్షణ అనునది సంపూర్ణముగా ఒకరి జీవితములో అనుభవించగలరు. రక్షణ మరియు సమాధానము విశ్వాసులకు కేవలము రక్షించు యేసు నామములో మాత్రమే కలుగును.

5. పౌలు చెప్పినట్లు పాత నిబంధన గ్రంధములో సమాధానము కేవలము కృపద్వారానే వచ్చును: యూదులకు మరియు క్రైస్తవులకు మధ్య ఏవిధమైన వ్యత్యాసము లేదు ఒకవేళ వారు క్రీస్తు కృప ద్వారా నూతన పరచబడినట్లైతే. వారికి ఒకే ప్రభువు, ఒకే రక్షకుడు, మరియు ఒకే విమోచకుడై యేసు ఉన్నాడు. యూదులు అబ్రాహాము ద్వారా లేదా మోషే ద్వారా రక్షింపబడలేదు అయితే క్రీస్తు ద్వారానే. క్రీస్తు యొక్క రక్షణ, శక్తి, జీవితము మరియు ప్రేమ ఇద్దరికీ ఒకేవిధముగానే ఉన్నది. ఈ లోక పాపములను మరియు యూదుల పాపములను క్రీస్తు తప్ప వేరే ఏ ఇతర వారు తమ రక్తమును ప్రతిగా పెట్టలేదు.

6. పౌలు అన్నట్లు క్రీస్తు ధనికుడే కనుక ఎవరైతే అతని యొద్దకు వచ్చి అతనితో బంధము కలిగి ఉంటారో వారిని అతను ఆత్మీయమైన ధనికులనుగా చేయును (రోమా 10:12-13). ఎవరైతే అతనికి ప్రార్థన చేస్తారో వారికి అతని పరిశుద్ధాత్మను, శక్తిని మరియు అతని నిత్యా జీవమును దయచేయును. నీవు ఒకవేళ క్రీస్తుతో విన్నపములు చేయకుండునట్లైతే నీకు రక్షణ, పరిశుద్ధత, విమోచన, ఏవికూడా రావు. కృప అనునది అందరికి దొరుకుతుంది అయితే మనము దానిని వెతకాలి (యవేలు 2:32). "అబ్బా తండ్రి" అని మనము పరిశుద్ధాత్మతో క్రీస్తుకి మనవి చేయగలము (రోమా 8: 15-16)

రోమీయులకు 10:15-16
15 ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారిపాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది 16 అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా? 

ఆత్మ మనలను దేవుని గొర్రెపిల్లకు మన పాపములను ఒప్పుకొనుమని నేర్పించును, మరియు అతని మరణమును, అతని పునరుత్తనమును మరియు మనలను దేవుని ఉగ్రతనుంచి కాపాడుటకు సిద్దపడుచున్న యేసుకు ఒప్పుకొనుమని నేర్పించును.

మనలో ఉండు ప్రార్థించు ఆత్మ స్వలాభముగా ఉండకూడదు. ఎవరైతే క్రీస్తు నందు విశ్వాసము కలిగి ఉంటాడో వారు తనకొరకు మాత్రమే కాగా క్రీస్తు ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరి కోరకు పురాతన చెంయును. ఈవిధముగానే యాకోబు పిల్లలు ఎవరైతే దేవునినుంచి తప్పిపోయారో వారి కొరకు ఈ విధముగా ప్రార్థన చేసిరి; కనుక ఈ విధముగానే మనము కూడా యూదుల కొరకు మరియు ముస్లింల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటె దేవుని యొక్క గొర్రెపిల్ల ఉద్దేశము ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి (అపొస్తలుల 1:8; ప్రకటన 5:6)

7. యాకోబు సంతతికి దేవుని గూర్చిన సువార్తను ఇతరులకు ఏవిధముగా బోధించాలో అని పౌలు వారిని నేర్పించెను, మరియు వారు ఎన్నుకొనబడినవారని పరిశుద్దాత్మ చేత నడిపించబడిన వారని చెప్పునట్లు నేర్పేను.

అవిశ్వాసులు ఒకవేళ క్రీస్తును విశ్వసించనట్లైతే వారిని యేసు ఏవిధముగా పిలుచును? ఒకవేళ వారు అతని గూర్చి క్లుప్తముగా వినకుండునట్లైతే వారు ఏవిధముగా అతనిని విశ్వసిస్తారు? ఒక నిజమైన నమ్మకము కలిగిన బోధకుడు లేకుండా వారు ఏవిధముగా వింటారు? ఒకవేళ క్రీస్తు ద్వారా ఆ బోధకుడు పంపబడకుండునట్లైతే అతను ఏవిధముగా బోధించును? అవిశ్వాసులు మాత్రమే కాదు అయితే వారికి పై విషయాలు చెప్పువారు లేకున్నప్పుడు వారు ఏవిధముగా అనుభవము కలిగి ఉండెదరు. యెషయా ను గూర్చి పౌలు దేవుని వాక్యమును చెప్పునప్పుడు సిగ్గుపడెను: "సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి" (యెషయా 52:7)

పౌలు చెప్పిన ప్రకారముగా శుభవార్తలో యేసు జీవించువాడని, ఉన్నవాడిని, మరియు అతని రక్షణ వ్యాపిస్తున్నదని ఒప్పుకొనెదరు. విశ్వాసుల యొక్క ఆనందమునకు క్రీస్తు యేసులో దేవుని రాజ్యము ఒక కారణముగా ఉన్నది. కనుక క్రీస్తు ఏలుతున్నదని విశ్వసించు వారి ఆనందము ఎవరు కలిగి ఉన్నారు? మనము మన విశ్వాసమును బట్టి అలసి పోయి లేక నిర్లక్ష్యము కలిగి ఉన్నామా? "నీ రాజ్యము వచ్చును గాక " అనే మనవిని బట్టి ఎవరు స్పందించి," అవును ప్రభువా నీ రాజ్యము మా దేశములో వచ్చును గాక " అని ఎవరు చెప్తారు?

ప్రార్థన: ఓ పరలోకమందున్న ప్రభువా యేసు క్రీస్తును పరలోకమునకు ఎత్తినందుకు నిను ఆరాధిస్తాను, మరియు అతనిని రాజులకు రాజును మరియు ప్రభువులకు ప్రభువును చేసినావు. అతని పునరుత్తనమును మరియు నీ కుడి ప్రక్కలో కూర్చున్న సత్యమును బట్టి మేము బహిరంగముగా ఒప్పుకొనుటకు మాకు సహాయము చేయుము, అప్పుడు ఎవరైతే వింటున్నారో వారి హృదయములలోనికి నిర్యాజీవము వస్తున్నదని తెలుసుకొనెదరు.

ప్రశ్నలు:

  1. సాక్ష్యమునకు మరియు విశ్వాసమునకు ఉన్నబంధము ఏమిటి?
  2. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు సాక్ష్యము మరియు విశ్వాసము ఏవిధముగా ఒకే కార్యమును చేయగలవు?

www.Waters-of-Life.net

Page last modified on December 14, 2023, at 01:24 AM | powered by PmWiki (pmwiki-2.3.3)