Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 053 (The Parable of the Potter and his Vessel)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు, ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)
3. ఇశ్రాయేలీయులలో ఎక్కువమంది దేవునికి వ్యతిరేకస్తులుగా ఉన్నప్పటికీ దేవుడు నీతిమంతులను కాపాడును (రోమీయులకు 9:6-29)

c) కుమ్మరి యొక్క ఉపమానము మరియు యూదులకు మరియు క్రైస్తవులకు సంబంధించిన పాత్రలు (రోమీయులకు 9:19-29)


రోమీయులకు 9:19-29
19 అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతో చెప్పుదువు. 20 అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? 21 ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధి కారము లేదా? 22 ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చ éయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి? 23 మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, 24 అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి? 25 ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరుపెట్టుదును. 26 మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్ప బడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. 27 మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని 28 యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. 29 మరియు యెషయా ముందు చెప్పినప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు సంతా నము శేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము. 

మనిషి యొక్క చిత్తము గర్వముతో కూడుకొనును, మరియు అతని సమాధానము దేవుని ఏర్పాటుకు మరియు అతని చిత్తమునకు కార్యమునకు వ్యతిరేకముగా ఉండును. ఈ యొక్క లోబడని మనస్తత్వము ఒక సీంఎ ఏనుగుకు చెప్పినట్లు ఉండును: " నీవెందుకు నామీద అడుగు వేస్తున్నావు?" (యెషయా 45:9)

మనిషికి దేవునిని ప్రశ్నించే అధికారము లేదు, ఎందుకంటె దేవుని జ్ఞానమునకు అతని పరిశుద్ధతకు మరియు అతని ప్రేమకు మనిషి యొక్క సామర్థ్యము చాల తక్కువగా ఉండును కాబట్టి.

ఎవరైతే తన హృదయమును మరియు తన సంపూర్ణ నమ్మకమును దేవుని మీద ఉంచినట్లయితే అప్పుడు వాని యొక్క హృదయమును, ఒకవేళ అది కఠినముగా ఉన్నట్లయితే దేవుడు దానిని అతనికి లోపడునట్లు మరియు ఈ లోకమందు అతను దేవునిని ప్రేమించి కృతజ్ఞత కలిగి ఉండునట్లు చేయును. కనుక ఈ విధముగా మనము ఒకమనిషి అనగా హిట్లర్ మాదిరి కొన్ని వేళా మందిని చంపి మరియు వారిని వ్యభిచారములోనికి నడిపించునట్లు అనగా వానికి ఎవ్వరు కూడా ప్రశ్నలు వేయరు మరియు ఇది తప్పు అని చెప్పుటకు సాహసించరు. మరియు స్టాలిన్ ఎంతో మందిని చంపినప్పుడు ఎందుకు ఎవ్వరికీ ఈ విషయము తెలియలేదు.

పౌలు మనకు దేవుని తీర్పును బట్టి వ్యత్యాసము ఇచ్చాడు: ఒక కుమ్మరి మట్టినుంచి కావలసిన వస్తువుగా ఒక పాత్రను చేయగలడు, మరియు ఇతర వస్తువులను కూడా తీసుకొని వెళ్ళుటకు కూడా చేయగలడు (యిర్మీయా 18:4-6)

పౌలు తన ఉపమానములో దేవుని యొక్క ఉగ్రత పాత్రను బట్టి కూడా చెప్పెను, అనగా దేవుడు ఎప్పటినుంచో సహనము కలిగి చివరకు వారిని నాశనములోనికి నడిపించెను అని. మరియు పౌలు, దేవుడు కనికరము గల పాత్రలను పాతదాని నుంచి మరియు వాటిని మహిమలోనికి తెచ్చును అని చెప్పను. కనుక కనికరము గల పాత్రలు సృష్టికర్తను మహిమపరచుటకు మరియు అవి తిరిగి అతని యొద్దకు వెళ్ళుటకు చేయబడెను.

పౌలు తన జ్ఞానముకలిగిన జీవిత అనుభవమునుంచి కనికరమును గురించి చెప్పలేదు, అయితే అతను దేవుని ఉగ్రత నుంచి తప్పుకొన్నవారు మరియు అతని ఉగ్రతలో ఉన్నవారిని బట్టి చెప్పెను, అంటే వారు అన్యులు మాత్రమే కాదు అయితే యూదులు కూడా. ఈ సందర్భమును వివరించుటకు అతను హోసయ (2:23) ను గుర్తుకు చేసెను, అది ఎవరైతే అతని ప్రజలు కారో వారిని అతని ప్రజలుగా చేసెను అని. మరియు పేతురు తన మొదటి పత్రికలో కూడా అన్యులను బట్టి ఈ విధముగా చెప్పెను: " అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి" (1 పేతురు 2:9-10)

పౌలుకు సంబంధించి ఈ ఉద్దేశములో చాల గొప్ప మర్మము కలదు; అది ఎవరైతే ఎన్నుకొనబడక ఉన్నారో వారిని దేవుడు ఎన్నుకొన్నారు, మరియు అతని పిల్లలుగా పిలువబడుటకు దేవుడు ఎన్నుకొనబడని వారిని ఎన్నుకొన్నారు (రోమా 9:26; 1 యోహాను 3:1-3). యెషయా చెప్పినట్లు దేవుడు ఎవరైతే లోబడక ఉంటారో వారిని గొప్ప దుఖ్ఖములోనికి మరియు ఒకవేళ వారు అదేవిధముగా ఉన్నట్లయితే నాశనములోనికి నడిపించునని, ఎందుకంటె అతను చెప్పినట్లు వారు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకవలె ఉంటారు అని.

మూర్ఖమైన మనుషులను జీవము గల దేవుడు సంరక్షించును. వారందరు కూడా నాశనమగుదురు అయితే చిన్న పరిశుద్ధత కలిగిన వారు మాత్రమూ ఉంటారు వారిలోనే దేవుని ఆత్మీయ వాగ్దానములు బయలుపరచును (యెషయా 11:1-6); మరియు పిలువబడిన ఎక్కువమంది సోడాము మరియి గొమొఱ్ఱా పట్టణములవలె మారిపోతారు, (యెషయా 1:9)

పౌలు రోమా లో ఉన్న యూదులకు వ్రాయుట ఏమనగా దేవుడు అన్యులను కూడా రక్షించుటకు అధికారము కలదు, మరియు వారిని సంపూర్ణముగా పరిశుద్ధపరచును, మరియు నమ్ము ప్రతి యూదుడను నాశనము అగు వరకు వారిని ఖఠినపరచును. అయితే ఈ అనుభవము వారిని దైవత్వము ద్వారా రాలేదు అయితే ఎవరష వారికి వారి గొప్పవాళ్లమని చెప్పారో వారిని బట్టి ఇది జరిగినది. అప్పుడు వారు యేసే వాగ్దాన మెస్సయ్య అని మరియు వారికి రక్షణను ఇచ్చువాడని చెప్పిరి. అయితే యూదులలో ఈ దినము వరకు ఎక్కువమంది యేసును తిరస్కరిస్తున్నారు.

ప్రార్థన: పరలోకమందున్న ప్రభువా మేము నీ సహనము కలిగిన గొప్ప కార్యమును ఒకవేళ గమనించకుండా ఉన్నట్లయితే దయచేత మమ్ములను క్షమించుము. నీవు మమ్ములను ఎప్పటినుంచో ప్రేమించి మమ్ములను నాశనములోనికి నడిపించలేదు. నీ ప్రేమను మరియు నీ ఆనందమును మేము అర్థము చేసుకోనున్నట్లు మమ్ములను పరిశుద్ధపరచుము. మరియు నీ పరిశుద్ధాత్మను మేము ఆనందముతో లోబడి ఉండుటకు నీ సహాయమును మాకు దయచేము.

ప్రశ్నలు:

  1. దేవుని ఉగ్రత పాత్రలు ఎవరు, మరియు వారి లోబడని స్వభావమునకు గల కారణము ఏమిటి?
  2. దేవుని కనికరము గల పాత్రల యొక్క ఉద్దేశము ఏమిటి, మరియు వారి ప్రారంభము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on November 29, 2023, at 03:00 AM | powered by PmWiki (pmwiki-2.3.3)