Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 054 (The Jews Neglect the Righteousness of God)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు, ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)
4. దేవుని నీతి కేవలము విశ్వాసము ద్వారానే కలుగును, మరియు ధర్మశాస్త్రమును లోబడునట్లు కాదు (రోమీయులకు 9:30 - 10:21)

a) విశ్వాసము ద్వారా వచ్చిన నీతిని యూదులు నిర్లక్ష్యము చేసిరి, మరియు వారు ధర్మశాస్త్ర ప్రకారము ఉండిరి (రోమీయులకు 9:30 - 10:3)


రోమీయులకు 9:30 - 10:3
30 అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్య జనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; 31 అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడి నను ఆ నియమమును అందుకొనలేదు, 32 వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. 33 ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి. 10:1 సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొంద వలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై యున్నవి. 2 వారు దేవుని యందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. 3 ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. 

అపొస్తలుడైన పౌలు రోమా లో ఉన్న సంఘమును వారి చివరి నిర్ణయమునుంచి వారిని మార్చెను, అది వారు దేవుని నీతిని కేవలము క్రీస్తు యేసు మీద వారికి ఉన్న విశ్వాసము ద్వారానే కలిగెను అని, ఎందుకంటె నీతి అనునది వారికి కార్యములచేత వచ్చేనని అనుకొనిరి కనుక అది వారిని నాశనములోనికి నడిపించెను. అపొస్తలుడైన పౌలు ధర్మశాస్త్రమును బట్టి నీతి కలిగినదని చెప్పువారిని బట్టి మీలో ఎవ్వరు కూడా దేవుని ఆజ్ఞలను నెరవేర్చలేదు, మరియు ఎవ్వరు కూడా వారి కార్యములను బట్టి రక్షించుకొనలేదు, అయితే క్రీస్తులో ఉన్నటువంటి కేవలము దేవుని యొక్క కృపద్వారానే వచ్చెను అని చెప్పెను (అపొస్తలుల 15:6-11). ఎప్పుడైతే ఒకని మార్గములో అనుకోకుండా ఒక పెద్ద రాయి వచ్చునో అతను పడిపోవును (యెషయా 8:14; 28:16).

అతను యూదులను దేవునితో సమాధాన పరచినప్పుడు, వారి జీవితములలో తీర్పును బట్టి వారికి క్రీస్తు ఒక కారణముగా ఉండెను, అయితే వారు అతని కృపను తిరస్కరించిరి. అయితే ఎవరైతే రక్షకుడిని గుర్తించి విశ్వసించారో వారు రక్షింపబడిరి.

పౌలు చెప్పినట్లు యూదులలో అనేకులు ధర్మశాస్త్రమును బట్టి జాగ్రత్తకలిగి ఉండిరి. మరియు ప్రతి ఆజ్ఞను కూడా లోబడుటకు వారి సామర్థ్యమును ఉపయోగించిరి. వారి యొక్క జాగ్రత్తను బట్టి అతను వారిని ప్రేమించి, వారి జీవితములను బట్టి ఉన్న అవకాశములను వారు ఉపయోగించి వారికి ఇవ్వబడిన గొప్ప బహుమానమునుబట్టి అంగీకరించిరి. వారిలో ఉన్న అనేకులు రక్షణలోనికి నడిపించునట్లు పౌలు వారిని బట్టి దేవునితో ప్రాధేయపడెను.

ఏదేమైనా పౌలు రోమా లో ఉన్నయూదుల చక్రవర్తి దఃర్మశాస్త్రమును అనుసరించుట చూసేను. వారిని వారు ఎన్నుకొనబడినవారుగా మరియు ఇతరులు మూర్కులుగా భావించిరి. వారు క్రీస్తులో ఉన్న క్రొత్త నీతిని కనుగొనలేదు, అయితే వారు ఉపవాసముచేత, ప్రార్థన చేత, యాత్ర చేత వారికున్న 613 ఆజ్ఞలను గైకొనిరి. కనుక వారు దేవుని నిజమైన నీతిని వ్యతిరేకించిరి. ఇది నిజముగా మోసకరమైన ఆలోచన! వారి మీదికి ఎటువంటి పరిష్టితిని తీసుకొచ్చారు!

ప్రార్థన: పరలోకమందున్న ప్రభువా మేము పాపులమైన అన్యులైనప్పటికీ మమ్ములను నీవు పరిశుద్ధపరచినందుకు నీకు కృతజ్ఞతలు, మరియు నీ నీతిని మాకు ఒక గొప్ప బహుమానంగా ఇచ్చియున్నావు. కనుక అదే ఆశీర్వాదములను మాకు కూడా దయచేయుమని మేము నిన్ను అడుగుచున్నాము. ఎందుకంటె వారు వారి కార్యముల ద్వారా నీతి కలుగును అని అనుకొన్నారు కాబట్టి, వారి యొక్క గర్వమును తీసివేసి నీయందు నమ్మకము కలిగి ఉండి నీ ప్రియమైన పిల్లలగుటకు సహాయము చేయుము.

ప్రశ్నలు:

  1. వేలమంది విశ్వాసులు మరియు రకరకాల ప్రజలు దేవుని నీతిని పండుకొని అందులో ఉంటారు?
  2. ఇతర మతస్థులు దేవుని నీతిని పొందుటకు ఎందుకు వారి మాత ఆచారములు పాటిస్తారు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:20 AM | powered by PmWiki (pmwiki-2.3.3)