Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 050 (The Spiritual Privileges of the Chosen)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు, ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)

2. ఎన్నుకొనబడిన ప్రజల యొక్క ఆత్మీయ అవకాశములు (రోమీయులకు 9:4-5)


రోమీయులకు 9:4-5
4 వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. 5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. 

పౌలు రోమా సంఘములో ఉండు వారికి తమ ఆత్మీయ అవకాశములను బట్టి వారికి జ్ఞాపకము చేసెను. మరియు ఆ ఆత్మీయ అవకాశములు తనకు కానీ తన ప్రజలకు కానీ మిస్సయ్యాను జ్ఞాపకము చేసుకొనుటకు మరియు అంగీకరించుటకు సహాయము చేయలేదని కూడా చెప్పెను; కనుకనే వారు అతనిని ద్వేషించి, ఖండించి, అతను సిలువ మరణము పొందాలని అనుకొనిరి, మరియు పరిశుద్ధాత్మకు కూడా వారి హృదయములను ఖఠినపరచుకొనిరి. ఏవిధముగా అయితే చీకటి అనుకోకుండా మీద పడుతుందో అదేవిధముగా వారి హృదయాలలో ఖఠినము అనునది ఆ ప్రజలమీద పడెను.

తన ప్రజలను వ్యత్యాసములోనికి మరియు తనను వెంబడించువారికి పౌలు చెప్పిన ఆశీర్వాదాలు ఏమిటి?

వారి నిజమైన పేరు, యాకోబు పిల్లలు అని, అయితే ఇశ్రాయేలు పిల్లలు అనునది నిజమైన పేరు కాదు. అయితే వారి తండ్రి తన పాపమును బట్టి ప్రభువు అతనిని ఆశీర్వదించువరకు వెళ్ళవద్దు అనెను. అయితే యాకోబు యొక్క స్థిరమైన విశ్వాసమును బట్టి దేవుడు అతనిని ఇశ్రాయేలు అని పిలిచెను దానికి అర్థము " దేవునితో పోరాడు " అని. యాకోబు శారీరకం గా బలవంతుడు కాదు, అయితే విశ్వాసముగా బలము కలవాడు, కనుకనే దేవుని కోపమునుంచి మరియు అయన తీర్పు నుండి తప్పించుకొనెను (ఆది 32:22-32)

యాకోబు కూడా యేసు యొక్క వంశములో ఒకడై ఉండెను. యేసు ఈ లోక పాపములను మోసుకొని వేళ్ళు దేవుని గొర్రెపిల్ల, మరియు మన పాపముల నిమ్మిత్తము మనలను పరిశుద్దులనుగా చేయుటకు దేవునితో పోరాటం చేసెను. దేవుడు మనలను ఆశీర్వదించువరకు క్రీస్తు అతడిని మననుంచి పంపలేదు. కనుక మరియా కుమారుడు మనలను తీర్పు నుంచి కాపాడిన రక్షకుడు. కనుక దేవునితో నిజముగా మన కొరకు పోరాడినది యాకోబు కాదు అయితే క్రీస్తే, మరియు యేసు మాత్రమే మనలను దేవుని ఉగ్రత నుంచి నిజముగా మనలను కాపాడిన రక్షకుడై ఉన్నాడు.

అయితే విశ్వసించని యూదులు కానీ లేక ముస్లీములు కానీ ఈ మధ్యవరహిని అంగీకరించకుంటే వారు అతని ఆశీర్వాదములో పాలుపంచుకోలేరు మరియు అతని ఆత్మీయ పిల్లలుగా పిలువబడలేరు. ఈ విషయమును బట్టి పౌలు తన హృదయమందు చాల బాధపడ్డాడు ఎందుకంటె అక్కడున్న ఎక్కువమంది ప్రజలు వారికి ఇచ్చిన వాగ్దాన హక్కులను వారు తెలియజేసుకొనలేక పోయిరి, అయితే వాటిని వారు ఆత్మీయ గ్రుడ్డితనము చేత వ్యతిరేకించి వారి హృదయములలో గర్వము కలిగి ఉండిరి.

దేవుడు మోషేను ఐగుప్తులో ఉన్న ఫరో దగ్గరకు పంపి యాకోబు ప్రజలందరూ అతని మొదటి పిల్లలని చెప్పుటకు పంపెను (నిర్గమ 4:22; ద్వితీ 14:1,32:6; హోసయా11:1-3). దేవుడు తన ప్రజల యొక్క కఠిన హృదయములను చూసి చాల బాధపడ్డాడు,ఎందుకంటే వారు థానిని గౌరవించలేదు, అయినప్పటికీ వారికి తన పిల్లలగుటకు తగిన అధికారమును ఇచ్చి ఉండెను. వారు తిరిగి జన్మించలేదు అయితే వారే అతనికి మొదట జన్మించిన ప్రజలు.

మహిమగల ప్రభువు పరిశుద్ధమైన స్థలములయందు జీవించును. అంతరంగ ప్రత్యక్ష గుడారములో, ప్రజలు అరణ్యములో అటు ఇటు తిరిగిరి. అయితే దేవుడు వారిని అపాయములనుంచి కాపాడి, అనేక అద్భుతములు వారికొరకు చేసెను (నిర్గ 40:34; ద్వితీ 4:7; 1రాజులు 2:11; యెషయా 6:1-7; హెఙ్కేల్ 1:4-28; హీబ్రూ 9:5). ఏదేమైనా దేవుడు వారిని తమ లోబడని స్వభావమును బట్టి శిక్షించెను అయితే మోషే అహరోను యొక్క విన్నపములచేత దేవుడు వారిని మహిమ గల మరణము నుంచి కాపాడెను (సంఖ్యా 14:1-25)

దేవుని యొక్క గొప్పనిబంధన వివరణను బట్టి పౌలు వారికి చెప్పెను, అది ఈ చిన్న ప్రజలను బట్టి సృష్టికర్త మరియు తీర్పు తీర్చువాడు వారితో బంధము కలిగి ఉన్నాడని చెప్పెను. పరిశుద్ధ గ్రంధము ఈ క్రింది విధముగా మాట్లాడును:

నోవహు తో దేవుని నిబంధన (ఆది 6:18; 9:9-14)
అబ్రాహాముతో దేవుని నిబంధన (ఆది 15:18; 17:4-14)
ఇస్సాకు మరియు యాకోబుతో దేవుని నిబంధన ( ఆది 26:3; 28:13-19; నిర్గమ 2:24 )
మోషేతో ప్రభువు నిబంధన (నిర్గమ 2:24; 6:4; 24:7-8; 34:10,28)

అయితే పరిశుద్ధ గ్రంధము చెప్పినట్లు పాత నిబంధన ప్రజలు వాగ్దానములను వారు సమయము వచ్చినప్పుడు విదిచిపెట్టిరని తెలియపరచుచున్నది, కనుకనే ప్రవక్త అయినటువంటి యిర్మీయా వారి కొరకు దేవుడు నూతన నిబంధనను ఏర్పాటుచేసెను అని చెప్పెను, అందులో తన ప్రజలు ఆత్మీయముగా కూడా జన్మించెదరు అని చెప్పెను ( యిర్మీయా 31:31-34)

ధర్మశాస్త్రము అనునది ప్రభువు నిబంధనకు ఒక పునాదిగా, అది మోషే ప్రవక్త ద్వారా తన ప్రజలతో దేవుడు చేసుకొని ఉన్నాడు. ఈ నిబంధన పుస్తకము మరియు పది ఆజ్ఞలు కూడా 613 ఆజ్ఞలలో ఒకటిగా మరియు 365 వ్యతిరేక ఆజ్ఞలలో కూడా ఉన్నవి (నిషేదించబడినవి) మరియు మైమోనిదేస్ ప్రకారము 248 వాగ్దానములు కలవు.

ఈ ఆజ్ఞల ప్రారంభములో మనము నేరుగా ఈ వివరణను చదవవచ్చు: "నేనే నీ దేవుడనన ప్రభువును. కనుక నీకు వేరే దేవుడు ఉండకూడదు" (నిర్గమ 20:1-3).

ఎవరైతే ఈ ఆజ్ఞలను బట్టి పరిశోధన చేస్తారో వారు ఈ ఆజ్ఞలను కనుగొంటారు: "నేను పరిశుద్ధముగా ఉండులాగున, నీవు కూడా పరిశుద్ధముగా ఉండుము" (లేవీయులకు 19:2). ఈ ఆజ్ఞ: "నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణా హృదయముతో ప్రేమించవలెను, మరియు నీ పోరేనా మనసుతో, నీ పూర్ణ బలముతో" (ద్వితీ 6:5) మరియు "నిన్ను వాలే నీ పొరుగు వారిని ప్రేమించవలెను" (లేవి 19:18)

అయితే క్రీస్తు తప్ప మరి ఎవ్వరూ ఈ ఆజ్ఞలను పాటించలేదు (కీర్తన 14:3; రోమా 3:10-12)

ఒక భక్తి పరుడు దేవునిని ప్రత్యక్ష గుడారములోకానీ లేదా యెరూషలేము మందిరములో కానీ ఆరాధించాలంటే, మొదట అతను తన పాపములను బట్టి రక రకాల జంతువుల రక్తముద్వారా చిందించబడాలి. ఇది ఆరాధన ద్వారా, కీర్తన ద్వారా మరియు విన్నపముల ద్వారా తమ పాపములను బట్టి అధికారము కలిగి ఆరాధించువారు. ఎవరైతే పాత నిబంధన గ్రంధమును క్లుప్తముగా చదివినట్లయితే ఈ విధమైన ఆత్మను ఎలా కలిగి ఉండాలో తెలుసుకొంటాడు. త్యాగము కాక చేయు ముఖ్యమైన ఆరాధన ఏమంటే ఆశీర్వాదాలు స్వీకరించుటే.

ఈ విధమైన ఆరాధన వారిని ముఖ్యముగా వారి పండుగలలో అనగా పస్కా పండుగ, పెంతేకొస్తు పండుగ మరియు ప్రత్యక్షగుడారాల పండుగలో వీటిని చూడవచ్చు.

యెరూషలేము మందిరములో ఐక్యత కలిగి నివసించుట అనునది దేశములకు ఒక బలముగా ఉండెను. అయితే దీనికి బదులుగా అక్కడున్న చాల గ్రామాలలో బాలా అను దేవతకు వారు కొన్ని బలిపీఠాలు చేసి వాటికి త్యాగాలు చేశారు, మరియు దేవునికి కోపము వచ్చునట్లు వారు అలాంటివి ఎన్నో చేసి వాటిని పూజించిరి.

పాత నిబంధన గ్రంథమందు మనము ఎన్నో వాగ్దానములను చూడవచ్చు, వాటిలో మూడు ఉద్దేశములను కనుగొనవచ్చు:

a) ప్రభువైన దేవుని యొక్క, సన్నిధి, క్షమాపణ, రక్షణ, మరియు ఓదార్పు ( నిర్గమ 34:9-11)
b) క్రీస్తు రాకడ యొక్క వాగ్దానము, సమాధాన కర్త మరియు సాత్వికమైన దేవుని గొర్రెపిల్ల ( ద్వితీ 18:15; 2 సమూయేలు 7:12-14; యెషయా 9:5-6; 49:6; 53:4-12)
c) ఎన్నుకొనబడినవారికి మరియు అన్ని శరీరములకు పరిశుద్ధాత్మను నింపడము ( యిర్మీయా 31:31-34; యెహేజ్కెల్ 36:26-27; యవేలు 3:1-5)

అయితే! యూదులలో ఎక్కువమంది క్రీస్తు రాకడను మరియు అతనే వారి రాజాని గుర్తించలేకపోయిరి. వారి మీద వచ్చు పరిశుద్ధాత్మను వారు నిర్లక్ష్యము చేసి, ఒక శక్తి కలిగిన రాజ్యము వచ్చునని ఎదురుచూసిరి. కనుకనే వారు వారి పాపములను కానీ మరియు నూతన ఆత్మీయ జన్మమును బట్టి గుర్తించలేకపోయిరి. క్రీస్తు వాగ్దానములు మరియు అతనిని వెంబడించువారిని పరిశుద్దాత్మ నింపుదలను నెరవేర్చబడెను, అయితే అక్కడున్న వారిలో చాల మంది ఈ పరిశుద్దాత్మ నింపుదలను మరియు వాగ్దాన నెరవేర్చుటను గుర్తించలేదు మరియు ఈ వాగ్దానములను అంగీకరించలేదు.

ఎన్నుకొనబడిన వారి యొక్క తండ్రులు జ్ఞానులు కాదు, అయితే గొర్రెలకాపరులు మరియు ఇతరులకు యాజకులు. వారు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులకు ఒక ప్రత్యామ్నాయంగా మనిషులుగా ఉండిరి, ఎందుకంటె వారి యొక్క నిజమైన విశ్వాసము వారి బలహీనతలనుంచి వారిని కాపాడెను. నిబంధన యొక్క ప్రభువు అబ్రాహాము, ఇస్సాకు, మరియు యాకోబు దేవుడు అని పిలువ బడెను (ఆది 35:9-12; నిర్గమ 3:6; మత్తయి 22:32)

మోషే కానీ, దావీదు కానీ, ఏలీయా కానీ ఏ ఇతర పాత నిబంధన వ్యక్తులు ఏ సంస్థను ఏర్పాటు చేయలేదు అయితే దేవుని యొక్క సత్యమైన శక్తిని అవినీతి కంటే వారినే ఎక్కువగా అనుభవించి ఉండిరి. వారు ఇతరులకు ఒక మాదిరి కరమైన మనుషులుగా మరియు వారి విశ్వాసము ద్వారా వారి మనవాళ్లకు ఆశీర్వాదమును ఇచ్చువారిగా జీవించిరి.

ఏదేమైనా ఇశ్రాయేలీయుల గొప్ప అవకాశము యేదనగా, వారికొరకు రాబోవు క్రీస్తు అనగా రాజులకు రాజు, నిజమైన యాజకుడు, వాక్యమైన దేవుడు, అతనితోనే వారు శక్తిని దేవుని ప్రేమను అందరిలో చూడగలరు. అందుకే, "నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను" ఎందుకంటె దేవుని ప్రేమ అతనిలో ఉన్నది కాబట్టి, మరియు పరిశుద్ధాత్ముడు అతనియందు ఘనపరచబడెను. అతను చెప్పినట్లు దేవుడు మరియు అతను ఒక్కటై ఉన్నారు: "నేను నా తండ్రి ఏకమై ఉన్నాము" (యోహాను). దీని ప్రకారముగా అపొస్తలుడైన పౌలు "దేవుడు" అని ఈ సత్యమును పిలిచి ఉన్నాడు. "ఒక దేవుడు" అని అతను చెప్పలేదు, అయితే నిజమైన "దేవుడు" అని పిలిచి, ఎందుకంటె అన్ని షాంగములు దేవుడిని దేవుడు అని ఒప్పుకొనునట్లు. వెలుగు నుంచి వెలుగు. నిజమైన దేవుడు; ఏకైకవాడు, సృష్టించబడలేదు, మరియు తండ్రితో ఉండువాడని.

రోమా సంఘములో ఉండు క్రైస్తవులను బట్టి మరియు పౌలు యొక్క మార్పును బట్టి అక్కడున్న యూదులు క్రైస్తవులకు హింసలు చేసిరి. అక్కడున్న ఎక్కువ మంది యూదులలో యేసును ఒక దుర్మార్గములో నడిపించువాడుగా మరియు దేవునికి వ్యతిరేకమైన వాడిగా భావించిరి, కనుకనే వారు రోమీయులకు అతనిని సిలువవేయుటకు అప్పగించిరి. యెషయా సమయమునుంచి వారి హృదయములను వారు ఖఠినపరచుకొనిరి.౭౦౦ BC (యెషయా 6:9-13; మత్తయి 13:11-15; యోహాను 11:40; అపొస్తలు 28:26-27).

ఈ వచనములలో మనము వారి హృదయములు ఎంత కఠినమై ఉన్నాయో క్లుప్తముగా తెలుసుకొనవచ్చు. వారు పాపులని ఎంచలేదు అయితే మోషే ధర్మశాస్త్రప్రకారముగా వారు నీతిమంతులని అనుకొనిరి, మరియు వేరేవారందరిని బట్టి వెలివేసినవారుగా భావించిరి.

ఎప్పుడైతే వారి హృదయములను ఖఠినపరచుకొనిరో అప్పుడు బాప్తీస్మమిచ్చు యోహాను క్రీస్తు కొరకు మార్గమును సరాళముచేయుటకు వచ్చెను, మరియు ఎంతో మంది అతని ద్వారా బాప్తీస్మము పొందిరి. మరియు వారు యేసు దేవుని గొర్రెపిల్ల అని మరియు ఆత్మీయ నూతన రాజ్యమును స్థాపించువాడు క్రీస్తు అనియు యోహాను ద్వారా వినిరి; కనుక అరణ్యములో కేకలు వేయు వాని ద్వారా క్రీస్తు కొరకు సిద్దపడుటకు అంగీకరించిరి. క్రీస్తు జ్ఞానులను భక్తిపరులను లేక వేరే వారిని తనను వెంబడించుటకు పిలువలేదు, అయితే ఎవరైతే యోహాను ద్వారా బాప్తీస్మము పొందిరో మరియు వారి పాపములను ఒప్పుకొనిరో వారిని పిలిచి, అప్పుడు వారు పరిశుద్దాత్మ చేత నింపబడినవారై అతని శిష్యులుగా మార్చబడిరి. జ్ఞానమునుబట్టి, ధనమును బట్టి, రాజ్యాధికారమును బట్టి, గొప్పతనమును బట్టి అతను వారిని ఎన్నుకొనలేదు అయితే వారి పాపములను పగిలిన హృదయము చేత ఒప్పుకొని ఆత్మయందు ఉన్నవారిని ఎన్నుకొనెను. ఎవరైతే ధారాళముగా వారి పాపములను ఒప్పుకొనిరో వారికి తన రక్షణను మరియు నిత్యజీవమును క్రీస్తు యిచ్చియున్నాడు.

యూదులు ఎప్పుడైతే దేవిని సన్నిధిలో ధర్మశాస్త్ర ప్రకారముగా అవకాశములను అనుభవించిరో అప్పుడు యూదులలో ఉన్న ఎక్కువమందికి ఇది నచ్చలేదు. వారు ఇతర దేశముల మీద గర్వము కలిగి మంరియు అధికారమును చెలాయించేవారుగా ఉండిరి. మరియు వారికి వారి నీతిమంతులమని చెప్పుకొని వారికి పచ్చాత్తాపము అవసరము లేదని చెప్పుకొనిరి. వారి పాపములను వారు గుర్తుచేసుకొనక వారి హృదయములను ఖఠినపరచుకొనిరి కనుక వారు దేవునికి క్రీస్తుకు మరియు ఆత్మకు వ్యతిరేకులైరి, అయితే వారు శారీరకంగా ధనవంతులైరి అయితే ఆత్మీయముగా చాల బీదలుగా మిగిలిపోయిరి.

పౌలు కూడా వారితో పాటు తన గత జీవితములో ఆ విధమైన మనసు కలిగి ఉండెను. క్రైస్తవులను ఇబ్బంది పెట్టి వారిని శ్రమలలోనికి నెట్టి, ఎవరైతే విశ్వాసముగా బలముగా ఉన్నారో వారిని చంపెను. అయితే ఎప్పుడైతే యేసు అతడిని దమస్కు అను పట్టణము దగ్గర మహిమతో ప్రత్యక్షమయానో అప్పుడు తన గర్వమును మరియు అహంకారమును విడిచి తన పాపములను ఒప్పుకొనువాడాయెను. అతను ఆ సమయములో క్రీస్తు కృపద్వారా మరియు పరిశుద్దాత్మ ద్వారా తిరిగి జన్మించబడి మరియు ప్రభువైన యేసుకు అపొస్తలుడుగా మారెను.

పౌలు తెలుసుకున్నది ఏమనగా, అబ్రాహాము వంశస్తులను బట్టి లేదా సున్నతిని బట్టి రక్షణ రాదు అయితే కేవలము క్రీస్తుతో సమాధాన పరచబడి మరియు పరిశుద్దాత్మ చేత నింపబడినట్లైతే అప్పుడు దాని ద్వారా మనిషికి రక్షణ వస్తున్నదని తెలుసుకొనెను. అప్పుడు మనిషి క్రీస్తు శరీరములో ఒక ఆత్మీయ భాగమై అందులో ఒక సభ్యుడుగా ఉందును. ఈ విధముగా పౌలు ఎప్పుడైతే అబ్రాహాము కుమారులకు వివరించెనో అప్పుడు ఆత్మీయ రాజ్యము ఇశ్రాయేలీయుల రాజకీయమునకు సాటిగా లేదని ఎంచెను. అయితే ఈ దినాలలో ఇశ్రాయేలీయులు ఆత్మీయముగా ఎన్నో శ్రమలు కలిగి ఉన్నారు. పౌలు ఇక్కడ వారికి రాజకీయమును బట్టి చెప్పలేదు అయితే ఆత్మీయమైన క్రీస్తు రాజ్యము ఈ లోకములో ప్రతి చోటా స్థాపించబడునని చెప్పెను.

ప్రార్థన: ప్రభువా నీవు ఏర్పాటుచేసుకున్న నీ ప్రజలను బట్టి నీకున్న సహనమును బట్టి నీకు కృతజ్ఞతలు, మరియు పథ నిబంధన గ్రంథమందు నీవు ఈ ప్రజలను బట్టి చేసిన వాగ్దానములను బట్టి కూడా కృతజ్ఞతలు, ఒకవేళ మేము నీ ప్రేమను మరియు నీ కృపను అర్థము చేసికొనక ఉన్నట్లైతే నీ గొప్ప నీతి ద్వారా మమ్ములను క్షమించుము; మరియు జీవము కలిగిన క్రీస్తు ద్వారా నశించిపోతున్న అబ్రాహాము కుమారులను దయతో రక్షించుము.

ప్రశ్నలు:

  1. పాత నిబంధన ప్రజలకు పౌలు ఎన్ని అవకాశములను బట్టి చెప్పెను? వాటిలో నీకు ఏది ప్రాముఖ్యముగా ఉన్నది?
  2. దేవుని యొక్క కృప ఎన్నుకొనబడినటువంటి అనేకులను ఎందుకు రక్షించలేదు, ఎవరు తీర్పు నుంచి ఇతరుల మీదికి పడతారు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:15 AM | powered by PmWiki (pmwiki-2.3.3)