Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 032 (The Grace of Christ)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
C - విమోచన అనగా దేవునికి మనిషికి ఒక నూతన బంధము అని అర్థము (రోమీయులకు 5:1-21)

3. క్రీస్తు కృప, మరణమును, పాపమును మరియు ధర్మశాస్త్రమును జయించును (రోమీయులకు 5:12-21)


రోమీయులకు 5:12-14
12 ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. 13 ఏలయనగా ధర్మ శాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. 14 అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను, 

పౌలు మనకు మరణమును గూర్చిన మర్మమును తేట పరచెను, అంటే మన పాపమే మన నాశనమునకు కారణమని చెప్పెను. మన మొదటి పితరులు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసిరి కనుక వారు మరణమును పొందిరి, అది ఈ లోకమంతటికి వచ్చినది కనుక మనకు కూడా అదే శిక్ష కలిగెను, ఎందుకంటె మనము కూడా అదే మార్గములో ఉన్నాము కనుక. అప్పటి నుంచి మరణము అందరి మీద అధికారము చేసెను, ధర్మశాస్త్రము వారికి మరియు పాత నిబంధన ప్రకారము నడుచుకుంటున్నవారికి కూడా అదేవిధముగా కలిగెను, ఎందుకంటె పాపము తేటగా కనపడెను కనుక, మరియు మరణము కూడా ధర్మశాస్త్రమును జయించెను.

మనమందరము పాపులం కనుక మనమందరము మరణించుచున్నాము. మన మనిషి లోకమునకు నిత్యా జీవము లెదు. మనము మరణమును క్రమముగా పొందుకొనుచున్నాము, ఎందుకంటె మనలో మరణ విత్తనములు కలిగి ఉన్నాము కనుక. ఏదేమైనా దేవుడు మనము పచ్చాత్తాపము కలిగి రక్షకుడిని అంగీకరిస్తామని సమయమును ఇచ్చుచున్నాడు, మరియు క్రైస్తవ విశ్వాసము ద్వారా మనము నూతన జీవితములోనికి పరిచయము కలిగి ఉంటామని అవకాశము ఇచ్చుచున్నాడు.

రోమీయులకు 5:15-17
15 అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృ 16 మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగ లేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. 17 మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబాహుళ్యమును నీతిదాన మును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు. 

పౌలు మనకు మొదటి ఆదాము యొక్క మరణమును బట్టి పాపము మరియు మరణము యొక్క మర్మమును గూర్చి వివరణ ఇచ్చుచున్నాడు, మరియు రెండవ ఆదాము నుంచి నీతిని మరియు జీవమును గూర్చి వివరించుచున్నాడు, కనుక అతను అతనిని మొదటి తండ్రి అని పిలువబడుచున్నాడు: "వచ్చువారి క్రీస్తు రూపము" అని.

ఆదాము ద్వారా పాపము మరియు మరణము అందరికి వ్యాప్తిన్చెను అని పౌలు చెప్పలేదు, అయితే మనిషి అయినా క్రీస్తు ద్వారా దేవుని కృప మరియు అతని నిత్యా జీవపు బహుమానములు అందరికి వ్యాప్తిన్చెనని చెప్పెను; ఎందుకంటె క్రీస్తు ఆదాము కంటే గొప్పవాడు, మరియు అతని కంటే వ్యత్యాసము కలిగిన వాడు. మన ప్రభువు మనకు కొన్ని మాత్రమే కాదు అయితే పరలోక బహుమానములన్నిటినీ సమృద్ధిగా ఇచ్చుచున్నాడు. అతని కృప మనకు సమృద్ధిగా ఉన్నది. అది మనలను మరణమునకు నడిపించక, ఫలములను, ఎదుగుదలను మరియు శక్తి కలిగిన జీవితమును కలిగించునదిగా ఉండును.

పాపము మీద దేవుని బ్యతిరేకము మొదటి మనిషి ద్వారా ప్రారంభమాయెను, మరియు అది అనుకోకుండా అందరికీ సంత్రాప్తమాయెను. ఇది సమాధానమును పోలి లెదు, ఎందుకంటె ఇది పాపి నుంచి మొదలయినది, అయితే పాపులందరిని క్రీస్తు ఒక్కసారే సమాధానపరచి ఉన్నాడు, కనుక ఎవరైతే అతని యందు విశ్వాసము కలిగి ఉంటారో వారు సమాధానపరచబడి ఉంటారు.

ఎప్పుడైతే మన మొదటి పితరుల ద్వారా మనకు మరణము కలిగినదో అప్పుడు యేసు తన గొప్ప కృపను మరియు మంచిని మతియు నిత్య జీవమును తాను విశ్వసించు ప్రతి విశ్వాసికి దయచేసి ఉండెను. ఏదేమైనా దేవుని యొక్క జీవము మన విశ్వాసుల యొక్క హృదయములు మీద పెత్తనము చేయలేదు, మరణము చేసినట్లు, అయితే ఎవరైతే పరిశుద్ధ పరచి ఉన్నారో వారు క్రీస్తుతో నిత్యమూ ఉన్నారు. అయితే దేవుని యొక్క గొప్పతనము ఆదాము కంటే గొప్పది కాదు. కనుక దేవుని యొక్క కృప మరణము కంటే గొప్పది.

రోమీయులకు 5:18-21
18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మను ష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణ మాయెను. 19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడు దురు. 20 మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, 21 ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.

పౌలు తిరిగి ఆదామును,మరియు క్రీస్తునకు గల పోలిక ధర్మశాస్త్ర ప్రకారముగా చేసెను. ఈ వంశములో అతను వారిని బట్టి పోలిక చేయలేదు అయితే వారి క్రియలను బట్టి పోలిక చేసెను. ఒకరి క్రియ ద్వారా మరణము అందరికీ ఏవిధముగా అయితే వచ్చినదో అదేవిధముగా ఒక్కరి త్యాగము ద్వారా అందరికీ దేవునితో సమాధానము మరియు నిత్యా జీవము వచ్చి ఉన్నది. పరలోక బహుమానము ఎంత గొప్పది! అవును మొదటి మనిషి ద్వారా మనకందరికీ పాపము అనే బందీలలో ఉన్నాము; అయితే మొదటి మనిషి యొక్క తగ్గింపును బట్టి మనకందరికీ నీతి వచ్చినది.

చివరిగా ఆదాము యొక్క పాపమును మరియు క్రీస్తు యొక్క నీతిని పోలి చూసినప్పుడు పౌలు ధర్మశాస్త్రము యొక్క సమస్యలోనికి ప్రవేశించెను. ఎందుకంటె ధర్మశాస్త్రము రక్షణకు ఆధారముగా లేదు, ఎందుకంటె అది రక్షణకొరకైనా చరిత్రలోకి ఒక దోషముగా వచ్చియున్నది, కనుక మనిషి సంపూర్ణముగా లోబడి ఉండాలి. అయితే దఃర్మశాస్త్రము మనిషి యొక్క రాతి గల హృదయమును మరియు పాపమును మరి ఎక్కువ చేసెను. అయితే క్రీస్తు మనలను కృపలోనికి దగ్గరగా నడిపించి, మనకు సంపూర్ణ శక్తిని మరియు నీతిని మరియు కృపను ఈ లోకములో ఉన్నవారందరికి వచ్చినది. పౌలు ఆనందముతో కేకలువేసి " గతములో పాపము ద్వారా మరణము వచ్చినట్లైతే, ఇప్పుడు కృప కూడా ఒక కిరీటముగా దేవుని యందు నమ్మకము మరియు సిలువ వేయబడిన క్రీస్తు నందు విశ్వాసమును కలిగి ఉండెను".

కృతజ్ఞత చెల్లించుటకు, ఘనపరచుటకు, ప్రహతి మనిషికీ ఒక కారణము ఉన్నది, ఎందుకంటె పునరుత్తానుడైన క్రీస్తు నూతన చరిత్రను ప్రారంభించాడు కనుక, మరియు క్రీస్తు శక్తి మరణమును జయించి ఉన్నది. మనము కృపయొక్క అభివృద్ధిని నిత్యజీవముద్వారా మరియు వాటి ఫలములను దేవునియొక్క సంపూర్ణమైన శక్తికలిగిన దేవుని కార్యములను క్రీస్తు సువార్త ద్వారా నమ్మగలరా.

ప్రార్థన: ప్రభువా మేము మిన్నులను ఆరాధించుచున్నాము, ఎందుకంటె నీవు మరణమును మరియు పాపమును మరియు సాతానును జయించిన వాడవు. నీవు మమ్ములను కృప లోనికి నడిపించి నీ జీవములో మేము కూడా భాగస్తులమగుటకు సహాయము చేసి ఉన్నావు. మేము తిరిగి మా గత జీవితములోనికి వేళ్ళ లేనట్లుగా మమ్ములను బలపరచి మా విశ్వాసములను వెలిగించుము. నీ కృపను మాలో స్థాపించి నీ ఆత్మ ద్వారా ఫలములను కలిగిఉండునట్లు మరియు మేము మరణమును జయించి బలము కలిగిన వారుగా ఉండునట్లు చేయుము. నీ సంపూర్ణము చేత మమ్ములను నింపుము.

ప్రశ్నలు:

  1. ఆదాము మరియు యేసుకు గల పోలిక ద్వారా పౌలు మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:55 AM | powered by PmWiki (pmwiki-2.3.3)