Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 028 (We are Justified by Grace)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
B - విశ్వాసము ద్వారా దేవుని నీతి నూతనముగా అందరికీ చేయబడుట (రోమీయులకు 3:21 - 4:22)
3. అబ్రాహాము మరియు దావీదు విశ్వాసము ద్వారా విమోచనము అను దానికి ఒక ఉదాహరణ (రోమీయులకు 4:1-24)

c) మనము ధర్మశాస్త్రప్రకారము కాక కృప ద్వారా విమోచించబడినాము (రోమీయులకు 4:13-18)


రోమీయులకు 4:13-18
13 అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రా హామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూల ముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను. 14 ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థక మగును. 15 ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిం చును; ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేక పోవును. 16 ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సం తతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికికూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను. 17 తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడుఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది. 18 నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. 

ఎప్పుడైతే యూదుల సున్నతిని గురించి పౌలు తప్పని చెప్పెనో అప్పుడే వారి నీతిని బట్టి కూడా తప్పని చెప్పెను, ఎందుకంటె అవే వారి యొక్క ధర్మశాస్త్ర నమ్మకము.

అరణ్యములో ఉన్న ప్రజలు దేవుని యొక్క ఆలోచనలు నిబంధనను ఒక బల్ల మీద పెట్టబడి అనుకొనిరి, దాని నుంచే వారిని వారు కనపరచి మరియు ప్రపంచనమును జయించిరి. వారు ధర్మశాస్త్రమును విశ్వసించినతవరకు దేవుడు వారితో ఉందును అని వారు విశ్వసించిరి. అయితే వారి పాపములను వారు గుర్తుచేసుకొనలేదు, మరియు దేవుని గొప్ప ప్రేమను కూడా వారు అనుకొనలేదు. అయితే వారు ధర్మశాస్త్రమునకు బానిసలుగా మారి ఉండిరి. వారి హృదయములు రాతిలాగా ఉండెను, మరియు వారు గ్రుడ్డిగా గొప్పలు చెప్పిరి. వారు దేవుని కోపమును కానీ క్రీస్తు వారి మధ్యలో నివసించుట కానీ చూడలేదు.

క్రీస్తు మీద ఏ చిన్న విశ్వాసము లేకుండా, వారి ఆచారములు, వారి న్యాయతీర్పులను, వారి సంఘములను బట్టి, వారి గుంపుము బట్టి, అతిశయము కలిగిన వారికి శ్రమ! ఎవరైతే వారి విశ్వాసముతో బలహీనంగా ఉంటారో వారు ప్రేమ లేని ఒక వకీలు లాగ ఉందురు. ధర్మశాస్త్రము అనునది ఒక భయంకరమైన కోపమును చేయును అనునది ఒక మర్మముగా ఉన్నది, ఎందుకంటె అది దోషమును మరియు శిక్షకు బదులుగా ఉన్నది కనుక. కనుకనే చాల మంది తమ పాఠశాలలో మరియు ఆఫీసులలో క్రీస్తు మన దోషములను మరియు పాపములను , తప్పిదములను యెంచక తన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కూడా కడిగి మనకు ఏవిధమైన శిక్షను రాకుండా చేసి ఉన్నాడు.

అబ్రాహాము విశ్వాసము చేతనే విమోచించబడినాడని మరొక్కసారి పౌలు వారికి చెప్పెను, అది కూడా మోషే రాక మునుపు. అయితే ధర్మశాస్త్రము ఇయ్యక మునుపే అబ్రాహాము దేవునియందు విశ్వాసము కలిగి ఉండెను. తరువాత విశ్వాసుల గర్వమును మరియు వారి కాపుదలను గూర్చిన ఆజ్ఞలు వచ్చెను. దేవుని మీద విశ్వాసము అనునది అతని మీద నమ్మకమును, ఆత్మీయ జీవితమును మరియు దేవునిని సేవించుటకు దేవుని యందు విశ్వాసము గొప్పగా ఉన్నది. అయితే ధర్మశాస్త్రము మనలను ఖండించునదిగా శిక్షించునదిగా మరియు చంపునదిగా ఉన్నది.

అప్పుడు అబ్రాహాము తన మనసును కానీ తన ధర్మశాస్త్రమును కానీ చూడలేదు అయితే కేవలము దేవుని వాగ్దానములను చూసి ప్రభువు మీద నమ్మకము కలిగి ఉన్నాడు. కనుకనే అతను ఆత్మీయ విశ్వాసులందరికి ఒక ఉదాహరణగా మరియు తండ్రిగా ఉండెను. అప్పటికి ఇంకా అతనికి ఏ సంతానము కూడా లేకున్నప్పటికీ, దేవుడు తన సంతానమును ఆశీర్వదిస్తానని చెప్పిన వాగ్దానమును నమ్మెను, కనుకనే అబ్రాహాము ఎంతో మందిని తన విశ్వాసము ద్వారా గెలిచికొనెను, కనుకనే పౌలు అతనిని "ఈ లోకమునకు ఒక వంశము " అని పిలిచెను.

కనుకనే అబ్రాహాము ఒక ఆశీర్వాదానికి సూచనగా మరియు క్రీస్తు అతనితో ఉన్నట్లుగా మరియు అతని విశ్వాసము ద్వారా విమోచించబడినట్లుగా ఉండెను.

కనుకనే అబ్రాహాము పాత నిబంధన వారందరికంటే గొప్ప విశ్వాసము గల వాడని పిలువబడెను. కనుకనే దేవుడు అతని సంతతి ద్వారా ఈ లోక సంతతి అంతటినీ ఆశీర్వదించెదనని చెప్పెను, అనగా క్రీస్తు కూడా అతని సంతతి వాడే. "విత్తనము" అను హీబ్రూ మాటకు నిర్వచనము, క్రీస్తు కూడా అబ్రాహాము వాగ్దానమే అని. కనుకనే ఎవరైతే సిలువవేయబడిన వానియందు విమోచించబడినారో వారు క్రీస్తు నందు నమ్మకము కలిగి అతని సమస్తములో మరియు శక్తిలో మరియు దేవుని ఆశీవాదములో భాగస్తుడుగా ఉండెను.

నీ మరణమునుంచి నీవు లేచునట్లుగా నీవు నీ రక్షకుని యొద్దకు రమ్ము. నీవు అతని వాక్యము నందు ఉన్నట్లయితే అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఒక నూతన జీవితమును ఇచ్చి నీ చుట్టూ అతని సన్నిధి ఉంచును. నీ సంఘములో కానీ నీ గుంపులో కానీ దేవుని వాగ్ధానము ఉన్నట్లయితే అది నిన్ను నీ పాపములనుంచి నిన్ను తప్పించును, ఎందుకంటె దేవుడు నీ విశ్వాసము ద్వారా కార్యములను సృష్టించి, నీ మానవులను వినును. నీ యొక్క అంగీకారము చేతనే నిన్ను మరియు ఈ లోకమును మార్చును.

ప్రార్థన: పరలోకమందున్న తండ్రి, ఇతరులను ఖండించునట్లుగా మా హృదయములు, మా మనసులు ఉన్నాయి. మాలో విశ్వాసము ఉండునట్లు మరియు నీ యందు నమ్మకము కలిగి ఉండునట్లు మా హృదయమందు ఒక స్థలమును సిద్దము చేయుము. పాపములో చనిపోయినవారిని లేపినట్లుగా నీ ఆత్మ చేత నిమ్బాబడి వారిని జీవములోనికి నడిపించులాగున మాకు సహాయము చేయుము. నీ రక్షణ కరమైన కార్యములు చేయులాగున నీ యందు విశ్వాసము కలిగి ఉండునట్లు మాలో నూతన విశ్వాసము పుట్టించుము.

ప్రశ్నలు:

  1. దేవుని వాగ్దానము చేత మన విశ్వాసము చేత దేవుని ఆశీర్వాదము ఎందుకు పొందుకుంటాము, ధర్మశాస్త్ర ప్రకారము కాక?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:51 AM | powered by PmWiki (pmwiki-2.3.3)