Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 017 (He who Judges Others Condemns Himself)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)
2. యూదులకు దేవుని ఉగ్రత బయలుపరచుట (రోమీయులకు 2:1 - 3:20)

a) ఇతరులను తీర్పు తీర్చువాడు తనను తాను ఖండించుకొనును (రోమీయులకు 2:1-11)


రోమీయులకు 2:6-11
6 ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. 7 సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. 8 అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. 9 దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును. 10 సత్‌ క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధాన మును కలుగును. 11 దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; 

ప్రియా సహోదరుడా దేవుని తీర్పులో ఉన్న ముఖ్యమైనవి నీకు తెలుసా? ప్రతి ఒక్కరు ఆ గడియకు దూసుకొని వెళ్తారు అయితే జ్ఞానము కలవాడు ఆ ఘడియ కొరకు సిద్దపడుతాడు. పౌలు మనకు చెప్పినట్లు ఆ దినమందు దేవుడు మన ప్రతి మంచి మరియు చెడులు కూడా ఆ తీర్పులోనికి దేవుడు తీసుకువస్తాడని చెప్పెను. మత్తయి 25 లో, మనము చదివినట్లయితే, ఎవరైతే అర్హతలేక, అలక్ష్యముచేత, మరియు బీదలుగా ఉన్నట్లయితే వారు దేవుడిని ఘనపరచెదరు. క్రీస్తు మనకు ఉపవాసముండమని, ప్రార్థన చేయమని, యాత్ర చేయుమని, కానుకలు ఇవ్వుమని మరియు మంచి కార్యములు చేయుమని చెప్పలేదు. అయితే అవసరతలో ఉన్నవారికి దాయకలిగి సహాయము చేయుమని చెప్పెను.

నీ రహస్య ప్రేమ కలిగిన కార్యముల ద్వారా నీ హృదయము మంచిదా, చెడ్డదా లేక గర్వముతో కూడుకొన్నదా లేక కనికరము కలిగి ఉన్నదా అని కనపడును. ప్రతి చిన్న విషయమును బట్టి సున్నితముగా ఆలోచించుకొనుటకు చదువుకున్న వాడివా? అర్హత లేనివారికి, నిర్లక్ష్యము చేయువారికి నీవు ప్రేమ కలిగి ఉండుటకు నీలో దేవుని ప్రేమ ఉన్నదా? నీ ప్రేమ కలిగిన కార్యములను బట్టి నీకు బహుమానములు కలవు, మరియు బహిరంగముగా చేయు కార్యములను బట్టి మరియు మాతా ఆచారములు బట్టి కాదు.

పౌలు మన హృదయములోనికి దేవుని ప్రేమ కురిపించబడులాగున మార్గమును చూపించెను. కనుక ఎవరైతే తన మసుతో దేవుడిని ఘనపరచి, మరియు ధనముకొరకు, ప్రఖ్యాతల కొరకు, కాక హృదయమునాడు దేవుని కొరకు మార్పు కలిగి ఉండుమని దేవుడు మనకు సూచిస్తున్నాడు. కనుకనే దేవుడు మన యడల కనికరము కలిగి ఉన్నాడు. ఎవరైతే దేవుని మహిమను వెతుకుతున్నారా వారు ఈ లోక ఘానా కార్యముల కొరకు ప్రయాసపడరు అయితే దేవుని యందు జ్ఞానము కలిగి ఉంటారు. అల్లాంటి వారు దేవుని ద్వారా క్షమాపణ పొందుకోవాలని కోరుకుంటారు. కనుక ఎవరైతే ఈ విధముగా ఉంటారో వారు నిత్యజీవము కొరకు కనిపెట్టుకొని ఉంటారు, మరియు వాటిని విశ్వాసముతో అంగీకరిస్తారు. కనుక నీవు నీ కార్యముల ద్వారా రక్షింపబడలేదు, అయితే నీవు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు అతని శక్తి నీ బలహీనతలలోనికి వచ్చి ఉన్నది, మరియు అతని ప్రేమ నీ ప్రాణముకంటె గొప్పదై అతని ప్రేమలోకి నిన్ను నడిపించింది. నీవు దేవుడిని వెతికి అతని కొరకు జీవిస్తావా?

ఎవరైతే చేదు చేస్తారో, వారు ఈ లోక పాపములో మరియు నాశనములో జన్మించాడు కనుక చేదు చేసాడు అని అనుకోకూడదు. అయితే అతను నిజమునకు లోబడి ఉండలేదు కనుక ఆ చేదు అనేది చేసాడు. కనుక చేదు కార్యాలు అనుకోకుండా జరిగేవి కావు. అవి సహజముగా వచ్చు చేదు కార్యాలు. అయితే మన మనస్సు ఆ విధమైన కార్యములనుంచి బయటికి వచ్చును. అవి మనలను దేవుడిని కానీ పరిశుద్ధాత్మను కానీ దూషించకుండా చేయును. అయితే ఇంకా ఎవరైతే దేవుని స్వరమునకు మరియు అతని పిలుపునకు లోబడక ఉంది, తనకు ఇష్టము వచ్చినట్లు చేస్తున్నట్లైతే ఖచ్చితముగా అతను దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొనబడని వాడు. ఒకవేళ మనము చేదు కార్యములు చేయుటకు మనసు అంగీకరిచినట్లైతే, చేదు సహవాసాలు చేసినట్లయితే మరియు, మన ఆలోచనా విధానము చెడ్డగా ఉండినట్లైతే దాని అర్థము మనము ఇంకా సంపూర్ణముగా దేవునికి సమర్పణ కలిగి లేమని అర్థము.

కనుక ఎవరతే దేవుని ఆత్మకు వ్యతిరేకముగా ఉంటారో వారికి తీర్పు తీర్చబడి, దేవుని బహుమానములకొరకు తమ హృదయములను తెరువక, మహోన్నతుడిని విడిచి, ఉగ్రతను కోరుకొనువారుగా ఉంటారు. కనుక దేవుని శిక్ష అనునది ఎవరైతే దేవునికి లోబడక ఉంటారో వారిమీదికి వచ్చును. నీవు క్రీస్తు శక్తిలో ఉన్నావా లేక నీవు ఉగ్రత వాని యందు తీర్పులోనికి మునిగి ఉన్నావా? నీవు ఈ సమాధానము నుంచి తప్పించుకొనలేవు. కనుక ప్రత్యేకించబడిన ఆ దినము కొరకు సిద్దపడి ఉండు.

అతని మాటలను బట్టి మొదట యూదులకు తీర్పు తీర్చబడును. పౌలు వారినే ఎందుకు దేవుడు పిలుస్తాడు అని చెప్పాడంటే, వారు పాత నిబంధన ప్రకారముగా ఉన్నారు కనుక వారిని దేవుడు తీర్పు దినమందు ముందుగా తీర్పు తీర్చును. అయితే అదే యూదులలో ఎవరైతే పరిశుద్దాత్మ ద్వారా నింపబడి అతని యందు నిలకడ కలిగి ఉంటారో వారు కనికరము కలిగి ఉంటారు. అయితే ఎవరైతే వారి హృదయమందు ఇంకా కఠిన మనస్సు కలిగి ఉంది మరియు ఇతరులను కూడా నిత్యా నరకములోనికి ప్రవేశించుటకు చేదు మార్గములు చూపి ఉంటారో అనగా వారిలోనికి దేవుని ఆత్మ కార్యములు చేయుటకు అడ్డుగా ఉండెదరు, అలాంటి వారు దేవుని దినమందు తీర్పులోనికి వచ్చెదరు.

గ్రీకులు, మంగోలియులు, మరియు నిగ్రోస్, వీరందరూ దేవుని దగ్గరకు నేరుగా వెళ్తారు ఎందుకంటె వారు కూడా అతని సృష్టిలోనే చేయబడి వారికి కూడా అతనే సృష్టికర్త అయి ఉన్నాడు కనుక. దేవుని ఎదుట ప్రతి ఒక్కరు సమానమే. ధనికులు కూడా దేవుని ప్రకాశమైన వెలుగులో వారి ధన వెలుగును కూడా కోల్పోతారు. కనుక ఆ సృష్టికర్త ఎదుట మనమందరూ గొప్పవారం కాము. ఏ ఇంటిలో అయితే సహోదరుల యొక్క తల్లులు ఎప్పుడు క్రీస్తుకు పరిచర్య చేస్తున్నట్లైతే వారి పిల్లలు ఎప్పుడు ప్రకాశమైన వెలుగుగా కనబడెదరు. మరియు వెలుగునిచ్చు నక్షత్రము వాలే కనపడెదరు.

దేవుడు మనలను తన ప్రేమచేత కొలుచును. ఎవరైతే తమను తాము దేవుని ప్రేమలోకి సమర్పించుకుంటారో వారు అంగీకరించబడెదరు. అయితే ఎవరైతే దేవుడిని కాక తమకు తాము మరియు ఇతరులను ఎక్కువగా ప్రేమిస్తారో వారు జీవితములో క్రమముగా క్రిందకు పడెదరు. దేవుడు నమ్మదగినవాడు నీతిమంతుడు, కనుక అతనిలో ఏ బేధము లేదు.

ఈ లోకములో నీతిమంతుడు ఎవ్వరు లేరు, అయితే దేవుడు మాత్రమే కనికరము గల వాడు మరియు నీతిమంతుడు. అయితే ఎవరైతే తమ పునాదులను దేవుని ప్రేమచేత వేసుకుంటారో వారు బలము కలిగి ఉంటారు ఎందుకంటె వారు ఎప్పుడు దేవుడిని వెతుకుతూ ఉంటారు కనుక. అయితే ఈ విధమైన మార్పు దేవుని కనికరమును తొందరగా తీసుకువస్తుందని అనుకొనవద్దు. అయితే వారి జీవితములో విజయము కలిగి ఉండాలని ఆశిస్తున్నవారు మాత్రమే ఈ విధముగా మార్పు కలిగి ఉంటారు. కనుకనే క్రీస్తు పరిసయ్యులతో, పాపులతో మరియు పన్ను కట్టించుకున్నవారితో కలసి భోజనము చేసాడు, ఎందుకంటె అతను అందరిని ప్రేమిస్తున్నాడు కనుక.

ఓర్పు కలిగి ప్రేమతో కార్యములు చేస్తున్నవారికి ఏవిధమైన బహుమానములు ఉంటాయో నీకు తెలుసా? దేవుడు ఎవరైతే కృప కలిగిన ఆత్మ కొరకు వారు హృదయములను తెరుస్తారో వారికి తన మహిమను ఇచ్చును. కనుక మనిషి యొక్క ముగింపు అతని ఆరంభము కంటే గొప్పది కాదు. మనిషిని దేవుడు తన పోలికలో చేసి తన ప్రతి విధమైన ప్రవర్తనలన్నీ ఆ మనిషిలో ఉంచాలని అనుకొన్నాడు. అందుకే అర్హత లేని వారిని ఎవరైతే ప్రేమకలిగి ఉంటారో వారిని దేవుడు ఘనపరచును. అతని నీతిని బట్టి ఎవరైతే త్రోసివేయబడుతారో వారి యెడల తన సమాధానమును మరియు తన నీతిని ఉంచును.

తీర్పు ముగింపు అనునది ఎవరైతే తమ జీవితములను మార్పు కలిగి ఉండి దేవుని కొరకు జీవిస్తారో వారిలో దేవుని ఆనందము అధికముగా ఉండును. మరియు పరిశుద్దాత్మునికి సమర్పించుకొని అతనిలో ఎవరైతే ఉంటారో వారు ఆశీర్వదించబడి ఉంటారు. కనుక మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడదు; మనిషి ఏదైతే విత్తునో, ఆ పంటనే కోయును.

ప్రార్థన: ప్రభువా నీ యందు నా ప్రేమ కొద్దిగా ఉండి, అహం ఎక్కువగా ఉన్నది. నీ ముందర నేను అపవిత్రుడను. నా పాపములను క్షమించు. నీ ప్రేమ కార్యముల కొరకు నా కన్నులను తెరువుము, ఎందుకంటె నల్ల ఎటువంటి మంచి లేదు. నిన్ను వెతుకునట్లు మరియు తప్పి పోయిన వారిని వెతుకునట్లు నాలో నీ ప్రేమను నింపుము. మరియు చెడిపోయినవారిని, తప్పిపోయిన వారిని మరియు చెదిరిపోయిన వారిని నీ సన్నిధికి తీసుకొనివచ్చు భాగ్యము దయచేయుము.

ప్రశ్నలు:

  1. చివరి తీర్పుదినమందు ప్రాముఖ్యమైన అంశములు ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:34 AM | powered by PmWiki (pmwiki-2.3.3)