Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 012 (The Wrath of God against the Nations)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)

1. దేశముల మీద దేవుని ఉగ్రత బహిరంగపరచుట (రోమీయులకు 1:18-32)


రోమీయులకు 1:24-25
24 ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశ లను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. 25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌. 

24 వ వచనంలో దేవుని ఉగ్రతను బట్టి తెలుసుకోగలం. ఎవరైతే పరిశుద్దుడైన తీర్పు తీర్చువాడిని తెలుసుకొనినప్పటికీ ఆయనకు గౌరవము ఇవ్వకున్నట్లైతే వారు తమ హృదయములలో పాపము చేసినవారు. వారు లోబడక ఉన్నారు కనుక ఆత్మీయముగా గ్రుడ్డివారుగా ఉన్నారు. వారు దేవుడిని ఈ లోకములో ఒక గొప్పవానిగా యెంచక వారిని వారే గొప్పవారిగా భావించెదరు; కనుక ఎవరైతే దేవుడిని ప్రేమించకుండా ఉంటారో వారిలో అహం అనునది పెరుగుతుంది. అప్పుడు వారి నడవడిక మార్చబడి చివరికి వారు దేవుని శక్తి పొందాక వారికి వారే బలము కలిగినవారమని చెప్పుకొంటారు. వారు వారికి ఇష్టమొచ్చినట్లు జీవిస్తారు అయితే దేవునికి ఇష్టమొచ్చినట్లు జీవించలేరు.

ఎప్పుడైతే మనిషి ఇష్టము అనునది జరిగించబడాలని అనుకుంటాడో అప్పుడే పాపము అనునది అతని లోపల మాత్రమే ఉండక కార్యరూపములో కూడా ఉండి తరువాత తన శరీరములో నుంచి కూడా బయటికి వచ్చును. కనుక పాపమును నీవు కలిగి ఉన్నట్లయితే అది నీ అంతరంగమంతటిని కూడా పాడుచేసి నిన్ను దేవుని రూమపులోనుంచి చేద్దుగా చేయును. ఎందుకంటె నీ హృదయాలు దేవుని ఆత్మకు ఆలయమై ఉండుటకు మాత్రమే చేయబడి ఉన్నది కనుక నీవు ఆ ఆలయమును పాపముతో నింపుకొని ఉన్నట్లయితే అప్పుడు దేవుని రూపమును నీవు కలిగి ఉండలేవు.

కల్మషమునకు కూడా అడుగులు కలవు. ఎప్పుడైతే మనిషి దేవుని నుంచి దూరముగా వెల్లునో అప్పుడు అతను సహజమైన స్థితినుంచి బడిపోవును, మరియు ధర్మశాస్త్రప్రకారము కాక దానికి వ్యతిరేకముగా నడుచుకొని పాపములో ఉండును. విరుద్ధముగా ఉండువాడు అతని పాపమునకు ఒక బానిసగా ఉండును. దేవుని ఆత్మచేత నింపబడినవాడు సముద్రము ఎంత లోతుగా ఉండునో అదేవిధముగా అతని శ్రమలు మరియు హింసలు కూడా అతని జీవితములో చాల లోతుకలిగి ఉండును! పాపము అనునది మనకు ప్రారంభములో చాల తీయ్యగా ఉండును, అయితే మనము ఎప్పుడైతే దానిలోతులలోనికి వెళ్ళినప్పుడు మంకు మనము సిగ్గుకలిగిన వారముగా ఉంది ఇతరులకు కూడా పాపము చేయువారముగా కనపడి దానికి బదులు మనకు తీర్పు తీర్చబడును.

పాపము అనునది ఒక వంకర మార్గము మరియు అది ఒక తప్పయిన ఆరాధన కూడా. దేవుని నుంచి వేరు పరచి జీవించడము అనగా ఆత్మీయముగా చెడిపోవుట, కనుక ఎప్పుడైతే అతను దేవుని వైపు తిరిగినప్పుడు అతను క్రీస్తు మార్గములో నడుచువాడుగా ఉండును. దేవుడు తనకు ఒక విగ్రహముగా ఉండుటకు ఇష్టపడిఅప్పుడు దాని అర్థము అతను ఒక నడిపింపుకు వ్యతిరేకముగా ఉండును. ఎందుకంటె విగ్రహములన్ని కూడా మనుషుల చేత చేయబడినవి. ఒకవేళ మనిషి జీవమునకు మరియు నిత్యమునకు వ్యత్యాసము చేసినప్పుడు! అతను ధనమునకు, ఆత్మకు, పుస్తకములు మరియు ప్రజలకు బానిసగా ఉండును.

మన ప్రతి గౌరవమును మన ప్రతి అభినందనను కూడా మెచ్చుకునే వారు ఒక్కరే. అతనే సర్వసృష్టి గల దేవుడు; అతను లేనిదే ఏది కూడా జరగదు, ఎందుకంటె అతను సర్వశక్తి గల దేవుడు;మరియు దాయకలిగిన వాడు. కనుక అతనిని ఘనపరచడము మన నోటిలో ఎల్లప్పుడూ ఉండాలి, మరియు అతనిలో ఏ అవినీతి కూడా లేదు. అతని ప్రేమ మనకు ప్రతి ఉదయము నూతనముగా ఉంటుంది. అతని నమ్మకత్వము కూడా గొప్పది. అతను మనము చనిపోక ఉండునట్లు తన నిరీక్షణతో మనలను ఉంచును. కనుక ఎవరైతే ఈ సృష్టికర్త వైపు తిరుగుతారో వారు తమ జీవితములకు ఒక పునాదిని వేసుకొంటారు. మరియు నిరీక్షణ కలిగి ఉంటారు.!

పౌలు తన పత్రికలలో సృష్టికర్త "ఆమెన్" అనే పదము ద్వారా అందరినీ ఆశీర్వదించాడు అని చెప్పెను, అంటే అతని బోధ ఒక ప్రార్థన కరమైన సాక్ష్యమై ఉన్నట్లు. "ఆమెన్" అనే పదమునకు అర్థము "జరుగును గాక" అని. మన దేవుని యొక్క ఉద్దేశములు, ప్రణాలికలు, కార్యములు మన జీవితములో ప్రాముఖ్యమవును గాక. ఎందుకంటె దేవుడు లేకుండా ఈ లోకములో ఉండు ప్రతి ఒక్కరు నిత్యా నరకమునకు వేళ్ళు వారుగా ఉంటారు. కనుక మనము పరిశుద్ధాకలిగి జాగ్రత్త కలిగి ఉండాలి.

ప్రార్థన: ప్రభువా నీవు నిత్యుడైనందుకు మరియు పరిశుద్ధుడవైనందుకు నీకు మేము ఆరాధన చెల్లించుచున్నాము. నీవు మమ్ములను మంచిగా చేసి మాకు నీ దయను దయచేసి ఉన్నావు. నీకు మా హృదయములు దగ్గరగాలా సంబంధము కలిగి ఉండులాగున మా హృదయములను నీవు మార్చుము. మీ నుంచి మేము వ్యతిరేకముగా తిరిగినందుకు మమ్ములను క్షమించుము. నిన్ను తప్ప మేము ఈ లోమములో ఏ విగ్రహమును కూడా ప్రేమించకుండా కాపాడు.

ప్రశ్నలు:

  1. సరిలేని ఆరాధనకు కలుగు ఫలితము ఏమి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:29 AM | powered by PmWiki (pmwiki-2.3.3)