Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 011 (The Wrath of God against the Nations)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)

1. దేశముల మీద దేవుని ఉగ్రత బహిరంగపరచుట (రోమీయులకు 1:18-32)


రోమీయులకు 1:22-23
22 వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. 

దేవుడు లేకుండా ఎవ్వరు జీవించలేరు. ఒకవేళ అతను తన దేవుడిని తన హృదయములో ఖండిస్తే అతను ఇతర దేవుళ్ళ వైపు తిరుగును, ఒకవేళ వారు చదివినవారైనా లేక చదువు రాణి వారైనా వారికి వారు సొంత విగ్రహములను చేసుకొని వాటికి పూజిస్తూ వాటికి సంపూర్ణముగా సమర్పించుకుంటారు. ప్రతి ఒక్కరు ధనము కొరకు పాటు పది వారు జీవితములో ధనవంతులై ఉండాలని కోరుకుంటారు. అయితే చదువు వచ్చినవారు మాత్రమూ వారికి వారు ఏమి తెలియదని తెలుసుకొని వారు కేవలము పాపులని మాత్రమే తెలుసుకొనెదరు. రాజకీయనాయకులు కూడా వారికి వారు విజయము పొందాలని ఉన్న ధనమంతటిని ఖర్చు చేసెదరు. విద్యార్థులు కూడా తమ ఆచారాముల ప్రకారముగా ఉండుటకు ఇష్టపడెదరు. ఎవరికైతే దేవుని సమాధానము ఉండదో వారిలో భయము అనునది మొదలవు తుంది.

కొంత మంది టాక్సీ డ్రైవర్లు తమ కార్ల అద్దములకు ఒక నీలి రంగు గుండ్లు పెట్టుకొంటారు, ఎందుకంటె వారు చెడునుంచి కాపాడుకొనుటకు, అయితే దేవుని శక్తి వారిని కాపాడుతుంది అనే సత్యమును వారు ఖండిస్తున్నారు. అదేవిధముగా కొంత మంది ప్రయాణికులు కూడా అదేవిధముగా ఆలోచనకలిగి ఉంటారు. చాల మంది ప్రజలు జరుగబోవు సంగతులను కూడా చెప్పేవారుగా ఉంటారు. కనుక వారు క్రమము కలిగి లైన్లలో నిలుచుంది వారి సమయము వచ్చినప్పుడు చావును మరియు ఆత్మను బట్టి అడిగి తెలుసుకుంటారు. మనిషి మొదటి ఆజ్ఞప్రకారముగా కొన్ని వందల సార్లు పాపము చేయును: " నేనే నీ దేవుడవు, నేను తప్ప నీకు ఏ ఇతర దేవుళ్ళు ఉండకూడదు".

ఈ లోకము దేవుని మహిమతో గ్రుడ్డిదిగా ఉన్నది, మరియు మనుషులు కిహళీ హృదయములతో నిరీక్షణకు కోల్పోతున్నారు. చాలామంది నిరాశ చేత అపనమ్మకముచేత అధికారము చేయబడుతున్నారు.

ఈ దినాలలో చాలామంది రాజకీయము కొరకు, సినిమా వారికొరకు ఎంతో ఆశకలిగి ఉన్నారు అయితే దేవుని వాగ్దాన ప్రకారముగా అతనికి తగిన సమయము ఇవ్వడము లేదు. వారు ఒకరిని ఒకరు కొట్లాటలచేత మరియు ఖండించుట చేత నాశనము చేసుకొంటున్నారు.

నిన్ను నీవే పరీక్షించుకో! నీ సృష్టికర్తకంటే ఎక్కువగా నిన్ను నీవు మరియు ఇతరులను ప్రేమించుచున్నావా? నీ కార్ ఇంజిన్ మీద ఆధారపడి ఉన్నావా? నీ ప్రత్యక్షతను ప్రేమించుచున్నావా? ప్రజల ధ్యానమును వెతుకుతున్నావా? ఇవన్నీ కూడా దేవునికి వ్యర్థమే. కనుక నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలముతో నీ దేవుడిని ప్రేమించుము, అప్పుడు నీ హృదయమందు విగ్రహములు చనిపోయి, నీవు దేవునిలో ఉండి వెలిగించబడెదవు.

ప్రార్థన: ప్రభువా మమ్ములను నీ పోలిక చెప్పున సృష్టించినందుకు నీకు క్రుజ్త్నతలు. ఈ లోకములో ఉన్న వారందరి అపనమ్మకములు వెళ్లునట్లు నీ ప్రేమను వారికి బయలుచేసి వారిని పరిశుద్దులనుగా చేయుము. ఒకవేళ మేము ఇతర విగ్రహములను కలిగి ఉన్నట్లయితే మమ్ములను క్షమించుము. మరియు నీ కుమారుడు మా హృదయములలో ఉండునట్లు వాటినన్నిటినీ మా నుంచి తీసివేయుము.

ప్రశ్నలు:

  1. దేవుడు లేకుండా నివసిస్తున్న మనిషి ఎందుకు ఈ లోక విగ్రహమును చేసుకొంటున్నాడు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:09 AM | powered by PmWiki (pmwiki-2.3.3)