Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 010 (The Wrath of God against the Nations)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)

1. దేశముల మీద దేవుని ఉగ్రత బహిరంగపరచుట (రోమీయులకు 1:18-32)


రోమీయులకు 1:18-21
18 దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. 19 ఎందు కనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపర చెను. 20 ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. 21 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాద ములయందు వ్యర్థులైరి. 

పౌలు రోమా సంఘమునకు సాత్వికమైన, ప్రేమతో మరియు తగ్గింపుతో శుభములు చెప్పిన తరువాత వారికి సువార్త యొక్క సారాంశమును అనగా దేవుని నీతిగలిగిన వాక్యమును క్రీస్తులో చెప్ప్తులకు ఈ మొదటి భాగమును ప్రారంభించెను. దేవుని ఉగ్రత ప్రతి ఒక్కరి మీద అనగా ఎవరైతే దేవునిని తిరస్కరిస్తారో వారి మీదికి వచ్చునని వారికి బయలుపరచెను. మనము ఈ దినాలలో కేవలము దేవుని కృపలో మాత్రమే ఉండడము లేదు అయితే దేవుని ఉగ్రతలో కూడా నివసిస్తున్నాము. కనుక దేవుని యొక్క ఉగ్రత అనునది ఈ దినాలలో పాపము చేయబడిన వారిమీదకు వచ్చి ఉన్నది. కనుక ఎవరైతే పరిశుద్ధుడిని తెలుసుకున్నారో వారు అతనిని బట్టి భయము కలిగి ఉండెదరు. పరిశుద్దాత్ముడ్ని అర్థము చేసుకొనకుండునట్లైతే ఎవ్వరు కూడా అతని పరిశుద్ధాత్మను తెలుసుకొనలేరు.

దేవుడు మనుషులను తన రూపములో సృష్టించి ఉన్నాడు, అయితే వారు తమ స్వబుద్ధిచేత స్వతంత్రులుగా ఉండాలని అనుకొంటారు. అయితే దేవుడు ఎంతో ఓర్పుకలిగి ఉన్నాడు కనుక బీదలను మరియు లోబడక ఉన్నవారిని బట్టి కోపము కలిగి ఉండక ఎప్పుడైనా వారు తిరిగి అతని యొద్దకు వచ్చి అతనికి సమర్పించుకొని ఉండేదరని ఎదురు చూస్తున్నాడు. అయితే వారు దేవునికంటే మరియు ఎక్కువగా వారికి వారే ప్రేమించుకొని వారిని దేవుని నుంచి దూరముగా చేసుకొన్నారు, కనుక వారు ఆత్మీయముగా గ్రుడ్డివారైనారు. వారు పరిశుద్ధుని సన్నిధిని అనుభవించక, చెడులోనే నడిచి, వారికి వారే చెడుగొట్టుకుంటున్నారు, కనుక దీని ప్రకారముగా ఇతరులకు రక్షణ కలిగి ఉండక వారు ఒక అడ్డుగా ఉన్నారు.

పాపములో పడుటకంటె మనిషి దేవుని అద్భుతములను గుర్తుచేసుకొంటున్నాడు. ఒకవేళ నీవు చెట్లను చూసి, వాటి శక్తిని బట్టి, మరియు నక్షత్రములను బాతి నీవు నీ సృష్టికర్తను ఆరాధించెదవు ఎందుకంటె అతను సర్వసృష్టికలవాడు మరియు నిత్యజీవము కలిగిన దేవుడు. నీ అందమైన ప్రాణమును, నీ మనసును మరియు నీ మెదడును గుర్తుచేసుకొన్నావా? నీ గుండె షాబామును వింటున్నావా, అది ఒక వంద వెళ్లసార్లు ప్రతి దినము కొట్టుకుంటుంది. అప్పుడు నీ శరీరములో ఉన్న ప్రతి అవయవమునకు రక్తమును సరఫరా చేస్తుంది? ఇవన్నీ నీకు అనుకోకుండా వచ్చినవి కావు అయితే సృష్టికర్త నీకు బహుమానంగా ఇచ్చినవి.

దేవుడిని మనము సహజముగా చోసినప్పుడు అతనిని అర్థము చేసుకొనుటలో విఫలమవుతున్నామా? అతని సాక్ష్యము చెప్పినట్లు అతని మహిమ ఎల్లప్పుడూ ఉండునని. చదువుకున్న మనలాంటి వారు దేవుని చేతులతో వ్రాయబడిన పుస్తకమును చదువుటకు చాలినంత సమయము లేదు.

ఎవరైతే సృష్టికర్తను సన్మానించకుండా ఉన్నట్లయితే వారు బుద్ధిలేనివారి అతని మహిమను బట్టి కృతజ్ఞత కలిగి ఉందురు. వారు పరిశుద్దాత్మ జ్ఞానమును పోగుట్టుకొని మనసులో గ్రుడ్డివారిగా ఉండి ఒక మృగముగా ఉండెదరు. కనుక ప్రియా సహోదరుడా ప్రేమతో భయముతో దేవునిని ఘనపరచు, ఎందుకంటె అతను నిన్ను తన రూపములో సృష్టించి నీ లోనికి జీవ వాయువును ఊదాడు కనుక. నీవు అతని చెందిన వాడివి కనుక అతను లేక నీవు ఉండలేవు.

ఎవరైతే దేవుడిని నిజముగా ఆరాదించక ఉన్నట్లయితే వారు పాపములో ఉండి అవిశ్వాసులుగా ఉంటారు. ఎందుకంటె వారు తమ శక్తిని మరియు బలమును పోగుట్టుకొని వారి మనసులను మరియు ఆలోచనలను చీకటిలోకి ప్రవేశించెదరు కనుక. వారు వారి అబద్ధములను నిజములుగా చేసుకొని దేవుని జ్ఞానమును ఎరుగక బలాత్కారము చేయబడిన వారుగా ఉందురు. కనుక నీవు జీవము కలిగిన విశ్వాసముతో ఉండునట్లు దేవునిని అడుగు, అప్పుడు ఇతరులను కూడా నీవు దేవుని సన్నిధిలోనికి నడిపించుటకు మార్గము కలదు, ఎందుకంటె అతని మహిమలేనిదే, అతని కనికరము లేనిదే మనిషి నశించిపోవును, అప్పుడు వారి మీదికి దేవుని ఉగ్రత వచ్చును.

ప్రార్థన: పరిశుద్ధమైన దేవా, మమ్ములను జీవము కలిగినవారముగా చేసినందుకు నీకు కృతజ్ఞతలు. మిమ్మును ఆరాధించుటలో మేము నిర్లక్ష్యము కలిగి ఉన్నందుకు క్షమించు. నిన్ను అందరిలో మహిమపరచుటకు మరియు నీ ప్రేమను ఇతరులకు పంచుటకు మేము ముందుకు వచ్చులాగున మాకు సహాయము చేయుము. మరియు అవిశ్వాసుల చెంత మేము నిన్ను ఘనపరచునట్లు నీ సహాయమును దయచేయుము.

ప్రశ్నలు:

  1. దేవుని ఉగ్రత ఎందుకు బయలుపడెను?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:06 AM | powered by PmWiki (pmwiki-2.3.3)