Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 002 (Introduction to the Book)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

1. పుస్తక పరిచయము మరియు క్రీస్తు వాగ్దానము (అపొస్తలుల 1:1-8)


అపొస్తలుల 1:1-2
1 ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్త లులకు పరిశుద్ధాత్మద్వారా, ఆజ్ఞాపించిన 2 తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుట కును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని.

చాల మంది అనేక పుస్తకములను వ్రాసారు, అవి ఒక పెద్ద పర్వతముగా ఉన్నవి. ఒకరోజు దేవుని అగ్ని జ్వాలలో కాలిపోతారు, ఎందుకంటె మనుషులందరి మాటలు పనిచెయ్యనివి, గొప్పగా చెప్పుకోవడం, మరియు ఖాళీగా ఉండడం.

వైద్యుడైన లూకా వ్రాసిన రెండు పుస్తకాలు కూడా తీర్పు దినమందు సూర్యుని కంటే ఎక్కువైనా ప్రకాశము కలిగి వెలుగును పంచుతుంది. వారు ఎన్నటికీ దూరముగా ఉండరు, అయితే దేవుని సింహాసనము ఎదుట ఎత్తులో ఉండెదరు. లూకా ఈ పత్రికలో క్రీస్తు మాటలు మరియు కార్యాలను బట్టి క్లుప్తముగా వివరించి ఉన్నాడు. క్రీస్తు ఈ లోకమునకు ఒక బోధకునిగానే కాక రక్షకునిగా కూడా వచ్చేనని లూకా ఈ పత్రికలో చెప్పియున్నాడు. కనుక సువార్తీకుడు క్రీస్తును మహిమపరచుటకు ఇష్టపడి ఉన్నాడు. పాపులు క్రీస్తు సన్నిధిలో ఏవిధముగా తమ పాపములను క్రీస్తు యేసు కృపలో నీతిగా ఎంచబడి ఒప్పుకొనిరో అని వివరించి ఉన్నాడు. క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన దొంగ కూడా అతనితో ఆశీర్వాదకరమైన అనుభవమును పరదేషులో పొందియున్నారు. ఈ లూకా సువార్త అనునది ఒక ఆనందకరమైన పుస్తకంగా ఉన్నది. ఈ వార్తను బట్టి దూత చెప్పినది. నశించిపోయినదానిని రక్షించుటకు దేవుడే క్రీస్తు యేసు స్వరూపమందు మానవునిగా జన్మించి ఉన్నాడు. కనుక ఈ లూకా సువార్త ద్వారా చాలామంది ప్రజలు రక్షింపబడిఉన్నారని మనము చెప్పగలము. కనుక నిత్యజీవము యొక్క శక్తి ఈ పత్రిక వాక్యముల ద్వారా వ్రాయబడినది.

రోమా అధికారమునకు చెందిన థియోఫిల్స్ అను వారు ఈ క్రీస్తు యేసు యొక్క అద్భుతమైన రక్షణను అనుభవించి ఉన్నాడు. కనుక అతను లుకాను నజరేయుడైన యేసు యొక్క సమాచారమును సేకరించుమని చెప్పెను, అప్పుడే రోమా చక్రవర్తికి రక్షణను బట్టి నిజమైన సమాచారమును ఇచ్చుటకు అవకాశము కలిగెను. అయితే రోమా అధికారికి ఈ విధమైన సమాచారం అవసరము లేదు అని అయితే చరిత్రకు సంబంధించిన సమాచారం కావాలని చెప్పెను. కనుక లూకా ఈ రెండు పుస్తకములను కూడా రోమా చక్రవతి రక్షింపబడి అతని ద్వారా తన సామ్రాజ్యములో క్రీస్తు యొక్క కార్యములను చెప్పుటకు ఉద్దేశము కలిగెను. ఈ లోకములో క్రీస్తు యేసు ద్వారా తప్ప మరి ఎవ్వరి ద్వారా కూడా నిరీక్షణ లేదు అని చెప్పెను.

ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా నాశనమయి పోతాయి. తత్వవేత్తలు కూడా లాభదాయకం, ఒకవేళ వారు వారి నిజమైన మనసు చేత మేధో మధనం చేసినప్పటికీ. క్రీస్తు తన రాజ్యమును మేధో శక్తి కలిగిన ఆలోచనల ప్రకారముగా కట్టలేదు, లేదా శక్తికలిగిన సైన్యాలు మీద కూడా ఆధారపడలేదు, అయితే వారికి బదులుగా అతని అపొస్తలులుగా పిలువబడుటకు అతను విద్యలేని పామరులను, చేపలు పట్టు జాలరులు పిలిచి ఉన్నాడు. అనుకువకలిగిన హానిచేయని వారిని క్రీస్తు ఎన్నుకొన్నదంటే గల కారణము, గొప్పవారిని, బలవంతులను మరియు ఈ లోకములో తెలివైన వారిని క్రీస్తు తిరస్కరించాడని అర్థము.

ఇది పవిత్రాత్మ రూపకల్పనకు సరిగ్గా సరిపోతుంది బలవంతులైనవారిని ఎవరు బలవంతులను చేస్తారు, మరియు చిక్కిన వారికి జీవితమును ఇస్తుంది. క్రీస్తు తన కార్యములను తనకు సొంతముగా చేయలేదు అయితే అన్ని సమయాలలో పరిశుద్దాత్మ ఐక్యతతో తన తండ్రి చిట్టాను సారముగా చేసియున్నాడు. తండ్రి అయినా దేవుడు, పరిశుద్ధాత్ముడు మరియు క్రీస్తు సంపూర్ణ ఐక్యత కలిగి ఉన్నారు, అది మన అర్థమును మరియు జ్ఞానమును తెలుసుకుంటుంది. ఈ ప్రపంచ మధ్యన క్రీస్తు సంఘమును కట్టుటకు పరిశుద్ధాత్ముడు నిర్ణయించాడు, మరియు ఈ భూమి నుంచి చనిపోయిన వారికి పరలోకమును విస్తరించాడు. అపొస్తలులును ఎన్నుకొనుటలో దేవుని రక్షణ అనునది మొదలైనది, కనుక మనుషులకు ప్రకటించుటకు క్రీస్తు అలంటి వారిని ఎన్నుకొన్నారు. సువార్తీకుడైన లూకా ప్రభువు కొరకు ఈ మనుషులను ఆకరిషించాడు, మరియు చేపలు పట్టు జాలరులు ద్వారా దేవుడు తన ప్రేమను వెల్లడి చేసాడు. వారు మాత్రమే ఈ లోకములో నిజమైన అద్భుతమైన వారు మరియు భవిష్యత్తు కొరకు నిరీక్షణ కలిగిన వారు.

ఈ అద్భుత, పునరుత్తానా క్రీస్తు కోసం మార్గం సుగమం చేయడానికి ప్రపంచంలోని అతని శిష్యులలో ఒకనిగా ఉండలేదు, బదులుగా అతను పరలోకమునకు వెళ్ళాడు. ప్రభువు తన శిష్యులు చేసిన తప్పులను బట్టి భయపడలేదు, ఎందుకంటె పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నాడని మరియు కార్యములను సంపూర్తి చేయగలదని అతనికి తెలుసు. అతను భయమునుంచి ధైర్యముకలిగి పరలోకమునకు వెళ్ళినాడు. అతను తన తండ్రి దగ్గరకు వెళ్లి అతని కుడి పార్శ్యమున కూర్చున్నాడు, అతనితో కలిసి అధికారమును కలిగి ఉంది ఈ లోకములో సంఘములను పరిశుద్దాత్మ ద్వారా కట్టుచున్నాడు, మరియు దేవునికి వ్యతిరేకమైనవన్నిటినీ కూడా జయించి కొన్ని కోట్లమందిని రక్షించుచున్నది. ఈ భూమి మీద జరుగుతున్న ఈ రహస్య కార్యములను బట్టి లూకా చాల ఆశ్చర్యము కలిగి ఉన్నాడు. ఈ అభివృద్ధిని అతను తన రెండవ పుస్తకములో వ్రాసి ఉన్నాడు, మరియు దీనిని యెరూషలేమును మొదలుపెట్టి రోమా లో ముగించాడు.

ప్రార్థన: ప్రభువైన యేసు నీ రహస్య కృపను బట్టి మరియు నీ ప్రేమ కలిగిన ఆశీర్వాదమును బట్టి నిన్ను మేము ఆరాధించుచున్నాము. మాకు నీవు దయచేసి నీ కనికరమును బట్టి నీకు కృతజ్ఞతలు,నీ మహిమను మేము ఈ పుస్తకము ద్వారా తెలుసుకొనుటకు సహాయము చేయుము. మా జీవితములో జరుగు గొప్ప మేలులను తెలుసుకొనుటకు నీ కృపను గొప్పగా మాకు దయచేయుము.

ప్రశ్న:

  1. లూకా వ్రాసిన మొదటి పుస్తకము యొక్క ఉద్దేశము ఏమిటి? మరియు రెండవ పుస్తకము యొక్క ఉద్దేశము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:38 PM | powered by PmWiki (pmwiki-2.3.3)