Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 003 (Introduction to the Book)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

1. పుస్తక పరిచయము మరియు క్రీస్తు వాగ్దానము (అపొస్తలుల 1:1-8)


అపొస్తలుల 1:3-5
3 ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను. 4 ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెనుమీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి; 5 యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దిన ములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెద రనెను. 

దేవుని రాజ్య ప్రకాశము క్రీస్తు పునరుత్తనము ద్వారా ప్రారంభమైనది. చనిపోయిన వారు సమాధినుంచి లేచి, నలభై దినాలు ఈ భూమి మీద ఉండి స్నేహితులతో ఉండి వారితో కలిసి తిని త్రాగి వేసిన తలుపుల నుంచి వచ్చి! ఈ కార్యముల చేత పునరుత్తానుడైన క్రీస్తును శిష్యులు చూచి అత్తుశులైరి, కనుక వారు ఈ విధమైన క్రీస్తు కార్యములను అనుభవించిరి. మరియు అతను ఏవిధముగా ఆ సిలువలో చనిపోయాడా కూడా చూసిరి, మరియు అందరి ద్వారా అతను వెక్కిరింపబడుట కూడా చూచిరి. శుక్రవారపు దినమున అతను సమాధి చేయబడుట చూసిరి.

ఒక టార్చ్ వెలుగు ఏవిధముగా అయితే వెలిగించబడుతుందో అదేవిధముగా అతని పునరుత్తనము కూడా వెలిగించబడినది. క్రీస్తు సన్నిధి ద్వారా మనకు తెలిసినది యేదనగా అతను రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అయితే ఆత్మీయమునకు సంబంధించినది ఉన్నది, నీతి, న్యాయము, ఆనందము మరియు ప్రేమతో కూడుకొనినది. కనుక అపొస్తలులు ఈ పరలోక కార్యములచేత నింపబడి ఉండిరి. నలభై రోజులు క్రీస్తు తన శిష్యులకు ధర్మశాస్త్రమును బట్టి కీర్తనలను బట్టి మరియు ప్రవక్తలను బట్టి వివరించి ఉన్నాడు ప్రవక్తలు చెప్పినట్లు చేసియున్నాడు. కనుక వారు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసి ఆ దినమును బట్టి ఎదురు చూసారు. కనుక ఇప్పుడు పరలోక సన్నిధి వచ్చి నిత్యమైన రాజు వచ్చి ఉన్నాడు.

దేవుని కుమారుడు ఎక్కడైతే చూర్ణం చేయబడ్డాడో మరియు ప్రవక్తలు ఎక్కడైతే చంపబడ్డారో అక్కడే దేవుడు తన రాజ్యమును యెరూషలేములో ప్రారంభించాడు. అయినప్పటికీ ప్రభువు తన సమాధానమును ఈ పట్టణములో స్థాపించాలని అనుకొన్నాడు, మరియు చేపలు పట్టు జాలరులు తిరిగి అదే పనిలోకి వెళ్లవద్దని చెప్పాడు. కనుక వారు నమ్మకము కలిగి ప్రార్థనలో ఉండుమని వారికి దేవుని వాగ్ధానము ఉన్నాడని వారు తెలుసుకొనిరి.

ప్రారంభము నుంచే క్రీస్తు తన శిష్యులకు తన వాగ్దానముల అర్థములను వారికి వివరించాడు, కనుక వాటి నుండి వారు అతనిని దేవుడు అని అనుకొనునట్లు. మరియు అతను వారికి తండ్రి అని కనపరచుకొనునట్లు వారిని అతను సంరక్షించుకొనెను. కనుక వారు తమ తమను నాశనము చేయువానికి భయపడి ఉండాలి. ఇదే క్రీస్తు యొక్క ప్రత్యేకమైన మాట: పరిశుద్దుడైన దేవుడు కనికరము గల తండ్రి అయి ఉన్నాడు. కనుక ఈ విషయమును బట్టి మన ఆచారములు కూడా మార్చబడి ఉన్నవి; మరియు వచ్చు రాజ్యము తండ్రి రాజ్యము అని కూడా మనకు తెలుసు, మరియు అతని పిల్లలు కూడా ప్రార్థన చేయువారు మరియు సేవ చేయువారు. వారు క్రీస్తును అనగా అందరి పాపముల కొరకు మరణించి అందరిని విమోచించిన వారి మాదిరిని అనుసరించి ఉన్నారు.

యేసు చివరిలో పలికిన మాటలను లూకా మనకు జ్ఞాపకము చేస్తున్నాడు: " మీరు నా ద్వారా తండ్రి వాగ్దానములను వినియున్నారు. " ఈ మాటలు దేవుని కుమారుని యొక్క బోధనలను తెలియపరచుచున్నది, దాని ద్వారా పరిశుద్ధుడు మరియు గొప్పవాడు మనలను దత్తత తీసుకొని తన జ్ఞానముతో నింపి తన పిల్లలుగా చేయును. కనుక ఈ ఉద్దేశముచేతనే క్రీస్తు ఆ సిలువలో మరణించి ఉన్నాడు. అతను మన పాపములను క్షమించి మరియు మనము తండ్రి అయినా దేవుని ప్రేమను పొందుకొనునట్లు మనలను అతనితో సమాధానపరచి ఉన్నాడు. కనుక మన ప్రవర్తన ద్వారా అతని నామము పరిశుద్ధపరచబడాలి.

దానికి ముందు, పరలోకము మరియు ఈ భూమి కదిలించబడుటకు బాప్తీస్మమిచ్చు యోహాను రావడము జరిగినది. అగ్రగామి అయిన క్రీస్తు అనగా అరణ్యములో ఉన్నవాడు దేవుడు చెడ్డవారికొరకు మరియు హృదయమందు రాతి హృదయము కలిగిన వారికొరకు మరియు మారుమనస్సు కలిగి లేకున్నవారి కొరకు దేవుడు త్వరగా రాదు అని అతనికి కూడా తెలుసు, ఎందుకంటె వారు సిద్ధపాటు కలిగి లేరు కనుక. వారు మరణమునకు పాత్రులైరి కనుక వారు యొర్దాను నదిలో బాప్తీస్మము ద్వారా పాపపు ఒప్పుదలను చేసుకొన్నాడు. మరియు నీటి నుంచి వారు పైకి వచ్చుట ద్వారా వారికి తిరిగి నూతన జీవితము పొందిఉన్నారని తెలుసుకొనవచ్చు. యోహాను తాను ఇచ్చు బాప్తీస్మమౌ నిజముగా వారిని మారుమనస్సులోనికి తీసుకొని రాదు అని అతనికి తెలుసు. నీటిలో మునుగుట అనగా ఎవ్వరు కూడా ఇతరులను మరియు తమకు తాము మార్పు కలిగి ఉండరని తెలియచెప్తున్నది. మనమందరము హానికరమైనవారము, శరీరానుసారమైనవారము, మరియు చెడ్డవారము కనుక మనకు మనము పరిశుద్ధులముగా చేసుకొనలేము.

అరణ్యములో ఉన్న ప్రవక్త ద్వారా దేవుని గొర్రెపిల్ల బాప్తీస్మముద్వారానే పరిశుద్ధాత్మలో అప్పుడలా కలుగును. ఎందుకంటె అతను ఆత్మ చేత జన్మించినవాడు మరియు పాపములేనివాడు. మరియు ఆత్మ యందు అతను తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు, మరియు తండ్రితో సమాధానపరచి ఉన్నాడు, మనము కనికరము కలిగి మరియు ఆశీర్వదించబడుటకు తన ఆత్మతో నింపినాడు. కనుక ప్రియమైన విశ్వాసి నీవు తండ్రి యొక్క వాగ్దానమును గుర్తించి ఉన్నావా? ఈ ఆత్మ నీలో ఉండాలని నిర్ణయించింది. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు క్రీస్తు నీ హృదయములో ఉండును, అప్పుడు నీ శరీరము దేవుని ఆలయమై ఉండును. కనుక ఈ దినమే దేవునిని స్వీకరించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా?

క్రీస్తు ఏవిధముగా అయితే తనను తాను తగ్గించుకొని ఉన్నదో అదేవిధముగా నీవు కూడా దేవుని వాగ్దానమును పొందుటకు సిద్డపాటు కలిగి ఉండులాగున నిన్ను నీవు తగ్గించుకొని ఉండు. " నేను పరిశుద్ధాత్మతో బాప్తీస్మము ఇచ్చాను" అని చెప్పలేదు, యోహాను చెప్పినట్లు, అయితే తన మహిమను అతని తండ్రికి వదిలివేసి ఉన్నాడు, మరియు పరిశుద్ధాత్ముడు మాత్రమే రావాలని నిర్ణయించుకొని ఉన్నాడు. తండ్రి మరియు కుమారుడు మనకు పరిశుద్ధాత్మను ఐక్యత కలిగి ఇచ్చియున్నారు, కనుక ఈ ఆత్మ ద్వారానే తండ్రి మరియు కుమారుని యొక్క నిజమైన ప్రేమ అనునది వచ్చియున్నది. కనుక సహోదరా దేవుని చిత్తమును నీవు కనుగొన్నవా? మరియు అతనిని స్వీకరించుటకు నీవు ప్రార్థనాపూర్వకముగా సిద్దపడి ఉన్నావా? ఎందుకంటె క్రీస్తే తన శిష్యులకు ఎదురు చూసి ప్రార్థన చేయమని చెప్పెను కనుక

ప్రార్థన: ఓ ప్రభువైన యేసు క్రీస్తు, నీవు పరిశుద్ధుడవు. నీవు తండ్రి మరియు పరిశుద్దాత్మ ఐక్యతతో పశ్చాత్తాపాన్నికలిగిన వారికి బాప్తీస్మమిచ్చి ఉన్నావు, కనుక మేము దేవుని తీర్పును బట్టి భయము కలిగి ఉండము, అయితే దేవునిని మేము మా తండ్రి అని ప్రేమించి అతనికి ఆనందముతో లోబడి అతని నామమును ప్రకటించి మరియు మాలో నూతన పరచబడెదము. " పరలోకమందున్న మా తండ్రి నీ తండ్రి నామము పరిశుద్ధపరచబడును గాక". అని మేము ప్రకటించుటకు మాకు అవకాశమును ఇచ్చియున్నావు. ఆమెన్

ప్రశ్న:

  1. తండ్రి వాగ్దానము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:38 PM | powered by PmWiki (pmwiki-2.3.3)