Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 129 (Future predictions)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 – 21:25)
5. చెరువు దగ్గర యేసు ప్రత్యక్షమగుట (యోహాను21:1-25)

c) భవిష్యత్తును గూర్చి యేసు ప్రవచించుట (యోహాను21:20-23)


యోహాను 21:20-22
20 పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును, భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొనిప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. 21 పేతురు అతనిని చూచి ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను. 22 యేసు నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను.

పేతురు తన బోధకుడు పిలిచినా పిలుపును బట్టి అనగా అతనిని కాపరిగా ఉండుటకు. యోహాను శిష్యులలో అందరికంటే చిన్నవాడు కనుక పేతురు యోహాను గురించి యేసుకు ఉన్న ఆలోచనను బట్టి ఎంతగానో ఎదురుచూసేను. అతను యెవ్వనస్తుడని ఇంటికి పంపగలడా లేక దండు ఉద్యోగస్తుడుగా ఉంచుతాడా ?

పేతురు మాటలలో అసూయ అనే గురుతు ఉన్నట్లుగా ఉండెను, ఎందుకంటె యేసు యోహానుగురించి ఇతరులకు తనను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పెను. అందుకే పేతురు ఆ రాత్రి సమయములో చివరి భోజనము చేస్తున్నప్పుడు యేసును పట్టించు వాడు ఎవరని మిగిలిన వారిని అడిగెను.

యోహాను యేసు సిలువచేత నిలుచుండి ఇతరుల కొరకు క్రీస్తు శత్రువుల కొరకు తన జీవితమును కష్టము చేసుకొన్నాడు. యేసు పునరుత్థానుడై లేచినప్పుడు మరియు ఆ సముద్రపు అంచున యేసు నిలబడినప్పుడు యేసును గుర్తుపట్టింది మొదట యోహానే. పేతురును యేసు వెంబడించుమని చెప్పినప్పుడే యోహాను క్రీస్తును వెంబడించాడు. అతని హృదయము క్రీస్తుతో ఏకీభవించి ఉండెను. అతను శిష్యులందరికంటే క్రీస్తుకు అంతరంగీకుడు.

పేతురు యేసును యోహాను గురించి , ఒకవేళ అతను నా ప్రకారముగా భవిష్యత్తులో ఉంటె ఒక్కడిగా ఉండునా అని అడిగెను. అందుకు యేసు నేను ఎవ్వరిని కూడా ఒంటరిగా విడువను అయితే సహోదరులందరినీ ఒకేవిధముగా ప్రేమించగలను. అయితే యోహాను యేసుతో నేరుగా సంబంధము కలిగి ఉన్నాడు కనుక అతనిని గూర్చి పేతురు చింతించనవసరము లేదు, అయితే పేతురు అపొస్తలులకు ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. అయితే యోహాను ప్రార్థనలో ఏకీభవించేని సంఘ సరిహద్దులను విశాలము చేసెను, మరియు వారికి ప్రార్థన శక్తిని వారికి ఒక మాదిరిగా చూపెను (అపొస్తలుల 3:1; 8:14; గలఁతి 2:9)

మనము గమనించినట్లయితే యోహాను విషయములో యేసు ప్రాముఖ్యతను చూపలేదు, కనుక మనము క్రీస్తు పరిచర్య కొరకు బ్రతకాలి లేనిచో అతని నామము కొరకు చనిపోవాలి. అతనికి భక్తి జీవాధారమై మరియు తగ్గింపు కొనసాగింపుగా ఉన్నది. యేసు తనను వెంబడించువారిని ఒకేవిధముగా నేర్పించలేదు అయితే ఎవరి సామర్థ్యమును బట్టి వారికి నేర్పించెను, కనుక వారిని బట్టి అతను మహిమపరచబడెను. మనము యోహాను మరణము గురించి వినలేదు; ఒకవేళ అతను సాధారణమైన మరణము పొందిఉంటాడేమో.

యేసు పేతురును తనను తప్ప ఇతరులవైపు చూడవద్దని ఆజ్ఞాపించెను. దాని అర్థము మనము ఇతర క్రైస్తవుల జీవితములను బట్టి ఆలోచన చేయక మనము దేవుని చిత్తానుసారముగా ఉండుటకు ఇష్టపడాలి, మరియు అతడిని ఒకేవిధమైన నిబంధన కలిగి వెంబడించాలి. నమ్మకముగా అతడిని వెంబడించుట క్రైస్తవుల ప్రత్యేకత .

తన రెండవ రాకడను బట్టి కూడా తన శిష్యులతో యేసు మాట్లాడేను. అది ఈ లోక చరిత్రగా ఉండును. శిష్యులందరి ఆలోచనలు కూడా ఈ భవిష్యత్తు మీదే ఉన్నది. అప్పుడు మనుషులందరి కోరికలు మరియు వారి ఆశలు దేవుని రాకడ సన్నిధిలో నెరవేర్చబడును. యేసు మహిమతో వచ్చును. నీవు అతని రాకడను బట్టి, ప్రార్థనా పూర్వకముగా సిద్దపడి, అతని పరిచర్యలో ఒక సాక్షిగా ఉండగలవా ? మనము ఎంతో మంది విశ్వాసులు యేసును అతని సన్నిధిలో నమ్మకముగా వెంబడించుట చూసాము అయితే ఇతరులు ఆ విధముగా చేయలేదు.

యోహాను 21:23
23 కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గానినేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను.

మనుషుల ఆలోచనల ప్రకారముగా యోహాను కూర వృద్ధు వరకు ఉంది సంగములకు మెస్సయ్య వస్తాడు అని అనుకున్నప్పటివరకు జీవించెను. మరియు ప్రభువు తిరిగి వచ్చువరకు యోహాను చనిపోదు అని అనుకొనిరి. పౌలు కూడా యేసు వచ్చు వరకు చైపోనని అనుకొనెను అయితే అతను తన ఆలోచనలను మార్చుకొని యేసును మహిమతో కలుసుకొంటానని చెప్పెను. అయితే యేసు వాగ్దానము యోహాను విషయములో అతను వచ్చువరకు యోహాను చనిపోడని మరియు పరలోకము తెరువబడువరకు ఉంటాడని చెప్పలేదు. పేతురు అనుకున్నట్లుగా కూడా అతని ఉద్దేశములు లేవు. అయితే యేసు చివరివరకు తన గొర్రెలకు ఒక మంచి కాపరిగా ఉండెను.

ప్రార్థన: ప్రభువా యేసయ్య నీవు నమ్మకమైన మహిమగల రక్షకుడవు. పేతురును మరియు యోహానును వారి సామర్థ్యమును బట్టి పిలిచి మరియు మరణములో జీవములో నీకు మహిమకరముగా ఉండుటకు సహాయము చేసినందుకు నీకు కృతజ్ఞతలు. మిమ్ములను వెంబడించుటను మాత్రమే మాకు నేర్పుము.మా స్నేహితులను మా బంధువులను కూడా మార్చుము అప్పుడు వారు కూడా నీ రాకడ కొరకు ఎదురుచూసి ఉండెదరు.

ప్రశ్న:

  1. సువార్తలలో యేసు చివరి మాటలు ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:46 PM | powered by PmWiki (pmwiki-2.3.3)