Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 107 (Jesus questioned before Annas and Peter's threefold denial)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
A - యేసును పట్టుకొన్నప్పుడు జరిగిన సంఘటనలు (యోహాను 18:1 – 19:42)

2. అన్న ఎదురుగా యేసును ప్రశ్నించుట మరియు పేతురు కాదనడం (యోహాను 18:15-21)


యోహాను 18:12-14
14 కయపఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. 15 సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి యేసుతో కూడ వెళ్లెను.

ఇక్కడ యూదులు మాత్రమే యేసును పట్టుకొనలేదు అయితే రోమా అధిపతులు కూడా యేసును అదే ఉద్దేశముచేత పట్టుకొనిరి. యేసు ఎవరైతే మరణమును జయించి, దెయ్యములను వెళ్లగొట్టి, అలలను నిలిపి, రోగులను స్వస్థపరచి, మరియు పాపములను క్షమించి వాడు సత్వేఏకము గలవాడు. మనకు రావలసిన శిక్షను క్రీస్తు పండుకొని ఉన్నాడు. ఎందుకనగా మనము పాపము చేసినవారము అయితే మనకొరకు అతను శిక్షను అనుభవించెను. కనుక అతని సిలువ మరణము ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగినది.

అన్న అను యాజకుడు 6 BC నుంచి 15 bc వరకు యాజకునిగా ఉన్నాడు. అయితే రోమా సామ్రాజ్యము అతడిని తొలగించింది. అయితే కైపసును వారు అనుకోకుండా పట్టుకొనిరి. అతను రోమా ధర్మశాస్త్ర ప్రకారము చేయుటకు సిద్దపడెను. అతను మోసకలరమైన వాడు, సాతానుకు యాజకునిగా ఉండెను, క్రీస్తు గురించి చెడు మాటలను బయలుపరచెను. కనుక ఎవరైతే సాతాను ద్వారా పట్టుకొనబడి ఉంటారో వారు మిములను చెడు మార్గములోనికి నడిపించి మిమ్ములను దేవుని ఉగ్రతలోనికి నడిపించెదరు.

అయితే యోహాను ఈ రెండు కార్యములను బట్టి తన సువార్తలో వ్రాయలేదు అయితే కేవలము అన్న మాత్రమే వారి ఎదుట నిలువబడినట్లు వ్రాసెను. అప్పటికి ఇంకా అతను కార్యము చేయుట అధికారము కలవాడు.

యోహాను 18:15-18
15 సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి యేసుతో కూడ వెళ్లెను. 16 పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను. 17 ద్వారమునొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడుకాననెను. 18 అప్పుడు చలివేయు చున్నందున దాసులును బంట్రౌతులును మంటవేసి చలికాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను.

యోహాను మరియు పేతురు క్రీస్తును కొద్దీ దూరము వరకు వెంబడించారు. యోహాను యాజకునికి సమీప బంధువు కాబట్టి ఆ యాజక భవనము లోనికి ప్రవేశించెను. అయితే పేతురు వెళ్లలేకపోయెను ఎందుకంటె ఆ ద్వారముల యొద్ద కావలివారు ఉండిరి.

ఆ ద్వారపు దగ్గర చీకటిలో పేతురు హృదయములో తొందరపాటును యోహాను చూసేను. అతనికి యోహాను సహాయము చేయాలనీ చూసేను. అయితే అక్కడ ఒక చిన్నది ఉండెను, " నీవు కూడా శిష్యులలో ఒకడివికదా?" అని అడిగెను, అందుకు పేతురు, " లేదు" , అతనికి ఆ కార్యముతో ఏమి సంబంధము లేనట్టుగా నాటించెను అయితే ఆ సమయములో అక్కడ వాతావరను చల్లగా ఉండినను అతను మాత్రమూ వెచ్చగా ఉండెను.

యోహాను 18:19-24
19 ప్రధానయాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా 20 యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయము లోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు. 21 నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. 22 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలొఒకడుప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చు చున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. 23 అందుకు యేసునేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన యెడల నన్నేల కొట్టుచున్నావనెను. 24 అంతట అన్న, యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను.

అయితే అక్కడ క్రీస్తు పొరపాటును బట్టి అతడిని విచారించడము లేదు అయితే అతను చెప్పిన విషయములను బట్టి విచారణ జరుగుతున్నది. అతని బోధనలను బట్టి మరియు అతని శిష్యులను బట్టి అక్కడ విచారణ జరిగినది. ఆ సమయములో అక్కడ చాల రహస్య సంస్థలు కూడా ఉన్నాయి. ఒకవేళ అతని శిష్యులు తిరగబడతారేమోనండి విచారించువారు వారి పనిని తొందరగా చేయుటకు ప్రయత్నించిరి.

అయితే యేసు ఆ సంస్థలను ఖండించెను యెదనుకంటె వారికి క్రీస్తు చెప్పిన ప్రతి మాట కూడా రహస్యముగా చెప్పక బహిరంగముగానే చెప్పెనని వారికి తెలుసు. ఒకవేళ అక్కడున్న పెద్దలు క్రీస్తు గురించి నిజముగా తెలుసుకోవాలని కుంటే వారు యేసు ఎక్కడైతే తన బోధనలను చెప్పాడో అక్కడికి వెళ్లి తన మాటలను మరియు అతని ఉద్దేశములను తెలుసుకొని ఉండేవారు. కనుక ఈ విధముగా క్రీస్తు ఆ పాత యాజకుల దగ్గర ధైర్యముగా వారి మాటలకు సమాధానము చెప్పెను. అప్పుడు అనుకోకుండా ప్రధాన యాజకుని దృష్టిలో పడాలనే ఉద్దేశ్యముతో క్రీస్తును గట్టిగా పట్టుకొనెను. అయితే క్రీస్తు అతని మీద కోపపడలేదు మరియు విడిపించుకోవాలని చూడలేదు. మరియు అదేసమయములో అక్కడున్న ఆ సేవకులకు అతను చేసిన పొరపాటును మరియు చేరిన గాయమును గూర్చి వివరించెను. యేసు నిందారహితుడు కనుక ఆ సేవకుడు తన తప్పును బట్టి పచ్చాత్తాపం పడవలసి ఉండెను.

ఈ సవాలు అన్న కు వెళ్లెను, ఎందుకంటె సేవకుల ప్రవర్తనకు అతడే కారకుడు కాబట్టి;అతనే ఆ పనిని ప్రోత్సహించాడు కనుక. ఈ దినాలలో కూడా ఈ విధముగా కారణము లేనిదే ఇతరులను పెట్టుకోవడము లేదా నిందించడము జరుగుతున్నది . అయితే ప్రభువు, " వీరికి మీరు చేసినట్లయితే, నాకు చేసినట్లు" అని చెప్పినవారిని బట్టి క్రీస్తు ప్రేమించును.

యేసు ఏమి కూడా మాటలాడక పోయిన దానిని బట్టి అన్న గమనించిన తరువాత తన అల్లుడైన కైపసు దగ్గరకు క్రీస్తును పంపెను .

యోహాను 18:25-27
25 సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచినీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడునేను కాను, నేనెరుగననెను. 26 పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడునునీవు తోటలో అతనితొ కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు 27 పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.

కైపసు యేసును తన శిష్యులను గురించి ప్రశ్నలు వేసెను. వారిలో ఇద్దరు అదే భవనంలో ఉండికూడా వారు యేసు శిష్యులని లేదా అతనిని వెంబడించువారమని చెప్పలేదు. పేతురు ఆ వెలుగులో వేరే స్థలము నుంచి వచ్చినవాడుగా కనపడెను, కనుక ఆ సేవకులకు అతనికి క్రీస్తు సంబంధము ఉన్నాడని అనుమానించి అతనిని అడిగిరి, నీవు వారిలో ఒక్కడివా అని అందుకు, పేతురు , " లేదు ,లేదు" అని సమాధానమిచ్చెను.

వారిలో అతని యెడల అనుమానము వచ్చినప్పుడు అతని మీద నిందమోపిరి. అందులో ఉన్న ఒకడు, " నాకు తెలుసు; నీవు ఆయనతో పాటు తోటలో ఉండుటచూసాను" అని చెప్పినప్పుడు అతను చాల విచారము కలిగెను. పేతురు తన కత్తితో తన చెవిని నరికిన వాడు అతని దగ్గరకు వచ్చెను. అయితే యోహాను పేతురు ఏవిధముగా ఖండించినాడో వ్రాయలేదు అయితే అపొస్తలులు ఏవిధముగా నడిపించబడినారో అది మాత్రమే చెప్పెను.

కోడి కూయటం అనునది పేతురు చెవిలో ఒక తీర్పు తీర్చునట్లుగా ఉండెను. యేసు తన శిష్యులలో ఏఒక్కరు కూడా మరణము వరకు అతనిని వెంబడించడము చూడలేదు. వారందరిలో పాపము చేయబడిరి, ఖండించిరి, మరియు తెలియదు అని చెప్పిన వారే. యోహాను పేతురు ఏడ్చేనని కానీ లేదా పచ్చాత్తాపం పడెను అని కానీ చెప్పలేదు అయితే క్రీస్తును ఖండించుట మాత్రమూ పెద్దగా చేసెను. పేతురు తన ఆత్మీయ కన్నులు తెరచునట్లు కోడి మూడు సార్లు కూయడము చూసేడము. మనము తప్పు చేయు ప్రతి సారి మనలను హెచ్చరించుటకు దేవుడు కోడిని ఇచ్చినాడు. కనుక సత్యమైన ఆత్మ మనలో ఉంటుంది. కనుక నీవు నిజాము పలికే నాలుక కలిగి ఉండునట్లు మరియు మంచి మనసు కలిగి ఉండునట్లు క్రీస్తును అడగవలెను.

ప్రార్థన: ప్రభువా నవ్వు సత్యము కలిగి ఓర్పు కలిగి ఘనత కలిగి ఉండుటను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. మా ప్రతి అబద్ధమును క్షమించు. నీవు మా గాయములను మాన్పి ఉన్నట్లు మేము ఎన్నడును అబద్ధము చెప్పక ఉండునట్లు మమ్ములను నీ ఆత్మ చేత నింపుము. మేము నీ సర్వసత్యములో నడుచునట్లు మాకు నీ మార్గమును తెలియపరచుము .

ప్రశ్న:

  1. అన్న ఎదురుగా ఉన్నప్పుడు క్రీస్తుకు మరియు పేతురును ఉన్న సంబంధము ఏవిధముగా ఉన్నది ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:21 PM | powered by PmWiki (pmwiki-2.3.3)