Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 106 (Jesus arrested in the garden)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
A - యేసును పట్టుకొన్నప్పుడు జరిగిన సంఘటనలు (యోహాను 18:1 – 19:42)

1. యేసును తోటలో పెట్టుకొనుట (యోహాను 18:1-14)


యోహాను 18:1-3
1 యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడకెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను. 2 యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. 3 కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధముల తోను అక్కడికివచ్చెను.

యేసు ప్రార్థనలో తన తండ్రితో మాట్లాడి అతని జీవితమును దేవుని హస్తములకు అప్పగించెను, మరియు అతని అపొస్తలులు మరియు అతనిని వెంబడించువారిని కూడా . ఈ విధముగా తన చివరి ప్రార్థన చేసెను. అప్పుడు తన తండ్రి చిత్తప్రకారముగా చేయబడినట్లు శ్రమలలోనికి మరియు ఈ లోక మానవాళి పాపములకొరకు దేవుని గొర్రెపిల్లగా అనుభవించెను.

కనుక అతను కిద్రోను నది అను ఒక ప్రదేశములో ఒలీవ పర్వతము దగ్గరకు ప్రవేశించెను. ఇక్కడే యేసు ఎక్కువకాలం తన శిష్యులతో సమయమును వెచ్చించి మరియు ఎక్కువ సేపే విశ్రాంతి తీసుకున్నది. అందుకే ఇస్కరియోటుకు ఈ రహస్య ప్రదేశము తెలుసు కాబట్టి పరిసయ్యులు ఆ స్థలమును గూర్చి చెప్పెను. అయితే రోమా అధిపతులతో ఒప్పందం కలిగి ఉంటేనే వారు రాత్రి పూత ఎవ్వరినైనా పట్టుకోగలరు. అయితే ఆ అధికారులు ఇస్కరియోతు మాటలు నమ్మక అతడిని వారికి మార్గము చూపుమని ఆజ్ఞాపించిరి. అందుకే యూదా ద్రోహి మాత్రమే కాక క్రీస్తును వారికి అప్పగించెను. తన కుమారుడిని పట్టించుటలో అతడిని నిషేధించెను.

యోహాను 18:4-6
4 యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లిమీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను. 5 వారునజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసుఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను. 6 ఆయననేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి.

మనకు ఏవిధముగా పట్టుకొనువారు వస్తారో అనే సమాచారం తెలియదు . ఒకవేళ అతను తప్పించుకుంటాడేమో అని వారితో చాల దీపములు తెచ్చుకొని వచ్చిరి. అయితే ఆ సమయములో క్రీస్తు ప్రార్థనలో ఉండగా అతని శిష్యులు గాఢ నిద్రలో ఉండిరి. ప్రార్థనలో క్రీస్తు అతడిని పట్టుకొనుటకు చాలామంది వచ్చుచున్నారని ఎరిగెను. తన కొరకు ఏవిధమైన తీర్పు ఉన్నదో తెలుసుకొన్నప్పటికీ అతను వారినుంచి తప్పించుకొనుటకు ప్రయత్నమూ చేయలేదు. ప్రతి విషయమును బట్టి తెలుసుకొనెను అయినప్పటికీ తన తండ్రికి లోబడి ఉన్నాడు. అప్పడు అతను లేచి తనను తాను వారికి అప్పగించుకొనెను; అప్పుడు అతని ఘనత బయలుపరచబడెను.అయితే మనము గమనించినట్లయితే యూదా ఇక్కడ క్రీస్తును అప్పగించలేదు , అయితే క్రీస్తే మన పాపములకొరకు తనను తాను చనిపోవుటకు అప్పగించుకొనెను.

అతడు వారిని ," ఎవరిని మీరు వెతుకుతున్నారు ? " అని అడిగెను. ఎప్పుడైతే వారు అతని పేరు చెప్పిరో ," అతను నేనే" అని చెప్పెను. ఆత్మీయముగా ఒకవేళ ఎవరైనా ఆలోచిస్తే దేవుడు మోషేతో " నేనే" అను మాట జ్ఞాపకముచేసుకోవచ్చు. నీవు నిజముగా నీ రక్షకుడిని చంపాలనుకున్నావా? అతను నేను ఏమి చేయాలను కున్నావా చేయుము. నేనే సృష్టికర్తను, విమోచకుడను నీ ముందర నిలబడి ఉన్నాను".

ఈ మాటలన్నీ యూదా హృదయము గుచ్చుకొన్నట్లు చేసెను. యోహాను సువార్తలో ఇది చివరిగా జ్ఞాపకము చేయబడెను. యోహాను యూదా క్రెస్టు ముద్దుపెట్టుకొనుటయే మరియు ఆత్మహత్య చేసుకొనుట గుర్తుచేయలేదు. అయితే యోహాను గురి అంత అందరికొరకు తన శత్రువులకు సమర్పించుకుంటున్న క్రీస్తు వైపే ఉన్నది. కనుక క్రీస్తు యొక్క సమర్పణ యూదా హృదయమును పొందిచినట్లుగా ఉండెను ఎందుకంటె క్రీస్తు చనిపోవుటకు సిద్దపడెను కనుక. అప్పుడు అక్కడున్న భటులందరు యేసు మాటలు విని ఆశ్చర్య పడిరి. ఇక్కడ క్రీస్తు తనను తాను వారికి అప్పగించెను , యాజకుడు విమోచనదినమందు ఏవిధముగా సమర్పించుకొంటాడో అదేవిధముగా క్రీస్తు చేసెను, అందుకే, " నేనే మీరు వెతుకుతున్న వాడను" అని చెప్పెను.

యోహాను 18:7-9
7 మరల ఆయనమీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారునజరేయుడైన యేసునని చెప్పగా 8 యేసు వారితోనేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను. 9 నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.

క్రీస్తు తనను పట్టుకొనుటకు వచ్చువారి వైపు తిరిగేను. అందులో కొందరు తన శిష్యులను పట్టుకొనుటకు ప్రయత్నించినప్పుడు క్రీస్తు వారికి కేడెముగా ఉండెను. అతను మంచి కాపరి కనుక తన గొర్రెలను కాపాడునట్లు తన శిష్యులను ఆ భటులనుంచి కాపాడెను. అప్పుడు వారు అతని ఆజ్ఞకు లోబడిరి. అప్పుడు అతను, " నేనే అతను" అని, అనగా, " నేనే జీవాహారము, నేనే ఈ లోకమునకు వెలుగును, నేనే ద్వారమును, నేనే మంచి కాపరి, మార్గము సత్యము మరియు జీవము " అన్నట్లుగా చెప్పెను. "యేసు" అను నామమునకు అర్థము, దేవుడు రక్షించి కాపాడుడు. ఈ నిజమైన ప్రేమను యూదులు తిరస్కరించారు. తగ్గింపుకలిగిన నజరేయుడైన యేసు వారి మెస్సయాగా స్వీకరించలేదు.

యోహాను 18:10-11
10 సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను. 11 ఆ దాసునిపేరు మల్కు. యేసుకత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.

పేతురు తన ప్రభువును మరియు అతని మాటలను అర్థము చేసుకోలేదు. అతను నిద్రనుంచి లేచెను. ఎప్పుడైతే అతను ఆ భటులను చూసాడా వారి దగ్గరకు వచ్చి క్రీస్తు అతడికి ఇచ్చిన కత్తిని తీసెను. దానిని క్రీస్తు అనుమతి లేకుండా వారిపైకి లేపెను. అప్పుడు ఆ సేవకుని యొక్క చెవి తెగి పడెను. దీనిని యోహాను పేతురు చనిపోయిన తరువాత చెప్పినాడు.

యేసు తన శిష్యులలో ముఖ్యుడైన వానికే ఆ కత్తిని తీసుకోమని ఆజ్ఞాపించుట యోహాను పెద్దదిగా చూపెను, తరువాత ఆ సేవకుని రక్తము కరుకుండునట్లు చేయుట మరియు అతని శిష్యులను వారు పట్టుకొనకుండునట్లు పెద్దదిగా చేసెను.

అప్పుడు క్రీస్తు తన శిష్యులతో ఆ పాత్ర గురించి చెప్పి ప్రార్థన చేసెను. దీనిని మనము క్రీస్తు శ్రమలను దానిలో ఉన్న లోతైన మర్మములను అర్థము చేసుకొనుటకు చదవగలము. మనము చదివినట్లు అందరి పాపములకొరకు అతను శ్రమలను పొందుటకు సిద్దపడెను. ఆ పాత్ర నేరుగా తండ్రి నుంచి వచ్చునది. మరియు చెడు అనునది అతనికి చాల దగ్గరైనది అని చెప్పెను. అయితే తండ్రి మరియు కుమారుడు మనుషుల విషయమై ఒక్కటై ఉన్నారు. కనుకనే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను అనుక తన కుమారుడిని ఇచ్చెను.

ప్రార్థన: ప్రభువా మా పట్ల మీ ప్రేమను బట్టి మిమ్ములను మేము ఆరాధిస్తున్నాము. మా కొరకు నీ కుమారుడిని ఇచ్చినావు. నీ కృపను బట్టి మరియు మహిమను బట్టి నీకు కృతజ్ఞతలు. నీవు ఆ తోటలోనుంచి తప్పించుకొని వెళ్ళాక నీ శిష్యులను రక్షించినందుకు నీకు కృతజ్ఞతలు. నిన్ను నీవు తిరస్కరించుకొని మాకొరకు దాయకలిగి ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు .

ప్రశ్న:

  1. తోటలోనికి ప్రవేశించినప్పుడు యేసు యొక్క ప్రకటన ఏ విధముగా ఉన్నది ?

క్విజ్ - 6

ప్రియా చదువరి 15 మరియు 17 వ ప్రశ్నలకు సరి అయినా సమాధానమును పంపుము. అప్పుడు మేము నీకు ఎలాంటి పత్రికలను పంపెదము.

  1. యేసు నిజమైన ద్రాక్షావల్లి ఎలా ఆయెను ?
  2. మనమెందుకు క్రీస్తులో ఉంది అతను మనలో ఎందుకు ఉన్నాడు ?
  3. పాపములో బానిసలుగా ఉన్నవారిని అతని ప్రియులుగా యేసు ఎలా చేసెను ?
  4. ఈ లోకము క్రీస్తును మరియు అతని వెంబడించువారిని ఎందుకు ద్వేషించును ?
  5. క్రీస్తు సిలువమరణముతో దేవుడు ఈ లోకమునకు ఏవిధముగా చెప్పెను ?
  6. క్రీస్తును విశ్వసించువారిని ఈ లోకము ఎందుకు ద్వేషించును ?
  7. ఈ లోకములో పరిశుద్ధాత్ముడు ఏవిధముగా పనిచేయును ?
  8. ఈ లోక ఎదుగుదలలో పరిశుద్దాత్మ ఏవిధముగా కార్యము చేయును ?
  9. యేసు నామములో మన ప్రార్థనలు దేవుడు ఎలా సమాధానమును ఇచ్చును ?
  10. ఎందుకు ఎలా తండ్రి మనలను ప్రేమించును ?
  11. యేసు ప్రార్థనలో ఉన్న మొదటి దాని ఉద్దేశము ఏమిటి ?
  12. యేసు ద్వారా తండ్రి నామం బయలు పరచుట అనగా ఏమి ?
  13. తండ్రి నామములో మనము ఏవిధముగా సంరక్షించబడతాము ?
  14. మనలను చెడు నుంచి కాపాడమని క్రీస్తు తన తండ్రిని ఏవిధముగా అడిగెను ?
  15. మన ప్రయోజనములు కొరకు క్రీస్తు ఏవిధముగా విన్నవించెను ?
  16. యాజక ప్రార్థన ద్వారా యేసు ఏవిధముగా ప్రార్థించెను ?
  17. తోట ప్రారంభములో యేసు యొక్క ప్రకటన వారికి ఏవిధముగా ఉన్నది ?

నీ పూర్తి చిరునామా క్రింద జవాబు పేపర్ లో వ్రాయుట మరచిపోవద్దు, ఎంవోలోప్ మీదనే కాక లోపల కూడా వ్రాసి ఈ క్రింది చిరునామాకు పంపగలరు:

Waters of Life
P.O.Box 600 513
70305 Stuttgart
Germany

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:20 PM | powered by PmWiki (pmwiki-2.3.3)