Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 084 (The new commandment)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
B - ప్రభువు భోజనమునకు సంభవించు కార్యములు (యోహాను 13:1-38)

3. సంఘమునకు క్రొత్త ఆజ్ఞ (యోహాను13:33-35)


యోహాను 13:33
33 పిల్లలారా, యింక కొంతకాలము మీతో కూడ ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను.

తండ్రి ఆత్మలో మహిమ పరచబడిన తరువాత , యేసు మనలను విశ్వాసములోనికి నడిపించెను. అతను మన మధ్యన శరీరముతో ఉండి అదేవిధముగా పరలోకములో కూడా ఉండెను. పునరుర్ధనుడైన క్రీస్తు ఈ లోకములో ఒక గొప్ప సత్యమై ఉన్నాడు. ఎవరైతే అతనిని విశ్వసించకపోతే అతను గ్రుడ్డితనములో ఉండి చెదరగొట్టబడును, అయితే ఎవరైతే అతనిని చూస్తారో వారు నిత్యజీవములో ఉందురు.

యేసు తన శిష్యులకు ఒక విషయమును గూర్చి చెప్పెను, నేను వేళ్ళు స్థలమునకు మీరు నన్ను వెంబడించలేరు అని. ఇది యేసు సంఘము ఎదుట చెప్పినది కాదు, మరియు తెరువబడిన సమాధిని బట్టి కాదు అయితే అతను పరలోకమునకు వేళ్ళు మూడు ఈ మాటలు చెప్పినాడు. తండ్రి చెప్పినట్టు, " నీ శత్రువులను నా పాదముల దగ్గర ఉందువరకు నా కుడి వైపును కూర్చో" . యేసు తన మరణమును గురించి మాత్రమే చెప్పలేదు అయితే అతను పరలోకమునకు ఏవిధముగా అయితే వేళ్తాడో అని వారికి చెప్పియున్నాడు, కనుక అక్కడికి ఏ మనుష్యుడు కూడా తన సొంత కార్యములచేత చేరలేడు. ఈ విషయమును బట్టి యూదులకు క్రీస్తు ముందుగానే చెప్పియున్నాడు అయితే వారు దీనిని నమ్మలేదు. అయితే ఈ సమయములో శిష్యులు ఈ విషయమును విశ్వసించగలరా ? అతను వారిని తండ్రిని ఆరాధించుటను మరియు కుమారుని ఆరాధించుటను నేర్పించెను కనుక వారు వారి భవిష్యత్తులో శ్రమ పడకూడదని. కనుక వారు అతని నమ్మకత్వమును విశ్వసించారా, వారిని విడచిపెట్టలేనందుకు ? మరియు వారి సాహసమును విఫలము కాలేదా ?

యోహాను 13:34-35
34 మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. 35 మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.

ఇంకా ఆత్మ శిష్యుల మీదికి రాలేదు కనుక వారికి సంపూర్ణముగా అర్థము కాలేదని యేసుకు తెలుసు. వారు విశ్వసించుటలో గ్రుడ్డివారుగా ఉన్నారు, లేదా ప్రేమించుటకు ఉత్సాహము కలిగి లేరు, " దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక, ఎవరైతే ప్రేమకలిగి ఉంటారో వారు దేవునిలో ఉంటారు మరియు దేవుడు వారిలో ఉండును. " పరిశుద్ధ త్రిత్వము కూడా ప్రేమ అయి ఉన్నది. త్రిత్వము ఎప్పుడు ప్రేమకలిగి ఉన్నది కనుక తండ్రి మరియు పరిశుద్ధాత్ముడు మనుషులలో ప్రేమను దయచేయువారుగా ఉన్నారు, కనుక ఆ పరిశుద్ధత శిష్యులలో నిజమైనదిగా ఉండెను.

కనుక యేసు సంఘములలో ఉన్న సభ్యులందరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండుమని చెప్పెను. పాత నిబంధన గ్రంధములో ఉన్నట్లు అతను ఏవిధమైన నిషేదం విధించలేదు, అయితే అన్ని ఆజ్ఞలను ఒకటిగా ఉండునట్లు ఒక్క ఆజ్ఞను మాత్రమే ఇచ్చెను. ప్రేమ అనునది ధర్మశాస్త్రమును నెరవేర్చునది. ఎందుకంటె మోషే ప్రజలకు వ్యతిరేకమైన నిబంధనలను ఇచ్చెను, అయితే క్రీస్తు అన్ని నిబంధనలను వాస్తవ్యమైనవి ఇచ్చెను. కనుక సంఘములలో ప్రేమ అనునది అవసరమైనది. సంఘములో ఒకవేళ ప్రేమలేనట్లైతే అది విరమణ పొందిన సంఘముగా పిలువబడుతుంది.

ప్రేమ అనునది యేసు యొక్క రహస్యమైన వ్యక్తిత్వము కలిగినది. అతను ఎప్పుడైతే గొర్రెలు చెదరి పోయినాయి అప్పుడే వాటి పట్ల ఒక కాపరిగా అతను దయకలిగి ఉన్నాడు, మరియు తప్పిపోయిన ఆ గొర్రె పట్ల అతను కనికరము కలిగి ఉన్నాడు. కనుక అతను తన శిష్యులతో ఓర్పు కలిగి మరియు సమాధానము కలిగి ఉండును. క్రీస్తు తన రాజ్యములో ప్రేమతో నింపెను. కనుక ఎవరైతే ప్రేమకలిగి ఉంటారో వారు అతని కృపలో ఉంటారు, అయితే ఎవరైతే ద్వేషిస్తారో వారు సాతానుకు సంబంధించినవారు. ప్రేమ దయకలిగి ఉండును. అది ఓర్పుకలిగి అన్నిటి కొరకు మంచి కలిగి ఉండును, అపొస్తలులు అప్పుడప్పుడు ఏవిధముగా ఓర్పు కలిగి ఉన్నారో అదేవిధముగా. దేవుని ప్రేమ ఎప్పటికీ విఫలము కాదు; అయితే ఇది సత్యమైనది.

సంఘమును ప్రేమించుటకు వేరే విధమైన త్యాగము లేదు. మనము సేవకొరకు తర్ఫీదు పొందినట్లైతే అప్పుడు అతని శిష్యులమవుతాము. మనము ప్రేమ అను మాటను క్రీస్తు కార్యముల ద్వారా నేర్చుకొనినవారముగా ఉన్నాము.మనము అతని క్షమాపణను కలిగి ఉన్నాము కనుక ఇతరులను కూడా మనము క్షమించాలి. ఒకవేళ సంఘములో అందరు ఆనందము కలిగి ఉన్నట్లయితే దాని అర్థము అందరు కూడా క్రీస్తు ఆత్మను పొందుకొనినవారు, మరియు ఐక్యం కలిగిన వారు, అప్పుడు అక్కడ పరలోకము ఈ భూమి మీదకు వచ్చును, అప్పుడు మన జీవము కలిగిన దేవుడు మన సంఘములను తన పరిశుద్ధాత్మచేత నింపును.

ప్రశ్న:

  1. క్రైస్తవులకు మాత్రమే ప్రేమ ఎందుకు ప్రసిద్ధమైనది ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:55 AM | powered by PmWiki (pmwiki-2.3.3)