Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 036 (Christ raises the dead and judges the world)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
A - యెరూషలేమునకు రెండవ ప్రయాణము (యోహాను 5:1-47) -- యేసుకు మరియు యూదులకు మధ్య వైరము

3. క్రీస్తు మృతిని లేపి లోకమునకు తీర్పు తీర్చుట (యోహాను 5:20-30)


యోహాను 5:20-23
20 తండ్రి,కుమారుని ప్రేమించుచు,తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. 21 తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును. 22 తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని 23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు;కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.

మనుష్యులకు ఆశాదేమైనా వాటిని క్రీస్తు సాధ్యపరచి యున్నాడు కనుక ఈ కారయములు ఎంత రమ్యములు. తండ్రి వాటిని తన కుమారునికి అప్పగిస్తే ఆయన వాటిని మోయును. ఇక్కడ క్రీస్తును గురించిన రెండు లక్షణాలను ఈ వాక్యంలో మనం గ్రానించవచ్చు. యూదులు ఆ మనిషిని ఉదాహరణగా అనుకొన్నారు : మృతిని జయించుట, మరియు నీతిగా తీర్పు తీర్చుట. ఈ రెండు లక్షణములు క్రీస్తుకు కలవు. యేసు ముందుగానే తనకు తాను జీవమును ఇచ్చువాడని మరియు తీర్పు తీర్చువాడని , వారి దృష్టిలో అతను ఒక దుమ్ము అని చెప్పినప్పటికీ వీటిని యేసు ముందుగానే చెప్పియున్నాడు. వారు ఆయనను చంపాలని చూచినప్పటికీ, యేసు వారిని మార్చి వారు ఆలోచన చేసినది తప్పు అని తెలిపి వారు నిజమైన అప్పుడలా కలిగి ఉండాలని అనుకున్నాడు.

మన దేవుడు నాశనము చేయువాడు కాదు అయితే జీవితమును ఇచ్చు వాడు, పాపమునకు మరణము జీతముగా ఉన్నప్పుడు వారు వారి పాపమును బట్టి చనిపోవాలని ఎంచలేదు అయితే వారి పాపమునకు ప్రాయచ్చిత్తంటూ చేసి వారికి నిత్యా జీవితమును దయచేయాలని అనుకొన్నాడు. ఎవరైతే అతనిని తిరస్కరిస్తారో వారు ఆత్మీయముగా,ప్రాణములో మరియు శరీరములో నశించిపోతారు. అయితే ఎవరైతే క్రీస్తుకు దగ్గరకలిగి ఉంటారో వారు నిత్యజీవమును అనుభవించెదరు. రక్షకుడు నీ జీవితము మార్చబడాలని అనుకొన్నాడు, కనుక అతని స్వరమును వింటావా? లేక పాపముతో కూడిన జీవితమును కలిగి ఉంటావా ?

ఈ భూమి ఆరంభములోనే చేయబడియున్నది. ఒకవేళ మనుషులు వారి దేవుని విషయములో అనాలోచనకలిగి, మోసము చేయుటలో, చంపుటలో ఉన్నప్పటికీ నిజాము అనునది మారణాదిగా ఉన్నది. తీర్పు దినము ఒక లెక్క చెప్పే దినముగా ఉన్నది. ఎవరైతే మోసము కలిగి శత్రుత్వము కలిగి మరియు విధవరాళ్ల పట్ల చెడ్డ ప్రవర్తన కలిగి ఉంటారో వారికి ఆ దినము బహు అపాయముగా ఉంటుంది. ఎందుకంటె ఆ దినమున క్రీస్తు అన్ని భాషలు మాట్లాడువారికి, మరియు మతస్తులకు మరియు బలహీనులకు తీర్పు తీరుస్తాడు కాబట్టి. క్రీస్తు పాపములేని వాడు కనుక మన ప్రతి మన స్థితులను తెలుసుకుంటాడు మరియు మన బలహీనతలు కూడా తెలుసుకుంటాడు. అతను మహిమతో వస్తున్నప్పుడే అన్ని జాతుల వారు మతస్తులు కన్నీరు విధిస్తారు. మరియి నీవు తెలుసుకున్నావా?

అప్పుడు ప్రతి మోకాలు కుమారుని ముందర వంగును. ఎవరైతే ఈ భూమిమీద ఉన్నప్పుడు క్రీస్తును నిర్లక్ష్యము చేసారో వారు ఆదినమున క్రీస్తును చూచి వెనుకెదరు. క్రీస్తు సమస్త శక్తికి, ఐశ్వర్యమునకు, జ్ఞానమునకు, గౌరవమునకు మరియు మహిమకు అర్హుడు (ప్రకటన 5:12). అతను ఈ లోక పాపములను తీసివేసాడు ఎందుకంటె ఈ లోకమునకు యేసు దేవుని గొర్రెపిల్లగా వచ్చియున్నాడు కాబట్టి. దేవుడు మరియు కుమారుడు ప్రతి విధమైన పనులలో ఒక్కటిగా ఉంది ప్రతి ఘనతము మహిమకు సమానమైన హక్కుదారులుగా ఉన్నారు. అందుకే భూమిమీద ఉన్నప్పుడు మనిషి చేసిన ఆరాధనను క్రీస్తు వ్యతిరేకించలేదు. కనుక మనకు తండ్రికి ఏవిధమైన గౌరవము ఇస్తామో అదేవిధముగా క్రీస్తుకు కూడా ఇవ్వాలి. మనము మన పరలోక తండ్రిని ప్రార్థనలో ఎలాగైతే అనుకుంటామో అదేవిధముగా కుమారుని కూడా అనుకోవాలి.

ఎవరైతే క్రీస్తును వ్యతిరేకిస్తారో వారు తండ్రిని కూడా వ్యతిరేకించినట్లే. కుమారుడిని ఎన్నుకొనుట సులభమే. క్రీస్తు పుత్రుత్వమును అనేకమంది ఎందుకు వ్యతిరేకిస్తారంటే వారు బుద్ధిలేని వారు కాబట్టి. వారు క్రీస్తును తెలుసుకొనుటకు ఇష్టపడలేదు కనుక దేవుని నిజస్వరూపమును కూడ తెలుసుకోలేక పోయిరి.

యోహాను 5:24
24 నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు;వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చ యముగా చెప్పుచున్నాను.

ఎవరైతే క్రీస్తు మాటలను మరియు అతని పుత్రుత్వమును వింటారో వారికి నిత్యజీవమును దేవుడు దయచేయును. మరణముతో జీవితము ప్రారంభముకాదు అయితే పరిశుద్ధాత్మచేత కలుగును. ఈ ఆత్మ నీ మీదికి వచ్చును ఎందుకంటె నీవు తండ్రిని మరియు కుమారుని అంగీకరించవు కనుక. అయితే కొంత మంది ఈ మాటలను కొన్ని వేలసార్లు చదివి వినినను దానికి సంబంధించిన అర్థము తెలియదు. వారు కుమారుని కృపను గూర్చి మాట్లాడారు మరియు ఆత్మ సంబంధముగా నడవారు. నిజమైన విశ్వాసము క్రీస్తులో ఒక నమ్మకముగా ఉంటుంది. ఈ విశ్వాసములోనికి నీవు ప్రవేశించడము అనేది నీవు తీర్పునుంచి బయటపడినట్లు అర్థము ఎందుకంటె నీ విశ్వాసము నిన్ను కాపాడుతుంది కాబట్టి. క్రీటు ప్రేమ ప్రతి ఒక్కరి దోషమును మరియు చెడును తీసి వేసి వారిని శుద్ధముగా చేయును. ఇది మనలను ప్రోత్సహించి మనము నిత్యజీవమును పొందునట్లు చేయును ఎందుకంటె మనము తండ్రి ద్వారా నూతన జన్మ పొందియున్నాము కాబట్టి.

నీవు క్రీస్తు గొప్ప వాగ్దానమును అర్థముచేసుకొన్నావా ?ఎందుకంటె నీవు ఈ లోక మరణము నుంచి మరియు యుద్ధములనుంచి విడిపించబడి క్రీస్తు కృప ద్వారా నీకు నిత్యజీవము కలిగినది కాబట్టి. కనుక దేవుని ఉగ్రత మన మీదకు రాదు.

నీ విశ్వాసము క్రీస్తు యెడల నిన్ను మర్చి నీకు పరిశుద్ధ నిత్యజీవమును ఇచ్చెను. యేసుతో మన బంధము ఒక సులువుగా లేదు,అయితే చేయబడినదిగా,ఉందిగా మరియు శుద్దమైనదిగా ఉన్నది. మనము క్రీతులో ఉన్నదానికంటే మరియి ఎక్కువైనా రక్షణ మనకు ఎక్కడ లేదు. 24 వ వచనమును చదివి నేర్చుకో, నీ జీవితమును అందులో ఉంచినట్లయితే అప్పుడు నిత్యజీవమును పొందుకొంటావు.

ప్రార్థన: ప్రియాయమైన తండ్రి అయిన దేవా,కుమారుడైన క్రీస్తు మరియు పరిశుద్దాత్మ మీకు నేను కృతజ్ఞతా కలిగి ఉంటాను. నా పాపములను కడిగినందుకు నీకు వందనాలు. మీ ఉగ్రత మానుంచి వేరుపరచినందుకు మాకు తీర్పు నుంచి తప్పించావు. మా ఆత్మీయ మరణమునుంచి నీ జీవితముచేత నింపినందుకు నీకు కృతఙ్ఞతలు. నీ నామమును ఘనపరచుటకు మమ్ములను వాడుకో.

ప్రశ్న:

  1. క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన రెండు ప్రాముఖ్యమైన పనులు ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:41 AM | powered by PmWiki (pmwiki-2.3.3)