Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 027 (The Baptist testifies to Jesus)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
C - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 2:13 – 4:54) -- నిజమైన ఆరాధనా అనగా ?

3. యోహాను క్రీస్తును పెండ్లికుమారుడుగా చూపుట (యోహాను 3:22-36)


యోహాను తనను తానూ తగ్గించుకొని క్రీస్తును ప్రకటించిన తరువాత క్రీస్తు గొప్పతనమును మరియు తన వాక్యమును ఈ విధముగా చెప్పాడు.

యోహాను 3:31
31 పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; భూమి నుండి వచ్చువాడు భూసంబంధియై భూసంబంధమైన సంగతులనుగూర్చి మాటలాడును; పరలోకమునుండి వచ్చు వాడు అందరికి పైగానుండి

మనిషి లోకానుసారము కనుక అతనికి నూతన జన్మ అవసరము. క్రీస్తు మాత్రమే పరలోకమునుంచి వచ్చి మనలను దేవునికి దగ్గరగా చేసియున్నాడు.యేసు ఒక నజరేయుడుగా, ప్రవక్తలకంటే, జ్ఞానులకంటే, నాయకులకంటే, పరలోకము యెత్తైనదని ప్రకటించెను. కుమారుడు మనకు జీవమును మరియు వెలుగునై ఉన్నాడు. కనుక అతనికి సాటి ఏది లేదు. కుమారుడు అందరికంటే ముందే ఏకైక కుమారుడుగా ఉన్నాడు. కనుక అతను సృష్టి అంతటికంటే ఉన్నతుడై ఉన్నాడు.

యోహాను 3:32-35
32 తాను కన్నవాటినిగూర్చియు విన్నవాటినిగూర్చియు సాక్ష్యమిచ్చును; ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. 33 ఆయన సాక్ష్యము అంగీక రించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసి యున్నాడు. 34 ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. 35 తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి యున్నాడు.

క్రీస్తు పరలోకమునకు సాక్షిగా ఉన్నాడు. అతను తన తండ్రిని చూచి తన స్వరమును నిజముగా వినియున్నాడు. అతని ఆలోచనలు అతని ప్రణాళికలు అతనికి తెలుసును. అతను దేవుని వాక్యమై దేవుని రొమ్మున ఉన్నవాడు. అతని ప్రకటన ఖశ్చితము. ప్రవక్తలనుంచి వచ్చిన ప్రకటన ఖశ్చితము కాదు. క్రీస్తు దేవుడి నిర్ణయమే ఆఖరి అని చెప్పియున్నాడు. అతను నమ్మకమైన సాక్షి, ఎందుకంటె అతనే అందరికొరకు మరణించి తనను తానూ దేవుని కుమారుడని సాక్షిగా చెప్పియున్నాడు. అయితే చాల మంది ఇంకా అతనిని తిరస్కరిస్తున్నారు. వారి జీవితములను మార్చు దేవుడు దగ్గరనే ఉన్నాడని వారు తెలుసుకొనలేదు. వారు క్రీస్తు పుత్రత్వమును పిత్రత్వమును వ్యతిరేకించిరి.

చాల మంది దేవుడిని మరియు ఆయన ఆత్మను వ్యతిరేకించనందుకు దేవునికి స్తోత్రము. కొందరు క్రీస్తులో తండ్రిని చూసి అతడిని అంగీకరిస్తున్నారు. ఎవరైతే క్రీస్తు ప్రకటనను మరియు అతని విమోచనను నమ్ముతారో వారు దేవుడిని గౌరవిస్తారు. కుమారుడు సత్యమై ఉన్నాడు కనుక దేవుడు అబద్ధమాడాడు; తండ్రి తన ఆలోచనలను ఒక పుస్తకములో వ్రాయలేదు అయితే క్రీస్తులో వాటిని జరిగించెను. ఎవరైతే అతని ఆత్మకు తమ హృదయములను తెరుస్తారో వారు నూతన జీవము పొందకుంటారు. క్రీస్తు నిన్ను కేవలము సత్యములో ఉండమనలేదు అయితే వాటిని అవలంబించుమని వాటి ప్రకారముగా చేయుమని ఆజ్ఞాపించియున్నాడు.

క్రీస్తు ఊహించుకొని మాట్లాడలేదు అయితే ఉద్దేశ్యముతో, శక్తితో మరియు క్లుప్తముగా మాట్లాడేను. దేవుడే తన కుమారునిల్నుంచి మాట్లాడినాడు. తండ్రి తన కుమారునిలో తన జ్ఞానమును మరియు అధికారమును కురిపించాడు.

తండ్రి తన కుమారుని ప్రేమించి అన్నిటిని తన చేతికి అప్పగించెను. కుమారుడు దేవుని బహుమానము, మరియు కుమారుడు తండ్రిని గౌరవించెను. తండ్రి లేదా కుమారుడు గొప్ప? అనే ప్రెనే లేదు. అలంటి ప్రశ్నలు సాతాను నుంచి వచ్చును. ప్రతి ఒక్కరు త్రిత్వమును ఘనపరచి ఒకరికి ఒకరు గౌరవించుకొనెదరు. ఎవరైతే వీటిని పాటించారో వారు క్రీస్తును కూడా పాటించరు. క్రీస్తు సమస్తమును పరిపాలించును , " పరలోకమందును, భూమి మీదను సమస్త అధికారము నాకు ఇవ్వబడెను".

యోహాను 3:36
36 కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.

యోహాను మనకు రక్షించబడే మార్గమును కనపరచెను:యెరవారైతే కుమారుని యందు విశ్వాసముంచునో వాడు నిత్యజీవము పొందును. ఎవరైతే ఆయనకు దగ్గరగా వస్తారో వారు దేవుని ప్రేమను తండ్రి కుమారునితో చూచెదరు. దేవుని గొర్రెపిల్ల మన పాపములను తొలగించెను అని నమ్ముకొనెదరు. క్రీస్తుతో సంబంధము మనకు అయన జాలిని ప్రేమను ఇస్తుంది. విశ్వాసము మనకు కుమారుని సత్యమైన జీవములోనికి నడిపించును. మరణించిన తరువాత నిత్యజీవము ప్రారంభము కాదు అయితే ఇప్పుడే అది ప్రారంభమవును. కుమారుని ద్వారా విశ్వాసులకు పరిశుద్దాత్మ వచ్చును. ఎవరైతే క్రీస్తు మాటలను మరియు ఆయన పుత్రత్వమును తరస్కరిస్తారో వారు పరిశుద్దాత్ముడ్ని కించపరచినట్లే. తన మనసుకు విశ్రాంతిని కనుగొన్నాడు. ఎవరైతే క్రీస్తను అంగీకరించలేదు వారు ఆత్మీయ మరణమును పొందుకుంటారు. కనుక ఎవరైతే అతని ప్రేమను తిరస్కరిస్తారో వారు ఉగ్రతను ఎన్నుకున్నట్లే.

యోహాను స్థితిని పౌలు చెప్పుట: దేవుని ఉగ్రత ఆయనను వ్యతిరేకించువారిపైనా మరియు చెడ్డదానిని పాటించువారి మీద ఉండును. ఎందుకంటె అందరు పాపము చేసి సత్యమునకు వ్యతిరేకముగా దోషము చేసిరి. జ్ఞాపకము చేసుకో దేవుని ఉగ్రత మనిషిమీద ఉన్నది.

అరణ్యములో ఏ విధముగా అయితే సర్పము ఎత్తబడినది అలాగే సిలువవేయబడుట రక్షణకు ఒక చిహ్నముగా మరియు అది దేవుని ఉగ్రత నుంచి వచ్చునట్లు తేలుకుందాము. ఎవరైతే క్రీస్తు కృపలో ఉంటారో వారు తీర్పునుంచి తప్పించుకొనువారు. క్రీస్తు లేని ప్రజలు వ్యర్థమైన వారే. కనుక నీవు ప్రజలు కుమారుడైన యేసు మీద విశ్వాసముంచి రక్షింపబడునట్లు వారి కొరకు ఎప్పుడు ప్రార్థన చేసెదవు? నీ సఖ్యము ద్వారా నీ స్నేహితులు దేవుని జీవము పొందునట్లు నీవు వారితో ఓర్పుకలిగి ఎప్పుడు మాట్లాడగలవు ?

ప్రార్థన: ప్రభువా నీ ప్రేమను బట్టి నీ సత్యమును బట్టి నిన్ను మేము మహిమ పరచుచున్నాము. తండ్రిని ఘనపరచునట్లు మాకు తగ్గింపు హృదయమును మరియు విశ్వాసమును దయచేయుము.మీరు మరియు తండ్రి ఇద్దరు ఒకటే అని మేము నమ్ముచున్నాము. ఎవరైతే నిన్ను తిరస్కరిస్తారో వారిని కూడా నీవు ప్రేమించి,వారికి నీ వాక్యమును తెలియపరచు. మా కొరకు నీవు నీ సువార్త కొరకు నిర్ణయించియున్నవో వారు సిద్దపడుటకు సహాయము చేయుము.

ప్రశ్న:

  1. నిత్యజీవమును మనము ఏవిధముగా పొందగలము ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:33 AM | powered by PmWiki (pmwiki-2.3.3)