Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 058 (The Holy Remnant Exists)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు, ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)
5. యాకోబు యొక్క పిల్లల నిరీక్షణ (రోమీయులకు 11:1-36)

a) పరిశుద్ధ శేషములో ఉండు (రోమీయులకు 11:1-10)


రోమీయులకు 11:1-10
1 ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తనప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేనుకూడ ఇశ్రాయేలీ యుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. 2 తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయానుగూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? 3 ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠము లను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయ జూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు. 4 అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది?బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను. 5 ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది. 6 అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును. 7 ఆలాగైన ఏమగును?ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరక లేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కిన వారు కఠినచిత్తులైరి. 8 ఇందువిషయమైనేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును,చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది. 9 మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంక ముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక. 10 వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. 

అబ్రాహాము యొక్క పిల్లల రక్షణను మరియు నాశనమును బట్టి అపొస్తలుడైన పౌలు వాదనలను సిద్దము చేసెను. అతను భయమైన ప్రశ్నలను కలిగి ఉండెను: " యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు?" (కీర్తన 94:14)

పౌలు ప్రశ్నలను బట్టి సమాధానములను ఇచ్చెను, 'లేదు' అని చెప్పెను. ఎందుకంటె ఆలాంటి వాటికీ నేనే రుజువును మరియు రక్షించు కృపను బట్టి నేనే రుజువును అని చెప్పెను. నేను ఒకప్పుడు ఘోరమైన పాపిని అయినను అతను నన్ను రక్షించెను. శారీరకంగా నేను బెంజిమెను వంశపు వాడిని, మరియు అబ్రాహాము యొక్క సంతతిని. అయితే దేవుడు నన్ను పిలిచి నన్ను క్షమించి, నాకు జీవితమును ఇచ్చెను. కనుక నేను యాకోబు పిల్లలకు ఒక రుజువుగా దేవుని యొక్క రక్షించు కృపకు రుజువుగా ఉన్నాను.

నేను ఏవిధముగా అయితే క్రీస్తులో జీవించి ఉన్నానో అదేవిధముగా దేవుడు ప్రతి యాకోబు సంతతిని కూడా వ్యక్తిగతముగా పిలుచుచున్నాడు. వారిని రక్షించి, ఆశీర్వదించి పంపెను. వారిలో దేవుడు నిజమైన క్రైస్తత్వమును కలిగించెను. కనుక క్రైస్తవులు లేక మనము క్రీస్తు యొక్క నిజమైన సువార్తను యూదులలో చూడలేము. ఎందుకంటె వారే దేవుని రాజ్యమునకు నిజమైన వారసులు, మరియు ఈ దేశములన్నిటిలో వారే సంతతి అనే విత్తనములు నాటినవారు. కనుక పంట అనుకోనుందా వ్యాపించిఉంది, కనుక ఏ అల్లరి లేకుండా దేవుని యొక్క రాజ్యము ముందుకు సాగును.

దేవుడు తన ప్రజలను ఎన్నుకొన్నారు కనుక అతనికి తన స్వంత ఆత్మీయ రాజ్యము కొరకు మార్గములు కలవు. ఈ దినాలలో యాకోబు సంతతి మరియు అనేక మంది ప్రజలు క్రీస్తును వ్యతిరేకించినప్పటికీ అనగా వారు వారికి తోచిన విధముగా దేవుళ్లను చేసుకొనినప్పటికీ, వారిని ఆయన ఎన్నడూ కూడా తిరస్కరించలేదు. అయితే ప్రవక్త అయినా ఏలీయా సమయములో పరిస్థితి ఏవిధముగా ఉండెను? ఈ ధైర్యము కలిగిన ప్రవక్త విశ్వాసుల యొక్క రక్తము ఏరులై పారినను నిట్టూర్పు కలిగి ఉన్నాడు, (1 రాజులు 19:10-14)

అప్పుడు దేవుడు అతనికి తన ఓదార్పుకలిగిన మాటలచేత సమాధానమును ఇచ్చెను: "వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి" (1 రాజులు 19:18). ఎవరు ఎవరిని విశ్వసిస్తున్నారో వారికి తెలియలేకపోయెను. సమారియా ను నాశనము చేయునప్పుడు వారు అక్కడనుండి రక్షించబడినవారు, వారు వారి విశ్వాసమును ఈ లోకమంతటికి తెలియపరచిరి. దేవుడు తన విశ్వాసులను కాపాడును కనుక ఎవ్వరు కూడా అతని చేతులనుంచి వారిని లాగలేరు. వారికి మంచి బ్రతుకు ఉండును అని వాగ్దానము చేయలేదు, అయితే అతని సాక్ష్యము ద్వారా వారికి నిర్యాజీవమును వారికి సంరక్షణగా ఇచ్చెను (యోహాను 10:29-30).

ఈ చర్చలో పౌలు తన ప్రశ్నలను వేసెను: "ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది" (రోమా 11:5)

ఈ మాట యేసు పుట్టినప్పటినుంచి ఉన్నది. నమ్మకమైన క్రైస్తవుల చిహ్నము, శక్తి కాదు, ఐశ్వర్యము కాదు, ఘనత కాదు, అయితే శ్రమలలో కూడా క్రీస్తును వెంబడించుటయే. కనుక ఈ మాటను బట్టి యేసు తన చిన్న గుంపును ఈవిధముగా చెప్పెను: "చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్ర హించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది" (లూకా 12:32; 22:28-29).

తండ్రి, కుమారా, పరిశుద్దాత్మ యొక్క అధికారము ప్రతి పరిశుద్ధునికీ అనగా ఎన్నుకొనబడిన ప్రతి ఒక్కరికీ ఆశీర్వాదముగా ఉండును. పౌలు మరియు బర్నబాస్ వారి యొక్క సువార్త ప్రయాణములో పిలువబడిన ప్రజలకు ఈ విధముగా చెప్పిరి; "అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి" (అపొస్తలుల 14:22).

పౌలు ఈ జ్ఞానములొ అలానే ఉంది, యాకోబు సంతతికి ఈ శేషము ఎల్లప్పుడూ నాహనము కలగక ఉండునని చెప్పెను, మరియు ఇది కేవలము కృప ద్వారమాత్రమే కలిగినది (రోమా 11:6). ఈ విధమైన సంఘటనను క్రీస్తు చివరిదినాలలో సాతాను శోధనలనుంచి కాపాడును, మరియు ఒక మంచి కాపరివలె నడిపించును. ఈ శేషము నీతికలిగినది కాదు, భక్తికలిగినది కాదు, లేక కార్యముల ద్వారా ఎన్నుకొనబడినది కాదు, అయితే దీనిలో ఉన్న మంచి అంత కూడా కేవలము కృప ద్వారా మాత్రమే వచ్చియున్నది. కనుక మనము బలము కలిగిన దేవుని కృపను కలిగిన శక్తిని బట్టి విశ్వసించి, ఇశ్రాయేలీయులను శేషముగా ఉంచును. కనుక ఇది ప్రతి క్రైస్తవుని కూడా ప్రాప్తించును కనుక మనము దేవునికి కృతజ్ఞత చెప్పాలి.

రోమా 11:7 లో పౌలు ఈ విధముగా అడుగుచున్నాడు: ఆ కాలములో యాకోబు సంతతి యొక్క ఆత్మీయ పరిస్థితులు మరియు ఈ రోజు పరిస్థితులు ఏ విధముగా ఉన్నాయి? వారు ధర్మశాస్త్రమును గైకొనుట అనగాఏమి? మరియు వారు సాధించలేని వారి భక్తి యొక్క గురి ఏమిటి? వారు వారి గురిని పోగొట్టుకొని, వారి రాజును సిలువ వేసి, పరిశుద్దాత్మ సన్నిధి కొరకు వారు కఠినముగా మారిపోయారు, మరియు త్రిత్వము యొక్క ఐక్యత నుంచి పూర్తిగా దూరముగా వేల్లిపాయారు, మరియు అంత్యక్రీస్తు వారిమీద అధికారము కలిగి ఉండునట్లు ఎదురుచూస్తున్నారు. ఈ సంఘటన యాకోబు సంతతి అందరికీ ప్రాప్తించలేదు ఎందుకంటె వారిలో కొంతమంది పరిశుద్దాత్మ ద్వారా అబ్రాహాము పిల్లలు నూతనము జన్మించబడ్డారు. వారికి తమ పాపములు తెలిసెను కనుక వారు బహిరంగముగానే ఒప్పుకొని, సాత్వికమైన దేవుని గొర్రెపిల్లయందు విశ్వాసము కలిగి ఉండి, అతని స్వచ్ఛమైన క్షమాపణ పండుకొని, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత అభిషేకించబడిరి. అప్పుడు వారు క్రీస్తు జీవములో ఉండి అతని ఆత్మీయ శరీర భాగములో సభ్యులైరి.

ఏదేమైనా వారిలో ఉన్న అనేకులు కఠినమైన వారు (ద్వితీ 29:4; యెషయా 29:10) ఇది మంచి మరియు చెడును అర్థము చేసుకొని ఆత్మను వారు పొందుకుంటారు. కనుక వారికి మంచి, చేదు అని అర్థముచేసుకోను జ్ఞానము లేదు, అయితే వారికి ఏమి తోచితే అదే చేసి, దేవుడిని మరియు తీర్పును బట్టి జరగట్టకలిగి లేక ఉన్నారు, ఎందుకంటె చూచునప్పుడు వారు చూడలేదు, మరియు ఎప్పుడు వినాలో వారు వినలేదు, దావీదు మహారాజు ప్రార్థించినట్లు వారిలో అనేకులను శపించుమని మరియు వారి ప్రణాళికలను చెరుపుమని (కీర్తన 69:23-24).

అయినప్పటికీ క్రీస్తు దావీదు మాటలను మర్చి, తనను వెంబడించువారికి చెప్పెను: "మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు" (మత్తయి 5:44-45).

ఈ లోకములో ఉన్న ప్రతి క్రైస్తవుడు మరియు క్రైస్తవురాలు కూడా పరిశుద్దుడైన క్రీస్తు యొక్క ఆజ్ఞను ప్రతి విధమైన శ్రమలలో మరియు అబద్దపు కార్యములలో తీసుకొని వెళ్తున్నారు.

ప్రార్థన: పరలోకమందున్న తండ్రి నిన్ను మేము ఆరాధిస్తున్నాము ఎందుకనగా నీవు అబ్రాహాము సంతతిని దిన దినమూ నీ పరిశుద్దాత్మ కొరకు వారు తమ హృదయములను తెరుచుటకు సహాయము చేస్తున్నందుకు, అప్పుడు వారు తమను యేసు రక్తములో పరిశుద్ధపరచబడి, నిత్యజీవమును పొందుకొనెదరు. ఆలాగుననే నూతనముగా నిన్ను విశ్వసించిన విశ్వాసులను కూడా బలపరుచు అప్పుడు వారు ఈ లోక అల్లరులలో మరియు శ్రమలలో పడిపోక ఉండెదరు.

ప్రశ్నలు:

  1. ఎలీషా ఏడు వేలమంది ఇశ్రాయేలీయులను దాచినాడని దేవుడు చెప్పిన మాటకు గల అర్థము ఏమిటి, ఎవరైతే మోకరిల్లారో వారు బాలుకు లోబడలేదా?
  2. పాలు చెప్పినట్లు యూదుల విశ్వాసులందరు పరిశుద్ధ శేషము కలిగి ఉన్నారని చెప్పే మాటకు గల అర్థము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:27 AM | powered by PmWiki (pmwiki-2.3.3)