Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 042 (In Christ, Man is Delivered)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)

6. క్రీస్తులో మనిషి తన పాపమునుంచి,మరణమునుంచి మరియు శిక్షావిధి నుండి విడుదలపొందియున్నాడు (రోమీయులకు 8:1-11)


రోమీయులకు 8:3-8
3 శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము 4 దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. 5 శరీరానుసారులు శరీరవిషయ ములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయ ములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము; 6 ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమా ధానమునై యున్నది. 7 ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. 8 కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. 

క్రీస్తు నూతన నిబంధనను స్థాపించాడు, ఎందుకంటె పాత నిబంధన కామమును, మరియు పాపమును మరియు శరీర వాంఛలను జయించజాలదు కాబట్టి. దేవుని కుమారుడైన దైవత్వము ఒక ప్రారంభమైనదై ఉన్నది, మరియు బలహీనముగల శరీరమునకు ఒక విజయముగా ఉన్నది, ఎందుకంటె క్రీస్తు శరీరమును సంపూర్ణముగా తన ఆత్మ ద్వారా తన అధీనములోనికి చేసుకొని, హృదయమందు ఉన్న చెడును తీసివేయును. క్రీసు యొక్క పరిశుద్ధము కలిగిన జీవితము పాపమునకు ఒక ఖండించునదిగా కట్టునదిగా ఉండును.

క్రీస్తు ఎప్పుడు పరిశుద్ధముగానే జీవించాడు, ఎందుకంటె పరలోకమందున్న తండ్రి తన శరీరమందు పాపములో చనిపోయెను ఎందుకంటె అది వారి పితరుల నుంచి వచ్చెను కనుక. కనుక అతను ధర్మశాస్త్రమునకు కావలసినట్లుగా ప్రతి కార్యములను చేసెను. అయితే ఎప్పుడైతే అతను మన పాపములను మోసాడో అప్పుడే అది చివరిదై ఉన్నది, మరియి అతని మృతి నుంచి నీతి కలిగిన దేవుని ద్వారా మనలను సంరక్షించాడు. అయితే మనము ఒక ఆచార సంబంధముగా మన జీవితములను కలిగి ఉండలేదు, అయితే దేవుని యొక్క శర్మశాస్త్ర ప్రేమ ద్వారా మనము నిజమైన విశ్వాసము కలిగి ఉన్నాము. ఈ గొప్ప ప్రేమ హృదయమందు విశ్వాసము కలిగినవారు ఈ విధముగా చెప్పునట్లుగా ఉన్నది: "క్రీస్తు మనలో జీవించెను. అతను మనలను ధర్మశాస్త్రమును నెరవేర్చునట్లు నడిపించును." ఒక క్రైస్తవుడు తన శరీర ప్రకారముగా ప్రవర్తించాడు అయితే ఆత్మ యందు సంతోషముతో కృతజ్ఞత కలిగి నెమ్మది కలిగి ఉండును.

ఇవే మీకు మూలసూత్రమైన ప్రశ్నలు వేసినది: నీవు పరిశుద్దాత్మ కలిగిన మనిషివా? క్రీస్తు నీలో ఉన్నాడా? ఈ లోక విమోచకుడు నీ హృదయములో ఉన్నాడా? నీవు నూతన జీవితములో నడుచునట్లు సిలువ మరణము నిన్ను సమాధాన పరచినదా? విశ్వాసము అనునది ఒక ఊహ కాదు. అయితే ఇది ఒక జీవముకలిగిన ఆత్మీయ శక్తి మరియు సమాధాన పరచబడిన శరీరములో దేవుని సన్నిధి.

ఆత్మీయమైన మనిషి తన ఆసక్తిని బట్టి తెలుసుకొనవచ్చు. అతను క్షమించుటకు మరియు సమాధానపరచుటకు ఆసక్తి కలవాడు. నీవు సమాధానపరచువాడివా? నీవు ఎందరో నూతనపరచబడుటకు దేవునితో సమాధానపరచబడి, అతని పిల్లలుగా ఉన్నది ఆత్మీయ మస్కతి కలిగిన వారీగా ఉన్నావా?

ఎవరైతే దేవుని ఆత్మ లేకుండా జీవించినట్లైతే వారు శరీరానుభవముతో, బలహీనముతో, సంకేతమైన వాడుగా, మరియు పరిశుద్ధాత్మను అతిక్రమించువాడుగా ఉండి, ఈ లోక కామముచేత మరియు ఆశచేత ఉండును. ఆలాంటి వ్యక్తి మరణమును దేవుని ఉగ్రతను మరియు నీతికలిగిన న్యాయతీర్పును తుదకు పొందును. అయితే శరీరానుభవము కలిగిన వాడు దేవుని ధర్మశాస్త్రమునకు సమర్పించుకొనడు, అయితే అతను తన మనసుకు కూడా వ్యతిరేకముగా కార్యము చేయును. అతను దేవుడిని తృప్తిపరచలేదు మరియు ప్రేమించలేదు, అనగా అతను క్రీస్తును అంగీకరించువరకు.మనిషి ఒకవేళ అతనిలో క్రీస్తు ఆత్మే లేకుండా ఉన్నట్లయితే అతను తప్పిపోవును. అతను నాశనములోనికి పడిపోవును. మరియు ఎవరైతే పరిశుద్దాత్మునికి దూరముగా ఉంటారో అతను ఆత్మ దేవుని వశములో ఉండదు అయితే అతను సాతానుకు బానిసగా ఉండును.

అయితే ఆత్మీయమైన మనిషి ఎప్పుడు వేకువ కలిగి ఉండును. అతను తనకు దేవుడు ఇచ్చిన సమాధానమును, ప్రేమను కలిగి ఉంది తన శత్రువులను ప్రేమించి, దేవుని యొక్క కాపుదల అనుదినము ఉండునట్లు దేవునిని అడుగును, మరియు తన హృదయమందు అందరు యేసు దగ్గరకు రావాలని కోరుకొనును, అప్పుడు వారు నశించిపోక నిత్యజీవములోనికి వెళ్ళును. నీవు దేవుని ఆత్మచేత నింపబడ్డావా?

ప్రార్థన: ప్రభువా యేసయ్య నిన్ను ప్రేమించుటకు మేము అర్హులము కాము అయినప్పటికీ మమ్ములను నీవు నీ ఆత్మ చేత నింపినందుకు నీకు కృతజ్ఞతలు, మరియు మా హృదయములలో నీ ఓర్పును, సహనమును, మరియు లక్షణములతో నింపుము, అప్పుడు మేము తండ్రిని పరిశుద్ధాత్మను మరియు యేసు చిత్తమును తెలుసుకొని ఆ ప్రకారముగా కార్యములు చేయుదము. నీ శక్తి కలిగిన ఆత్మయందు మేము నడుచుకొనులాగున మాలో నీ సమాధానమును నింపుము. మేము మా స్నేహితులను మరియు మా ఇరుగు పొరుగు వారిని కూడా నీ సన్నిధిలోనికి మరియు రక్షణ లోనికి నడిపించునట్లు నీ జ్ఞానమును మాకు దయచేయుము.

ప్రశ్నలు:

  1. ఆత్మీయమైన మనిషి యొక్క లాభము ఏమిటి? శరీరానుభవము కలిగిన వారి యొక్క వంశపారంపర్యము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:04 AM | powered by PmWiki (pmwiki-2.3.3)