Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 043 (In Christ, Man is Delivered)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)

6. క్రీస్తులో మనిషి తన పాపమునుంచి,మరణమునుంచి మరియు శిక్షావిధి నుండి విడుదలపొందియున్నాడు (రోమీయులకు 8:1-11)


రోమీయులకు 8:9-11
9 దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు. 10 క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది. 11 మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును. 

పౌలు రోమా లో ఉన్న విశ్వాసులకు చెప్పునది ఏమనగా, దేవుని ఆత్మ ప్రతి సోమరి అయినా శరీరములను మరియు దానికి బానిస అయినవారిని జయించును, ఎందుకంటె వారి యొక్క జీవితములు పరిశుద్దాత్మ యొక్క శక్తి మీద స్థాపించబడి ఉన్నవి. కనుకనే వారు తిరిగి జన్మించుటకు వారిని సృష్టించి వారిని ఓదార్చి వారియెడల దేవుని ప్రేమను నింపి, వారిని దేవుని పరిచర్యను చేయుటకు బలపరచెను.కనుక ప్రతి విశ్వాసి కూడా పరిశుద్దాత్మ చేత నింపబడాలి.

అయితే ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు తన హృదయములో నివాసము లేకుండా ఉంటె అతను క్రైస్తవుడు కాదు, ఒకవేళ అతను నూతనముగా జన్మించిన వాడై ఉన్నప్పటికీ " ఎవరైతే దేవుని ఆత్మ చేత అభిషేకించబడిరో". క్రీస్తు ఏవిధముగా అయితే దేవుని యొక్క సంపూర్ణతలోని వచ్చాడో అదేవిధముగా విశ్వాసి కూడా ఉండాలి. ఒకవేళ నీవు బాప్తీస్మము తీసుకొన్న, లేదా సంఘ కార్యక్రమాలలో ఉన్న, స్నాగములో చందాలు ఇచ్చినా, వీటన్నిటిని బట్టి నీవు క్రైస్తవుడవు కాదు. అయితే నీవు సంఘములో స్థిరమైన విశ్వాసి అని పిలువబడాలంటే నీవు క్రీస్తు ఆత్మే చేత నింపబడి అతని శక్తిని కూడా పొంది ఉండాలి. మరియు ఎవరైతే పరిశుద్దాత్మ చేత జన్మించబడతారో వారు క్రీస్తుకు సంబంధించినవారు. అయితే ఎవరైతే క్రీస్తులో సంపూర్ణముగా ఉండనట్లయితే వాడు దేవుని భాగములో ఉండదు. క్రీస్తు నీలో సంపూర్ణముగా ఉండాలని కోరుకొనుచున్నాడు. లేనిచో నీవు అతని నుంచి వేరుపరచబడెదవు.

ప్రియా సహోదరుడా నీవు క్రీస్తు ప్రేమలో ఉండాలని అనుకున్నట్లైతే క్రీస్తును ఆరాధించు. ఎవరైతే ఆత్మయందు నివసిస్తారో వారు అతని అద్భుతములను వివరించి, వారి మనసులను మార్చుకొంటారు.

నీ శరీరములో పాపము మరియు యేసు ఇద్దరు నివాసము కలిగి ఉంటారని అనుకొనవద్దు. నీవు ఎవ్వరినీ ద్వేషించి క్రీస్తును ఒకే సమయములో ప్రేమించలేవు. అపరిశుద్ధతకు సమర్పించుకొని పరిశుద్దాత్మ ఉన్నాడని చెప్పలేవు, ఎందుకంటె పాపమును యేసు నాశనము చేయువాడు. నీలో ఉన్న పాపమును నీవు ఒప్పుకొనకుండా నీ మనసునందు విశ్రాంతి పొందుకొనలేవు, ఎందుకంటె వాటిని నీవు కన్నీళ్లతో ఒప్పుకొని, వాటిని ద్వేషించి నిన్ను నీవు క్రీస్తుకు అనగా నిన్ను చేసినవానికి సంపూర్ణముగా సమర్పించుకోవాలి.దేవుని యొక్క ఆత్మ నీ పాపములమీద పోరాడుతుంది, మరియు నిన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరచుతుంది, ఎందుకంటె క్రీస్తు నిన్ను పరిశుద్ధతకే పిలిచాడు అయితే అపరిశుద్ధతకు కాదు.

యేసు రక్తము నీ ప్రతి పాపమును కడుగును, అది ఒకవేళ నీవు అతని యందు మరియు అతని వాగ్దానములయందు విశ్వసించినయెడల. అతని శక్తి నీ బలహీనతతో ఉన్నది. నీ చిత్తము బలపరచబడి నిన్ను ఖండించి దేవుని కొరకు జీవించుట. నీ శరీరము నీ పాపముల నిమిత్తము చనిపోతున్నాడని జ్ఞాపకము చేసుకో, అయితే పరలోకమునుండి ఇవ్వబడిన ఆత్మ నీ యందు జీవము కలిగి ఉంటుంది. కనుక మనకు పోలికలేని నిరీక్షణ ఉన్నది ఎందుకంటె మనలో దేవుని మహిమ జీవమును కలిగి ఉన్నాము, అది ప్రభువు వచ్చునప్పుడు మనకు కలుగును.

క్రీస్తు సమాధినుంచి లేచినప్పుడు ఉన్న శక్తి, ఈ దినాలలో ఉన్న ప్రతి విశ్వాసి యందు అదే శక్తి ఉన్నది. దేవుడు ఆ జీవితమును క్రీస్తు రెండవ రాకడ సమయములో మనకు ఇచ్చును. అది అవిశ్వాసులు ప్రాణమందు మృతిపొందినప్పుడు అది కనపడును, ఎప్పుడైతే మనము మహిమకరముగా జీవించి ఉన్నామో అప్పుడు దేవుని ఆత్మ మనలో కార్యము చేసి, మహిమతో కనపడి, అతను దేవుడై ఉన్నాడని ఆనందముతో, శక్తితో ఉండెదరు.

ప్రార్థన: ఓ ప్రభువా నీ పిల్లలుగా మేము బ్రతుకుటకు నీవు ఇచ్చిన నీ పరిశుద్ధాత్మను బట్టి నీకు కృతజ్ఞతలు, ఎందుకంటే మమ్ములను క్రీస్తు ద్వారా సమాధానపరచినందుకు. నీవు మమ్ములను మా అపనమ్మకంతో మరియు చెడు స్వభావంతో కాపాడి ఉన్నావు. మరణము మమ్ములను బంధించకుండా నీ హస్తముచేత మమ్ములను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు,మరియు నీ కుమారుడు జీవించినట్లు మేము కూడా ఈ లోకములో జీవించుచున్నాము కనుక మమ్ములను నీ మహిమచేత నింపుము.

ప్రశ్నలు:

  1. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసముంచు వారిని పరిశుద్దటమే ఏమి ఇస్తున్నది?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 11:05 AM | powered by PmWiki (pmwiki-2.3.3)