Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 031 (The Resurrected Christ Fulfills his Righteousness)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
C - విమోచన అనగా దేవునికి మనిషికి ఒక నూతన బంధము అని అర్థము (రోమీయులకు 5:1-21)

2. పునరుత్తానుడైన క్రీస్తు తన నీతిని మనలో నెరవేర్చును (రోమీయులకు 5:6-11)


రోమీయులకు 5:6-8
6 ఏల యనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకుచనిపోయెను. 7 నీతి మంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. 8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. 

నీతి కలిగిన తీర్పు తరువాత మరియు దేవుని ఉగ్రత ప్రకటన తరువాత, మనము విశ్వాసముచేత సంపూర్ణమైన ఒప్పుదలను మరియు నిజమైన పచ్చాత్తాపమును కలిగి ఉండాలని పౌలు చెప్పెను. కనుక దేవుని మీద గొప్ప నిరీక్షణ కలిగి ఉంది విశ్వాసము చేత అతని యందు ప్రేమ కలిగి ఉండాలి. మనము ఈ రక్షణలోనికి ప్రవేశించినప్పటికీ మనము మన గత జీవితమును జ్ఞాపకము చేసుకోవాలి.

మనకు కలిగిన ఆత్మీయ బహుమానములు అనగా, సమాధానము, కృప, ప్రేమ, పరిశుద్ధత, విశ్వాసము, నిరీక్షణ, మరియు ఓర్పు ఇవన్నీ కూడా మనకు మన సామర్థ్యమును బట్టి వచ్చినవి కావు మరియు మనిషి శక్తిని బట్టి కూడా వచ్చినావు కావు. అయితే ఇవన్నీ కూడా మనకు మనకొరకు చనిపోయిన క్రీస్తు ద్వారా కలిగినవి, అనగా తన ప్రియులకు కాదు అయితే ఎవరైతే అవిధేయత కలిగి ఉంటారో వారికి ఎందుకంటె దేవుడు వారిని చూస్తాడు కనుక. మనిషి ఒక బాంబు మాదిరి ఉంటాడు. అతను తనకు మాత్రమే హాని తలపెట్టుకోడు అయితే ఇతరులకు కూడా హాని తలపెట్టుకొంటాడు. అయినప్పటికీ క్రీస్తు మనలను ప్రేమించి మనకొరకు చనిపోయెను.

ఈ సాత్వికము ద్వారా మనము దేవుని గొప్ప ప్రేమను చూడవచ్చు. తనకొరకు తాను త్యాగము చేసుకొనువారిని చాల అరుదుగా చూస్తుంటాము, సమయము, ధనము, మరియు జీవితము ఇవన్నీ కూడా అనారోగ్యము కలిగిన సహోదరునికి చేయలేరు. అయితే ఎవరో ఒకరు తమ సొంత దేశము కొరకు, పిల్లల కొరకు లేదా తల్లుల కొరకు త్యాగము చేయగలరు. అయితే దోషులకు తిరస్కరించబడినవారికి ఎవ్వరు తమ జీవితములను ఇవ్వలేరు అయితే కేవలము దేవుడు మాత్రమే ఇవ్వగలడు.

మన విశ్వాసమే మన ముగింపుకు మూలసూత్రము. మనము ఎప్పుడైతే దేవునికి లోబడని శత్రువులుగా ఉన్నామో అప్పుడే మనలను పరిశుద్దుడైన వాడు ప్రేమించాడు. అతను పాపులతో కలిసి ఉండి వారికొరకు బదులుగా వారి పాపముల కొరకు చనిపోయెను. తన స్నేహితులకొరకు తన ప్రాణమును పెట్టినవానికంటే గొప్పవాడు ఈ లోకములో లేడు. ఈ మాట ద్వారా క్రీస్తు తన శత్రువులను కూడా పిలుచుచున్నాడని తెలుసుకొందుము, " అతని స్నేహితులు", ఎందుకంటె అతను మరణము వరకు అందరినీ ప్రేమించుచున్నాడు కనుక.

మనము పాపము చేయక మునుపే దేవుడు మనలను ప్రేమించును కనుక అతని ప్రేమ మన యెడల గొప్పదై ఉన్నది అది కూడా మనము పుట్టుకమునుపు నుంచి అతని ప్రేమ గొప్పగా ఉన్నది. కనుక మనలను మనకు విమోచించుకొనుటకు మనము ఏమి కూడా చేయనవసరం లెదు. అయితే కేవలము కృప మాత్రమే కలుగును. కనుక మనము విమోచించబడినామని తెలుసుకొనుటకు ఇది ఒక సాదృశ్యముగా ఉన్నది.

రోమీయులకు 5:9-11
9 కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. 10 ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము. 11 అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము. 

ఇప్పుడు ఆనందించి సంతోషించుడి!ఎందుకంటె మనము క్రీస్తులో విశ్వాసము ద్వారా దేవుని యందు విమోచన పొంది ఉన్నాము. కనుక సాతానుకు మనలను బట్టి పిర్యాదు చేయుటకు అవకాశము లెదు. క్రీస్తు రక్తము మన శరీరములను మరియు ప్రాణమును కూడా సంపూర్ణముగా కడుగును.కనుక మనలను యేసు అను మదేవర్తి దేవుని న్యాయసంబంధమైన ఉగ్రత నుంచి తప్పించును.

పౌలు రక్షణను గూర్చిన ఈ క్రింది నాలుగు అర్థములను ఇచ్చి ఉన్నాడు:

మొదటిది: మనము ఎప్పుడైతే అతనికి శత్రువులుగా ఉన్నప్పుడే దేవునితో మనము సమాధానము కలిగి ఉన్నాము. ఈ సమాధానము ఏవిధమైన క్రమము లేకుండా మరియు షరతులు లేకుండా ఉన్నవి. అయితే మనము ఈ సమాధానమును పొందుటకు అర్హులము కాము అయితే ఇది కేవలము కృప ద్వారా కలిగిన బహుమానమే. ఈ సమాధానము కూడా క్రీస్తు ద్వారా మాత్రమే కలుగును, ఎందుకంటె అతను మనకొరకు దైవత్వము కలిగి మరణించెను కనుక.

రెండవది: ఒకవేళ క్రీస్తు మరణము మనకు అంతటి మార్పులను ఇచ్చినట్లయితే, మరి ఇంకా ఎంతటి జీవము కలిగిన రక్షణను మనకు క్రీస్తు ఇవ్వగలడు! అయితే ఇప్పుడు మనము ఇష్టపూర్వకంగానే ఈ సమాధానమును పొందుకొని, మనము అతని చిత్తమునూ మన హృదయ పూర్వకముగా అతని శక్తిని పొంది కార్యములను చేయాలి. అయితే నిత్యజీవము మనకు క్రీస్తు జీవితము ద్వారా మనకు దేవుని గొర్రెపిల్ల యొక్క ప్రేమ ద్వారా అనగా పరిశుద్దాత్మ ద్వారా మనకు దేవుని ప్రేమ కలిగి ఉన్నది. ఈ వచనముల ద్వారా మనకు సమాధానము, సంతోషము మరియు ఘనత అనునది మన హృదయములో కలుగును. కనుక క్రీస్తు ఆత్మ మనలో ఉండాలంటే మనకు దేవుని యందు ఉండి మరియు దేవుడు మనలో ఉన్నట్లయితేనే అది మనకు కలుగును.

మూడవది: అప్పుడు పౌలు మహిమను బట్టి ధైర్యముగా చెప్పెను, " మేము కూడా దేవుని యందు ఆనందించుచున్నాము ", అనగా పరిశుద్ధాత్ముడు మనలో నివసించుచున్నాడని, మనము అతనిలో ఉన్నామని, ఎందుకంటె మనము అతనితో మాత్రమే సమాధానము కలిగి ఉండక, అయితే దేవుడైన పరిశుద్ధాత్మతో మన శరీరములను దేవుని ఆలయములుగా చేసినది. నీ యందు దేవుని సన్నిధిని బట్టి ఆనందించుచున్నావా? అయితే నలిగినా మనిషిగా, నిన్ను నీవు ప్రముఖ్యుడవు కాదని ప్రభువును ఆరాధించి, నీ జీవితములో తప్పిదములను క్రీస్తు మరణము ద్వారా తెలుసుకొని వాటిని పైకి లేపుము.

ప్రార్థన: మేము ప్రకటించుచున్న శక్తి కలిగిన ప్రేమ ముందర మోకరిల్లుతున్నాము, మీ ప్రేమకు మా శరీరములను మా మనసులను అప్పగించుచున్నాము. మా గురించి మేము ఆలోచన కలిగి ఉండక నీ ప్రేమ యందు మునిగి ఉండెదము.

ప్రశ్నలు:

  1. దేవుని ప్రేమ ఏవిధముగా కనపడును?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:54 AM | powered by PmWiki (pmwiki-2.3.3)