Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 027 (Man is not Justified by Circumcision)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
B - విశ్వాసము ద్వారా దేవుని నీతి నూతనముగా అందరికీ చేయబడుట (రోమీయులకు 3:21 - 4:22)
3. అబ్రాహాము మరియు దావీదు విశ్వాసము ద్వారా విమోచనము అను దానికి ఒక ఉదాహరణ (రోమీయులకు 4:1-24)

b) మనిషి సున్నతి ద్వారా విమోచించబడలేదు (రోమీయులకు 4:9-12)


రోమీయులకు 4:9-12
9 ఈ ధన్యవచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారినిగూర్చికూడ చెప్ప బడినదా? అబ్రాహాము యొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడెనను చున్నాము గదా? 10 మంచిది; అది ఏ స్థితి యందు ఎంచ బడెను?సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే. 11 మరియు సున్నతి లేని వారైనను, నమి్మనవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను. 12 మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగు జాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను. 

పౌలు యూదుల సున్నతిని కలిగిన నమ్మకమును మరియు వారి నియమములను ఖండించెను. అరణ్యములో ఉన్న ప్రజలు వారికి కలిగిన గొప్ప సూచనను బట్టి పాత నిబంధన యొక్క గొప్ప నిబంధన అని యెంచిరి. ఎవరైతే సున్నతి పొంది ఉన్నదో వారు దేవునికి సంబంధించినవాడుగా ఎంచెను, మరియు ఎవరైతే సున్నతి చేయబడలేదు వారు ఒక దూషణగా ఎంచబడిరి. కనుకనే ప్రతి విశ్వాసిని సున్నతి చేయబడాలని యూదులు చెప్పిరి, అప్పుడు వారు నిజముగా పరిశుద్ధపరచబడుటకు సూచనగా ఉండుటకు, అది దేవుని నిబంధనలోనికి ప్రవేశించుటకు ఒక అవకాశముగా ఉండెను.

పౌలు యూదులకు అబ్రాహామును గూర్చి, అతను సున్నతి ద్వారా విమోచినబడలేదని అయితే విశ్వాసముచేతనే విమోచించబడినాడని చెప్పెను; అప్పటికి అబ్రాహాము దేవుని పిలుపు స్వరమును విన్నాడు, అనగా అతను సున్నతి పొందాక మునుపే ఆ స్వరమును నమ్మాడు. కనుకనే అతని విశ్వాసము తనను నీతిగా ఎంచబడుటకు ఒక పునాదిగా ఉండెను. సున్నతి అనునది అతనికి ఒక ముద్రగానే ఉన్నది అయితే దేవుని యొద్దకు వచ్చుటకు కాదు; అయితే దేవుని చెంతకు చేరుటకు అబ్రాహామును సున్నతి అనునది ఒక అవకాశముగా లేడు అయితే విశ్వాసముచేతనే అది అతనికి దేవుని చెంతకు చేరుటకు ఉపయోగము అయినది.

పౌలు అబ్రాహామును గూర్చి, అతను సున్నతి పొందువారికి తండ్రిగా పిలువబడుట కంటే ముఖ్యముగా అన్యుల విశ్వాసులకు ఒక తండ్రిగా పిలువబడుచున్నాడని చెప్పుటకు ధైర్యము చేసెను. ఎందుకంటె అతను ఇంకనూ సున్నతి పొందలేకున్నప్పుడే విమోచించబడినాడు. కనుక ఈ విషయమూ బట్టి అన్యు విశ్వాసులు దేవుడుని దగ్గరకు వారు వచ్చుటకు ఇష్టపడిరి అయితే వారు క్రీస్తును విశ్వసించలేదు. దేవుడు నిజమైన విశ్వాసిని మరియు మనసు మార్చబయినవారి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, అయితే శారీరక మార్పుకలిగినవారి ద్వారా కాదు.

ఎప్పుడైతే పూలు ఈ విధమైన విషయములను వారికి వివరించినప్పుడు యూదులు అతనిపైన మంటకలిగి ఉండిరి. అయితే వారు కూడా అబ్రాహామును కూడా కృప కలిగిన సువార్త ద్వారా వారి తండ్రిగా యెంచిరి. దేవుని యొద్దకు నడిపించుట సున్నతి కాదు మరియు నమ్మకము కాదు అయితే సిలువవేయబడిన వాటియందు విశ్వాసమే. అనగా ప్రతి బాప్తీస్మము పొందిన విశ్వాసి నీతిమంతుడు కాదు, అతను దేవుని ద్వారా విశ్వాసమందు విమోచించబడెను అని చెప్పువరకు, అయితే ఇవన్నీ కూడా కార్యములద్వారా కాదు అయితే కేవలము విశ్వాసము చేతనే.

ప్రార్థన: ఓ ప్రభువా మా చేదు హృదయములు ప్రకారము మరియు మా తప్పిదముల ప్రకారము నీ యొద్దకు వచ్చుటకు మేము యోగ్యులము కాము. అయితే నీ ప్రియమైన కుమారుడు తన ప్రేమను మాకు బయలుపరచి ఉన్నాడు, మరియు మమ్ములను ఆ సిలువలో విమోచించి ఉన్నాడు, మరియు మేము అతని మాటలను విశ్వసించాము, మరియు అతనిని బట్టి ఆశకలిగి ఉంది అతని రక్షణను పొందుకొని ఉన్నాము. నీవు మమ్ములను విమోచించి నీ ప్రేమ చేత మమ్ములను నీ యొద్దకు తీసుకొన్నావు కనుక మేము నిన్ను ఒక ఉదాహరణముగా ఎంచుకొనగలము.

ప్రశ్నలు:

  1. మనిషి కార్యముల ద్వారా కాక సున్నతి ద్వారా కాక విశ్వాసము చేత ఎందుకు విమోచించబడినాడు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:51 AM | powered by PmWiki (pmwiki-2.3.3)