Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 026 (Abraham’s Faith was Accounted to him)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
B - విశ్వాసము ద్వారా దేవుని నీతి నూతనముగా అందరికీ చేయబడుట (రోమీయులకు 3:21 - 4:22)
3. అబ్రాహాము మరియు దావీదు విశ్వాసము ద్వారా విమోచనము అను దానికి ఒక ఉదాహరణ (రోమీయులకు 4:1-24)

a) అబ్రాహాము యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడినది (రోమీయులకు 4:1-8)


రోమీయులకు 4:1-8
1 కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెననిఅందుము. 2 అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు. 3 లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రా హాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను 4 పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచ బడదు. 5 పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. 6 ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మను ష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు. 7 ఏలా గనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడుధన్యుడు. 8 ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు, 

పౌలు నూతన నిబంధన ప్రకారము అక్కడున్న రోమా లో ఉండు యూదులను నిజమైన విశ్వాసములోనికి నడిపించెను. కనుక అతను ఒక ఉదాహరణకు అబ్రాహామును వారి తండ్రిగా మరియు ప్రవక్త అయినటువంటి దావీదును కూడా ఉదాహరణముగా తీసుకొన్నాడు. కనుక క్షమాపణను కార్యముల ద్వారా కాక మరియు నీతి ద్వారా కాక కేవలము విశ్వాసము ద్వారానే పొందుకొని ఉన్నారని చెప్పెను.

అబ్రాహాము అందరి వాలే జీవించాడు; అతను ఇతరులకంటే మంచి వాడు కాదు మరియు చెడ్డవాడు కాదు. ప్రభువు అతని పాపములను మరియు చేదు హృదయములను చూసేను, అయితే అబ్రాహాము ఆత్మీయముగా లోబడుటకు సిద్దపడెను అను సత్యమును దేవుడు గమనించెను. కనుకనే దేవుడు అబ్రాహామును నేరుగా పిలిచెను కనుక అతను అతని స్వరమునకు లోబడి ఉండెను. అతను దేవుని లోతైన మర్మములను అర్థములను అర్థము చేసుకొనలేదు, అయితే అతను దేవుని యందు మరియు అతని మాటలయందు విశ్వాసముంచెను, ఎందుకంటె అవి సత్యమైనవి కనుక, కనుకనే దేవుని యొక్క వాగ్దానములు నెరవేర్చబడుటకు ఇవి ఒక ఆధారముగా ఉండెను. ఈ విశ్వాసముచేతనే అబ్రాహాము దేవుడిని ఘనపరచెను, మరియు దేవుని నామమును మహిమ పరచెను. కనుకనే అబ్రాహాము తన శక్తి యందును మరియు తన బలహీనత యందును ఆలోచన కలిగి ఉండలేదు, అయితే శక్తి కలిగిన దేవుని యందు నమ్మకము కలిగి ఉండెను. కనుక అతని హృదయ వాంఛలను విశ్వాసముచేత నమ్మకము ఉంచెను.

అబ్రాహాము తనకు తాను నీతిమంతుడు కాదు, అయితే అతని విశ్వాసము అతనిని నీతిమంతునిగా చేసియున్నది. అతను మానవలె చాల సాధారణమైన మనిషే అయితే అతను దేవుని స్వరమును విని మరియు అతని మాటను విని, అతని వాగ్దానములను అంగీకరించెను.

4 వ అధ్యాయములో, మనము చదివినట్లయితే ఈ విధమైన విశ్వాసము "నీతికి ఎంచబడినదని" చూడగలము. ఎవరైతే దేవునిని గౌరవిస్తారా వారు విశ్వాసము చేత సిలువ సువార్తను అంగీకరించి, క్రీస్తులో తమ జీవితమును కట్టుకొంటారు, ఇది విమోచనము ద్వారా మరియు కార్యముల ద్వారా సంపూర్ణముగా నెరవేర్చబడినది.

నీ అబద్ధములచేత మరియు నీ స్వల్ప ప్రేమ చేత దేవుని వాక్యము బయలుపరచెనని నీవు విన్నావా? నీమీదికి న్యాయతీర్పు వస్తున్నదని విశ్వసిస్తావా? నీవు పశ్శాత్తాపము కలిగి ఒప్పుకొని దేవుని నుంచి క్షమాపణను అడగలేక ఉన్నావా? ఒకవేళ నీ రాయిలాంటి హృదయము ద్వారా నీవు ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు నిను సిలువ వేయబడిన దేవుని కుమారుని కన్నుల ఎదుట నిన్ను నడిపించును. నీకు నీవు నీతిమంతుడవు కావు, అయితే నేనే నిన్ను నీతిమంతునిగా చేసి ఉన్నాను. నీవు శుద్ధముగా లేనివాడవు, అయితే నేనే నిన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరచి ఉన్నాను."

నీవు దేవుని వాక్యమును విన్నావా? అయితే ఇది నీ రాతి గుండెను మరియు దాని లోతులలోని దానిని మరియు నీ ఆత్మలోనికి చొచ్చుకొని వెళ్ళినదా? దేవుని వాక్యమును అంగీకరించు; రక్షణ సువార్తను విశ్వసించు, మరియు దేవుని సిలువను బట్టి విస్వసము కలిగి ఉండు అప్పుడు నిన్ను నీతి మంతునిగా యెంచును. నీ విశ్వాసముచేత సిలువవేయబడిన వాడిని ఘనపరచు, అప్పుడు నీవు అతని బంధములో పరిశుద్ధపరచబడి ఉండెదవు.

కీర్తనకారుడు, పాపి మరియు విమోచన రహస్యములను అనుభవించిన రాగా దావీదు కూడా విమోచించబడినాడు. అతను తన కీర్తనలను బట్టి ఘనపరచబడలేదు మరియు అతని విజయములను బట్టి కూడా అతిశయించలేదు, మరియు అతని ప్రార్థనలను బట్టి, మరియు ఏవిధమైన కార్యములను బట్టి అతిశయించలేదు. అయితే దానికి బదులుగా తన పాపములను బట్టి తనను క్షమించి కృపను దయచేసి దేవునిని ఘనపరచి ఉన్నాడు. క్రీస్తులో నీకు ఇవ్వబడినటువంటి నీతి దేవుని వరమే.

ప్రార్థన: ఓ దేవా నీ కుమారుని ద్వారా నీ వాక్యమును మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు, మరియు విమోచనము అనునది సిలువ ద్వారా కలుగునని చెప్పి ఉన్నావు. మేము నీ వాగ్దానములను వినునట్లు మా చెవులను తెరువుము, మరియు వాటిని అర్థము చేసుకొని వాటి యందు విశ్వాసము కలిగి ఉండునట్లు చేయుము. నీ యందు విశ్వాసము కలిగిన వారి ప్రకారము నన్ను కూడా నీవు విమోచించించినందుకు నీకు కృతజ్ఞతలు. నీ సిలువ వేయబడిన కుమారుని యందు మా స్నేహితులు కూడా విశ్వాసముంచునట్లు నీ పిలుపును వారు కూడా అంగీకరించునట్లు సహాయము చేయుము.

ప్రశ్నలు:

  1. అబ్రాహాము మరియు దావీదు ఏవిధముగా విమోచించబడినారు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:50 AM | powered by PmWiki (pmwiki-2.3.3)