Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 004 (Identification and apostolic benediction)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
ప్రారంభము: అభివాదం, దేవునికి కృతజ్ఞత మరియు "దేవుని నీతి" పైన అవధారణము ఈ పత్రిక ముఖ్య ఉద్దేశము

a) ఆశీర్వాదమునకు ఆనవాలు (రోమీయులకు 1:1-7)


రోమీయులకు 1:5-7
5 యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను.  6 ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయనద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితివిు.  7 మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు. 

దేవుని ప్రతి విధమైన బహుమానమునకు క్రీస్తు ఒక కారణమై ఉన్నాడు. ఎందుకంటె ప్రవక్తలు, పరిశుద్ధులు, మరియు కన్య అయినా మరియా మీ కొరకు దేవుని ముందర కృప కొరకు మరియు ఆశీర్వాదము కొరకు ధ్యానించలేరు. పరలోకమందున్న తండ్రి మన ప్రార్థనలు కేవలము యేసు నామములో మాత్రమే అంగీకరించి సమాధానమును ఇచ్చును, ఎందుకంటె అతను మాత్రమే మనకు బదులుగా తండ్రి దగ్గ్గర మాట్లాడ గలదు కాబట్టి. అతని నామము ద్వారానే మన ప్రతి ప్రార్థన ఆలకించబడి దాని ప్రకారము మనకు ఆత్మీయ బహుమానములు వచ్చును. యేసు మాత్రమే మనకొరకు దేవునితో సమాధాన పదును. కనుక మనము అతనినుంచి సంపూర్ణ కృప, క్షమాపణ, సమాధానము మరియు నీతి అతని ద్వారానే మనము పొందగలము. కనుక మన ప్రతి ఆశీర్వాదమునకు మనము అర్హులము కాదు అయితే అతని కృప ద్వారానే మనకు అవన్నియు కలిగినాయి.

"కృప " అనునది పౌలు యొక్క పత్రికలో చాల ప్రాముఖ్యమైనది. దీనిని పౌలు ఎప్పుడైతే సంఘమును హింసిస్తున్నాడో ఆ సమయములో దీనిని అనుభవించాడు. అతను తన కార్యముల ద్వారా, లేక ప్రార్థనల ద్వారా, లేక ఇష్టము ద్వారా రక్షింపబడలేదు, అయితే క్రీస్తు కృప చేత రక్షింపబడినాడు. కనుక నీవు కూడా క్రీస్తు నీకు మొదటగా ఇచ్చినట్లు కృపను అందరికి ఇచ్చి వారిని కూడా క్రీస్తు కృపలోనికి నడిపించు అప్పుడు వారు కూడా క్షమాపణ పండుకొని సమాధానము కలిగి ఉంటారు.

ఎప్పుడైతే నీవు కృపను గూర్చిన అంశమును తెలుసుకొని నేర్చుకొంటావో అప్పుడు నీవు కూడా కృపను ఇచ్చువాడుగా మరియు దేవుని ప్రేమ కలిగి ప్రకటించువాడుగా ఉండి నీతి కలిగి ఉంటావు. పరిశుద్ధాత్ముడు నీ హృదయములో ఒక వర్ధమానమును పెట్టినదా? లేక, ఇంకా నీ పాపములకు మరియు నీ బానిసత్వములో ఉన్నావా?

ఎవరైతే కృప కలిగిన ప్రేమ కలిగిన వర్తమానమును అర్థము చేసుకొంటారో వారు దేవుని దయకు లోబడి ఉంటారు. " లోబడుట" అనే మాటకు అర్థము ఏమనగా, "విశ్వాసము" అనగా పౌలు కృప కలిగిన మనుషులకు ఒక బాధ్యత కలిగిన వాడు అని అర్థము. ఎందుకంటె మనము మన ఇష్టమునకు వ్యతిరేకముగా ఉండక, మన రక్షకుడైన, విమోచకుడైన క్రీస్తునకు సంపూర్ణముగా లోబడి ఉండాలని అర్థము. కనుకనే పౌలు తనను తాను క్రీస్తు విధేయుడను అని పిలవబడ్డాడు. ఈ మాటలో అతను " విశ్వాసముతో లోబడుట" అనే మాటకు సంపూర్ణ అర్థము చెప్పెను. నీవు క్రీస్తుకు సంపూర్ణ సమర్పణ కలిగిన సేవకుడివా? దేవుడు ప్రతి ఒక్కరిని వారి పాపములనుబట్టి క్రీస్తు కొరకు క్షమించెను. కనుక మనము దీనికంటే ఉత్తమమైనది ఏది కూడా కనుగొనలేము కాబట్టి దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని అతని శక్తిని పూర్తిగా అనుభవించాలి. కనుక నీవు నీ స్నేహితులను కృప ఇచ్చు దేవుని యెడల విశ్వాసముతో లోబడుటకు పిలిచి ఉన్నావా?

రోమ్లో ఉన్న సంఘస్తులందరు కూడా పౌలు ద్వారా పిలువబడలేదు అయితే నేరుగా క్రీస్తు ద్వారా పిలువవాడినారు. కనుక నిజమైన విశ్వాసమునకు ఇది ఒక రహస్యము:అనగా ఎవ్వరు కూడా ఇతరుల ద్వారా పిలువబడలేరు అయితే మనము అతని చేతులలో పరికరములువంటి వారము కనుక మనలను అతను నేరుగా పిలిచి ఉన్నాడు. యేసు తనను వెంబడించువారిని తన కొరకు పిలుచును. అతని స్వరము చేత అందరిని పిలుచును, కనుక అతని స్వరములో మరణమును కూడా లేపు శక్తి కలదు. " సంఘము" అను పేరుకు అర్థము పిలువబడినవారి సహవాసము, మరియు దేవుని పరిచర్యలో బాధ్యత కలిగి ప్రేమ కలిగి ఉండుట. నీవు క్రీస్తు కొరకు పిలువబడిన వాడివా? లేక నీవు ఇంకా ప్రయోజనకరము లేవా? మన మతము మతముగా పిలువబడుచున్నది.

ఎవరైతే ఈ సమాధానములను అంగీకరిస్తారా వారు దేవుని ప్రియులుగా ఉంటారు. కనుక క్రైస్తవులు ఎవరు! అను మాట మనకు ఎంత మహిమకరముగా అందముగా ఉన్నది, వారు సర్వశక్తుని బంధువులై మరియు అతని చేత మర్యాదించబడిన వారు. అయితే దేవుడు వారి సమానముగా వచ్చి వారితో సహవాసము కలిగి ఉండెను. దేవుని ప్రేమ అనునది వారి తల్లి తండ్రుల కంటే గొప్పదై వారి పిల్లలకు అది ఒక పరిశుద్ధత కలిగి ఉన్నది, లేక అది పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె మధ్యన ఉన్న ప్రేమ వలె ఉన్నది. దేవుని ప్రేమ పరిశుద్ధమైనది కనుక ఎన్నటికీ ఓడిపోదు. నీవు దేవుని ప్రేమలో, పరిషుడతలో ఉన్న ప్రియులలో ఒకడివిగా ఉన్నావా?

క్రీస్తు మనలను పిలిచింది, క్షమించుటకు, లోబడుటకు, మరియు అతనిని వెంబడించుటకు. ఈ విధమైన ప్రవర్ధనలూ పరిశుద్ధతత కలిగి ఉంటాయి. మనము ఎవ్వరమూ కూడా పరిశుద్ధులము కాము, అయితే విమోచనకలిగిన పరిశుద్దమను మనము ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మనము పరిశుద్ధులముగా మార్చబడతాము. కృపచేతనే మనము దేవుని ఎదుట నిర్దోషులముగా నిలువబడగలము. కనుక ప్రతి పరిశుద్ధుడు కూడా ఈ లోకము నుంచి వేరుపరచి క్రీస్తు పరిచర్యకు పిలువబడి ఉన్నాడు. వారు వారి బంధువులకు చెందిన వారు కారు అయితెహ్ దేవుని కొరకు వారు పిలువబడినారు కనుక పరిశుద్ధత కలిగి ఉండిరి. నీవు అందులో ఒకడివిగా ఉన్నావా? నీవు కృపచేత పరిశుద్ధునిగా ఉన్నావా?

ప్రార్థన: పరిశుద్ధమైన దేవా, మేము కూడా పరిశుద్ధులముగా ఉండులాగున మమ్ములను నీ పరిశుద్ధమైన క్రీస్తు ద్వారా పిలిచి ఉన్నావు. కనుక మేము తెలిసి తెలియక చేసిన పాపముల కొరకు క్షమించుమని బతిమాలుచున్నాము. నీవు మమ్ములను ప్రేమించి మమ్ములను నీ రక్తముచేత పరిశుద్ధపరచినందుకు నీకు కృతజ్ఞతలు. మమ్ములను నీవు ప్రేమించినట్లు మేము కూడా నిన్ను ప్రేమించేవిధముగా మా మనసులను మా సమయములను మర్చి మమ్ములను బలపరచుము.

ప్రశ్నలు:

  1. కృప అనగా ఏమి, దీనిని గూర్చి మనిషి సమాధానము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:01 AM | powered by PmWiki (pmwiki-2.3.3)