Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 012 (Peter’s Sermon at Pentecost)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

6. పెంతేకొస్తు దినమందు పేతురు యొక్క ప్రసంగము (అపొస్తలుల 2:14-36)


అపొస్తలుల 2:22-23
22 ఇశ్రాయేలువారలారా, యీ మాటలువినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్య ములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు. 23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. 

పరిశుద్ధాత్ముడు తనను తాను గొప్పగా అనుకోలేదు, అయితే క్రీస్తును మహిమపరచినది. దేవుడు ప్రేమ కలిగినవాడు. త్రిత్వములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనలను ఇతరుల యొద్దకు నడిపిస్తారు కనుక మనము కూడా ఇతరులను ప్రేమించాలి. కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు అలాగునే పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడిని మహిమపరుస్తాడు. కుమారుడు రక్షణ నిమిత్తమై ఏవిధముగా అయితే పరిశుద్దాత్ముడ్ని పెంపినాడో అదేవిధముగా తండ్రి కూడా తన అధికారమునంతటినీ పరలోకమందు మరియు ఈ భూమి యందు అధికారమును కుమారునికి ఇచ్చి ఉన్నాడు. కనుక దేవుని జ్ఞానము కొరకు ఆశ కలిగి ఉన్నవారు తండ్రి కుమారా పరిశుద్దాత్ముడ్ని ఘనపరచాలి, వారు ప్రేమై ఉన్నారు కనుక.

పేతురు ఆశీర్వాదము ఇచ్చు పరిశుద్ధాత్మను గురించి ఎక్కువగా చెప్పలేదు, ఎందుకంటే అతని సాక్షయమును త్వరగా యేసు క్రీస్తు వైపు త్రిప్పాడు. ప్రభువు ఎవరైతే తనను తాను అందరి కొరకు సమర్పించుకొని త్యాగము కలిగి ఆదివారము ఉదయమే తిరిగి లేచాడు, కనుక శిష్యుల మనసులను మంచి ఆలోచనలచేత నింపాడు. వారు ఈ విషయాలను బట్టి ప్రార్థించి వారి యందు మరియు ప్రవచనములు యందు మనసు ఉంచిరి, మరియు వాటిని అర్థము చేసుకొనిరి.పేతురు తనను వినువారికి నజరేయుడైన యేసును పోషించునట్లుగా మరియు పరిశుద్ధాత్మను ఎందుకు పంపవలసి వచ్చెనో అని కూడా వారికి వివరించెను.

మాట్లాడు వాడు తన హృదయలోతులలోనుంచి గ్రహింహాదు, యూదుల పాపములను పరిశుద్ధాత్ముడు ఏవిధముగా వ్యతిరేకిస్తున్నాడో అని, ఎందుకంటె వారే క్రీస్తును వ్యతిరేకించి అతనిని చంపియున్నారు కనుక. కనుక పేతురు తన మంచి మాటలచేత వినువారిని వాగ్దాన ఆశీర్వాదములచేత ఓదార్చలేకపోయెను. అయినప్పటికీ ఈ సత్యమును వారికి చెప్పలేదు. అయితే వారి పాపములను అతను వారికి కనపరిచాడు; ప్రేమ కలిగిన భాషలో ఆలోచనచేస్తే వారిని వారి దోషములనుంచి వారు తెలుసుకొనుటకు చేసెను. అందుకనే అతను తన ప్రసంగ ప్రారంభములో "క్రీస్తు" అను మాట వాడలేదు, అయితే యేసును "దేవుని మనిషి" అని పిలిచాడు. యూదులు అతని మాటలు వింటూ ఉండుటకు ఇష్టపడెను కానీ వారు త్వరగా కోప పడుటకు ఇష్టపడలేదు.

పేతురు లోతుగా ఊపిరి పీల్చుకొని తన తరువాత ప్రసంగమును అర్థము అయ్యేటట్లు చేసెను. " నజరేయుడైన యేసు మీకందరికీ తెలుసు. ఈ మనిషి దేవుని ద్వారా వచ్చినవాడు మరియు ఎన్నో సూచనల చేత వచ్చి ఇతర ప్రవక్తలు చేయలేని అద్భుతములు చేసినవాడు. అతను మృతులను లేపాడు, దెయ్యములను వెళ్ళగొట్టాడు, పాపములను క్షమించాడు, మరియు ఐదు రొట్టెలచేత ఐదు వేళా మందికి ఆహారమును సమృద్ధిగా యిచ్చియున్నాడు తుఫానును గద్దించాడు. ఈ అద్భుత కార్యములన్ని కూడా మనిషి చేయజాలనివి అయితే దేవుడు మాత్రమే చేయగలడు. కనుక సర్వశక్తుడు తన కార్యములను క్రీస్తు ద్వారా చేయునట్లుగా క్రీస్తు తన తండ్రికి సంపూర్ణముగా సమర్పించుకొనెను. కనుక పరలోకము ఈ భూమి మీద ప్రాకెను. క్రీస్తు ప్రత్యేకముగా లెక్కడా తన తండ్రికి దూరముగా ఉంది కార్యము చేయలేదు. అతను తనతో పాటుగా ఉండెను కనుక పరిశుద్ధాత్ముడు తన ద్వారా వచ్చెను. క్రీస్తు చెప్పినట్లు " నన్ను పంపువాని చిత్తమును చేయుట నాకు ఆహారమాయెను".

దేవుని శక్తి మరియు అధికారము కలిగిన వానిని తిరస్కరించుట యూదులకు ఒక వింతగా ఉండెను. యాజకులు మరియు వారి సభ్యులు వారి తిరస్కరణకు కారకులు అని పేతురు చెప్పలేదు, అయితే వినువారు తప్పుగా ఉన్నారు. వారు వారు నాయకులను బట్టి భయము కలిగి ఉండిరి కనుక నజరేయుడైన యేసును వారు రక్షించలేకపోయిరి. కొంతమంది యేడ్చుట ఒక భాగముగా తీసుకున్నారు: "సిలువ వేయుడి, సిలువ వేయుడి!" అని, పేతురు వారి హృదయములను పరిశుద్దాత్మ చేత దహిరేముతో ఈ మాటలు పలికెను: "మీరే దేవుడు పంపిన వానిని చంపినారు, అనగా సహజమైన మనుషులకు అప్పగించలేదు అయితే రోమా వారికి మీరు అతనిని సిలువవేయుటకు అప్పగించారు. కనుక దాని ద్వారా మీకు సిగ్గు కలిగినది ". పేతురు వారి దొంగతనమును బట్టి, అబద్ధమును బట్టి, లేదా అపరిశుద్దతను బట్టి మాట్లాడలేదు, అయితే యేసు పట్ల వారి ప్రవర్తన ఒక గ్రుడ్డిదిగా, లోబడనిదిగా మరియు అతనికి శత్రువులుగా ఉండిరి అని చెప్పెను. ఈ పేతురు ప్రసంఘములో పరిశుద్ధాత్మను ఖండించునట్లుగా ప్రకటించలేదు. అయితే దేవుని చేయబడిన ప్రతి కార్యము ద్వారా వారిని ఖంధించబడినది, కనుకనే దీని ద్వారా దేవునికి వారికి మధ్యన శత్రుత్వం వచ్చినది.

దేవుడు క్రీస్తు సిలువవేయబడడములో ఓడిపోలేదు, అయితే రక్షణను బట్టి తనకు ఉన్న జ్ఞానమును ముందుగానే పంపెను. ఈ అనుకోని నేరము ద్వారా వారికి తన ఉచిత ప్రేమను కనపరిచాడు. ఎవరు కూడా దేవుని ప్రణాలికను ఆటంకపరచలేదు. పరిశుద్దుడైన వాడు ఈ లోకమును విమోచించుటకు సిద్దమయ్యాడు, పాపులకొరకు తన కుమారుడు త్యాగము చేయాలని అనుకున్నాడు. సిలువ అనునది ఈ లోకమునకు ఒక ప్రేమ అయినదిగా మరియు దేవుని జ్ఞానమునకు చెందినదిగా ఉండెను. దేవుడు ముందుగానే యూదుల ఆనందము గురించి సర్వశక్తుడైన దేవుడు పరిశుద్ధాత్మను బట్టి ముందుగానే నిర్ణయించాడు, పేతురు చెప్పినట్లు: " మీరు హంతకులు, మరియు దేవునికి శత్రువులై ఉన్నారు."

పేతురు యొక్క ప్రసంఘపు ప్రారంభములో మరియు ముగింపులో గొప్ప వ్యత్యాసము కనపడినది! మొదటగా, అపొస్తలులు పరిశుద్ధాత్మలో ఆనందముతో నిలువబడిరి, దేవునిని మహిమపరచుచు మరియు కృతజ్ఞత తెలుపుతూ. మరియు పేతురు వినువారి హృదయములను ఖండించునట్లుగా పరిశుద్ధాత్ముడు సహాయపడెను. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ పరిశుద్ధముగా మరియు సత్యమై ఉన్నది.

ప్రార్థన: ఓ పరిశుద్ధమైన తండ్రి నీ కుమారుడిని మా కొరకు మరణించుటకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. మేము అతడిని అసూయతో మరియు మొండిగా చంపియున్నాము. మమ్ములను క్షమించి నీ గొప్ప ప్రేమతో నింపబడునట్లు నీ ఆత్మను కుమ్మరించు.

ప్రశ్న:

  1. యూదులు యేసును చంపినా హంతకులను పేతురు వారికి ఎందుకు చెప్పెను?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:44 PM | powered by PmWiki (pmwiki-2.3.3)