Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 098 (Christ predicts the joy of the disciples)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
D - పైటప్పుడు గెత్సేమనే కు వెళ్ళేటం (యోహాను 15:1 – 16:33)

5. పునరుత్థాన దినమును శిష్యులు ఆనందముతో ఉంటారని యేసు ముందుగానే ప్రవచించుట (యోహాను16:16-24)


యోహాను 16:16-19
16 కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకునన్నుచూచెదరనిచెప్పెను. 17 కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని యొకనితో ఒకరుచెప్పుకొనిరి. 18 కొంచెము కాలమని ఆయన చెప్పుచున్న దేమిటి? ఆయన చెప్పుచున్న సంగతిమనకుతెలియదనిచెప్పుకొనిరి. 19 వారు తన్ను అడుగ గోరుచుండిరని యేసు యెరిగి వారితో ఇట్లనెను కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొను చున్నారా?

ఈ సాయంకాలములో క్రీస్తు తన వెళ్ళిపోవటం గురించి చెప్పెను. ఇది అతని శిష్యులకు ఆఘాతాము కలిగినది; ఎందుకంటె అతని ఉద్దేశమును వారు అర్థము చేసుకోలేక పోయారు. అయితే పస్కా పండుగ తరువాత అతను తిరిగి పునరుత్థానుడై సమాధిని గెలిచి లేస్తానని వారికి చెప్పెను. అప్పుడు అతను తన శిష్యులకు ఆ గోడదగ్గర కనపడెను; అది అతని చివరి ఘడియలుగా తన తండ్రిని ఎదుర్కొనుటకు ఉండెను.

ఎప్పుడైతే క్రీస్తు ఒలీవ కొండమీద ఈ విషయాలను బట్టి చెప్పినప్పుడు వారికి ఏమి కూడా అర్థము కాలేదు. అయితే దాని కంటే ముందే అతను వెళ్లిపోవుట గురించి ముందుగానే చెప్పెను. అయితే వారికి ఇప్పుడు అతను సంపూర్ణముగా వారి నుంచి వేరు పరచబడుతానని చెప్పెను. వారికి ఈ ప్రణాళికలు మరియు ఉద్దేశములు అర్థము కాలేదని ఒప్పుకొనిరి. అయితే అతను తిరిగి పరలోకమునకు వెళ్తాడని తెలిసి వారు ఎంతగానో అంగలార్చిరి.

యోహాను 16:20-23
20 మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 21 స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు. 22 అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతొషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు. 23 ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

యేసు వారు ఆలోచనలను చదివి వారు ఏమి మాట్లాడుతున్నారో అర్థము చేసుకొనెను, వారు మాట్లాడుట వినక ఉండినను తెలుసుకొనెను. అయితే వారు అంగలార్పును బట్టి , వారి బాధను బట్టి యేసు అర్థము చేసుకొని తొందరలో వారి జీవితములు కదిలించబడతాయని అనుకొనెను. ఇది ఒక మంచి రాజు యొక్క మరణము మాది ఉండెను, ఎందుకంటె ప్రజలు వారి నిరీక్షణకు కోల్పోతారు కాబట్టి రాజును బట్టి అంగలార్చేదరు. మరియు శత్రువులు సంతోషిస్తారు , శత్రువులు అనగా ఈ లోకము మాత్రమే యూదులు కాదు. ఎవరైతే క్రీస్తులో ఉండక లేదా అతని సంఘములో ఉండక ఉంటారో వారు ఈ లోకములో క్రీస్తుకు శత్రువులుగా ఉంటారు.

తరువాత యేసు శిష్యులతో మీరు ముందు ఆనందమును పొందుకుంటారని చెప్పేను. ఒక తల్లి బిడ్డకు జన్మనించ్చినప్పుడు బిడ్డ ఏవిధముగా ఏడుస్తారో అదేవిధముగా వారు ఏడుస్తుందిరి. ఎప్పుడైతే ఆ బిడ్డలను ఆ తల్లులు తమ కౌగిలిలోకి తీసుకుంటారో అప్పుడు వారు ఏడవడము మానేస్తారు.

పునరుత్థానమందు శిష్యుల ప్రశ్నలన్నీ మౌనమై పోయినాయి. వారి దోషములన్ని కూడా తీసివేయబడ్డాయి ; మరియు సాతాను అధికారము వారి మీద లేకపోయెను అదేవిధముగా దేవుని ఉగ్రత కూడా వారినుంచి వేర్పరచెను. వారి భయము వారి తిరస్కారము మరియు వారి అపనమ్మకం క్రీస్తు క్షమాపణలో తొలగి పోయెను. అయితే యూదులు వీటిని బట్టి పట్టించుకోలేదు అయితే యేసు వారిని నిలబెట్టెను. కనుక వారిప్రతి ప్రశ్నకు వారు ప్రతి అపనమ్మకమునకు క్రీస్తు పునరుత్థాన దినమందు వారికి తగిన సమాధానము దొరికెను.

యోహాను 16:24
24 ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.

క్రీస్తు తన శిష్యులను వదిలి వెళ్ళేటప్పుడు వారికి ఏమి కావాలో అడుగుమని చెప్పెను, వాటిని వారికి దయచేసి తన తండ్రి మహిమ పరచబడతాడని చెప్పెను (యోహాను 14:13). ఇవి సంఘమునకు మరియు సువార్త సేవ కార్యములను కట్టబడును, ఎందుకంటె యేసుకు అనేకులు తన ప్రేమ కలిగిన మహిమలోనికి చేర్చబడాలని ఉద్దేశమై ఉన్నది కనుక. అందుకే, " మొదట అతని రాజ్యమును, నీటిని వెతుకుడి . అప్పుడు అవన్నియు మీకు అనుగ్రహించబడును". కనుక యేసు వాగ్దానము చేసినట్లు పరలోకమందును ఈ భూమియందును ప్రతి ప్రార్థన కూడా సమాధానం దొరుకును, అయినప్పటికీ పరలోకములోనే ఎక్కువ ప్రాధాన్యత కలుగును ఈ భూమి కంటే.

నీ హృదయ ప్రశ్నలు నీ మానవులు ఏమిటి ? నీకు ధనము, ఆరోగ్యము కావాలా? నీకు మరియు ఇతరులకు ఏవైనా లింక్ కావాలా? నీలో దేవుని కనికరము ఉన్నాడని అనుమానిస్తున్నావా ? నీ జీవితములో ఆత్మ లేకుండా ఖాళీగా అనిపిస్తున్నదా ? నీ శ్రమలను బట్టి నీ కష్టములను బట్టి నీవు భారము కలిగి ఉన్నావా ? దురాత్మా చేత కలవరపడుచున్నావా ? క్రీస్తు రాకడను బట్టి మరియు అతని సమాధానమును బట్టి ఎదురు చూస్తున్నావా ? నీవు ఆత్మీయము కలిగి ఉన్నావా లేక గర్వము కలిగి ఉన్నావా ? నీవు ఆశావాదా లేక నిరాశావాదా ? నీవు తొందరగా నొప్పించబడుతున్నావా ? నీ హృదయములో పరిశుద్ధాత్మను నింపుమని ప్రభువును అడుగుతున్నావా ?

ప్రతి సమస్యను బట్టి ప్రార్థనలో ఉంచుము. నీ హృదయమును నీ పరలోకపు తండ్రికి తెరువుము. అయితే ప్రార్థనలో అపనమ్మకం కలిగి ఉండవద్దు, అయితే దేని విషమై ప్రార్థించాలి జ్ఞానముకలిగి ఉండు. నీకు యేసు ఇచ్చిన నైపుణ్యములను మరియు బహుమానములను బట్టి ఆలోచనచేయుము, వాటిని బట్టి కృతజ్ఞత తెలుపుము. మరియు నీ పాపములను బట్టి ఒప్పుకొనుము ఎందుకంటె నీకు స్వల్ప విశ్వాసమే ఉన్నది కనుక. నీ పాపములను క్షమించుమని అడిగి నీ ఆశను నెరవేర్చుమని అడుగు, అప్పుడు నీవు కఠినమైనది అడగవద్దు. అతని కృపను మరియు అతని మాటలను విను మనసును అడుగుము. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని మరియు ఇతరులను ఆశీర్వదించువాడని మరవవద్దు. నీ స్నేహితులను బట్టి నీ శత్రువులను బట్టి యేసుతో ప్రార్థించు అప్పుడు వారు కూడ కృప ద్వారా ఆశీర్వదించబడెదరు. నీవు మాత్రమే అవసరంలో ఉన్నవాడివి కావు. అయితే అనేకులు ఉన్నారు. నీ ప్రశ్నలు ధైర్యముగా క్రీస్తుకు వినిపించు, అప్పుడు నీవు కృతజ్ఞత కలిగిన పుష్పములను పొందుకొనెదవు. అప్పుడు నీవు యేసు నామములో రహస్య ప్రార్థనను నేర్చుకుంటావు.

నిజమైన ప్రార్థనలు దేవుని ఎదుట మానవులుగా ఉందును, అవి ఆరాధనతో మరియు కృతజ్ఞతతో చేయబడును. కనుక నీవు గంభీరంగా చేయకు . నీవు నీ తల్లి తండ్రులతో ఏవిధముగా ప్రేమ కలిగి నీ అవసరము బట్టి అడుగుతావో అదేవిధముగా నీ దేవునితో ప్రార్థనలో అడుగుము. సుంకరి ఏవిధంగా అయితే ప్రార్థన చేసాడో, " ప్రభువా నేను పాపిని , కనికరము చూపు" . యేసు ఎప్పుడైతే లాజరు కొరకు ప్రార్థన చేసాడో అప్పుడు పరలోక మందున్న తండ్రి ఆ కార్యము చేసెను. విశ్వాసము మాత్రమే రక్షణను పొందుకొని, సహాయమును కలిగి ఉండును. కనుక ధైర్యము కలిగి కృప చేత ప్రార్థన చేయుము. నీవు అతని కుమారునివిగా పిలువబడ్డావు కనుక ఆనందముతో అతనితో మాట్లాడు.

యేసు తన ఆశలను నీమీద ఉంచాడు, దేవునితో మరియు కుమారునితో నీవు సహవాసము కలిగి ఉండునట్లు నీ ప్రతి ప్రార్థనకు ఆయన సమాధానమును ఇచ్చి ఉన్నాడు. కనుక నీకు ఏది ఎక్కువ ప్రాముఖ్యము బహుమానమా లేక ఇచ్చువాడ ? యేసు సంపూర్ణము కలిగిన వాడు కనుక సంపూర్ణముగా ఉండు. ఎందుకంటె మనము సంపూర్ణ ఆనందము కలిగి ఉండాలని యేసు కోరుకుంటున్నాడు. క్రీస్తు మన ప్రార్థనలు వింటున్నదన్నప్పుడు మన ఆనందము మరి ఎక్కువ అవుతుంది. మన ప్రార్థనల ద్వారా ఇతరులను రక్షించి వారిని ఆశీర్వదించాడు. క్రీస్తు మ్దఘాలమీద వస్తున్నప్పుడు మన ఆనందము పరిపూర్ణమవుతుంది. కనుక క్రీస్తు వచ్చుట మన ప్రార్థనలు ఒక ప్రత్యేకమైనది .

ప్రార్థన: పరలోకమందున్న ప్రభువా నీ కుమారుడైన యేసును మాకొరకు పంపి మాకు రక్షకుడిగా ఉన్నందుకు నీకు మా హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు. ఈ లోక ఆశలను బట్టి క్షమించి నీ సిలువ ప్రాముఖ్యమును మాకు నేర్పుము. మేము బాధ్యత కలిగి ప్రార్థించి, నీ పిల్లలుగా ఉండునట్లు మాకు సహాయము చేయుము. పాపములతో ఉన్న మా సహోదరులను కూడా వారి పాపమునుంచి కాపాడు. వారి కత్తులనుంచి వారిని విడిపించి వారు కూడా నీ ఆనందమును మరియు నీ సన్నిధిని పొందునట్లు సహాయము చేయుము .

ప్రశ్న:

  1. తండ్రి అయినా దేవుడు యేసు నామములో మనము చేయు ప్రార్థనలను ఏవిధముగా జవాబు ఇచ్చును ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:14 PM | powered by PmWiki (pmwiki-2.3.3)