Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 092 (Abiding in the Father's fellowship appears in mutual love)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
D - పైటప్పుడు గెత్సేమనే కు వెళ్ళేటం (యోహాను 15:1 – 16:33)

2. మనము తండ్రితో సహవాసము కలిగి ఉండుట అనునది అన్యోన్యమైన ప్రేమకలిగి ఉన్నది (యోహాను 15:9-17)


యోహాను 15:9
9 తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి.

తండ్రి తన కుమారుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక అతను యొర్దాను నదిలో బాప్తీస్మము తీసుకున్నప్పుడు పాలోకములను రెండుగా చేసెను. అప్పుడు పరిశుద్ధాత్ముడు పావురము వాలే వచ్చెను, మరియు ఒక స్వరము, " ఇతను నాప్రియ కుమారుడు, ఇతనియందు నేనానందించుచున్నాను" అని. ఈ త్రిత్వము యొక్క మాట యేసు బాప్తీస్మము తీసుకున్నప్పుడు దేవుని గొర్రెపిల్ల త్యాగముకొరకు ప్రారంభమైనది. కుమారుడు తన తండ్రి చిత్తమును తీసుకున్నాడు, మరియు మన విమోచనము కొరకు ఖాళీ అయి ఉన్నాడు. ఆ ప్రేమ తండ్రికి మరియు కుమారునికి ఒక హద్దుగా లేదు, అయితే వారిద్దరూ ఈ లోకమును బట్టి ఒకటిగా ఉండి, గొప్ప విమోచనము కొరకు సిద్దపడినారు.

యేసు తన తండ్రి కొలత చేత మనలను ప్రేమించెను. అతను లోబడి ఉన్నప్పుడు మనము ఆ విధముగా లేము. ఎందుకంటె మనలో ఏఒక్కరు కూడా ఆదినుంచి ఏకైక వారుగా లేము. అయితే కుమారుడు మనము ఇంకనూ పాపులం i ఉండగా మన పాపములను కడిగివేసెను. అతను మనకు రెండవ జన్మమునిచ్చి తన ఆత్మచేత పరిశుద్ధపరచెను. అతను మన విషయమై ఎల్లప్పుడూ ఆలోచనకలిగి ఉన్నాడు, మరియు మనలను సంయుక్తపరచి ఉన్నాడు. అతను మనకొరకు రాయబారిగా ఉండి ప్రేమ కలిగిన ఉత్తరమును వ్రాయును. అతను మనలను విశ్వాసములోనికి మరియు ప్రేమలోకి నడిపించును. ఒకవేళ మనకు తండ్రి ప్రేమ మరియు తల్లి ప్రేమ రెండు కూడా కలగలిపి ఉన్నప్పటికీ క్రీస్తు ప్రేమలో అవన్నీ కూడా కేవలము కొంచమే, అవి విఫలము కావచ్చేమో అయితే క్రీస్తు ప్రేమ విఫలము కాదు.

యోహాను 15:10
10 నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు.

యేసు నిన్ను మందలించుచున్నాడు, " నిన్ను నీవు ప్రేమ నుంచి వేరుగా ఉండవద్దు. నేను నిన్ను ప్రేమించి నా గురించి నీవు ఏ విధముగా ప్రేమిస్తున్నావా అనుటకు రుజువు కోరుకుంటున్నాను. నీ ప్రార్థనలు ఎక్కడ, అవి పరలోకముతో ఒక ఫోన్ మాదిరి సంబంధము కలిగి ఉన్నాయా ? అవసరంలో ఉన్నవారికి నీ సహాయము ఎక్కడ ? ఏది మంచిదో మరియు ప్రేమ కలిగి ఉన్నదో మరియు దయ పరిశుద్ధతకలిగి ఉన్నదో దానిని గూర్చినేను ఎదురు చూస్తున్నాను. కనుక నా ప్రేమలో ఉండు. పరిశుద్దాత్మ దేవుడు నీవు మంచి కార్యములు చేయుటకు సహాయపడును, దేవుడు ఏవిధముగా అయితే మంచి పనులు చేస్తాడో ఆలాగున .

దేవుడు ప్రేమించినట్లు నీవు ప్రేమించకపోతే అది పాపము. క్రీస్తు మనలను దేవుని మాదిరి ఉండాలని కోరుకుంటున్నాడు, " నేను నా తండ్రి ఏవిధముగా జాలికలిగి ఉన్నామో అదేవిధముగా జాలికలిగి ఉండుడి". నీవు ఇది అసాధ్యమని అనుకొనవచ్చు. ఒకవేళ మనుషులకు అది అసాధ్యమను కుంటే నీవు కరెక్ట్. అయితే క్రీస్తుకు ఏది కావాలో నీకు తెలియదు, అతను నీలో ఉండి ఏ కార్యము చేయునో అని కూడా నీకు తెలియదు. నీవు అతను ఏవిధముగా ప్రేమ కలిగి ఉన్నదో నీవు కూడా అదేవిధముగా ఉండాలని తన ఆత్మను నీమీద పెట్టును. అందుకే పౌలు చెప్పినట్టు, " నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేసెదను " అని.

క్రీస్తు తన తండ్రి చిత్తమునకు వ్యతిరేకముగా ఏచిన్న కార్యము కూడా చేయలేదు, బదులుగా అతను దేవుని ప్రేమలో నిత్యమూ నిలిచి ఉన్నాడు. క్రీస్తు మనలోకి దేవుని సమాధానము, ఆత్మీయ ప్రార్థన మరియు ప్రేమ కలిగిన పరిచర్య.

యోహాను 15:11
11 మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.

దప్పిక అనునది మనిషికి చాలా బాగుగా తెలుసు ఎందుకంటె అతని శ్రమలలో మరియు కష్టాలలో అతను దేవుని కొరకు దప్పిగ కలిగి ఉండాలి. తండ్రితో ఉన్న క్రీస్తు సంపూర్ణ ఆనందము కలిగి మరియు ఆశీర్వాదము కలిగి ఉన్నాడు. అతని అంతరంగములో కీర్తనలు పాడుతూ ఆరాధన చేసు ఉన్నాడు. కనుక అతను మనకు రక్షణతో సహా సముద్రమంతటి ప్రేమను మరియు దేవుని సంతోషమును మనకు సమృద్ధిగా ఇచ్చును.

ఆత్మీయ బహుమానములో ప్రేమ అనునది రెండవ వరుసలో ఉన్నది. అక్కడ పాపము ఖండించబడి, ఆనందము వ్యాపించబడుతుంది. క్రీస్తు మన రక్షణ ఆనందమును ఇతరులకు వ్యాపించునట్లుగా బలపరచును. ఆనందకరమైన మనిషి తన ఆనందమును తనతో మాత్రమే ఉంచుకొనక తన పొరుగువారికి కూడా వ్యాపించినట్లుగా ఉండును. అప్పుడు మన ఆనందము అనునది ఇతరులు రక్షింపబడినప్పుడు సంతోషించును. " అందరు కూడా రక్షింపబడి దేవుని సత్యమైన జ్ఞానములొ ఉండునట్లు దేవుని ఉద్దశమై ఉన్నది" అని పౌలు చెప్పెను. కనుక సువార్తీకారణ అనునది శ్రమలలో ఉన్నవారికి ఒక ఆనందరమును ఇచ్చు లాగున ఉండును.

యోహాను 15:12-13
12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయేనాఆజ్ఞ 13 తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.

క్రీస్తుకు మన గుణములు , ప్రవర్తన , పేర్లు మరియు ఆయన మీద మనకున్న ప్రేమ కూడా తెలుసు. అతను మన సమస్యలను మరియు మన ఇబ్బందులను కూడా తెలుసుకుంటాడు. మన భవిష్యత్తును గురించి మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అతను మనలను ప్రార్థనలో మార్చుటకు సిద్ధముగా ఉన్నాడు, అతను మన పాపములను క్షమించి అతని పరిశుద్ధ సన్నిధిలోనికి మనలను నడిపించును.

క్రీస్తు మనలను ఏవిధముగా అయితే ప్రేమించాడో అదేవిధముగా మనము ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండుమని సెలవిచ్చియున్నాడు. అప్పుడు మనము మన సహోదరుల యొక్క కష్టములను బట్టి వారి శ్రమలను బట్టి అందులో మనము కూడ పాలుపంచుకుంటాము. అదేవిధముగా వారి ప్రవర్ధనను మరియు వారి గుణములను కూడా మనము కలిగి ఉండగలం. మనము వారి సమస్యలకు పరిస్కారం కనుగొని వారికి ప్రత్యామ్నాయము కనుగొనుటకు సమయమును కేటాయిస్తాము. ఒకవేళ వారు పొరపాట్లు చేసినట్లయితే మనము వాటిని బట్టి క్షమించి వారి తప్పులను జ్ఞాపకము చేసికొనక ఉండుము.

క్రీస్తు తన లోతైన ప్రేమను వారికి తెలియపరచెను. వారితో ఎక్కువగా మాట్లాడక వారికి సహాయము చేయక వారి పాపము కొరకు త్యాగము చేసెను. అతను మనకొరకు జీవించలేడు అయితే మనకు బదులుగా మరణించెను. క్రీస్తు సిలువ మనకు ఒక ప్రేమ కిరీటమై మనకు దేవుని ప్రేమను వివరించెను. అతను తన రక్షణ వాక్యమును మరియు త్యాగము కలిగిన ధనమును సమయమును కనపరచెను. ఒకవేళ మనలను దేవుడు సువార్త ఇతరులకు పంచుటకు పిలిచినట్లైతే అప్పుడు మనము త్యాగముగలవారమై మన శక్తిని మరియు కలిగినదంతయు వదిలి తనకొరకు పనిచేయాలని ఉద్దేశించెను. ఎవరైతే క్రీస్తును అంగీకరించి ఉంటారో వారిని బట్టి క్రీస్తు స్నేహితులుగానే భావించును. అందుకే తన శత్రువులను గూర్చి ప్రార్థించెను," తండ్రి వారేమిచేయుచున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించు " అని ప్రార్థించెను. అతను వారిని సహోదరులుగా లేకా దేవుని పిల్లలుగా పిలువలేదు అయితే ప్రియమైన వారుగా పిలిచియున్నాడు. కనుక ఎవరైతే అతని యందు విశ్వాసముంచక ఉంటారో వారి కొరకు కూడా అతను మరణించి ఉన్నాడు.

యోహాను 15:14-15
4 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు. 15 దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.

దేవుడు నిన్ను "ప్రియమైన" వాడా అని పిలుస్తున్నాడు. ఈ విధముగా ఆయన ప్రతి కూనారిని కూడా పిలుచును. ఒకవేళ నీవు ఒంటరిగానే ఉండవచ్చు. కనుక నీ కొరకు చనిపోయి మరియు జీవించుచున్న క్రీస్తు వైపు చూడు. ఎందుకంటె అతను నీ నిజమైన స్నేహితుడు కనుక నీకు సహాయము చేయును. నీ ఆలోచనలను తెలుసుకొని నీ సమాధానము కొరకు ఎదురుచూచును. మనము అతని లో ఉండడము అంగీ అతనితో స్నేహము కలిగి అందరినీ ఒకేవిధముగా పేమించడమే. ఎందుకంటే అతని స్నేహము ఒకరిని ఒకరు ప్రేమించుమని అడుగుతాడు. అందుకే అతను మనలను తన ప్రియులుగా పిలుస్తున్నాడు. అతను మనలను సృష్టించాడు కనుక మనము ఆయన బానిసలుగా పిలువబడడానికి అర్హులమే. అతను మనలను బరువైన కాడినుంచి విడిపించి మనలను పైకి లేపినాడు. అప్పుడు అతను తన కార్యములను మనకు వివరించును. అతను మనలను ఒంటరిగా వదలకు మనకు తండ్రి శక్తిని మరియు అతని ప్రేమను మరియు పరిశుద్దాత్ముడ్ని గూర్చి వివరించును. తన త్రిత్వమునకు సంబంధించిన రహస్యములను బయలుపరచి వాటిని మనకు వివరించును. అతనితో మనము స్నేహము చేసినట్లయితే అప్పుడు మనము తన కార్యములో, గౌరవములో, శక్తిలో మరియు జీవితములో కలసినవారముగా ఉండెదము. అతను తన కుమారత్వమును, దత్తతను చూడక, కేవలము అతను మనకొరకు త్యాగము చేసి మనలను దేవుని పిల్లలుగా చేయుము.

యోహాను 15:16-17
16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. 17 మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను.

క్రీస్తుతో నీ బంధము నీ ఇష్టము, ఆశ, అనుభవము మీద ఆధారపడి లేదు అయితే అతని ప్రేమ మీద మరియు అతను నిన్ను ఎన్నుకున్న, మరియు పిలువబడిన దానిని బట్టి ఆధారపడి ఉన్నది. నీవు నీ మరణములో సాతానుకు బానిసగా ఉంటివి. నీవు నీ బంధకములో ఉంటివి అయితే క్రీస్తు నిన్ను దానినుంచి కాపాడి నిన్ను నిత్యజీవములోనికి నడిపించి తన రక్త ప్రోక్షణ ద్వారా నిన్ను రక్షించాడు. అతను నిన్ను తన స్నేహితునిగా చేసుకొని అతని కుమారత్వములోనికి మనలను నడిపించాడు. అతని ఎన్నిక సంపూర్ణ కృప ద్వారా జరిగినది. యేసు తన సిలువలో పాపము చేసిన వారందరిని బట్టి అతను మృతిపొందాడు. ప్రతి ఒక్కరు అతని పిలుపును వినరు అయితే వారందరూ పాపములో ఉన్నారు. కనుక వారికి దేవుని పిల్లల స్వాతంత్ర్యము గురిన్సిహ్ వారికి తెలియదు. క్రీస్తు నిన్ను నీ పాపమునుంచి విడుదల కలిగి అతనితో సంపూర్ణ బంధము కలిగి ఉండుమని ఉద్దేశించెను. కనుక నిన్ను నీవు ప్రేమలో ఎదుగు. నీ స్వాతంత్ర్యము ఇతరులను సేవచేయడమే ఉండాలి. కనుక బానిసత్వములో బలవంతము ఉండదు. యేసు సేవకులకు అతను ఒక ప్రేమ అయి ఉన్నాడు. అతను ఎల్లప్పుడూ తన పిల్లలను గూర్చి చింతించువాడుగా ఉన్నాడు.

కనుక అతను నీ గురించి ఏవిధముగా అయితే చింతించి ఉంటాడో అదేవిధముగా నీవు కూడా నీ స్నేహితుల గురించి చింతించేవాడుగా ఉండాలి, ఓకే కాపరి ఏవిధముగా అయితే తన గొర్రెలను బట్టి ఆలోచనచేస్తాడో ఆవిధముగా ఉండాలి. మనము కేవలము మానవమాత్రులము కనుక ఇతరుల పాపపు బానిసత్వమునుంచి వారిని విడిపించలేము. మనము క్రీస్తు నామములో ప్రార్థన చేసినప్పుడు అతను మన ప్రతి ప్రార్థనను విని తన మంచి తనముచేత మరియు ఆత్మచేత మన ప్రతి ప్రార్థనను వినును. ప్రార్థన సమాధానమునకు రహస్యముగా జరుగును. నీవు ఒకవేళ నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు క్రీస్తు నీ పాపములను కూడా నీకు కనపరచి నీవు హృదయమందు పాప క్షమాపణ కలిగి ప్రార్థించునట్లు నడిపించును. ఒకవేళ నీవు నీ స్నేహితుల రక్షణను గూర్చి లేదా వారి పరిశుద్ధత గూర్చి ప్రార్థించినట్లైతే అప్పుడు క్రీస్తు నీ ప్రార్థనను వినును. కనుక నీవు ఎల్లప్పుడూ ప్రార్థనలు గడపాలి అయితే క్రీస్తు నీవు ప్రార్థనకు తగిన జవాబు ఇస్తాడని కాదు అయితే నీవు అతనిలో ఉండాలని యేసు కోరుచున్నారు. కనుక ఎవరైతే నీ ప్రార్థన ద్వారా విశ్వసించారో వారు నిత్యజీవము పండుకొందురు మరియు వారు మరణమునుండి విడిపించబడుదురు.

విశ్వాసము కంటే ఎక్కువగా, నీ ప్రార్థన మరియు నీ సాక్ష్యము, కనుక యేసు నీవు నీ స్నేహితులను ప్రేమించుమని, వారితో స్వచ్చమైన ప్రేమ కలిగి ఉండుమని చెప్పెను. వారి సమస్యలను ఓపికగా ఓర్చుకొని వారి ప్రవర్తనను సరిచేయాలి. దేవుడు నీతో ఏవిధముగా ఉన్నదో అదేవిధముగా నీ స్నేహితులతో కూడా ఉండాలి. నిన్ను నీవు త్యాగమునకు, పరిచారయకు, వినుటకు మరియు స్పందించుటకు నేర్చుకొని ఉండాలి. క్రీస్తు వెలుగు నీద్వారా ప్రకాశించును గాక.

ప్రార్థన: ప్రభువా మమ్ములను మా పాపములనుంచి విడిపించి నీ ప్రియమైన వారీగా చేసినందుకు నీకు కృతజ్ఞతలు. నీవు నన్ను ప్రేమించునట్లు నేను కూడా ఇతరులను ప్రేమించునట్లు చేయుము. నేను నిన్ను ఆరాధించి నీమీదే నా భారమును వేసి ఉందును. అనేక ఫలములు తెచ్చునట్లు మాకు లోబడి ఉండే భాగ్యము ఇమ్ము.

ప్రశ్న:

  1. బానిసలుగా ఉన్న వారిని యేసు ఏవిధముగా తన ప్రియమైన పిల్లలుగా చేసుకొన్నాడు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:03 PM | powered by PmWiki (pmwiki-2.3.3)