Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 085 (Christ predicts Peter's denial; God is present in Christ)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
B - ప్రభువు భోజనమునకు సంభవించు కార్యములు (యోహాను 13:1-38)

4. పేతురు ఖండనను యేసు ముందుగానే చెప్పుట (యోహాను 13:36-38)


యోహాను 13:36-38
36 సీమోను పేతురుప్రభువా, నీవెక్కడికి వెళ్లు చున్నావని ఆయనను అడుగగా యేసునేను వెళ్లు చున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరు వాత వచ్చెదవనిఅతనితోచెప్పెను. 37 అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదుననిఆయనతోచెప్పగా 38 యేసునాకొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

యేసు పేతురు గురించి ప్రేమకలిగి మాట్లాడుతున్నప్పుడు అతని హృదయము కలత చెందెను. వారందరు కూడా యేసు వారిని శ్రమలకు మరియు కష్టములకు విడిచి వెళ్తాడని అనుకొన్నారు. ఎందుకంటె వారందరు కూడా అతని మీద ఆధారపడి ఉన్నారు కనుక/ అందుకే పేతురు యేసుతో ఏది ఏమైనా నేను నిన్ను విడువక వెంబడించెదను అన్నాడు. ఎందుకంటె అతను క్రీస్తు కొరకు యుద్ధము చేయుటకు మరియు చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉండెను కనుక.


C - మీద గదిలో వెళ్లిపోయే దాని గురించి చెప్పుట (యోహాను 14:1-31)

1. క్రీస్తులో దేవుడు ఉండుట (యోహాను 14:1-11)


యోహాను 14:1-3
1 మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాస ముంచుడి. 2 నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. 3 నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

యేసు తన శిష్యులను విడిచి వెళ్ళుటకు విని ఆ శిష్యులు తమ మనసులో చాల బాధపడిరి, ఎందుకంటె యేసు వారిని ఒంటరిని చేసి అతను వేళ్ళు స్థలమునకు వారిని తీసుకొని వెళ్ళాడు అని మదనపడిరి. మరియు పేతురు కూడా యేసును ఖండిస్తాడనే వైషమ్యమును ముందుగానే చెప్పినప్పుడు పేతురు తన విశ్వాసముతో బలము కలిగినవాడుగా ఉన్నాడు కనుక యేసు మాటలను ఖండించెను. అయితే అందులోని కొంతమంది శిష్యులు ఒక వేళా మనము తొందరలో మనలను విడిచి వెళ్తున్న లేకా మరణిస్తున్న యేసును వెంబడించుట మంచిది కాదేమో అని అనుకొనిరి. యేసు వారి మొక్కలను చూసి చిన్నగా ఆజ్ఞాపించెను. దేవుని మీద సంపూర్ణ భారము కలిగి ఉండు అతను నీ ప్రతి సమయములో ఒక పునాదిగా ఉన్నాడు, అందరు కదిలించబడినప్పుడు అతను కదిలించబడని వాడు. కనుక భయము అనగా అవిశ్వాసమే. నీ పరలోకపు తండ్రి నిన్ను విడువడు మరియు మోసము చేయడు. ఈ లోకమును నీవు జయించుట నీ విశ్వాసమునకు ఒక విజయము.

యేసు తనను వెంబడించువారి నుంచి కూడా ఇదే విధమైన విశ్వాసమును మరియు ప్రార్థనను కోరుకొనెను. ఎందుకంటె అతను కూడా తన తండ్రి దగ్గర ఉన్నవాడు కనుక. తండ్రి మన జీవితమును బట్టి ఏవిధముగా అయితే నమ్మకమును ఇచ్చాడో అదేవిధముగా క్రీస్తుకూడ మనకు నమ్మకమును ఇచ్చును. కుమారునితో తండ్రి ఈ లోకములో ఉన్నాడు. అతని ప్రేమ మన నమ్మకమును మరియు అతని సత్యము ఒక బండలాగా ఉండును.

తరువాత యేసు తన మరణము తరువాత ఏమి సంభవించునో వారికి క్లుప్తముగా చెప్పెను. దేవునితో ఎన్నో అద్భుతమైన భవనములు కలవు అవి మీరు ఈ లోకములో ఎక్కడ కూడా చూసి ఉండరు. దేవుని స్థలము ఆ పట్టణము నందు ఉండును, అది ఎంతో విశాలమైన స్థలములలో నిర్మించి యుండెను కనుక అందరికి సమృద్ధికలిగిన భవనములు ఉండును. కనుక ఇప్పుడు నీవు ఒకవేళ గుడిసెలో లేదా ఒక డేరా లో ఉన్నప్పటికీ చింతించవద్దు. ఎందుకంటె నీ తండ్రి స్థలములో నీకు అనేక నివాసములు కలవు. అతను నీకొరకు ఒక ఇంటిని సిద్ధముచేసి ఉన్నాడు, అది మంచిదిగా ఉన్నది. కనుక నీవు నీ తండ్రితో నిత్యమూ ఉండుటకు అతనితో ఉండు

దేవుడే క్రీస్తులో విశ్వాసులను ప్రేమించి వారి కొరకు స్థలమును సిద్ధముచేసి ఉన్నాడు. ఎప్పుడైతే యేసు పరలోకమునకు వెళ్లేనా అప్పుడు ఈ భావనములను ఆయన సిద్దము చేస్తున్నాడు. అయితే ఆయన తిరిగి మనదగ్గరకు రావాలనుకున్నాడు;అతను మన నుంచి దూరముగా ఉండాలని అనుకొనలేదు. అతను వారిని ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ఏవిధముగా ప్రేమించునో అదేవిధముగా సంఘమును కూడా క్రీస్తు ప్రేమించును. మనము ఎల్లప్పుడూ అతనితో ఉండి, అతని మంచితనమును పొందుకోవాలి.

యోహాను 14:4-6
4 నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను. 5 అందుకు తోమా ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగుతెలియుననిఆయననడుగగా 6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.

యేసు తన శిష్యులతో , " నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసా, మరియు మీకు దేవుని దగ్గరకు మార్గము తెలుసా." అందుకు తోమా, " మాకు ఏవిధముగా ఆ మార్గము తెలుసును, ఎందుకంటె మీరు మా నుంచి ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు కాబట్టి ?" అతని బాధలో అతని గమ్యమును చూడలేదు. భయము అతనిని కదిలించింది;అతని గమ్యమును మరచిపోయాడు.

యేసు అతనికి వాగ్దానము చేసాడు, " నేనే దేవుని దగ్గరకు మార్గము, నా ప్రేమ మరియు సత్యమే పరలోకమునకు నడిపించునది. మానవత్వమునకు నేనే పునాది, దీని ద్వారానే దేవుడు తార్పు ఇచ్చేది. కనుక నీవు మనిషి ఆలోచనలచేత ఏది కొలవవద్దు. దేవుని దగ్గరకు నిన్ను తీసుకు వెళ్లే మార్గములో ఉండు. నా దగ్గరకు వచ్చి నాతో పోల్చుకో;నీవు పాపుడవు అని తెలుసుకో.

క్రీస్తు నిన్ను భయములోనికి నెట్టివేయడు, ఎప్పుడైతే నీవు నీ జీవితములో క్రిందకు వెళ్తావో అప్పడు తన చేతిని నీకు ఇచ్చి నిన్ను కాపాడి, ఈ విధముగా చెప్పును, " ఇప్పుడు నీకు క్రొత్త నిజమును ఇచ్చెదను, పాతది నీ వెనుక ఉన్నది. నేను నీకొరకు చనిపోయాను, మరియు నీకొరకు కృపచేత క్రొత్త నిబంధనను తీసుకొనివచ్చాను. నీ పాపములు క్షమించబడి ఉన్నవి; నీ విశ్వాసమే నిన్ను కాపాడును. నన్ను పట్టుకొని ఉండు. నాలో మాత్రమే దేవుని దగ్గరకు వేళ్ళు సత్యమును పొందుకుంటావు. నేను లేకుంటే నీవు నశించిపోతావు.

నీవు అనవచ్చు, " నేను ఇవన్నీ వింటున్నాను, అయితే నాకు విశ్వాసము కొదువై ఉన్నది, శక్తి, ప్రార్థన మరియు పరిశుద్ధత తక్కువై ఉన్నవి. అందుకు యేసు, " నేను నీకు నిత్యజీవమును ఇచ్చియున్నాను; నేనే జీవమునకు కారణము. కనుక విశ్వాసముతో నా మీద భారము కలిగి ఉండు అప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఈ ఆత్మలో నీవు సమృద్ధిగల జీవితమును పొందుకుంటావు." ఎవరైతే క్రీస్తును నమ్ముతారో వారు జీవితమును పొందుకుంటారు. కనుక అతని నుంచి దూరముగా ఉండకు; అతను నీకు జీవితమే ఉన్నాడు. నీవు నీ పాపములో మృతిపొందినవాడవుగా ఉంటావో లేక క్రీస్తులో జీవము కలిగి ఉంటావో. నీకు మధ్యన ఏ మార్గము లేదు అయితెహ్ క్రీస్తే విశ్వాసులకు జీవమై ఉన్నాడు.

ఎవరైతే క్రీస్తుతో సహవాసము కలిగి ఉంటారో వారు దేవునిని ముఖ ముఖిగా చూసి తండ్రి యొక్క కనికరమును చూస్తారు. ఏవిధమైన కార్యములు మతము నిన్ను దేవుని దగ్గరకు నడిపించాడు. కేవలము దేవుని కుమారుని ద్వారానే ఇది జరుగును; అతనిలో తండ్రి నీ ముందర నివాసమై ఉంటాడు. యేసు దేవుని సత్యమైన ప్రవచనము. మనకు దేవుడిని తెలుసుకొనుటకు అవకాశము ఉన్నది; క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నాడు కనుక మనము అతని యొద్దకు వెళ్తున్నాము, మరియు అతను మనలను దేవుని పిల్లలుగా చేసి ఉన్నాడు.

యోహాను 14:7
7 మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.

ఈ లోక మనుషులు తమ పాపములచేత దేవునికి దూరముగా ఉన్నారు. ఎవరు కూడా దేవునిని తమ సొంత అంగీకారముచేత తెలుసుకొనరు. క్రీస్తు తప్పతండ్రిని ఎవరు చూడలేదు, క్రీస్తు తన తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అతను చెప్పినట్లు: నీవు నన్ను తెలుసుకున్నట్లైతే నా తండ్రిని తెలిసికొంటావు. అయితే వారికి ఈ విషయము తెలియదు. జ్ఞానము అనునది కేవలము అర్థమైనది మాత్రమే కాదు అయితే మార్పు చెందినది కూడా. కనుక దేవుని జ్ఞానము మనలోకి వచ్చి అది జీవమును ఇచ్చును. మాత చదువులు దేవుడిని తెలియపరచవు కనుక మోసపోకుడి. ఏదైతే వెలుగును నీవు పొందుకుంటావో అది నిన్ను మార్చి నీకు వెలుగై ఉండును.

యేసు పట్టపడుతున్నప్పుడు ఆశ్చర్యంగా ఒక మాట శిష్యులకు చెప్పెను, " ఇప్పటి నుంచి మీరు నన్ను తెలుసుకుంటారు. నేను ప్రతి చోటఉండువాడను , జ్ఞానము కలవాడను మరియు మహిమకలవాడను మాత్రమే కాదు అయితే ఈ లోక పాపములను తీసుకొని వెళ్లే దేవుని గొర్రెపిల్లను. నీకు బదులుగా మరణించింది నేను నీకు దేవునికి మరియు తండ్రికి సహవాసము ఇచ్చుటకు, అతను నీ పాపములను ఉగ్రతతో శిక్షించడు, లేక నాశనము చేయదు, అయితే నన్ను శిక్షిస్తాడు, కనుక నీవు మార్పు కలిగి పరిశుద్ధత కలిగి అతని ప్రజలతో సహవాసము కలిగి ఉంటావు."

సిలువ మీద దేవుడు తండ్రిని బయలుపరచెను. అతను ప్రేమ కలిగి, కృప కలిగి విమోచన కలిగి ఉన్నాడు. దేవుడు నీ స్వకీయమైన తండ్రి అయి ఉన్నాడు. నీవు నన్ను నమ్మిన వాడివి, మరియు నీకు మాత్రమే దేవుని గురించిన రహస్యము తెలిసి ఉన్నది. ఈ విధమైన జ్ఞానము నిన్ను అతని జ్ఞానములోనికి మార్చును.

యోహాను 14:8-9
8 అప్పుడు ఫిలిప్పుప్రభువా, తండ్రిని మాకు కనబర చుము, మాకంతే చాలునని ఆయనతోచెప్పగా 9 యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?

యేసు చెప్పినప్పుడు, " మీరు తండ్రిని చూసి అతనిని తెలుసుకొన్నారు. " ఫిలిప్పు ఆశ్చర్యపడి ," లేదు మేము అతనిని చూడలేదు" అని చెప్పెను, అయితే అతను తన ప్రభువుచేత కౌగిలించుకొన్నాడు. బదులుగా, " ప్రభువా, మాకు తండ్రిని చూపించు అది మాకు చాలు." ఈ విధమైన సమాధానముచేత అతను దేవుని రహస్యమును మరియు అతని శక్తిని పొందుకున్నాడని తెలుసుకొనెదము. ఆ రహస్యము అతని తండ్రితో తనకున్న ఐక్యతనుబట్టి ఆధారపడినాడు. ఒకవేళ అతను వారిని వదిలి వెళ్లాలను కుంటే , అతను తన తండ్రిని కొద్దిసేపైనా చూపించి అతను అన్నివేళలా ఉన్నవాడిని తెలియపరచెను. అప్పుడు వారు దేవుడిని తెలుసుకొని చూసి అతని అధికారమును మరియు శక్తిని పొంది స్వస్థతను కలిగి ఉంటారు.

ఆ విన్నపముచేత , ఫిలిప్పు తనకు ఇంకా తండ్రిని గూర్చి మరియు కుమారుని గూర్చి తెలియదని ఒప్పుకొనెను. సత్యమును మరియు దైవత్వమును తెలుసుకొనుటలో అతను విఫలము అయ్యాడు. యేసు వానిని తిరస్కరించక, అతని యెడల కనికరము కలిగి ఆ సాయంకాలము వేళా తన గొప్ప సత్యమును తెలియపరచెను, " ఎవరైతే నన్ను చూసారో వారు తండ్రిని చూసారు." ఈ మాటలచేత ఆ శిష్యుల యూదుట ఉన్న వస్త్రమును యేసు చింపి వేసెను. ఏవిధమైన కళలు లేదా దర్శనములు దేవుని సత్యములను దగ్గరకు రావు;కేవలము మాశుష్య కుమారుడైన యేసు క్రీస్తు మాత్రమే. అతను ప్రాముఖ్యమైన వాడు మాత్రమే కాదు , అయితే ఆయనలో మనము దేవునిని చూడగలము. నీవు ఒకవేళ యేసును చూసినట్లయితే ఈ దినము దేవుని గురించిన దర్శనము కలిగి ఆయనను జ్ఞాపకము చేసికొని ఉండవచ్చు. తోమా ఈ మాటలు విన్నప్పటికి దానిలోని మర్మములను తెలుసుకొనుటలో విఫలం అయ్యాడు. అయితే క్రీస్తు పునరుతానము తరువాత తన హృదయమందు ఏడీసీది, " నా ప్రభువా , నా దేవా " అని ప్రలాపించెను.

యోహాను 14:10-11
10 తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచుతనక్రియలుచేయుచున్నాడు. 11 తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.

శిష్యులకు వాక్యములను కంఠస్థము చేసి యేసును హీనంగా చూచుట వారికి సాధ్యమే, అయితే అతని హృదయములో మరియు ఆత్మయందు మారుమనస్సు కలిగి ఉండలేక పోతే అది వ్యర్థమే. యేసు ఫిలిప్పును బట్టి ఒక లోతైన విషయమును ఆత్మ ద్వారా అడిగిఉన్నాడు, " నేను తండ్రిలో ఉన్నది నీవు విశ్వసించుటలేదా ? నా జీవిత ఆశయము నా తండ్రిని మహిమపరచుటే. నేను తండ్రిలో ఉన్నాను. తండ్రి శరీరాను సారముగా నాలో ఉన్నాడు. అతని సంపూర్ణ దైవత్వము నాలో ఉన్నది. నేను పరిశుద్ధాత్మచేత జన్మించి పాపములేకుండా జీవించాను. కనుక నాకు అతను నిత్యమూ నుంచి తెలుసు, ఈ జ్ఞానము నాలో అవతరించి ఉన్నది. నాలో అతను తండ్రి మంచితనమును మరియు కనికరమును చూపియున్నాడు."

“నా సాక్ష్యమును బట్టి నిరూపణ కలదు: మరియు నా అధికారమునకు మరియు నా కార్యములకు గల నిరూపణ ఉన్నది. తండ్రితో విశ్వాసము కలిగి ఉండుటకు నీకు కష్టమనిపిస్తే, అప్పుడు నా మాటలను విను, నా తండ్రి వీటి ద్వారా నీతో మాట్లాడుతాడు. ఈ మాటలు నీకు జీవమును శక్తిని మరియు ధైర్యమును ఇచ్చును. ఒక వేళా నీకు నా మాటలను బట్టి అర్థము కాకపోతే నా కార్యములను చూడుము;దేవుడే తన పరలోక సూచనద్వారా నీలో కార్యము చేయును. అతను నిన్ను నా ద్వారా రక్షించును, ఎందుకంటె నీవు పోగొట్టుకొని పోయావు కనుక. నా సిలువ సమయములో నీవు దేవుని గొప్ప కార్యములను చూదవచ్చు, మనుషులను నా మరణము ద్వారా విమోచించబడుట. నీ కన్నులను తెరచి, నీ చెవులను మూసుకొనవద్దు. నా సిలువ మరణముద్వారా నీవు దేవునిని తెలుసుకుంటావు. ఈయన నిజమైన దేవుడు కనుక అతను నిన్ను ఖండించక నిన్ను రక్షించును.”

ప్రార్థన: ప్రభువైన యేసు నీ కృపద్వారా నేను చెప్తున్నాను," నా దేవా నా ప్రభువా" అని. నా అవిశ్వాసమును మరియు కొదువైన ప్రేమను క్షమించుము. పరిశుద్ధాత్మను చూచుటకు నా అంతరంగ కన్నులను తెరువుము, అప్పుడు నేను తండ్రిని నీలో చూసి, అతని ప్రేమలోకి మార్చబడెదను, అప్పుడు నీ జ్ఞానము కలిగి మరణమును పొందాక జీవమును పొందుకొనెదను. నీ మహిమను బయలు పరచినట్లైతే అప్పుడు అవిశ్వాసులు విశ్వాసముద్వారా నూతన జీవితమును పొందుకొనెదరు.

ప్రశ్న:

  1. తండ్రి అయిన దేవునికి మరియు క్రీస్తుకు ఉన్న సంబంధము ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:57 AM | powered by PmWiki (pmwiki-2.3.3)