Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 076 (Jesus anointed in Bethany)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
A - పరిశుద్ధ వారము ప్రరంభము (యోహాను 11:55 – 12:50)

1. బేతనిలో యేసు అభిషేకించుట (యోహాను 11:55 – 12:8)


యోహాను 11:55-57
55 మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లె టూళ్లలోనుండి యెరూషలేమునకువచ్చిరి. 56 వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడిమీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. 57 ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.

హెబ్రెయులు ఇగుప్త దేశమునుంచి విడిపించబడినప్పటినుంచి పస్కా పండుగ వారికి పాత నిబంధన గ్రంధములో ఎంతో ప్రాధాన్యత కలిగినది. అక్కడినుంచి వారికొరకు సిద్ధపరచబడిన గొర్రెపిల్ల సంరక్షణలో ఉన్నారు. వారు చనిపోవాలని ఆశకలిగినారు అయితే వారి విశ్వాసమే వారిని కాపాడినది.

సంవత్సరమునకు ఒక సారి యూదులు యెరూషలేమునకు వచ్చి దేవుడు వారిని ఉగ్రత నుంచి కాపాడినందుకు కృతజ్ఞత చెప్పుటకు వచ్చిరి. అక్కడా వారు గొర్రెలను బాలి ఇచ్చి వాటిని తినిరి. చాల మంది యేసుషలేమునకు పస్కాపండుగ కంటే ముందుగానే వెళ్లి వారి పాపములను బట్టి పచ్చాత్తాపముకలిగి ఉండిరి, ఎందుకంటె వారు దేవుని గొర్రెపిల్లతవు సహవాసముకలిగి ఆ పండుగలో భోజనమును తినుచువచ్చిరి. ఒక వేళా ఎవరైనా శవమును తాకినయెడల వారు క్రమము తప్పక 7 దినములు జాగ్రత్త కలిగి ఆ తరువాత దేవాలయములోనికి ప్రవేశించాలి (సంఖ్యా 19:11).

అందుకే యాత్ర చేయువారు నజరేయుడైన క్రీస్తు గురించి ముందుగానే ," అతను వచ్చాడా లేకా వారు అతనిని చూడలేదా ? " అయితే ఆ సంఘపు మత పెద్దలు అతని మరణమును ఖండించిరి. ఆ దేశములో ఉన్న అనేకులను యేసును ఎక్కడైనా చూసారా , ఒక వేళా చూసినట్లయితే అతనిని పట్టుకోవాలి అని అనేకులను అడిగిరి. యేసు మరణమును మ్రింగుటకు వారి దవడలు తెరువబడెను .

యోహాను 12:1-3
1 కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందుచేసిరి. 2 మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతో కూడ భోజమునకు కూర్చున్నవారిలోఒకడు. 3 అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని,యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో ని

యేసు అతని శత్రువులను గూర్చి భయపడక తన తండ్రి చిత్తము నెరవేర్చబడులాగున యెరూషలేమునకు వెళ్లెను. అతను ఏకాంత స్థలమును వెతకలేదు అయితే పస్కా పండుగకు ఒక వారము ముందే యెరూషలేమునకు వెళ్లెను. అతను బెథానీ అనే ఊరి మీద వెళ్లెను. మరణమును జయించిన స్థలమునకు వచ్చెను అక్కడనే అతను తన తండ్రిని ఘనపరచి అతని తండ్రిని గూర్చి ప్రకటించి యున్నాడు. అప్పుడు లాజరు తినుటలో , త్రాగుటలో ఆ స్థలములో ఉండెను. అక్కడ ప్రజలు చూసి ఆశ్చర్యపడి మరణమును గూర్చి భయపడిరి.

మరియా, మార్తా మరియు లాజరు దేవుని మహిమను అనుభవించి ఆ సంఘమును పట్టించుకోక దానిని సాక్ష్యముగా చెప్పిరి అప్పుడు అతను యేసును స్వాగతించి ఆనందముతో పూలను ఇచ్చిరి. లాజరు యేసుకు స్నేహితుడు కనుక మరణమునుంచి లేపిన వాని ప్రక్కన కూర్చుండెను. ఈ చిత్రము మనకు పరదైసును గురించి చేప్తుందా ? కనుక దేవుడు మననుంచి దూరముగా లేదు అందుకే మనము అతనితో పాటు మహిమతో కూర్చుందుము.

మార్తా ఆమె ఇంట్లో ఉన్న అంతటిని తెరచి యేసును నిజమైన మెస్సయ్య మరియు మరణమును జయించినవాడు అని నమ్మినది .

మరియా తనకు తెలియని రీతిలో ఆమెతో ఉన్న అత్యంత ఖరీదైన ఆతరుతో యేసును గౌరవించింది. ఎందుకంటె ఆమెతో ఉన్న ఖరీదైన వస్తువులతో క్రీస్తును ఘనపరచాలనుకున్నది కనుక. అయితే అతని తలమీద ఆ అతడును పూయక అతని పాదములకు పూసినది. కనుక ప్రేమ అనునది త్యాగముతో కూడుకొనినది. ఆ తరువాత ఆమె వెండ్రుకలతో క్రీస్తు పాదములను తుడిచింది.కనుక ఆ ఇంటిలో ఒక సుగంధ వాసనతో వారి ప్రేమ నిండినది. అక్కడ ఉన్నవారందరూ కూడా మరియా యొక్క అత్తరు సువాసనతో నిండియుండిరి.

యోహాను 12:4-6
4 ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా 5 యీ అత్తరెందుకు మూడు వందల దేనార ములకు అమి్మ బీదలకు ఇయ్యలేదనెను. 6 వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.

యూదా ఎసుకంటే ఎక్కువగా ధనమునే ప్రేమించి తన విశ్వాసమును పాడుచేసుకొనెను. కనుక అతని త్యాగమును ధనముతో వివరించి, ఆత్మీయ ఆశీర్వాదములను పోగొట్టుకొనెను. మరియా మాదిరిగా యేసును ఘనపరచుటలో మరియు కృతజ్ఞత కలిగి ఉండుటలో విఫలమాయెను. ఎవరైతే ధనమును ప్రేమిస్తారో వారు దెయ్యముగా ఉందురు. మరియు అతను క్రీస్తును ప్రేమించలేదు, అయితే బీదలను ప్రేమిస్తున్నానని నటించెను. వారికి అతను ఏమి ఇవ్వాలని అనుకోలేదు లేదా చేయాలనీ అనుకోకేడు అయితే వారి ధనమును కూడా లాగుకోవాలని చూసేను. అతని జేబులో ఎక్కువ మొత్తమును ఉంచుకొని ఇతరులకు ఏమి కూడా ఇవ్వలేదు , ఈ విధముగా ఒక దొంగ మాత్రమే చేయగలడు.

అయితే క్రీస్తు ఎప్పుడు కూడా అతని ధనమును బట్టి ఆలోచనచేయలేదు అయితే ఎప్పుడు తనను పట్టిస్తాడో అని మరియు అతని చెడ్డ కార్యములను చూసేను. అయితే యూదా ఒక దొంగ గా ఉంది తనను మాత్రమే ప్రేమించుకొని అతనే ధనికుడుగా ఉండాలనే ఉద్దేశములో ఉన్నవాడు. కనుక సహోదరుడా నీవు ధనమును మరియు దేవుడిని సేవించలేవు. నీవు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషించగలవు. కనుక నిన్ను నీవే మోసము చేసుకోవద్దు. దేవుడు నీ గురి అయి ఉన్నదా లేకా సులభమైన జీవితము కావాలనుకున్నావా ?

యోహాను 12:7-8
7 కాబట్టి యేసునన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి; 8 బీదలు ఎల్లప్పు డును మీతో కూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను.

దేవుడు మనలను ఇతరులకొరకు ఖరీదైన అతడును పోయామని చెప్పలేదు అయితే వారి నిజమైన అవసరమును తెలుసుకొని వారికి షాయాము చేయమని మాత్రమే చెప్పెను. క్రీస్తు చెప్పినట్లు బీదలతో మనముండాలని ఏ మతము కానీ రాజకీయ పార్టీ కానీ మనకు చెప్పలేదు. మన ప్రేమ చిన్నగా మరియు మనకొరకు ఆలోచన పెద్దదిగా ఉన్నది.ఎందుకంటె ఈ లోకములో ఎక్కడ కూడా సామాజిక సేవ లేదు అయితే అందరూ వారికే బహుమానములు కావాలని చూస్తున్నారు. మనము వేళ్ళు ప్రతి స్థలంలోనూ తిరస్కరించబడినవారుగా వ్యతిరేకించబడినవారుగా ఉండాలి. ఎక్కడైతే నీవు బీదలను చూస్తావో వారిలో క్రీస్తును కనుగొనుము.

ఆ మనుషుల హృదయములు కఠినమని యేసుకు తెలుసు. అయితే వారికొరకు ఆయన చనిపోవుటకు వచ్చెను. మరియు మరియా తన అత్తరు చేత అతని పాదములు కడుగుటకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించెనని తెలుసు.

ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఒకరి హృదయములోనికి వచ్చునో అప్పడు వాని జీవితములో అద్భుతకార్యములు జరుగును. మరియా అతని దగ్గరకు వచ్చిన అతిధిని గౌరవించాలని ఉద్దేశించెను, కనుకనే పరిశుద్ధాత్ముడు ఆ అతిధి పాదములు నూనెతో కడుగుమని ప్రేరేపించెను. ఈ chedipoyina లోకముతో తన మంచితనంతో మరియు తన కృపతో మార్చియున్నాడు.

ప్రార్థన: లాజరును లేపినందుకు ప్రభువా మేము మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాము. నీకు సమాధిని బట్టి ఏవిధమైన భయము లేదు. మేము మాకు కలిగిందంతాతో నిన్ను మహిమపరచునట్లు నీ నడిపింపు మాకు దయచేయుము. మమ్ములను ద్వేషమునుంచి, కలహములనుంచి, మరియు కపటము నుంచి కాపాడు. నీ ప్రేమచేత నింపి మరియు త్యాగముచేసే మార్గములోనికి నడిపించుము.

ప్రశ్న:

  1. మరియు యొక్క అభిషేకమును యేసు ఎందుకు అంగీకరించెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:29 AM | powered by PmWiki (pmwiki-2.3.3)