Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 006 (The Baptist prepares the way of Christ)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
A - క్రీస్తు లో శరీరధారియైన దేవుని వాక్యము (యోహాను 1:1-18)

2. బాప్తీస్మమిచ్చు యోహాను క్రీస్తు కొరకు మార్గమును సిద్ధపరచుట (యోహాను 1:6-13)


యోహాను 1:9-10
9 నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది, 10 ఆయన లోకములో ఉండెను, లోక మాఆయన మూలముగా కలిగెను గాని లోకమాయణను తెలిసికొనలేదు.

క్రీస్తు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడని పరిశుద్ధాత్ముడు ఎన్నో వందల సంవత్సరముల ముందే చెప్పియున్నాడు . పాత నిబంధన గ్రంథ వాక్యములు క్రీస్తు వస్తున్నాడు అనే అనేక వచనములతో ఉన్నది. అందుకే యెషయా " చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది" (యెషయా 60:2).

మన వాక్యంలో "లోకము" అను పదము నాలుగు సార్లు ప్రత్యేకించబడినది. అందుకే యోహాను ఈ మాటకు అర్థముగా," మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు యెరుగుదుము" (1 యోహాను 5:19)

ఆదియందు ఈ లోకము చెడ్డదిగా లేదు ఎందుకంటె దేవుడు దీనిని కలుగ చేసినప్పుడు ఇది మంచిదై ఉన్నది కనుక. తన సౌందర్యముతో మరియు మంచితో నింపబడినది. "దేవుడు తానూ చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగా నుండెను" (ఆదికాండము 1:31). దేవుడు మనిషిని తన సొంత పోలికచేత చేసియున్నాడు కనుక తల్లితండ్రులు ఒక అద్దమువలె సృష్టించబడ్డారు.

అయితే గర్వము మనిషిని ఆవరించినప్పుడు దేవునికి వ్యతిరేకమైన స్వభావము కలిగి , దేవుని బంధమునుండి వేరుపరచబడి వారి హృదయములను చీకటిలోకి త్రోసివేసినవారైరి. ఎప్పుడైతే దేవుని నుంచి దూరమైనప్పుడు, చెడ్డది అనునది వానిని కమ్మును, అందుకే దావీదు అన్నట్లు " దేవుడు లేదని బుద్దినీనులు తమ హృదయములో అనుకొందురు,వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు. మేలు చేయు వాడొకడును లేదు" (కీర్త14:1).

సూర్యుడు ఏ విధముగా నైతే లోకమంతటికి వెలుగును ఇచ్చుటకు వచ్చునో అదేవిధముగా క్రీస్తు కూడా ఈ చెడిపోయిన లోకమును వెలిగించాలని ఉద్దేశము చేత వచ్చియున్నది యోహాను సాక్ష్యమిచ్చుచున్నాడు. క్రీస్తు వెలుగు ఈ లోకములోనికి గ్రుడ్డిగా చీకటిని పారద్రోలుటకు రాలేదు కానీ ఈ లోకములో ఉన్న ప్రతి మనిషిని వెలిగించుటకు వారి జీవితములో వెలుగును ప్రకాశింపజేయుటకు వచ్చియున్నది చెప్పియున్నాడు. క్రీస్తు ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ ఈ లోకమునకు ఒక రక్షకునిగా వచ్చియున్నాడు. కనుక ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క వెలుగుతో వెలిగింపబడవలెను. లేనియెడల వారు చీకటిలోనే ఉంటారు. ఎందుకంటె క్రీస్తు మాత్రమే ఒక సత్యమైన వెలుగై ఉన్నాడు వేరెవ్వరు ఆయన వాలే లేరు కాబట్టి. ఎవరైతే ఈ సువార్తను మరియు ఈ వెలుగును అంగీకరిస్తారా వారు మంచి చేత మార్పు పొందిన వారుగా ఉంటారు.

"సృష్టికర్త ఈ లోకమునకు వచ్చాడు", అను మాటకు అర్థము తెలుసా ? యజమానుడు వచ్చు నప్పుడు ఎవరు సిద్ధముగా ఉంది సిద్దపడుటకు త్వరగా లేస్తారు ? ఆయన సత్యమును చదివి ఆయన గురిని ఎవరు చదువుతారు ? ఈ లోక వ్యర్థమైన గురిని వదిలి దేవునిని ఆహ్వానిస్తారు? దేవుడు ఎప్పుడు వస్తాడో ఏ ఘడియయందు వస్తాడో తెలిసినవారు ఎవరు ?

ప్రభువు హఠాత్తుగా పాపుల దగ్గర కనబడి ఉండి, వారు ఇంకను వస్తాడు అని తెలుసుకోకమునుపే వారిమధ్యన వస్త్తాడు . క్రీస్తు తన గొప్పతనమును, శక్తిని మరియు అతనికి మహిమను చూపుటకు రాలేదు కానీ తన ప్రేమను తన తగ్గింపు స్వభావమును తెలియపరచుటకు వచ్చియున్నాడు. సృష్టి చేయబడినప్పటినుంచి గర్వము అనునది మనిషికి నాశనమై ఉండగా, క్రీస్తు ఆ నాశనమును తొలగించుటకు తనను తానూ తగ్గించుకొనెను. ఎందుకంటె సాతాను కూడా దేవిని వాలే శక్తిగలిగి ఉండాలని అనుకున్నాడు. అయితే క్రీస్తు చాలా బలహీనమైన శిశువుగా కనబడి ఒక తొట్టిలో పడుకున్నవాడిగా ఉన్నాడు. కనుకనే తనను తానూ తగ్గించుకొని మనుషులందరి రక్షణకొరకు తన తగ్గింపుస్వభావమును చూపించువాడుగా ఉన్నాడు.

వినండి, ఇవన్నీ తెలిసినతరువాత మనము ఈ లోకము వినండి మాటను విని దాని ప్రకారము మనము ఉండవలెను. దేవుని కుమారుడు మానవద్దకు వచ్చి నివాసము చేసెను అని తెలిసికొని అందరి మధ్యన ఉండెను. అయితే వారి మధ్యన దేవుడే ఉండి కార్యములను చేసియున్నాడని మరియు వారికి ఒక రక్షకుడుగా ఉన్నాడని తెలిసికొనలేకపోయిరి.

ఈ బాధకలిగించే సత్యముద్వారా దేవుని రాజ్యము చాలా ముఖ్యమైనదిగా మనము ఎంచవలెను. అనగా మనకు కలిగిన జ్ఞానముచేత మనకు ఉన్న సామర్థ్యము చేత మనము దేవునిని అర్థము చేసుకోలేము. మనకు కలిగిన ప్రతివిధమైన జ్ఞానము మంకు ప్రభువైన క్రీస్తు ద్వారా తండ్రియైన దేవుని చేత వచ్చిన బహుమానంగా ఉండి పరిశుద్దాత్ముడైన దేవుని సహాయముగా ఉండి విశ్వాసముచేత ఆ సత్యమును తెలుసుకున్నవారముగా ఉన్నాము. కనుక మనము మన పొరపాటును బట్టి పచ్చాత్తాపపడినవారిగా ఉండి మన మనసులను మన ప్రాణములను కాపాడుకొనువారిగా ఉండాలి. కనుక మనమందరము మన హృదయములను ఒక పుష్పము సూర్యుని కిరణాలు ఏ విధముగా తెరుచుకుంటుందో అదేవిధముగా మన హృదయములను క్రీస్తు వెలుగు కొరకు తెరవాలి. ఈ విధముగా క్రీస్తు లో విశ్వాసము దేవుని జ్ఞానమునకు మేరీ విస్వసమునకు అవకాశముగా ఉందును.

ప్రార్థన: ప్రభువా మీరు ఈ లోకమునకు వచ్చినందుకు మీకు కృతఙ్ఞతలు. ప్రజలను తీర్పు తీర్చుటకు రాక వారి హృదయములను నీ వెలుగుతో మరియు నీ రక్షణతో నింపబడునట్లు చేసియున్నావు. అయితే మేము గ్రుడ్డివారము కనుక మమ్ములను క్షమించి మాకే తగ్గింపు కలిగిన హృదయమును దయచేసి , మా కాను దృష్టిని తెరచి మిమ్ములను చూసి మీ శక్తి చేత మరియు పరిశుద్ధాత్మచేత నింపుము.

ప్రశ్న:

  1. క్రీస్తు వెలుగుకు మరియు చీకటి లోకమునకు మధ్య తేడా ఏమి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:12 AM | powered by PmWiki (pmwiki-2.3.3)