Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 005 (The Baptist prepares the way of Christ)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
A - క్రీస్తు లో శరీరధారియైన దేవుని వాక్యము (యోహాను 1:1-18)

2. బాప్తీస్మమిచ్చు యోహాను క్రీస్తు కొరకు మార్గమును సిద్ధపరచుట (యోహాను 1:6-13)


యోహాను 1:6-8
6 దేవుని యొద్ద నుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను;అతని పేరు యోహాను. 7 అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతనా వచ్చెను. 8 అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను.

దేవుడు మనుషులను ఈ లోక చీకటిలోనుంచి పిలుచుటకు బాప్తీస్మమిచ్చు యోహానును ఈ లోకమునకు పంపియున్నాడు. ఎందుకంటె అన్ని పాపములు చీకటిలోనే చేయబడుతున్నాయి కాబట్టి. అయితే ఎవరైతే తమ పాపములను పశ్చాత్తాపముతో ఒప్పుకొని ఉన్నప్పుడు ఆ పగిలిన హృదయమును దేవుడు తన వెలుగుచేత నింపబడును. మరి నీ విషయమేమి ? నీవు వెలుగులోనికి వచ్చియున్నావా లేక ఇంకా చీకటిలోనే ఉన్నావా?

బాప్తీస్మమిచ్చు యోహాను ప్రజల యొక్క హృదయ పరిస్థితులను తెలియపరచి దేవునితో వారికీ ఉన్న సంబంధమును మరియు అందరు చేదు హృదయములు కలిగి ఉన్నారని తెలియపరచియున్నాడు. ఎందుకంటె వారు అందరు పశ్చాత్తాపము కలిగి దేవుని ఉగ్రత దినమునుండి విడిపింపబడవలెను కనుక. అప్పుడు పశ్చాత్తాపము కొరకు అరణ్యములో ఉన్న వారందరు పరుగిడి తమ పాపములను ఒప్పుకొనువారుగా ఉన్నారు. అప్పుడు వారు తమ పాపములను బహిరంగముగా ఒప్పుకొని వారి ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఉండులాగున వారికి బాప్తీస్మము ఇవ్వమని యోహానును వారు అడిగి వారికి నూతన జీవితము పొందినట్లుగా ఉండిరి.

దేవుడు బాప్తీస్మమిచ్చు యోహానును ఆ ప్రజలందరి కొరకు వారు పాపములనుండి విముక్తులనుగా చేయుటకు మరియు రాబోవు క్రీస్తు కొరకు వారు సిద్ధపాటు కలిగిఉండులాగున యోహానును వాడుకొనెను. ఎందుకంటె పాత నిబంధన కాలపు ప్రజలకు వారి కొరకు ఎవరు వస్తున్నారో వారికి తెలిసియున్నది. ఎందుకంటే ప్రవక్త అయిన యెషయా ఈ విధముగా చెబుతున్నాడు. "చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును" (యెషయా 9:2) అదేవిధముగా, "నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను" (యెషయా 60:1). అందుకే యోహాను ఈ వెలుగు వచ్చియున్నది కేవలము పాత నిబంధన వారికి మాత్రమే కాక ఎవరైతే క్రీస్తు కొరకు వారి హృదయములను తెరచి ఉంటారో వారికి కొరకు వచ్చియున్నది. అందుకే ఆసియా ఖండములో ఉన్న అనేకులు యోహాను మృతి పొందిన తరువాత కూడా అనేక సంవత్సరములు ఈ వాక్యము ప్రకారము నడుచుకున్నారు.

కొన్ని వేలమంది యోహానును వెంబడించి ఉండిరి ఎందుకంటె ఆటను క్రీస్తు యొక్క మార్గమును సిద్ధపరచుటకు వచ్చి యున్నాడని వెంబడించువారుగా ఉండిరి. అయితే వారిని తన వైపు త్రిప్పుకొనక క్రీస్తు కొరకు సిద్ధపాటుచేసియున్నాడు. కనుక ప్రతి దేవుని దాసుడు వారికొరకు ప్రజలను త్రిప్పుకొనక కేవలము క్రీస్తు కొరకు ప్రజలను సిద్ధపాటు చేయాలనీ నేర్చుకోవచ్చు.

యోహాను యొక్క ముఖ్య సేవ ఉద్దేశము ప్రజలను తన వైపు చేసికోవడము కాదు కానీ క్రీస్తు వైపు త్రిప్పుకొనుటయే. ఎందుకంటె ప్రజలు తననే క్రీస్తు అని అనుకొనియున్నారు కనుక. అయితే దేవుని మార్గమును సిద్దము చేయువాడుగా ఉన్నాడు. ఎందుకంటె తన తరువాత వచ్చు క్రీస్తు వారికి పరిశుద్ధాత్మలో బాప్తీస్మమిచ్చునని యోహానును తెలుసు. యోహానును కేవలము బాప్తీస్మము మాత్రమే అవసరము అని అనుకొనలేదు అయితే క్రీస్తు ద్వారా ప్రజల హృదయ లోతులలో కూడా మార్పు అవసరమని ఎరిగియున్నాడు. దేవుడు యోహానును ప్రజల హృదయాలను మార్చు అధికారము ఇవ్వలేదు, ఎందుకంటె పాత నిబంధన గ్రంధములో కూడా ఎవ్వరికీ ఇటువంటి అధికారము లేదు కనుక. ఈ అవకాశము కేవలము ఎవ్వరైతే తమ హృదయమందు నూతన మార్పును కోరుకొనిఉంటారో వారికి మాత్రమే తన వెలుగు క్రీస్తు వారికి ఇస్చ్చి యున్నాడు. అందుకు యోహాను ప్రజలను క్రీస్తు పైన విశ్వాసము కలిగి ఉండువారుగా నడిపించియున్నాడు ఎందుకంటె విశ్వాసము మాత్రమే వారికి నూతన జీవితము ఇవ్వగలదు కనుక. యోహాను యొక్క ముఖ్య సేవ ఉద్దేశము ప్రజలను తన వైపు చేసికోవడము కాదు కానీ క్రీస్తు వైపు త్రిప్పుకొనుటయే. ఎందుకంటె ప్రజలు తననే క్రీస్తు అని అనుకొనియున్నారు కనుక. అయితే దేవుని మార్గమును సిద్దము చేయువాడుగా ఉన్నాడు. ఎందుకంటె తన తరువాత వచ్చు క్రీస్తు వారికి పరిశుద్ధాత్మలో బాప్తీస్మమిచ్చునని యోహానును తెలుసు. యోహానును కేవలము బాప్తీస్మము మాత్రమే అవసరము అని అనుకొనలేదు అయితే క్రీస్తు ద్వారా ప్రజల హృదయ లోతులలో కూడా మార్పు అవసరమని ఎరిగియున్నాడు. దేవుడు యోహానును ప్రజల హృదయాలను మార్చు అధికారము ఇవ్వలేదు, ఎందుకంటె పాత నిబంధన గ్రంధములో కూడా ఎవ్వరికీ ఇటువంటి అధికారము లేదు కనుక. ఈ అవకాశము కేవలము ఎవ్వరైతే తమ హృదయమందు నూతన మార్పును కోరుకొనిఉంటారో వారికి మాత్రమే తన వెలుగు క్రీస్తు వారికి ఇస్చ్చి యున్నాడు. అందుకు యోహాను ప్రజలను క్రీస్తు పైన విశ్వాసము కలిగి ఉండువారుగా నడిపించియున్నాడు ఎందుకంటె విశ్వాసము మాత్రమే వారికి నూతన జీవితము ఇవ్వగలదు కనుక.

అపొల్లోస్ అను జ్ఞానీ యోహాను బోధనలను పాటించి క్రీస్తు కొరకు ప్రకటించి క్రీస్తు యొక్క నూతన నిబంధన యందు శక్తి కలిగి ఉండెను. క్రీస్తును ఇంకను అనుభవించక మునుపే క్రీస్తును ప్రకటించెను. ఎప్పుడైతే తనకు తానూ క్రీస్తుకు సమర్పించుకొన్నాడో అప్పుడు క్రీస్తు వెలుగు ఆయన హృదయములో వచ్చి నప్పుడు దేవుని వెలుగై ఉన్నాడు (అపోస్త 18:24-28)

ప్రార్థన: ప్రభువైన యేసు నీవు ఈ లోకమునకు వెలుగై ఉన్నందుకు నీకు మేము కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాము. మా చీకటి హృదయములను తెరచి నీ వెలుగును ప్రకాశింపచేసి మా పాపములన్నిటినీ కడిగినందుకు నీకు కృతఙ్ఞతలు. మమ్ములను వెలుగునకు పిల్లలుగా చేసి నీ నిత్యజీవమును మాకు దయచేసియున్నందుకు నీకు కృతఙ్ఞతలు. మా స్నేహితులు మరియు మా బంధువులకు కూడా నీ వెలుగును ప్రకాశింపచేసి వారు కూడా నూతన నిత్యా జీవితమును పొందినట్లుగా చేయుము.

ప్రశ్న:

  1. బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క ముఖ్య గురి ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:11 AM | powered by PmWiki (pmwiki-2.3.3)