Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 004 (The word before incarnation)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
A - క్రీస్తు లో శరీరధారియైన దేవుని వాక్యము (యోహాను 1:1-18)

1. శరీరధారి కాకమునుపు దేవుని వాక్యము యొక్క పని (యోహాను 1:1-5)


యోహాను 1:5
5 వెలుగు చీకటిలో ప్రకాశించెను అయితే చీకటి దానిని జయించలేకపోయెను

దేవునితో ప్రతిదీ సంపూర్ణ వెలుగును మరియు అందముగా ఉన్నది. అతనిలా ఏవిధమైన చీకటి లేదు, ప్రతిదీ మంచిదై మరియు పరిశుద్ధతకలిగి ఉండెను. పరిశుద్దాత్ముడైన క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశించునదిగా మరియు శుద్దమైనదిగా ఉంది అది స్వస్థపరచునదిగా ఉండెను.

క్రీస్తు యొక్క వెలుగు ఈ దినాలలో అందరి జీవితాలలో వెలుగునిచ్చేదిగా ఉండి చీకటి మధ్యలో వెలుగునిచ్చేదిగా ఉన్నది. మనము గమనించినట్లయితే క్రీస్తు వెలుగు ఈ లోకములో ఉన్న ప్రతి విధమైన చీకటిని వెళ్లగొట్టి అన్నిటిని తన వెలుగుచేత నింపబడినట్లుగా ఉన్నది. అందుకనే యోహాను మనకు ఈ రహస్యమును మరుగుచేసి కేవలము క్రీస్తు మనలను ఈ లోక చీకటిలో ఒక వెలుగునిచ్చు వారుగా చేసి మనలను చీకటిని జయించువారినిగా చేసియున్నాడు. అందుకే ఈ లోకములో ఉన్న ప్రతి జీవ రాసి మరియు మనుషులందరూ ఈ లోక చీకటిలోనుంచి బయటకు వచ్చువారుగా ఉండాలి.

నీవు అడగవచ్చు : ఒకవేళ క్రీస్తు ఈ సృష్టిని మంచి ఉద్దేశ్యముతో చేసియున్నట్లైతే మరి చీకటి ఏ విధముగా ఉన్నది అని ? మనము దేవుని పోలిక లో సృష్టించబడ్డాము కనుక ఎందుకు తన మహిమలోనుండి వెలుపలకు వచ్చియున్నామని?

యోహాను సాతానును పేరుపెట్టి పిలువలేదు, సాతాను దేవునికి లోబడియుండినను పిలువలేదు. ఎందుకంటె సాతాను క్రీస్తుకు ఎప్పుడు వ్యతిరేకముగా ఉన్నాడు కనుక. సాతాను దేవుని కంటే ఘనత పొందునట్లు ఉద్దేశించినాడు కనుక వెలుగును పోగొట్టుకొనువాడుగా ఉన్నాడు. మరియు క్రీస్తు కంటే ఎత్తైన స్థలములో ఉండాలని కోరుకొని, గర్వము కలిగి ఉన్నాడు కనుకనే సాతాను చీకటికి అధిపతి అయి ఉన్నాడు.

ప్రాయమైన సహోదరుడా నీ గురి ఏమిటి ? నీవు దేవుడు లేకుండా ఘనత గౌరవము పొందాలని అనుకున్నావా? ఇదే నిజమైతే నీవు చీకటికి చెందినవాడిగా ఉన్నావు. అదేవిధముగా సాతాను ఒంటరిగా చీకటిలో ఉండక తనతో పాటు కొన్ని కోట్ల మందిని చీకటికి వారసులుగా చేసియున్నాడు. నీ వీధి నుంచి దాటిపోయే చీకటి సంబంధాలను బట్టి ఆలోచనకలిగి ఉండు. నీవు వారి కన్నులలో చీకటిని చదువుతున్నావా లేక వెలుగును చదువుతున్నావా? వారి హృదయములు దేవుని ఆనందముతో నిండియున్నాయా లేక సాతాను బంధకములతో నిండియున్నాయా?

చెడు హృదయము దేవుడిని వ్యతిరేకిస్తుంది ఎందుకంటె పరిశుద్ధమైన వెలుగు తీర్పు తీరుస్తుంది కనుక. సాతాను వారు హృదయములను వెలుగునకు తమ హృదయములను తెరువకుండునట్లు వారిని తన స్వాధీనములో పెట్టుకొనియున్నాడు. చాలా మందికి క్రీస్తు యొక్క వెలుగు తెలియక సూర్యుని వెలుగే అని అనుకోని ఉంటారు కనుక వారికి క్లుప్తముగా క్రీస్తు వెలుగును బట్టి చెప్పాలి.

అయితే చాలా మంది క్రీస్తు మహిమను మరియు ఆయన శక్తిని తెలుసుకొనక ఉంటారు. వారికి వారే మోసపుచ్చుకొనుచూ క్రీస్తు యొక్క వాక్యమును వ్యతిరేకించి సత్యములో ప్రవేశించాక ఉండెదరు. వారి పాపములను వారు ఒప్పుకొనక వారి జీవితాలలో చీకటిని పారద్రోలి వెలుగుని నింపబడలేకపోవుచున్నారు. వారు వారి పాపములను ఒప్పుకొనక వారిని వారు మోసపుచ్చుకొంటున్నారు. కనుకనే వారు రాయి లాంటి హృదయము కలిగినవారుగా ఉండి క్రీస్తు కృపలో ఉండక గ్రుడ్డివారుగా ఉంటున్నారు. కనుక నీవు ఎవరు ? వెలుగు క్రీస్తు నుంచి లేక చీకటి చెడ్డవాడినుంచా ?

ప్రార్థన: ఓ ప్రభువా నీవు లోకమునకు వెలుగుగా ఉన్నావు కనుక నిన్ను మేము ప్రేమతో వెంబడించి, చీకటిలో నడువక నీ వెలుగును పొందుకొనువారిగా ఉంటాము. మేము చీకటిలో ఉండగా మమ్ములను నీవు మరువక నీ వెలుగులోనికి పిలిచియున్నందుకు నీకు కృతఙ్ఞతలు. ఈ లోకములో ఉన్న ప్రజలందరికి నీ వెలుగు చేత నింపి అందరిని నీవు వెలిగించు !

ప్రశ్న:

  1. ఆత్మీయమైన పద్దతిలో చీకటికీ వెలుగుకు మధ్యన ఉన్న తేడా ఏమిటి ?

చీకటి అను మరణములో నడుచువారికి గొప్ప వెలుగును చూసిఉన్నారు;
వారిపైన గొప్ప వెలుగు ప్రకాశించియున్నది
(యెషయా 9:2)

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:10 AM | powered by PmWiki (pmwiki-2.3.3)