Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 069 (Summary of the Commandments Concerning Men)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 3 - క్రీస్తును వెంబడించు వారిలో దేవుని యొక్క నీతి కనబడుట (రోమీయులకు 12:1 - 15:13)

6. మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు (రోమీయులకు 13:7-10)


రోమీయులకు 13:7-10
7 ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి. 8 ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. 9 ఏలా గనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. 10 ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.

అపొస్తలుడైన పౌలు దినాలలో రోమా వారి దొరతనం మరియు ఆర్థికపరమైనవి విశ్వాసులకు ప్రాముఖ్యమైనవి కావు, ఎందుకంటె క్రైస్తవులు చాల కొద్దిమంది ఉండిరి, కనుక వారి ధర్మశాస్త్రము గురించి ఏవిధమైన భావన వారికి ఉండలేదు. కనుకనే అపొస్తలులు క్రైస్తువులకు వారి బాధ్యతలను మరియు వారి శునకమును ఏవిధమైన మోసము చేయక నీతి కలిగి చేయుమని చెప్పిరి, కనుక వారి యొక్క ప్రధానమైన బాధ్యత యేదనగా, పాపులకొరకు మరియు ప్రభుత్వాల కొరకు వారు యెడతెగక ప్రార్థన చేయడమే. అయితే రోమా లో సహజమునకు వ్యతిరేకముగా కార్యములు అక్కడ జరిగినవి. కనుకనే వారు క్రీస్తును వ్యతిరేకించి మరియు ఎవరైతే కైసరును ఆరాధించక ఉండు క్రైస్తవులందరినీ కూడా చంపివేయమని ఆజ్ఞాపించిరి, మరియు వారు వారిని మృగములు తినుటకు బహిరంగ ప్రదేశములో వారి శవాలను విసిరి వేసిరి.

పౌలు కూడా రోమా పౌరుడుగానే జన్మించాడు. కనుకనే అతను తన ప్రాంతమునకు ఒక శక్తికలిగిన బాధ్యత చూపాడు, మరియు క్రీస్తు మాటలను అనుసరించారు, "కైసరు యొక్క కార్యములను కైసరుకు చేయుము, మరియు దేవుని కార్యములు దేవునికి చేయుము". మరియు సంఘము గూర్చి అతనికి ఈ లోకమంతటిమీద అధికారము ఉన్నాడని తెలుసు, అందుకే యేసు చెప్పెను: "మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను" (యోహాను 13:34-35).

యేసు ఏవిధముగా అయితే శిష్యులను ప్రేమించాడో అదేవేహిధముగా ప్రతి క్రైస్తువుడు కూడా ప్రేమించి ఉన్నట్లయితే వారు యేసు ఆజ్ఞలను నెరవేర్చినట్లు. ఇది సంఘము యొక్క ఆజ్ఞ, మరియు దీనికి పరిశుద్ధాత్ముడు అవసరమై ఉన్నాడు. అదేసమయములో, మోషే యొక్క ఆజ్ఞలను క్రీస్తు పడగొట్టలేదు: "నిన్ను వాలే నీ పొరుగువారికి ప్రేమించుము" (లేవి19:18).

పౌలు ఈ అగణాలను పది ఆజ్ఞల రెండవ భాగముగా వివరించి ఉన్నాడు, అందుకే ఈ విధముగా చెప్పెను: ఎవ్వరినీ ద్వేషించి చంపవద్దు. వ్యభిచారము చేయవద్దు. అపరిశుద్ధముగా ఉండవద్దు. దొంగతనము చేయవద్దు, అయితే కష్టపడి. ఇతరుల ధనము చూసి ఈర్షపడకు, అయితే దేవుడు నీకు ఇచ్చిన బహుమానమును బట్టి గర్వించు.ఈ విధమైన ఆజ్ఞలన్ని కూడా నీవు నీ పొరుగువారికి ప్రేమించుటకు వ్రాయబడి ఉన్నవి.

అపొస్తలుడు వీటిని బట్టి ఉత్సాహముతో చెప్పలేదు, అయితే వ్యభిచారము చేయుట విడిచునది ప్రాముఖ్యమైన కార్యము అని చెప్పెను. నిజమైన, మరియు స్వచ్చమైన ప్రేమ అనునది నీవు ఎప్పుడైతే శారీరక వాంచ్చలను బట్టి బైటికి వస్తావో అప్పుడు అవి నీలో కనబడును.

స్వలాభములో నిజమైన ప్రేమ కనపడదు, అయితే అవసరంలో ఉన్నవారిని ఆడుకొనుటలో నిజమైన ప్రేమ కనబడును. మనము ఎప్పుడైతే ఇతరుల కష్టాలలో, బాధలలో, కన్నీళ్లలో మరియు శ్రమలలో పాలుపంచుకోవాలి అనుకుంటామో, అనగా దానికి అర్థము మనము వారిని ఈ పారిశ్తిథులలోనికి త్రోయకూడదు అయితే వాటిని మనము వారితోపాటు అనుభవించి వాటిని వారితో పాటుగా జయించాలి.

"నీ పొరుగువారు ఎవరు?" అనే ప్రశ్న నీవు వేసుకోవాలి, దీనికి యేసు సమాధానమును యిచ్చియున్నాడు. దీనికి అర్థము పొరుగు వారు అనగా కేవలము నీ రక్తసంబంధీకులు మాత్రమే కాదు, అయితే ఎవరైతే నీకు దగ్గరగా ఉండి మరియు నీ ద్వారా మంచిని కోరుకొనుచున్నారో వారే నీ పొరుగువారు. దీనిలో సువార్త పరిచర్య కూడా ఇమిడి ఉండును, "మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను" (అపోస్త:12).

ప్రార్థన: ఓ ప్రభువైన యేసు క్రీస్తు, నీ సంఘమునకు నూతన ఆజ్ఞను ఇచ్చినందుకు నీకు మేము ఆరాధన చెల్లిస్తున్నాము, మరియు నీ పరిశుద్ధాత్మను కూడా యిచ్చియున్నాడు. మేము ఒకవేళ కఠినమైన హృదయముచేత నిన్ను నొప్పించి ఉన్నట్లయితే దయతో మమ్ములను క్షమించుము. మేము ప్రార్థన చేసే మా స్నేహితులను అర్థము చేసుకోను జ్ఞానమును దయచేయుము, మరియు మేము ఎక్కడ ఉన్న జ్ఞానముకలిగి నిన్ను సేవించునట్లు మాకు సహాయము చేయుము.

ప్రశ్నలు:

  1. "నిన్ను వాలే నీ పొరుగు వారిని ప్రేమించవలెను" అను ఈ ఆజ్ఞను పౌలు ఏవిధముగా వివరించాడు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:39 AM | powered by PmWiki (pmwiki-2.3.3)