Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 059 (Would that the Salvation in the Believers of the Gentiles incite Jealousy in the Children of Jacob)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు, ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)
5. యాకోబు యొక్క పిల్లల నిరీక్షణ (రోమీయులకు 11:1-36)

b) యాకోబు పిల్లలకు అన్యుల రక్షణ వారికీ అసూయగా ఉన్నదా (రోమీయులకు 11:11-15)


రోమీయులకు 11:11-15
11 కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లన రాదు. 12 వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును! 13 అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి, 14 వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘన పరచుచున్నాను. 15 వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా? 

పౌలు తన రక్త సంబంధమైన సహోదరులు మరియు సహోదరులు ఎలా అయితే అతను ప్రేమించెనో అదేవిధముగా అతను ఉన్న దేశమును కూడా ప్రేమించెను. దేవుడు యేసు క్రీస్తును తిరస్కరించి మరియు అతని యెడల లోబడక ఉన్నవారిని మాత్రమే శిక్షిస్తాడని అనుకోలేదు, అయితే అతను ఎన్నుకొనబడిన వారు అనగా పాత నిబంధన ద్వారా ఏర్పాటుచేయబడిన వారిని, మరియు అదేసమయములో నూతనముగా తన దేశములో ఎన్నుకొనబడినవారిని కూడా శిక్షించును. అవిశ్వాసులైన అన్యులకు పడిపోయిన యూదులు రక్షణను పొందుటకు కారణమైనారు ఎందుకంటె ఇది వారికొరకు ముందుగానే సిద్దము చేయబడినది, మరియు ఈ రక్షణ వారికి క్రీస్తు మీద కలిగిన విశ్వాసమును బట్టి కలిగినది.

ఈ రక్షణను అన్యులందరికి ప్రకినందున యాకోబు సంతతికి ఈర్ష్య కలిగినది. ఈ విధమైన ఈర్ష్యను పౌలు ఆ యూదుల హృదయాలలో చూసి ఉన్నాడు; పరిశుద్ధముగా లేనివారు కూడా క్రీస్తు సన్నిధిలో ఉన్నారని జ్ఞాపకము చేసికొని, దేవునిద్వారా సమాధానమును పండుకొని, పరిశుద్ధాత్మతో ఆనందముచేత నింపబడి ఉండిరి, కనుక వారు వారి శత్రువులను కూడా ప్రేమించిరి. అప్పుడు అబ్రాహాము యొక్క సంతతిలో భక్తి గల దరిద్రులు కూడా వారి నుంచి కొంచెము పొందుకొనిరి అని, అయితే అది వారి యొక్క ఆచారము కాదు అయితే అది నేరుగా దేవుని నుంచే పొందుకొనిరి. ఖఠినముగల యూదులు అవిశ్వాసులు కూడా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు యొక్క ఆశీర్వాదములు కూడా వారిలో ఉన్నందున వారు ఈర్ష్య పడిరి. అతని ప్రజలు వారి మనసులు మర్చి వారికున్న దానిని ఇతరులతి పంచుకొనెదరని నిరీక్షించెను. అందుకే ఈ విషయమును బట్టి క్రీస్తు తన శిష్యులతో: "మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి" (మత్తయి 5:14-16).

పౌలు యూదుల కొరకు తన ప్రసంగ ప్రణాలికను మర్చి ఇలా చెప్పెను: ఒకవేళ నలిగినా యూదులు అలక్ష్యము కలిగి ఉండి ఒక ఆశీర్వాదముగా ఉన్నట్లయితే, మరియు అన్యుల రక్షణ అధికమైనయెడల, అప్పుడు ఈ లోకమంతటిలో వారి సంతతి ఇంకా ఎంతో గొప్పగా వ్యాపించును! ఒకవేళ యూదులందరు కూడా రక్షించబడినట్లైతే అప్పుడు వారి యొక్క శక్తి కలిగిన విశ్వాసము మరియు వారి ఆశ ఈ లోకములో ఒక శక్తిగా మారును, అప్పుడు ఈ లోక ఎడారిలో ఒక నీరు ప్రవహించునట్లుగా ఉండును, అప్పుడు వారిని వారి పాపములో ఒక జీవము కలిగిన పరదేశుగా వారి మధ్యలో ఉండును.

ఈ విషయమును బట్టి క్రైస్తువులు యాకోబు పిల్లలను ప్రేమించుదురని పౌలు చెప్పెను, మరియు వారి గర్వము నుంచి, ఖఠినము నుంచి తగ్గింపు హృదయము కలిగి మరియు సాత్వికము కలిగి ఉందురని చెప్పెను (మత్తయి 11:28-30).

పౌలు రోమా లో ఉన్న అన్యులైన విశ్వాసులను కదిలించేను. యూదులను అతను ఆత్మీయముగా సత్యముగా ఎదుర్కొని ఇలా చెప్పెను: యేసు నన్ను యూదులకు ఒక బోధకునిగా పంపలేదు, అయితే అన్యులకు ఒక అపొస్తలునిగా నియమించాడు, ఎందుకంటె కొన్ని వందలమంది అపరిశుద్దమైన దేవుళ్ళు సాతాను ఆత్మచేత నింపబడి ఉన్నాయి. కనుక నేను ఆనందముతో ఈ పనిని చేస్తూ, వారి భాషను నేర్చుకొని, వారి ఆచారములు గూర్చి అలోచించి, యేసు ఆచారములు వారి అపరిషుద్దమైన దేవతల యొద్దకు మరియు బహిరంగ వ్యభిచారములోనికి తీసుకొనివచ్చాను.

పౌలుకు యూదులతో క్రీస్తు సువార్తను ప్రకటించుటకు అవకాశము దొరికెను. ఆసియా మరియు ఐరోపా లో ఉండు క్రైస్తవుల ద్వారా అబ్రాహాము యొక్క సంతతికి ఆశ్చర్యమును కలిగించాలని అనుకొనెను. ఇది అతను వారిలో ఆత్మీయ అవసరతను బట్టి చేసెను, అప్పుడు వారి చేదు మార్గములనుండి బయటకు వచ్చెదరని, మరియు అన్యుల నుంచి ఒక ఫాఠమును నేర్చుకొనెదరని, మరియు మృతిని జయించి తిరిగి లేచిన క్రీస్తును వెంబడిస్తారని ఉద్దేశించెను. పాత నిబంధనను తిరస్కరించినవారు తిరిగి నూతన నిబంధనను పొందుకొంటారని అనుకొనెను, ఎందుకంటె వారికొరకు దేవుడు ఇచ్చిన వాగ్దానములు ఇప్పటికీ కూడా అదేవిధముగా ఉన్నవి కనుక.

ఒకవేళ రాజు అయినా క్రీస్తును తిరస్కరించిన వారికీ ఈ లోకము మరియు దేవునికి మధ్యన సమాధానము ఉన్నప్పుడు, మరి ఆత్మీయముగా పాపములో మృతి పొందినవారు తిరిగి దేవుని యొద్దకు వస్తే ఇంకెత సంపూర్ణత ఉండును?! అపొస్తలుడు దేవుని యొక్క శక్తిని ఆత్మీయముగా మృతిపొందిన వారి పట్ల అనుభవము కలిగి ఉండెను, మరియు అతని శరీరములో చేసిన తప్పులను కూడా, అయితే ప్రభువు వారిని రక్షించెను. కనుక అదేవిధముగా క్రీస్తు యేసు యొక్క నిత్యా జీవము కూడా ఈ లోకములో ఉండు ప్రతి ఒక్కరు కూడా వ్యాపిస్తారని అతను నిరీక్షణ కలిగి ఉన్నాడు.

ప్రార్థన: ఓ పరలోకమందున్న తండ్రి నీవు కఠినమైన యూదుల హృదయములను మార్చి ఈ లోకములో ఉండు వారందరికీ వారిని ఒక ఆశీర్వాదముగా చేసినందుకు నీకు కృతజ్ఞతలు. స్వలాభముతో కాక నీ పరిశుద్ధాత్మచేత అందరినీ నీ సేవలోనికి నడిపించుటకు సహాయము చేయుము, మరియు వారిని ప్రార్థనలో, వాక్యంలో,తెచ్చునట్లు నడిపించు. మరియు అబ్రాహాము సంతతి కూడా నీ రక్షణలోనికి నడిపించునట్లు సహాయము చేయుము.

ప్రశ్నలు:

  1. అవిశ్వాసులైన వారికి యూదుల ఖఠినము అను మాటకు గల అర్థము ఏమిటి?
  2. నిజమైన విశ్వాసమును బట్టి క్రైస్తవులను ఏవిధముగా ప్రాధేయపడవచ్చు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:28 AM | powered by PmWiki (pmwiki-2.3.3)