Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 055 (The Aggravation of the Offense of the Israelite People)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు, ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)
4. దేవుని నీతి కేవలము విశ్వాసము ద్వారానే కలుగును, మరియు ధర్మశాస్త్రమును లోబడునట్లు కాదు (రోమీయులకు 9:30 - 10:21)

b) ఇశ్రాయేలీయుల ప్రజలు అధికమగుట, ఎందుకంటె దేవుడు వారికే ఎక్కువ కనికరము కలిగి ఉన్నాడు కనుక (రోమీయులకు 10:4-8)


రోమీయులకు 10:4-8
4 విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు. 5 ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెర వేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. 6 అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నదిఎవడు పరలోకములోనికి ఎక్కి పోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు; 7 లేకఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృద యములో అనుకొనవద్దు. 8 అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. 

ధర్మశాస్త్రము యొక్క చివరి ఉద్దేశము క్రీస్తే అని పౌలు చెప్తున్నాడు, ఎందుకంటె అతనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. అతని ద్వారా తప్ప మరి ఎవ్వరి ద్వారా తండ్రి యొద్దకు రాలేదు (యోహాను 14:6)

క్రీస్తు ధర్మశాస్త్రమునకు సంబంధించిన ప్రతి అవసరమును కూడా సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాడు, మరియు అందరికీ అతను ఒక ఉదాహరణగా దానిని వెంబడించుటకు ఉండెను. కనుక మనము ఎప్పుడైతే మనలను అతనితో పోల్చుకున్నప్పుడు మనము చెడిపోగలము. ఇది క్రైస్తవులకు మరియు యూదులకు ఇద్దరికీ సంబంధించినది, ఎందుకంటె అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు, మరియు అందరికీ ప్రేమ మరియు సత్యము అవసరమై ఉన్నది (లెవీ 18:5; రోమా 3:23).

అదే సమయములో క్రీస్తు ఈ లోకమును దేవునితో తన మరణము ద్వారా సమాధాన పరచి ఉన్నాడు (2 కొరింతి 5:18-21). క్రీస్తు పాత ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాడు కనుక అతను మంకు నూతన ధర్మశాస్త్రమై ఉన్నాడు, కనుక అతనితోనే మనము కృప కలిగిన ధర్మశాత్రమును చూచుచున్నాము. అతని మరణము ద్వారా మనకు తన కృప చొప్పున ఉచితాహా సమాధానము కలిగి ఉన్నది, ఎందుకంటె మనము నిత్యా జీవమును పొందుకొనుటకు. అయితే క్రీస్తే మన నీతి (యెషయా 45:24; యిర్మీయా 23:6; 33:16), ఎవరైతే అతని వైపు తిరుగుతారో వారు ఖండించబడరు.

మోషే ధర్మశాస్త్రములొ దేవుడు చెప్పినట్లు: ఎవరైతే నా అగణాలను గైకొనునో వాడు బ్రతుకును. అయితే యేసు తప్ప ఎవ్వరు కూడా దేవుని ఆజ్ఞలను పాటించలేదు. కనుక ఎవ్వరు కూడా అతని ప్రకారము జీవించలేడు. కనుకనే యూదులు ఉపవాసముండి, ప్రార్థనలో ఉంది, వారికొరకు మెస్సయ్య వచ్చి దేవుని ఉగ్రత నుంచి కాపాడునని అనుకొనుచున్నారు. మరియు ఎవరైతే వచ్చారో వాని దగ్గరకు రావడానికి మరియు వాని మాటలు వినడానికి వారికి ఇష్టము లేకపోయెను. నీతి కలిగిన విశ్వాసమునకు క్రీస్తు పరలోకమునుండి వచ్చుట అవసరం లేదు, లేదా నూతన క్రీస్తు వచ్చి మృతిని లేపుట అవసరము లేదు అయితే క్రీస్తు మనకొరకు వచ్చియున్నాడు (లూకా), మరియు మృతిని జయించి లేచాడు (మత్తయి), మరియు దేవుని యొక్క జీవము కలిగిన వాక్యము అనేకులా దగ్గరకు వచ్చినది. సువార్త ఏదైతే ప్రకటించబడినదో అది పూర్తిగా క్రీస్తు అధికారములోనుండి చెప్పబడినది. కనుక ఎవరైతే దానిని విని అంగీకరించునో వానికి జీవము కలిగిన ఆశీర్వాదాలు కలుగును, మరియు ఎవరైతే దీనిని బట్టి కోరుకొనునో వాడు పలుకును. మనకు తెలిసినదానికంటే మనము ధనికులము కనుక మనకు కలిగిన దానిలో ఇతరులకు కూడా ఆత్మీయముగా పంచిపెట్టాలి, ఎందుకంటె వారు కూడా నీమాదిరి గొప్పవారని మరియు బలవంతులని చెప్పుకొనెదరు, అయితే వారు పాపములో మరణించినవారు.

ప్రార్థన: ఓ పరలోకమందున్న తండ్రి నీ ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు నీ ఏకైక కుమారుడిని మా కొరకు పంపినందుకు నీకు ఆరాధన చెల్లిస్తున్నాము, మరియు ఈ లోక పాపములను కూడా తీసివేసియున్నావు. క్రీస్తు మాకు ధర్మశాస్త్రమును తీసి వేసి కృప కలిగిన ధర్మశాస్త్రమును దయచేసి ఉన్నాడు. ఆమెన్

ప్రశ్నలు:

  1. క్రీస్తు ధర్మాత్మశాస్త్రమునకు ముగింపు అని పౌలు చెప్పిన మాటకు అర్థము ఏమిటి?
  2. యూదులు వారి కొరకు వచ్చు మెస్సయ్య కొరకు ఎందుకు ఎదురుచూస్తున్నారు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:21 AM | powered by PmWiki (pmwiki-2.3.3)