Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 047 (The Truth of Christ Guarantees our Fellowship with God)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)

2. మన శ్రమలయందు క్రీస్తు సత్యము మనకు దేవుని సహవాసములో భయము చూపును (రోమీయులకు 8:31-39)


రోమీయులకు 8:31-32
31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు? 32 తన సొంతకుమారుని అనుగ్ర హించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు? 

పౌలు దేవుని ఆలోచనలను మరియు రక్షణను బట్టి మనకు చెప్పినతరువాత, మనము దేవుని నిజ చరిత్ర కార్యములను తన రక్షణ యందు స్థాపించెనని చెప్పెను.

పౌలు తన మనసులో మరియు హృదయములో చెప్పినది ఏమనగా దేవుని మన శత్రువు కాదు, మరియు అతను మన నిజమైన స్నేహితుడు. మరియు అతను సర్వశక్తి కలిగిన దేవుడని, ఈ లోక సృష్టికర్తని మరియు భూమ్యాకాశములు సృష్టించిన దేవుడని విస్వసించెను. కనుక అతను దేవునిని తన జీవితకాలమంతా కూడా తన హృదయముతో దేవునిని ప్రేమించెను. మరియు అన్ని కార్యములు తండ్రి ప్రేమను మరియు రక్షకుని సంరక్షణలో కలుగును అని నమ్మెను.

పౌలు ఏవిధముగా పర్వతముల ప్రకారముగా ఉన్న పాపములు తొలగి పోవును అని ఎలా నమ్మించేను, మరియు వేళా కోట్ల మంది మరణకరమైన పాపమును తిరిగి లేపునని ఎలా చెప్పేను? క్రీస్తు సిలువ అతనికి దేవుని ప్రేమకు ఒక రుజువుగా ఉండెను. ఆ కలువారి సిలువలో తన పరిశుద్ధ కనికరము బయలుపరచెనని గుర్తుకు చేసుకొనెను. ఎందుకంటె మన పాపములకొరకు తన కుమారుడిని ఇచ్చి, ఎవ్వరు నశించి పోకూడదని ఉద్దేశించెను, కనుక అందరి కొరకు తన రక్తమును కార్చెను.

అయితే ఎవరైతే దేవునికి లోబడక మరియు పాపము చేస్తారో వారికి అతని హృదయమును, పరలోకమును, రాబోవు కుమారుని మహిమను వారికి ఇచ్చెను. కనుక క్రీస్తు ద్వారా ఇచ్చు ఆశీర్వాదము కాక ఆ పరలోకమందు మరి ఏ విధమైన ఆశీర్వాదములు లేవు, ఎందుకంటె సమస్తము మనకు క్రీస్తులోనే యిచ్చియున్నాడు. అయితే నా ఆరాధన ఎక్కడ? నీవు ఎందుకు ప్రతి దానిని అతనికి ఎందుకు ఇవ్వడము లేదు?

రోమీయులకు 8:33-34
33 దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే; 34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే 

రక్షణ మరియు వాగ్దానములు కేవలము పరిశుద్ధులకు మరియు విశ్వాసులకు మాత్రమే అని నీవు అనుకొనేవు, నీకు నీవు ఒక చక్కగా పనుపడనివాడు, కదిలించబడువాడవు మరియు అపరిశుద్ధుడవు. నీ జీవితములో దేవుని తీర్పును బట్టి జాగ్రత్త కలిగి ఉండు. నిన్ను అతను నీతిగా మరిచినది మరియు సమాధాన పరచింది నీ కార్యములను బట్టి కాదు, అయితే అతని సిలువ యందు నీకు ఉన్న విశ్వాసమును బట్టి, మరియు నీవు అతనితో ఐక్యత కలిగి ఉంది అతని ద్వారానే శక్తిని మనము పొందుకుంటాము.

నీవు కొంచమైనా సాతాను యొక్క మాటను విని ఉండెదవు, ఎందుకంటె నీ యొక్క మౌనము దేవుని యొక్క చిత్తమై ఉన్నట్లు. అయితే పరిశుద్ధాత్ముడు "లేదు" అని చెప్పును. అతను నిన్ను దేవునియందు ఓదార్చును, మరియు మరియు క్రీస్తు సిలువ మరణమును నీ కన్నుల ఎదుట చిత్రించును, మరియు అతని పునరుత్తనమును నీకు జ్ఞాపకము చేసి సమాధానమును దేవుడు అంగీకరించునని. మరణము మీద విజయము జయించువాడు పరలోకమునకు ఏతెంచెను. అతను నీ కొరకు కృప కలిగిన సింహాసనమందు బతిమాలుచున్నాడు, అతని నీతికలిగిన రక్తము ద్వారా నీకు అతనితో సంబంధము చేయును. నీకొరకు దేవునితో వకీలు ఉన్నాడు. కనుక నీవు ఒంటరి కాదు, ఎందుకంటె ప్రియా సహోదరుడా కనికరము గల దేవుడు నీతో ఉన్నాడు, మరియు అతని గురి నీపట్ల నిన్ను విడిపించేదే కానీ నీకు నాశనము కలిగించునది కాదు. క్రీస్తు నీ రక్షణకు ఒక గారంటీగా ఉన్నాడు.

నీవు మరణమును గూర్చి భయము కలిగి ఉండవచ్చు. అయితే యేసు మరణమును జయించి తిరిగి లేచాడని జ్ఞాపకము చేసుకో, మరియు దేవుని జీవితమును అతను నీ కళ్ళముందు పెట్టి ఉన్నాడు. ఒకవేళ నీవు నూతనముగా జన్మించినట్లైతే అతని నిత్యా జీవితము నీలో ఉండును. దేవుని ప్రేమ ఎన్నటికీ ఓడిపోదు కనుక దానికి ముగింపు ఉండదు. కనుక త్రిత్వమునుంచి నిన్ను మరణము వేరుపరచాడు.

రోమీయులకు 8:35-37
35 క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలనుఎడబాపునా? 36 ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడిన వారము. 37 అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. 

పౌలు అతను అనుభవించిన శ్రమలను బట్టి ఊహించక వాటిని క్లుప్తముగా వివరించి ఉన్నాడు. మనము కూడా క్రీస్తు కొరకు శ్రమపడాలని అతను మనకు నేర్పిస్తున్నాడు, ఎందుకంటె తండ్రి యందు కుమారుని యందు మరియు పరిశుద్దాత్మ యందు మనకున్న విశ్వాసము మనలను వడ్డీకి ఇచ్చునట్లుగా ఉండదు. అతను పరిశుద్ధాత్మచేత జన్మించి, మరియు ఈ లోక ఆత్మను కలిగిన వారికొరకు సిలువ వేయబడినాడు. పౌలు తన జీవితములో, బీదతనమును, ఐశ్వర్యమును, రోగమును, బలహీనతను, అపాయమును, మరియు శ్రమను అనుభవించాడు. ఇవన్నీ కూడా వ్యర్థమని అతనికి తెలుసు అయితే వాటి కంటే క్రీస్తు ప్రేమ గొప్పదని ఎంచెను. కనుక నీ విశ్వాసము నీ ప్రతి శ్రమయందు కూడా కనపడును,మరియు నీ మరణకారమునందు కూడా ఉండును, నీవు సంపూర్ణముగా మార్చబడువరకూ పరిశుద్దాత్మ దేవుడు నీ విశ్వాసమును బలపరచును, అప్పుడు నీవు దేవుని తగ్గింపును, నమ్మకమును, మరియు శ్రమలయందు ఘనతను కలిగి ఉందువు. అప్పుడు నీవు దేవునిని వెంబడించు గొర్రెపిల్లలాగా ఉందువు. నీవు ప్రతి దానిని కూడా పిర్యాదు లేకుండా అనుభవించెదవు. నీ పొరుగు వాని గాయములకు నీవు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవు, అయితే నీవు ఆనందము కలిగి ఉంది, ఓర్పుతో దేవుని శక్తిని కొరకు ఎదురుచూస్తావు.

ప్రతి శ్రమ మరియు బాధ మనలను క్రీస్తు నుంచి వేరుపరచవు, ఎందుకంటె శ్రమలు మనకు దేవుని వాక్యము నందు నిలకడను నేర్పును. అప్పుడు మనలను తండ్రి యొద్దకు నడిపించిన క్రీస్తు కొరకు ఆశకలిగి ఉందుము. అతను మనలను అర్థము చేసుకొని మనలను విడువడు, అయితే మనము అతని గొప్ప ప్రేమను చూచుటకు కృతజ్ఞత కలిగి దాయకలిగి ఉండునట్లు మనకు నేర్పును. క్రీస్తు యందు ప్రేమ మనలను మహిమగల విజయములోనికి నడిపించును, అప్పుడు మనము కన్నీళ్ళలో మరియు శ్రమలలో అతనిని సంతోషముతో సేవించగలము.

ప్రార్థన: ఓ పరిశుద్ధ ప్రభువా నీవు నా తండ్రివి మరియు నీ కుమారుడు నాకు మహద్య్వార్తిగా ఉన్నాడు, ఈ దినము మరియు నా చివరి దిన తీర్పునందు కూడా పరిశుద్ధాత్ముడు నాలో ఉంది నన్ను ఓదార్చును. ప్రేమ అయినా తండ్రి కుమారా పరిశుద్దాత్మ నేను మిమ్ములను ఆరాధిస్తున్నాము. నీవు నన్ను సంరక్షించుకొని ఉన్నావు మరియు నీ సన్నిధి నాతో ఉంచావు మరియు నీవు నన్ను నూతన పరచి ఉన్నావు కనుక నేను మరణము అయి పోతానని నమ్మను. కనుక ప్రభువా నీ నుంచి నేను వేరుగా ఉండకుండా నా శ్రమలను నా నుంచి దూరముగా చేయుము. అప్పుడు ఈ లోకమందుండు పరిశుద్ధులకు ఉన్న ప్రేమచేత నా ప్రేమ కూడా కదిలించబడదు.

ప్రశ్నలు:

  1. క్రైస్తవులు శ్రమలను ఏవిధముగా జయించెదరు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:11 AM | powered by PmWiki (pmwiki-2.2.109)