Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 037 (Deliverance to the Service of Christ)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)

3. క్రీస్తు పరిచర్యకు నడిపించుటకు మనలను ధర్మశాస్త్రము నుంచి విడిపించుట (రోమీయులకు 7:1-6)


రోమీయులకు 7:1-6
1 సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంతకాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడు చున్నాను. 2 భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదల పొందును. 3 కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని చేరినయెడల వ్యభిచారిణియన బడును గాని, భర్తచనిపోయినయెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివా హము చేసికొనినను వ్యభిచారిణి కాకపోవును. 4 కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అనువేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మ శాస్త్రము విషయమై మృతులైతిరి. 5 ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను. 6 ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొంది తివిు గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము.

రోమా లో ఉన్న యూదులు ఎవరైతే నిజమైన విశ్వాసం కలిగి ఉన్నారో వారిని బట్టి అతను క్రీస్తు మరణము పునరుత్థానమును బట్టి పౌలు వారికి చెప్పెను. ఏదేమైనా పౌలు ధర్మశాస్త్రమును బట్టి వారికి నిజమైన సమాధానము ఇవ్వాలని ఇష్టపడెను, ఎందుకంటె మోషే ద్వారా దేవుని మాటలను బయలు పరచుట చూసి అతని సంపూర్ణ ప్రకటనను వినియున్నారు.

పౌలు వారికి చెప్తూ: ఒక భార్య భర్తలు ఏవిధముగా అయితే ఒకరికి ఒకరు సమర్పణ కలిగి ఉంటారో అదేవిధముగా ప్రేమ మరియు ధర్మశాస్త్రములు కూడా అలాగునే ఉంటాయి. మరియు ఎప్పుడైతే ఆ బంధములో ఒకరు చంపోయినప్పుడు ఒంటరిగా ఉంటారో అదేవిధముగా నీవు కూడా ధర్మశాస్త్రమునందు విమోచించబడతావు, ఎందుకంటె నీవు క్రీస్తు మరణముతో మరణమే పోయావు కనుక. అతని సమాధి చేయబడిన శవము నిన్ను వాలే పోలి ఉన్నది, కనుక మరణమునకు నీమీద అధికారము లేదు.

అయినప్పటికీ క్రీస్తు కూడా మృతి నుంచి తిరిగి లేచాడు, కనుక ఇప్పుడు ఎవరైతే ఎన్నుకొనబడి ఉన్నారో వారు దేవుని కుమారునితో నిబంధన కలిగి ఉండుడి. పాత నిబంధన అనునది చివరి న్యాయతీర్పునకు ధర్మశాస్త్ర మరణమే ఉన్నది. ఇప్పుడు నీవు జీవమునకు కర్త అయినా వాని యందు నీ జీవితమును ప్రవేశించుకొని ఉన్నావు, కనుక ఆత్మీయమైన ఫలములు ఘనముగా కనపడెను; ప్రేమ, ఆనందము, సమాధానము, ఆశానిగ్రహము, దయ, మంచితనము, నమ్మకత్వము,కనికరము, మరియు క్రీస్తు లక్షణములు; కృతజ్ఞత, నిజాము, పరిశుద్ధత మరియు సమ్మతి.

దేవుడు నీ జీవితములో దేవుని కుమారుని యొక్క ఫలములను ఆశించుచున్నాడు, ఎందుకంటె క్రీస్తు చనిపోయి, పునరుత్థానుడై తన ఆత్మను మనుషులమీద ఉంచాడు కనుక అందరు సంపూర్ణమైన ఫలములు కలిగి ఉండాలి. ఒక తోటమాలి ఏవిధముగా అయితే ఫలములను బట్టి ఆశిస్తాడో అదేవిధముగా దేవుడు కూడా నీ నుంచి ఆశించును.

క్రీస్తు రాక మునుపు మనిషి ఒక బానిసగా ఎంచబడ్డాడు, అతని శరీరములో చెడు ఉన్నంతవరకు, ఎందుకంటె ధర్మశాస్త్రము మనలను చెడు కార్యములను చేయుటకు ప్రోత్సహించును. ధర్మశాస్త్రము మరణమునకు ఎక్కువ ఫలములను ఇచ్చును. ఇది మనలను తప్పుచేయుటకు మాత్రమే నడిపించాడు అయితే నిర్ణయాత్మను కూడా ఖండించును.

ఏదేమైనా క్రీస్తులో ధర్మశాస్త్ర ప్రకారముగా మనము చనిపోయి ఉన్నాము, ఎందుకంటె క్రీస్తు తన మరణము ద్వారా ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాడు. మనము మన విశ్వాసములో సిలువవేయబడ్డాము కనుక మరణించినవారిగా ఉన్నాము,మనలను మనము చనిపోయామని ఎందుకొని పాత ప్రకటనకు కట్టుబడి లేము.

అదేసమయములో దేవుని కుమారుడు మనలను నూతన నిబంధనలోనికి పిలిచి ఉన్నాడు, అనగా ధర్మశాస్త్ర ప్రకారముగా మనము కాలు జారకుండా మంచి ప్రకటనను కనుగొనునట్లు, అయితే దేవునిని ఆత్మ శక్తి చేత సేవించాలి. మన జీవితములు బెదిరించుటకు మరియు నిషేధించుటకు ఆవరించలేదు, అయితే మనము ప్రేమను మరియు ఆనందకరమైన జీవితమును జ్ఞాపకము చేసుకొనుటకు సమాధాన శక్తి కలిగి ఉన్నాము. ఆత్మీయమైన నూతన నిబంధన మనకు పాతది, లేదా అలసినదిగా ఉన్నది, ఎందుకంటె దేవుడే ముగింపునకు సంపూర్ణమై ఉన్నాడు. అతనికి ముగింపులేని జ్ఞానము, మంచితనము, దయ, మరియు నిరీక్షణ ఉన్నవి. కనుక నిన్ను నీవు సంపూర్ణముగా దేవుని ఆత్మకు సమర్పించుకొని ఉన్నట్లయితే అప్పుడు మనము ఆత్మీయమైన ఐశ్వర్యమును మరియు శక్తిని పండుకొని, క్రీస్తు సాత్వికములోనికి నడుచుకోంవాలి, ఎందుకంటె నీవు మరణమై ఉన్నావు కనుక నీలో క్రీస్తు జీవించాలి.

ప్రార్థన: ఓ పరిశుద్దుడైన ప్రభువా నీవు మమ్ములను ధర్మశాస్త్రము అనబడునటువంటి కట్టలనుంచి పిలిచి ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు, క్రీస్తు తన మరణము ద్వారా తన ప్రేమను మరియు సత్యమును ఆ సిలువ ద్వారా నెరవేర్చి ఉన్నావు. మమ్ములను నూతన నిబంధనలోనికి నడిపించినందుకు నిన్ను ఘనపరచుచున్నాము, మరియు నీ ఆత్మ ద్వారా మా హృదయములలో నివసించి ఉన్నావు కనుక నీ కృప కలిగిన శక్తి చేత మంచి ఫలములను ఫలించుచున్నాము.

ప్రశ్నలు:

  1. పాత నిబంధన నుంచి మనమందరము ఎందుకు విమోచించబడినాము?

ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా?
అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.

(అపోస్త 15:11)

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:00 AM | powered by PmWiki (pmwiki-2.3.3)