Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 036 (Freedom from the Law)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)

2. ధారణశాస్త్రము మరియు మన పాపమునుంచి విడుదల (రోమీయులకు 6:15-23)


రోమీయులకు 6:15-22
15 అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్న టికిని కూడదు. 16 లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? 17 మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై, 18 పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము. 19 మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్ప గించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. 20 మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి. 21 అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే, 22 అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము. 

యూదుల యొక్క ప్రశ్నలు మరొక్కసారి పౌలు యొక్క మనసులోకి వెళ్లెను: మనము ధర్మశాస్త్రములో లేము కనుక పాపము చేద్దామా, అయితే కృప ద్వారా విమోచించబడ్డామా?

పౌలు ఈ సాతాను ప్రశ్నను పూర్తిగా తిరస్కరించెను, ఎందుకంటె ఇది పరిశుద్దాత్మ ద్వారా చెప్పబడినది కాదు, అయితే రాజ్యము ద్వారా చెప్పబడినది. పౌలు చెప్పినట్లు వారు క్రీస్తు ప్రేమలో ఉండునట్లు ఇష్టపూర్వకంగా తమను తాము అతనికి అప్పగించెను.కనుకనే వారు పాపపు శక్తి నుంచి విడుదల పొంది, మరియు ధర్మశాస్త్రమునకు కూడా పిర్యాదు చేసే వారైరి. ఎవరైతే దేవుని భయము లేకుండా స్వతంత్రులమని చెప్పెదరో వారు అబద్ధికులు. అందుకే డాక్టర్ లూథర్ మనిషిని గాడిదతో పోల్చాడు ఎందుకంటె అవి నాయకుడు లేకుండా ఎక్కడికి కూడా క్రమముగా వెళ్లవు కనుక. కనుక నీవు సాతాను నుంచి లేదా దేవుని నుంచి నడిపింప బడెదవు. ఎప్పుడైతే దేవుడు నీ దేవుడై ఉండునో అప్పుడు నీవు అతనిని సంతోషముతో మోసుకొని వెళ్లెదవు, కనుక నీవు పాపములో ఉండక అతని శక్తిలో ఉండెదవు కనుక నీ పాపమందు చనిపోలేవు. అయితే దానికి బదులు నీలో సమాధానము, నిరీక్షణ, నిజమైన ఆత్మీయత ఉండును. క్రీస్తు నిన్ను విమోచించినది ఇతరులను నీతి కలిగిన జీవితములో నడిపించి దేవుని సేవను చేయులాగున ప్రోత్సహించుటకు. పరిశుద్దాత్మునికి లోబడిన ప్రకారము నీ మనస్సు మార్చబడును. కనుక ఈ విధమైన క్రీస్తుతో సహవాసము లేకుండా ఉన్నట్లయితే నీవు నశించిపోయెదవు.

క్రీస్తు తనకు తాను నా దగ్గర కాడి ఉన్నాడని మరియు తన ద్వారానే నిత్యా దేవుడు కలదని చెప్పెను. ఏదేమైనా అతను తన తండ్రికి తనను తాను సంతోషముగా సమర్పించుకొని, సిలువ మరణము పొందువరకు తన తండ్రికి తగ్గింపుగా ఉండెను. కనుక స్వచ్ఛమైన ప్రేమ క్రీస్తును ఈ లోక పాపమునకు ఒక బానిసగా చేసెను. కనుక నీవు ఎందుకు అతనిని వెంబడించవు? నీవు నీ స్నేహితుల నిర్లక్ష్యమును మరియు పాపములను మోసుకొన్నావా? నిరాశచెందవద్దు, అయితే వారి రక్షణ నిమిత్తము మరియు ఆత్మీయ విమోచనమును బట్టి నీ హృదయమును ఇమ్ము. దేవుని ప్రేమ నిన్ను అందరిని విడిపించునట్లు బ్రతిమిలాడుతున్నది.

క్రీస్తుతో నీ జీవితము ఎందరికొరకో సేవచేయమని నడిపిస్తున్నది, అయితే అది దైవత్వము లేదా త్యాగమును బట్టో కాదు అయితే నీ బలమును బట్టి.నీవు నీ గత జీవితములో ఖర్చుచేసినా సమయమును, ధనమును, బహుమానములను

క్రీస్తు యొక్క ప్రేమ విశ్వాసులలో ఈ అన్యాయమైన లోకములో ప్రేమ కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి ఉండును. నీవు క్రీస్తుకు నమ్మకమైన సేవకునిగా మరియు అతని ప్రేమలో సంపూణముగా సమర్పించుకున్న వానిగా ఉన్నావా? ఒకవేళ అయితే, పాపమునకు నీ మీద బలము లేదు, ఎందుకంటె నీ పచ్చాత్తాపమును బట్టి మరణమును జయించి, క్రీస్తుతో సిలువ వేయబడి, అతని పరిశుద్దాత్మ చేత నిమ్బపడి, మరియు అతని నిత్యా జీవితములో స్థాపించబడినావు. ఎవరైతే క్రీస్తు నందు జీవించుచున్నారో వారితో పాటు నీకు కూడా గొప్ప నిరీక్షణ ఉన్నది.

రోమీయులకు 6:23
23 ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

ఇక్కడ మనకు బంగారమైన వచనము యేదనగా, మనిషి ఫలములు మరియు గొప్ప కార్యములు అనునవి క్రీస్తు ఇచ్చునవి.

1. మన పాపములను బట్టి మనము చనిపోతాము. మనము పాపులం కనుక మరణము నుంచి తప్పించుకొనలేము. అందరు పాపులు కనుక అందరు చనిపోవలసినదే. ఇదే జీవితమునకు జీతము.

2. అయితే ఎవరైతే క్రీస్తునందు విశ్వసిస్తారో వారు దేవుని బహుమానములను పొందుకుంటారు. ఈ బహుమానములు వెండి, బంగారు లేకా ఈ లోక వస్తువులనుంచి చేసినవి కావు. అయితే అవి దేవుని నుంచి నేరుగా మన హృదయములలోనికి వచ్చి మన హృదయములలో నిజముగా నివాసము చేయును. ఎవరైతే అతని కుమారునితో సిలువ వేయబడినారో వారికి తన జీవితమును ఇచ్చి, అప్పుడు వారు అతని అధికారంలో భాగము కలిగి ఉంటారు. అతను ప్రభువులకు ప్రభువు మరియు అతని తండ్రితో ఉండును కనుక పరిశుద్దాత్మునితో ఇవి చేయును; కనుక మనకున్నది ఒకే దేవుడు అతను నిత్యమూ ఉండును.

ప్రార్థన: తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మేము నిన్ను ఆరాధించుచున్నాము, ఏడునాకంటే మీరు మా పాపములను తీసివేసి ఉన్నారు, మరియు మమ్ములను మరణము నుంచి తప్పించి క్రీస్తు చెంతకు నడిపించి, మాలో నీ పరిశుద్ధాత్మను నింపి, అప్పుడు మేము ఇక ఎన్నడును కూడా చంపక నీ కృప యందు నివసించినట్లు చేసి ఉన్నావు.

ప్రశ్నలు:

  1. పాపము, మరణము మరియు క్రీస్తు ప్రేమకు గల వ్యత్యాసము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:59 AM | powered by PmWiki (pmwiki-2.3.3)