Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 008 (The Righteousness of God)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
ప్రారంభము: అభివాదం, దేవునికి కృతజ్ఞత మరియు "దేవుని నీతి" పైన అవధారణము ఈ పత్రిక ముఖ్య ఉద్దేశము

c) విశ్వాసము ద్వారా దేవుని నీతి మనలో స్థాపించబడెను (రోమీయులకు 1:16-17)


రోమీయులకు 1:16
16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. 

పౌలు "సువాత" అను పదమును బట్టి జాగ్రత్త కలిగి ఉండెను ఎందుకంటె ఈ మాటకు రోమ్లో ఒక మంచి అర్థము ఉండెను. ఎందుకంటె ఆ పట్టణములో ఈ విధమైన సువార్తలు ఆ దినాలలో ప్రకటించుచుండిరి కనుక వినుటకు వారు ఎంతో ఆత్రుతకలిగి ఉండిరి.

అతను ఈ రక్షణ సువార్తను ఆనందముతో ప్రకటించెను, అందుకు, "పాలస్తీనా నుంచి వచ్చిన నా పత్రికను బట్టి నేను సిగ్గుపడువాడను కాను. దానికి బదులు దీనిని ఆ పట్టాన మధ్యలోకి తీసుకొని దేవుని ఏకైక కుమారుడు మనకు మంచి వర్తమానమును ఇచ్చి మనకొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడై లేచిన సువార్తను మీకు తెచ్చాను అని చెప్పెను. నేను మీ దగ్గరకు ఒక కుమారుడు ఈ లోక సంబంధముగా జన్మించాడని చెప్పక పరిశుద్దుడైన యేసు పరిశుద్దుడైన తండ్రి ద్వారా కలిగి ఉన్నాడని చెప్పుటకు వచ్చి ఉన్నాను. ఒకవేళ మీకు రోమా సామ్రాజ్యము జయము కలిగిన వర్తమానమును తీసుకొనివచ్చినట్లైతే, ఈ దినము నేను మీకొరకు మంచి వర్తమానమును అనగా మిమ్ములను పాపము నుంచి, మరణము నుంచి, సాతాను నుంచి, మరియు దేవుని ఉగ్రత నుంచి మరియు న్యాయతీర్పు నుంచి తప్పించు సువార్తను తీసుకొచ్చాను అని చెప్పెను. నేను తెచ్చిన సువార్త మీ రోమా సామ్రాజ్యములన్నిటికంటే శక్తి కలిగినది, గొప్పది, మరియు మహిమకరమైనది. ఇది ఒక పుస్తకమునుంచి లేకా జ్ఞానుల నుంచి లేదా నిరీక్షణ లేని వారి నుంచి రాలేదు అయితే ఒక్కరి ద్వారా వచ్చినది. "

"క్రీస్తు" అను పదమునకు రోమావారికి రకరకాల అర్థాలు యూదులకు ఇచ్చినట్లు తెలియవు. వారు ఈ మాటకు, "అభిషేకించబడిన వాడు" అని అర్థము చేసుకొనిరి. ఇది కైసరుకు కూడా ఇవ్వడము జరిగినది, అతను వారికి ఒక ప్రధాన యాజకుడుగా ఉండెను. కైసరు తనకు తాను ఒక రాజకీయవేత్తగా, సైనికునిగా మరియు ధర్మశాస్త్రమును నడిపించు వాడుగా అనుకోని, అతని ద్వారానే ప్రజలందరికి ఆశీర్వాదము మరియు సమాధానము కలుగునని చెప్పుకొనెను.

ఏదేమైనా క్రీస్తు రాజులకు రాజు మరియు పరలోకమందును ఈ భూమియందును అధికారమును ఇయ్యబడిన ప్రధాన యాజకునిగా మరియు మనకు దేవునికి మధ్యన ఒక రాయబారిగా ఉండెను.

పౌలు ఈ పత్రిక ప్రారంభములో యేసును కేవలము దేవుని కుమారుడుగానే చెప్పక మరియు అతని సహజ ప్రవర్తనను బట్టి మాత్రమే చెప్పక, యేసును ఒక ప్రభువుగా, న్యాయాధిపతిగా, పాలించువాడిగా, మరియు సమాధానపరచువాడుగా చెప్పి, " ఈ లోక రక్షకుడు" అని అతనికి మాత్రమే పెట్టబడెను అని వారికి చెప్పెను.

ఈ విధమైన అనగా దేవుని కుమానునికి గల రకరకాల పరిచర్యలను బట్టి చెప్పుట అతని ఉద్దేశము కాదు. అయితే ఇది ఈ లోకములో ఉన్న శక్తులన్నిటికంటే గొప్ప శక్తి కలిగి ఉండెను, ఎందుకంటె సువార్త కూడా దేవుని శక్తి చేత సంపూర్ణముగా నింపబడెను గనుక. ఆటను తన మాటలచేత వినువారిని వారి నూతన జీవితమును బట్టి పిలిచి ఉన్నాడు. కనుక ఈ పుస్తకమును నీవు ఇతర పుస్తకముల ప్రకారము యెంచక వాటిలో ఒక్కటిగా పెట్టక దీనిని ప్రత్యేకమైన స్థలములో పెట్టాలి ఎందుకంటె ఈ పుస్తకము అన్ని పుస్తకములను ఖండించును కనుక. దేవుడు నీతి కలిగి ఉన్నట్లు ఈ సువార్త కూడా నీతి న్యాయము కలిగి ఉన్నది.

దేవుని శక్తి ఈ లోకమునకు క్రీస్తు సువార్త రూమపులో వచ్చినది, ఇది ఈ లోక మాలిన్యమును పడగొట్టి, మరియు రక్షించుటకు వచ్చెను, ఎందుకంటె ఈ లోకములో ఉండు ప్రతి ఒక్కరు కూడా దేవుని నిజమైన జ్ఞానము కలిగి ఉండుటకు దేవుని ఉద్దేశమై ఉన్నది. మన పరలోకపు తండ్రి ఒక అధికారిగా ఉండలేదు, మరియు అతని కుమారుని యందు విశ్వాసము కలిగి ఉండుమని ఎవ్వరినీ బలవంతము చేయలేదు, అయితే ప్రతి ఒక్కరు అతని సత్యమును ఉచితముగా పొందాలని ఉద్దేశించెను. కనుక ఎవరైతే దేవుని శక్తిని మరియు క్రీస్తు మాటల కొరకు తమ హృదయములను తెరుస్తారో వారు దేవుని శక్తిని అనుభవిస్తారు. ఎందుకంటె విశ్వాసము లేనిదే రక్షణ లేదు కనుక. ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుని కుమారునితో ఐక్యత కలిగి ఉంటారు ఎందుకంటె అతను వారిలో తన పరిశుద్దతను ఉంచును కనుక.

ఎవరైతే వారి హృదయములను క్రీస్తు కొరకు తెరచి ఉంచుతారో వారిలో నిత్యమైన రక్షణ మరియు విశ్వాసము స్థాపించబడును; మరియు దేవుని కుమారుని యందు విశ్వాసమే రక్షణకు మార్గము. విశ్వాసము ద్వారానే విశ్వాసులకు క్షమాపణ దొరుకును మరియు మరణమునకు పునరుత్థానము కూడా దొరుకును. కనుక విశ్వాసము అనునది రోమా వారికి ఒక నిర్ణయాత్మకమైనది, ఎందుకంటె విశ్వాసము లేనిదే నీవు దేవుడిని తెలుసుకొనలేవు మరియు అతని శక్తిని పొందుకొనలేవు. కనుక ఎవరైతే విశ్వసించునో అతను నిర్దోషమై నిత్యమూ జీవించును.

యూదులు ఈ సత్యమును అనుభవించారు, అయితే అందులో చాలా మంది క్రీస్తును తిరస్కరించి, అతనిని ద్వేషించి అతనిని సిలువ వేసిరి. అయితే తగ్గించబడినవారు అతనిని తెలుసుకొని అతని యందు విశ్వాసము కలిగి ఉండిరి. కనుక వారు దేవుని పరిశుద్దాత్మ చేత నింపబడి దేవుని ప్రేమలో నిలకడగా ఉండిరి. ఈ దినాలలో కూడా పరిశుద్దాత్మత్రిత్వ శక్తి విశ్వాసుల సాక్ష్యాలతో నివాసము కలిగి ఉన్నది.

ఎప్పుడైతే యూదులలో కొద్దిమంది క్రీస్తు రక్షణను అంగీకరించినప్పుడు గ్రీకు దేశస్తులు మరియు ఇతర దేశస్తులు తన హుర్దయములను సువార్త రక్షణకు తెరచి వాటిని వెంబడించిరి. వాక్యము ఖాళీగా లేక దేవుని శక్తి చేత నింపబడినదని అనుభవించి అది క్రీస్తుతో నిత్యమూ బంధము కలిగిన ఒక నిబంధనవలె ఉండెనని తెలుసుకొనిరి.

ప్రియా చదువరి, ఒకవేళ నీవు ఈ యేసు సువార్తను జాగ్రత్తగా చదివి నీ హృదయమును దేవుని వాక్యమునకు తెరచి యేసు దైవత్వమును బట్టి విశ్వసించి అతనితో ప్రార్థనలో మాట్లాడినట్లైతే అప్పుడు నీకు సిలువ వేయబడిన క్రీస్తును ఒక రక్షకునిగా, యాజకునిగా, శక్తి కలిగిన రాజుగా మరియు ఈ లోక విమోచకునిగా తెలుసుకుంటావు. కనుక నీ జీవితము ధైర్యము కలిగి నీ బలహీనత ఒక బలము కలిగి ఉండునట్లు దేవుని శక్తిని అనుభవించుము.

ప్రార్థన: తండ్రి, కుమారా, పరిశుద్దాత్మ మేము మిమ్ములను మహిమపరచుచున్నాము, ఎందుకంటె మీరు సువార్తలలో ప్రకటించుకొని మా విశ్వాసములను పరిశుద్ధపరచి, మరియు మాలో సంపూర్ణముగా నివసించినందుకు. మరియు ఈ పత్రిక ద్వారా నీవు రోమా సంఘమునకు నీ కార్యములను ప్రకటించుకొని నూతన గ్రంథమునుండి ఈ పుస్తకమును ప్రత్యేకపరచినందుకు కృతజ్ఞతలు. మాకు మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొనులాగున మా హృదయములను తెరువుము అప్పుడు నీకు మా జీవితమును సమర్పించుకొని నీ పోషణలో నీ నడిపింపులో ఉండెదము.

ప్రశ్నలు:

  1. 16 వ వచనంలో నీవు దేనిని ప్రాముఖ్యముగా ఎంచుకొంటావు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:04 AM | powered by PmWiki (pmwiki-2.3.3)