Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 007 (Paul’s Desire to Visit Rome)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
ప్రారంభము: అభివాదం, దేవునికి కృతజ్ఞత మరియు "దేవుని నీతి" పైన అవధారణము ఈ పత్రిక ముఖ్య ఉద్దేశము

b) రోమను దర్శించుటకు పౌలుకు ఉన్న ఆశ (రోమీయులకు 1:8-15)


రోమీయులకు 1:13-15
13 సహో దరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిది వరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు 14 గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను. 15 కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. 

ఈ పత్రికలో పౌలు రోమా సంఘమును బట్టి తన హృదయములో ఉన్నవాటిని బయట పెట్టెను. అవేవనగా, అతను తరచూ ఈ సంఘమును దర్శించాలని కోరుకున్నప్పుడు దేవుడు తన ప్రణాళికలను పాడు చేసెనని చెప్పెను. ఎందుకంటె అతని ఆలోచనలకంటే దేవుని ఆలోచనలు గొప్పవని నేర్చికొని, మరియు అతని మార్గములు దేవుని మార్గములు ఆకాశము భూమికి ఎంత ఎత్తులో ఉన్నదో అదేవిధముగా దేవుని మార్గములు కూడా ఉన్నవని చెప్పెను. అతని ప్రయత్నములు వినుటకు మంచివిగా ఉన్నప్పటికీ దేవుని ఆత్మ వాటిని నెరవేర్చలేదు. అయితే పౌలుకు ఈ సంఘమును దర్శించుటకు అవకాశము దొరికినప్పుడు దేవుడు ఆటంకపరచలేదు.

ఏదేమైనప్పటికీ, పౌలు తన మనసులో ఈ లోకమునకు సువార్త ప్రకటించాలి ఉద్దేశించెను. కనుక అతను రోమ్లో దేవుని రాజ్యమును స్థాపించుటకు మరియు ఇతర దేశములలో కూడా స్థాపించుటకు ఇష్టపడెను. అతను ప్రతి ఒక్కరిని వ్యక్తిగతముగా బలపరచాలని అనుకోప్నాలేదు, అయితే దేశములన్ని కూడా క్రీస్తు చేత బలపరచబడి అతని కార్యములచేత ఆశీర్వదించబడాలని అనుకొనెను. ఎందుకంటె అతను మహిమ కలిగిన తండ్రిని చూసాడు కనుక ఈ లోకమంతా కూడా అతనిదే రాజులకు రాజాని అతని ద్వారానే విజయమని తెలుసుకొనునట్లు ఉద్దేశించెను.

దేశములలో ఉన్న ఆపోస్టులందరు పౌలును ఒక రునస్తునిగా చూసిరి, ధనము కొరకు కాదు అయితే దేవుడు తన శక్తిని అతనికి ఇచ్చాడని చూసిరి. కనుక అతను ఎవరైతే ఎన్నుకొనబడినారో వారికి అతను క్రీస్తు శక్తిని మరియు అధికారమును బట్టి చెప్పువాడుగా ఉండెను. నిజముగా మనము ఈ దినాలలో పౌలు పత్రికలద్వారా దేవుని బహుమానములను అతని శక్తిని పొందుటకు ఒక అవకాశముగా స్వీకరించుచున్నాము. కనుక దీని ద్వారా మేము నీకు రునస్తునిగా మారి, నీవు కూడా అందరికీ రునస్తునిగా ఉండుమని చెప్పెను, ఎందుకంటె పరిశుద్దాత్మ కార్యము చేసి మన హృదయములలో ఉండుటకు సిద్దపడును.

పౌలు చదువుకున్న గ్రీకుల దగ్గరకూడా పనిచేసెను, మరియు వారిని ప్రభువు పౌలు బలహీనముచేత పరిచర్య చేయులాగున స్థాపించెను. గ్రీసులో ఉన్న సంఘములను కూడా అతను సంఘములను కనుగొనెను. అప్పుడు అతను ఈ పత్రిక వ్రాసే సమయములో బార్బెరియన్స్, ఫ్రాన్స్ మరియు జర్మనీ దేశములలో కూడా పనిచేయాలని ఇష్టపడెను. కనుక అతను ప్రతి ఒక్కరికి ఈ సువార్తను అనగా దేవుని కుమారుడైన యేసు మనందరి పాపముల కొరకు సిలువలో మరణించి మనకు విమోచన ఇచ్చాడు అని చెప్పుటకు చాల ఆశ కలిగి ఉండెను. ఈ సమయములో అతని వాక్యములు ఒక రాకెట్ మాదిరి ఉండెను. ప్రేమ కలిగి బర్బరీయన్స్కు అతను వాక్యమును ప్రకటించాలని చాలా ఆశకలిగి ఉండెను. అప్పుడు అతను వారికి రక్షణ అను వాక్యములను వారికి పంచిపెట్టెను. పౌలు ఈ రోమా సంఘమును తన పరిచర్యలలో ఒక ప్రాముఖ్యమైన సంఘముగా ఈ లోకములో ఉంచెను.

ఏదేమైనా దేవుడు అపొస్తలుల ప్రార్థనలకు సమాధానము ఇచ్చెను. అతను తన రాయబారులను రోమాకు నేరుగా పంపలేదు, దానికి బదులు యెరూషలేమునకు వెనక్కు పంపి అక్కడ బందించబడుటకు పంపెను. చాల బాధాకరమైన సంవత్సరాల తరువాత పౌలు అక్కడినుండి విడిపించబడెను. అప్పటికి పౌలులో ఇంకా దేవుని శక్తి తగ్గలేదు.అతను బంధింపబడి ఉన్నప్పుడు కూడా ఈ రోమా సంఘమునకు ఏవిధముగా అయితే తన పత్రికల ద్వారా క్రీస్తు దుర్వార్తను ప్రకటించాడో ఈ దినాలలో కూడా క్రీస్తు సువార్తను ప్రకటించుచున్నాడు.

మనము ఇప్పుడు అనగా బార్బెరియన్స్ మనవాళ్ళమయిన మనకు కూడా పౌలు యేసు సువార్తను ఆనందముతో సంతోషముతో ప్రకటించి అదే సువార్తను పౌలు ఎల్లప్పుడూ ప్రకటించునట్లు చేయాలి. ఒకవేళ పౌలు ప్రకటించుట ఇంకా రోమాకు ముగిసిపోలేదేమో అయితే అదేవిధముగా ఈ లోకమంతటిలో కూడా క్రీస్తు సువార్త ప్రకటించాలి. యోహాను పత్రిక తరువాత ఈ పత్రికే ఈ ప్రపంచమంతటిని మర్చి ఉన్నది, ఎందుకంటె ఈ పత్రిక అనేకులు ప్రార్థనలచేత మరియు పరిశుద్దాత్ముని చేత నింపబడి వ్రాయబడి ఉన్నది కనుక.

ప్రార్థన: ప్రభువా నీవు ఒక రాజువు మరియు నీ సేవకులను నీవు క్రమముగా నడిపించువాడవు. ఒకవేళ నీ చిత్తమునకు మేము ఏదేని తప్పు చేసినట్లయితే దయతో క్షమించు. నీ నడిపింపుతో మేము నడుచుటకు నీ ప్రణాళికలను మరియు ప్రేమను మరియు నీ ఆత్మకు లోబడునట్లు చేయుము. ప్రభువా నీ మార్గములు పరిశుద్దములు కనుక మేము నీకు సమర్పించుకొంటున్నాము. నీ కనికరము నుంచి మేము బయటకు రాకుండా చేసినందుకు నీకు కృతజ్ఞతలు.

ప్రశ్నలు:

  1. ఎప్పటినుంచి దేవుడు పౌలు ప్రణాళికలను పాడు చేసెను?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:03 AM | powered by PmWiki (pmwiki-2.3.3)