Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 125 (Conclusion of John's gospel)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 - 21:25)

4. యోహాను సువార్త యొక్క ముగింపు (యోహాను 20:30-31)


యోహాను 20:30-31
30 మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని 31 యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమి్మ ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.

ఈ అధ్యయము చివరిలో యోహాను దీనిగురించి వ్రాశాడో మనము చేరుకోవచ్చు. అదేదనగా క్రీస్తు పునరుత్థానమునుంచి ఒక వెలుతురును సాదృశ్యముగా చేసి చీకటిని తన వెలుగుతో కప్పి ఉన్నాడని చెప్పెను. అయితే ఎవరైతే అతనిని అంగీకరించారో మరియు విశ్వసించారో వారికి తన పిల్లలగుటకు అధికారమును ఇచ్చెను. కనుక యేసు దగ్గరకు ఒక బంధమును వారు కలిగి ఉన్నారు. అతను మనకు క్రీస్తు పునరుత్థానమును మరియు అతని జీవమును తెలియపరచి మనము అతనిలో ఉండులాగున మరియు అతను జీవము కలిగి ఉన్నది చూడాలాగున వర్ణించెను.

ఇంకా కొన్ని అపొస్తలుల మాటలలో మనము అతని సువార్తలయందు విశ్వాసము కలిగి ఉండునట్లు అతను వ్రాసి ఉన్నాడు.

యోహాను యేసు చేసిన కార్యములను గూర్చి విడతల వారీగా పుస్తకములను వ్రాయలేదు. లేనిచో కొన్నిసార్లు తప్పులు ఉండవచ్చు. అయితే ఏవైతే ప్రాముఖ్యమయ్యాయో వాటిని అతను గొప్పగా చూపాడు. అతని వ్రతాలు ఏదో ఒకరు చెప్తుంటే వ్రాసినట్లుగా లేదు అయితే క్రీస్తు ఆత్మ కలిగి వ్రాసి ఉన్నాడు. కనుక అతను వ్రాసిన ప్రతి మాటకు అతను బాధ్యత కలిగి దేవుని ప్రేమ మన యెడల దేవుని గొర్రెపిల్ల ద్వారా ఉన్నాడని మరియు ఆ గొర్రెపిల్ల ఈ లోక పాపముల కొరకు వధించబడినదని చెప్పెను.

యోహాను ఈ సువార్తను యేసు ఒక నజరేతు మనిషి అని , క్రీస్తు అని, అదే సమయములో దేవుని వాగ్ధానా పుత్రుడని వ్రాసెను. కనుక ఈ నామములచేత అతను యేసును గూర్చిన మాటలు పాత నిబంధన గ్రంథమందు వ్రాయుట వినెను. అప్పుడు అతను ఈ లోకమునకు తీర్పు తీర్చునని కూడా చెప్పెను. కనుక దేవుని గొప్ప ప్రేమ మరియు అతని నిందారహితము మరియు అతని పరిశుద్ధత ఆయన దగ్గరకు వచ్చు ప్రతి ఒక్కరికీ యిచ్చియున్నాడు. కనుక యోహాను క్రీస్తును ఎంతగానో ఘనపరచి ఉన్నాడు. అతను క్రీస్తు గురించి చెప్పిన ప్రకారముగా మనము యేసును విశ్వసించుటకు ఎంతగానో దోహదపడి మనము అఆయన పిల్లలగుటకు అవకాశము కలిగెను.

మనము కేవలము ఒక విశ్వాసముచేతనే ఉండునట్లు చేయలేదు అయితే క్రీస్తుతో బంధము కలిగి ఉండునట్లు ఇష్టపడెను. యేసు కుమారుడైనందున, దేవుడు తండ్రి అయినాడు. అలంటి వాడు మన తండ్రి అయి ఉన్నప్పుడు అతను చాల మంది పిల్లలను స్వీకరించి వారికి నిత్యా జీవమును దయచేయును. మనము క్రీస్తు రక్తము చేత జన్మించబడి మరియు అతని ఆత్మ మనలో ఉంచుకొని ఉండటమే అతని ముఖ్య ఉద్దేశము. కనుక నీవు ఆత్మీయముగా జన్మించావా లేక పాపములో మరణించావా ? దేవుడు నీలో ఉన్నాడా లేక నీవు పరిశుద్ధాత్మను దూరము చేస్తున్నావా ?

రెండవ పుట్టుక అనునది దేవాలము దేవుని కుమారుని యందు మాత్రమే కలుగును. కనుక ఎవరైతే అతని యందు నమ్మకము కలిగి ఉంటారో వారు అతని నిత్యా జీవమును పొందుకొనును. మనకు ఈ జీవితము అతనితో ఎల్లప్పుడు ఉన్నది. ఎవరైతే అతనిలో ఉంటారో , వారిలో అతను ఉంటాడు. కనుక అలంటి విశ్వాసి తన జీవితములో ఫలించి ఆత్మీయముగా ఎంతగానో ఎదుగును. కనుక వారిలో నిత్యజీవమును దేవుడు దయచేయును.

ప్రార్థన: ప్రభువా యోహాను సెలవిచ్చినట్లుగా నీ సువార్తను బట్టి నీకు కృతజ్ఞతలు. ఈ పుస్తకమును బట్టి నీ మహిమను మరియు నీ సత్యమును మేము పొందుకొంటున్నాము. మాకు కృపచేత నూతన జీవితమును ఇచ్చి మమ్ములను విశ్వాసములోనికి నడిపించినందుకు నీ ముందర మేము మోకరిల్లుతున్నాము. మేము నీ ఆజ్ఞలను పాటించునట్లు నీతో సహవాసము కలిగి ఉండునట్లు మాకు సహాయము చేయుము. అప్పుడు మేము నీ గురించిన సాక్ష్యమును మా స్నేహితులకు తెలియచేసెదము.

ప్రశ్న:

  1. తన సువార్త పత్రికలో ముగింపుగా యోహాను దీనిగురించి పరిష్కారము చేసి ఉన్నాడు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:43 PM | powered by PmWiki (pmwiki-2.3.3)