Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 065 (Jesus reveals himself to the healed one)
This page in: -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- English -- Farsi? -- French -- Georgian -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
2. పుట్టుకతో గ్రుడ్డివానిగా ఉన్నవానిని స్వస్థపరచుట (యోహాను 9:1-41)

c) స్వస్థత పొడిని వానికి తాను దేవుని కుమారుడని బయలు పరచుట (యోహాను9:35-41)


యోహాను9:35-38
35 పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచు చున్నావా అని అడిగెను. 36 అందుకు వాడు ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా 37 యేసు నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. 38 అంతట వాడుప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను.

మనము ఈ ఓదార్చే కథను విన్నాము. ఎప్పుడైతే యేసు ఈ మనిషి బహిష్కరమును గూర్చి విన్నాడో అతను దుఃఖము కలిగి ఉన్నాడు. కనుక ఇదే ఓదార్పును , ఎవరైతే విశ్వాసులు తమ కుటుంబముల నుంచి వేరుపరచి ఉంటారో వారికి క్రీస్తు ఒక స్నేహితుడిలాగా ఓదార్పును దయచేస్తున్నాడు. నీవు ఒకవేళ ఈ దిద్దమయిన పరిస్థితులలో ఉన్నట్లతే క్రీస్తు నిన్ను తన దగ్గరకు తీసుకొని నిన్ను ఓదార్చి నేన్ను ఏ క్షణము విడువక నీతోనే ఉండును. కనుక నీవు మనుషుల వైపు చూడవద్దు ఎందుకంటె నీవు నిరుత్సాహము కలిగి ఉండెదవు. అయితే క్రీస్తు వైపు మాత్రమే చూడుము. నీకు ఈ భూమి మీద కానీ లేదా పరలోకమందు కానీ ఎక్కడా నీకు నిరీక్షణ లేదు అయితే అది కేవలము క్రీస్తులోనే ఎందుకంటె అతను నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక .

అప్పుడు క్రీస్తు ఆ యవస్తుడిని ముఖ్యమైన ప్రసం వేసాడు, " నీవు దేవుని కుమారుడు మరియు మనుష్య కుమారుడైన వాని యందు విశ్వాసము కలిగి ఉన్నావా ? " ఇది క్రీస్తు ఆ యవాంస్తుడిని గూర్చిన పాత నిబంధన ప్రకారము ఉన్నదా అనుటకు సాదృశ్యము, దానియేలు 7:13-14, మనుష్య కుమారుడు ఈ లోకమునకు తీర్పుతీర్చువాడని మరియు దేవుని కుమారుడని. యేసు ఇది ఆ యవ్వనస్తుడు దేవుని మహిమను మరియు అతని నిత్యమును కొరకు ఆశకలిగి ఉన్నదా అని కూడా గమనిస్తున్నాడు. అయితే అతను అప్పటికే యేసు ఒక సామాన్యమైన మనిషి కాదని అనుకొన్నాడు, అందుకే అతడిని , " ప్రభువు" అని సంబోదించాడు. అయినప్పటికీ దేవుని కుమారుని గూర్చి ఇంకా ఎక్కువగా తెలుసుకొనుటకు ఆశకలిగి ఉండెను.

అప్పుడు క్రీస్తు ఆ మనిషికి ఒక మహిమ కలిగిన సమాధానమును ఇచ్చెను, " నీవు అతనిని విశ్వాసము ద్వారా ముందుగానే చూసినావు, నీవు చూడకముందే నేను నేనే; దేవుని కుమారుడు నీతో మాట్లాడుతున్నాడు" . ఏది కూడా యేసుకు ఆ మనిషి దగ్గరవడానికి అడ్డుగా రాలేదు. అందుకే అతని ముందర తన తలను దించి, "ప్రభువా" నేను నీవాడను, నీవు నా రాజువు, నా ప్రభువు. నీవు ప్రేమకు సాదృశ్యమైనవాడవు, నేను నీకు బానిసగా ఉండుటకు ఇష్టపడుతున్నాను. " సహోదరా యేసు దేవుని కుమారుడై, మనిషి రూపములో ఉన్నాడని గ్రహించుచున్నావా ? నీవు అతనికి ఒక విశ్వాసిగా కాట్టబడినావా ? నీవు అతనికి నిజముగా ఆరాధించువాడుగా ఉన్నావా ?

యోహాను 9:39-41
39 అప్పుడు యేసుచూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను. 40 ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట వినిమేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. 41 అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.

ఎప్పుడైతే ఆ యెవ్వనస్తుడు తన తలను యేసుకు వంచి తన కృతజ్ఞతను తెలియపరచాడో, అప్పుడు వాడు ఆ విధముగా చేయుటకు అవమానంగా అనుకొనలేదు అయితే క్రీస్తు అందుకు అర్హుడని భావించెను. అయితే యేసు గర్విష్ఠులకు తన తీర్పు వస్తున్నదని చెప్పి, మరియు నిజమును తెలియక తమకు తామే భక్తి గళవారమని అనుకోను వారికి కూడా తీర్పు తీర్చువాడుగా ఉన్నాడు. కనుక పాపులు మరియు ఆ గ్రుడ్డివాడు అలాగే అక్కడ ఉన్న అనేక బ్యభిచారులు కూడా తమ పాపములను ఒప్పుకొనగా క్రీస్తు వారిని సంపూర్ణముగా కడిగి ఉన్నాడు. మరియు ఎవరైతే క్రీస్తు రక్షణను తిరస్కరించారో వారిని కూడా తన తీర్పులోనికి తెచ్చును. వారు తమ జీవితాలలోని ఒక నిత్యా వెలుగును మరియు బైబిల్ కి సంబంధమైన జ్ఞానమును కూడా దీని ద్వారా తీసుకొచ్చిరి. అయితే వారు క్రీస్తు మాటలను తిరస్కరించిన యెడల ఇనక వారికి దొరుకు క్రీస్తు మాటలను వారు పోగొట్టుకొనెదరు. వారు గ్రుడ్డివారుగా, హృదయ కాఠిన్యముగా, మరియు హంతకులుగా ఉంటారు. క్రీస్తు రాకడ మరియు అతని ప్రకటన రెండు విధాలుగా ఉండును: రక్షణ లేకా దండన, ఆశీర్వాదమా లేకా శాపమా. నీ హృదయములో ఏ ఫలితము ఉన్నది ?

akadnna వారిలో అనేకులు పరిసయ్యులు , మరియు వారందరు కూడా యేసు మమ్ములనే తన మాటలచేత అంటున్నాడని అనుకోని, " మేము గ్రుడ్డివారమా?" అందుకు యేసు వారి కపటపును చూసి, " మీరు ఆత్మీయముగా నిజముగా గ్రుడ్డివారని భావించిన యెడల ఖచ్చితముగా మీరు మీ పాపమును బట్టి యోహాను దగ్గర మీ పాపములను ఒప్పుకొనెదరు; అప్పుడు మీరు క్షమాపణ పొంది మీ పాపమునకు ప్రాయశ్చిత్తము పొందియుడెదరు. అయితే మిమ్ములను మీరు మోసపుచ్చుకొని మీకు ప్రతి ఒక్కటి అర్థము అయినట్టుగా ఉండి, మీరు అనుకొన్నది నిజమని భావించిరి. అయితే ఆ విధమైన భావనకలిగి మిమ్ములను మీరు ఘనపరచుకొని గ్రుడ్డివారుగా మరియు న్యాయవంతులుగా మెలిగిరి. కనుక మీరు ఏ చిన్న వెలుగు కాంతిని కూడా పొందలేకపోవుదురు.

ప్రార్థన: ప్రభువైన యేసు నీవు మనిషి రూపములో ఉన్నా దేవుని కుమారుడవు. మేము నిన్ను ఆరాధించి మమ్ములను మేము నీకు సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాము. మేము మాకు కలిగిన ప్రతి ఒక్కటిని బట్టి నీకు కృతజ్ఞత తెలియపరచుకొనుచున్నాము. మా హృదయమందు పాపము ఎన్నటికీ ఉండకుండునట్లు మమ్ములను క్షమించుము ఎందుకంటె మా పాపము మీనుంచి మమ్ములను వేరుపరుచును కనుక .

ప్రశ్న:

  1. యేసు ముందర లోబడుట దేనికి సాదృశ్యము ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:20 AM | powered by PmWiki (pmwiki-2.2.109)