Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 064 (The Jews interrogate the healed man)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
2. పుట్టుకతో గ్రుడ్డివానిగా ఉన్నవానిని స్వస్థపరచుట (యోహాను 9:1-41)

b) స్వస్థపరచబడిన మనిషితో యూదులు మాట్లాడుట (యోహాను 9:13-34)


యోహాను 9:24-25
24 కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా 25 వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగు దును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నా ననెను.

పరిసయ్యులు యేసును బట్టి ఒక బలహీనతను కనిపెట్టుటకు ప్రయత్నించిరి. తిరిగి యేసు దగ్గరకు స్వస్థత కలిగిన ఆ మనిషిని యేసు దగ్గరకు తీసుకొని వచ్చి యేసుకు వ్యతిరేకముగా మాట్లాడులాగున బలవంతము చేసిరి. వారి ధర్మ శాస్త్రము చెప్పినట్లు యేసు కూడా పాపము చేసినవాడు అని చెప్పిరి; అయితే వారికి ఒక క్లుప్తమైన సాక్ష్యము కొరకు ఎదురుచూసిరి. కనుక వారు ఆ మనిషిని యేసులో పొరపాటును పట్టుకొనుటకు బలవంతము చేసిరి, మరియు అతను చేసిన అద్భుతము నజరేయుడైన దేవుడు చేసినది కాదని బలవంతము చేసిరి. అయితే అతను తెలివిగా స్పందించెను, " అతను పాపము కలిగిన వాడు అని నాకు తెలియదు, అయితే దేవునికే తెలుసు. అయితే నాకు ఒకటి మాత్రము తెలుసు- నేను ఒకప్పుడు గ్రుడ్డివాడిని అయితే ఇప్పుడు చూడగలుగుతున్నాను" . కనుక నిజాము ఎన్నటికిని దాగుడు. ఈ అద్భుతము దేవుని క్షమాపణకు ఒక శక్తిలాగా ఉన్నది. ఆ యవ్వనస్తుడి సాక్ష్యము కొన్ని వేలమందికి నమ్మకము కలిగించునట్లుగా ఉన్నది. వారికి నరకమును బట్టి మరియు పరలోకమును బట్టి మర్మము తెలియదు, అయితే నూతన జన్మమును గూర్చి తెలిసినది. కనుక ప్రతి ఒక్కరు కూడా , " నేను ఒకప్పుడు గ్రుడ్డివాడిని అయితే ఇప్పుడు చూడగలుగుతున్నాను " అని .

యోహాను 9:26-27
26 అందుకు వారు ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా 27 వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను.

అయితే ఆ యవ్వనస్తుడు చెప్పిన విషయములో వారు తప్పులను చూచుటకు పరిసయ్యులు తిరిగి ఆ మనిషిని అదే సంగతిని తిరిగి చెప్పమని అడిగిరి. అప్పుడు అతను కోప పది, " మీరు మొదటి సారి చెప్పినప్పుడు అర్థము కాలేదా ? మీరు అదే సంగతిని మరల విని అతని శ్గిష్యులగుట ఇష్టపడుతున్నారు? "

యోహాను 9:28-34
28 అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము; 29 దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి. 30 అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను. 31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును. 32 పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు. 33 ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను. 34 అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి.

ఆ యవ్వనస్తుడు ఈ విధముగా చెప్పిన తరువాత , ఆ పెద్దమనుషులు ఈ విధముగా అనిరి, " మేము కాదు నీవే ఆ మోసగానికి శిష్యుడవు, మేము దేవునితో నేరుగా మాట్లాడిన మోషేను వెంబడించుచున్నాము." ఎందుకంటె యేసు ముందుగానే చెప్పినట్లుగా ఎవరైతే మోషేను అర్థము చేసుకున్నారో వారు అతని మాటలను బట్టి వెంబడించెదరు అని. అయితే వారు మోషే మాటలను వినక వారికి వారే తీర్పుతీర్చుకొన్నారు, కనుక వారు అతనిని అర్థము చేసుకొనలేదు మరియు అతను ఏ విధమైన ఆత్మచేత మాట్లాడినదో కూడా అర్థము చేసుకొనలేదు.

అప్పుడు స్వస్థత కలిగిన వాడు ఈ విధముగా చెప్పెను, " ఎవరైతే పుట్టుకతో గ్రిడ్డివానిగా ఉన్నదో వాడు శక్తి కలిగిన వాడు. ఎందుకంటె అతను బలవంతుడు మరియు సమర్థుడు. అతని దయాగుణముతో నన్ను నిందించలేదు; అతను నా నుంచి డబ్బును ఆశించలేదు కానీ తన ప్రేమను పంచి నాకు చూపును ఇచ్చెను. అతను నా నుంచి కనీసము కృతజ్ఞత కూడా కోరుకొనలేదు అయితెహ్ నాలో నిందారహితమును కనుగొనెను."

అప్పుడు ఆ యవ్వనస్తుడు ఒప్పుకొనెను, " మనలో ఉన్న ప్రతి ఒక్కరికి పాత నిబంధన ప్రకారముగా దేవుడు గర్విష్ఠుల యొక్క ప్రార్థనను వినడు. ఎందుకంటె మనిషి పాపము దేవుని ఆశీర్వాదమును పొందుకొనదు. అయితే ఎవరైతే వారి పాపమును బట్టి నాలుగగొట్టబడి పరిశుద్దుడైన దేవుని ఎదుట ఆ పాపమును ఒప్పుకొని , దేవుని యందు విశ్వాసము కలిగి కృతజ్ఞత కలిగి ఉండునో వాడితో దేవుడు మాట్లాడును. "

" మీలో ఎవ్వరు నా కన్నులను తెరువలేదు, ఎవ్వరు ఈ కార్యమును చేయలేరు , ఎందుకంటె అందరు పాపము చేసి ఉన్నారు కనుక అయితే క్రీస్తు ఏ పాపము చేయనటువంటి వాడు. కనుక అతను నన్ను స్వస్థపరచుటకు సమర్థుడు, అతను పాపములేని వాడు కనుక దేవుడు అతని యానాడు నివాసము కలిగి ఉన్నాడు." ఈ విధముగా క్రీస్తును బట్టి ఆలోచన చేయుటకు ఆ గ్రుడ్డివానికి అవకాశము దొరికినప్పుడు, క్రీస్తును గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొనెను.

అప్పుడు వ్యక్తిగతముగా గొప్పలు చెప్పే భక్తిగల వాడు ఈ విధముగా చెప్పెను, " నీకంటే ఎవ్వరూ ఎక్కువగా చెడిపోలేదు, మీ పితరులు కూడా నీ మాదిరే ఉన్నారు. నీ ద్రుమార్గము నీ గ్రుడ్డితనములో బయటకు వచ్చినది." అయితే ఈ భక్తి కలిగిన వారు ఆ గ్రుడ్డివాని కంటే మరి ఎక్కువైనా గ్రుడ్డివారని వారికి తెలియలేదు. అయితే క్రీస్తు ఆ మనిషిని వారి కొరకు ఒక అపొస్తలుడుగా వాడుకొనియున్నాడు, వారికొరకు అతను ఏమి చేయగలడో నిరూపించుటకు అతడిని వాడుకొనెను. అయితే వారు ఆ స్వస్థత కలిగిన మనిషిద్వారా క్రీస్తు బోధనలను వ్యతిరేకించిరి. కనుక వారు అతనిని ఆ గుంపు నుండి బయటకు త్రోసివేసిరి. ఇది మొదటగా ఆ సంఘము లోపల జరిగి తరువాత అతను క్రీస్తు శిష్యుడను అని చెప్పినతరువాత బహిరంగముగా అతనిని త్రోసివేసిరి. అతను ఆదినమున ఒక త్రోసివేసి స్వస్థత కలిగిన వాడు, అయితే ఇది వారు క్రీస్తు ఆత్మను అర్థము చేసికొనలేదనడానికి ఒక నిదర్శనంగా ఉన్నది.

ప్రశ్న:

  1. ఈ యవ్వనస్తుడు చర్చలో ఉన్నప్పుడు ఏమి తెలుసుకొనెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:19 AM | powered by PmWiki (pmwiki-2.3.3)