Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 018 (The first six disciples)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
B - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 1:19-28)

3. మొదటి ఆరు శిష్యులు (యోహాను 1:35-51)


యోహాను 1:43-46
43 మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొనినన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. 44 ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు. 45 ఫిలిప్పు నతనయేలును కనుగొనిధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. 46 అందుకు నతనయేలునజ రేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.

మనము ముందు వచనములను చదివినట్లయితే నాలుగు దినములు జరిగిన వాటిని తెలుసుకోవచ్చు. మొదటి దినమున యెరూషలేము పెద్దలు వచ్చినారు; రెండవదినమున యోహాను వారికి యేసును దేవుని గొర్రెపిల్ల అని బోధించాడు; మూడవ దినమున యేసు నలుగురు శిష్యులను; మరియు నాలుగవ దినమున ఫిలిప్, నతనయేలు లను క్రీస్తు పిలిచియున్నాడు.

ఫిలిప్పును చూశినది యేసే. అయితే ముందు దినములలో యోహాను ద్వారా క్రీస్తు గురించి వినియున్నాడు. ఎప్పుడైతే యోహాను క్రీస్తును దేవుని గొర్రెపిల్ల అని సంభోదించాడో ఫిలిప్పు ఆశ్చర్యపడ్డాడు. ఫిలిప్పు క్రీస్తు దగ్గరకు వెళ్ళుటకు ధైర్యాము చేయక పోయెను ఎందుకంటె అతను క్రీస్తుతో ఉండుటకు యోగ్యుడు కానని ఎంచుకొనెను. కనుకనే క్రీస్తు అతని దగ్గరకు వెళ్లి తనను వెంబడించుమని చెప్పెను.

యేసుకు మనుష్యులను ఎన్నుకొనుటకు అధికారము కలవాడు, ఎందుకంటె అతనే వారిని చేసియున్నాడు కాబట్టి. మనము అతనిని తెలుసుకోవడము మన చిత్తము కాదు అయితే అతనే మనలను ముందుగా చూసియున్నాడు; కనుకనే మనలను వెంబడించుమని ఆయన పిలిచియున్నాడు.

దేవుని పిలుపు లేనిదే వంబడించడము లేదు, అలాగే ఆయన ఆజ్ఞ లేనిదే సేవచేయడమనేది లేదు. ఎవరైతే క్రీస్తు పిలుపు లేకుండా ఆయన సేవలో ఉన్నట్లయితే వేరేవారిని శ్రమపెట్టి అతను కూడా శ్రమలోనికి వెళుతాడు. అయితే ఎవరైతే క్రీస్తు పిలుపును బట్టి వస్తారో వారు క్రీస్తు సేవలో సంతోషముగా ఉంటారు. అప్పుడు ప్రతి సమయములో క్రీస్తు వారికి బాధ్యతకలిగి ఉంటాడు. ఫిలిప్ తన షెహితుడైన నతనయేలు కొరకు వెళ్లి ప్రకటిస్తాడు, " మేము మిస్సయ్యాను కనుగొన్నము" "నేను కనుగొన్నాను " అని కాదు, అయితే తనను తానూ కలుపుకొని సంఘములో చెప్పి ఉన్నాడు.

క్రీస్తు తన పనిని బట్టి ముందుగానే చెప్పినట్లుగా కనబడుచున్నది. యేసేపు తన తండ్రిదగ్గర పెంచుకున్నవాడుగా ఉన్నాడు. యేసు బేత్లెహేములో తన పుట్టుకను బట్టి చెప్పలేదు, కనుక శిస్యులకు ఈ విషయము గూర్చి ఏమి తెలియదు. నతనయేలు ఈ సమయములో చాలా ప్రావీణ్యుడుగా ఉన్నాడు. కనుకనే మోషే గ్రంధములను ప్రవక్తల మాటలను వెతుకుచున్నాడు, మరియు వాగ్దాన క్రీస్తును బట్టి నేర్చుకున్నాడు, వచ్చువాడు దావీదు వంశమందు బేత్లెహేములో జన్మిస్తాడు అని, మరియు తన ప్రజలకు రాజుగా ఉంటాడు అని. అయితే నతనయేలు ఈ విషయాన్నీ నమ్మలేకపోయాడు ఎందుకంటె క్రీస్తు ఇంట చిన్న పట్టణములో జన్మించగలడ్డా అని, ఎందుకంటె ఈ పట్టణమును పాత నిబంధన గ్రంథమందు కూడా ప్రవచింపబడలేదు కనుక. ఈ పట్టణము రోమాకు వ్యతిరేకం అని నాథనాలుకు తెలుసు. ఈ సత్యము పిలుపుకు తెలియదు. అయితే అతని ఆనందము క్రీస్తులో గొప్పదిగా ఉండినది. అందుకే " రండి చూడండి" అని చెప్పాడు. కనుక దేవునితో వాదించవద్దు, అయితే ఆయన శక్తిని ప్రసన్నతను అనుభవించు. మన సాక్ష్యములు మన ఆలోచనలమీద ఆధారపడి ఉండదు అయితే సత్యమైన క్రీస్తు విశ్వాసముతో మాత్రమే.

ప్రార్థన: ప్రియమైన యేసయ్య మా హృదయములలో కలిగించిన ఆనందమును బట్టి నీకు కృతఙ్ఞతలు. కనుక మమ్ములను ఏవిధముగా నీ సందిలో నడిపించావో అదేవిధముగా ఇతరులను కూడా నడిపించు. మేము కూడా స్వతంత్రముగా నిన్ను ప్రకటించి మా నుంచి భయమును తొలగించి నిన్ను ప్రకటించు ధైర్యము దయచేయుము.

ప్రశ్న:

  1. ఏ విధముగా మొదటి శిస్త్యుడు క్రీస్తును ప్రకటించాడు?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:26 AM | powered by PmWiki (pmwiki-2.3.3)