Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Tracts -- Tract 09 (You shall love the LORD your God with all your heart, with all your soul, and with all your strength)
This page in: -- Armenian -- Baoule -- Burmese -- Chinese -- Dagbani? -- Dioula -- English -- French -- German? -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Japanese -- Korean? -- Lingala? -- Maranao -- Nepali? -- Peul? -- Somali -- Spanish -- Sundanese -- TELUGU -- Thai? -- Turkish? -- Twi? -- Uzbek -- Yoruba

Previous TractNext Tract

చిన్న పత్రికలు - పంచడము కొరకు బైబిల్ వాక్యములు

చిన్న పత్రిక 9 -- నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణఆత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను (ద్వితీ 6:5; మత్త 22:37)


మనుస్యులు తమ భోజనపు బల్ల మీద ఆహారముందరునట్లు వారి జీవితములో కష్టపడి, చెమటోడ్చి ఆహారమును సమకూర్చుకొని వారి మోహములో సంతోషమును నింపుకొందురు, అయిననూ దేవునిని నిర్లక్ష్యము చేసి వారి జీవితములో ఆయనకు స్థానము ఇయ్యక ఉందురు. (ఆది 3:19)

కొంతమంది మనుష్యులు సర్వశక్తి అయినా దేవుని యెడల భయముకలిగి ఉందురు, పరిశుద్దుడైన దేవుని తీర్పును గూర్చి భయపడి, ఆయన కొరకు ఉపవాసముండి ప్రార్థన చేసి, దానము, మరియు యాత్ర చేయువారుగా ఉంటారు , అయినాను వారి మంచి కార్యాలు వారిని నిత్యా నరకము నుండి కాపాడుతైయి అని గ్రహింపరు. (యాకోబు 2:19)

ఒక పొద్దుతిరుగుడు చెట్టు ఏ విధముగా ప్రతి రోజు సూర్యుడు ఉదయించు వైపు తిరిగి , తన పంటకాలమును అభివృద్దిచేసుకొనునో అదేవిధముగా కొంతమంది మనుస్యులు తమ దేవునివైపు తిరిగి వారి జీవితములను ఫలభరితులుగా చేసికొందురు. అలాంటి వారు నిత్యా సమృద్ధిగల పంటను కూర్చుకొందురు.

ఏ రకమైన మనిషివి నీవు ? రోజులో ఎన్ని నిమిషాలు దేవునిగూర్చి అలూచనచేస్తున్నావు , ఎన్ని మారులు ఆయనను సేవిస్తున్నావు? ప్రేమ గూర్చి ఏమి వ్రాయబడినాగో జ్ఞాపకము చేసుకో.

"మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునై యుందును.ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.(కొరింతి 13:1-2)

పాతనిబంధన గ్రంధములో ఒక ముఖ్య ఆజ్ఞ , నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బ్లమోతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.కనుక మనము ఈ విధముగా దేవునిని ప్రేమిస్తున్నామా? మన పూర్ణ హృదయముతో,ఆత్మతో బలముతో దేవునిని ప్రేమిస్తున్నామా?

ఎవరైతే ఈ మాటలను ధ్యానించియున్నపుడు, క్షచితముగా తమ హృదయమోతో దేవునిని ప్రేమించలేదని చెప్పుదురు, " నేను నా పూర్ణహృదయముతో, పూర్ణ ఆత్మతో , పూర్ణ బలముతో , మరియు నా మనుసు దేవుని ఆలోచనతో నింపబడలేదు, మరియు ఆయన సముఖమున నేను లేక ఉన్నాను. నా గుండె దేవుని కొరకు కొట్టుకొనక నా హృదయము దేవునిమీద ప్రేమలేక మరియు నా అంతరంగము ఆయన అడుగుజాడలలో నడవలేదు, నేను దేవునిని నా అంతటిలో ప్రేమించినాను నా సమయమును, నా శక్తిని, నా ధనమును ఈ లోకములో వ్యర్థముగా ఖర్చు చేసియున్నాను".

సర్వశక్తుడైన దేవుడు మనకొరకు , అనగా మనము మనలను మనమే పూర్ణ హృదయముతో, పొర్రనాయాత్మతో, పోర్ర్ణశక్తితో ప్రేమిష్టున్నాము అని తెలిసికొని ఆయన తట్టు తిరుగుమని ఎదురుచూస్తున్నాడు. మనకు దేవునిద్వారా ఆశీర్వాదము పొందుకొనియున్నాను ఆయనను మన సంపూర్ణ హృదయముతో ప్రేమించలేదు. ఇదే మన పాపము .

మనము దేవుని ఉగ్రతను పొందుకొంటున్నాము , మనకు కలుగు శాపము మనకు మరణమును తెచ్చ్చును , అయితే మనము చెదరిన వారముగా ఉన్నట్లయితే దేవుడు మనయెడల , మొదటివాడు, కడపటివాడు గా ఉండనేరడు .

సృష్టికర్త అయినా దేవుడు మనలను అర్థము చేసికొని మనపాపములను క్షమించి, మనలను విడువక ప్రేమించి తన కుమారుడిని ఈ లోకమునకు పంపి తన ప్రేమను మనయెడల తెలియపరచెను. క్రీస్తు తన ముఖ్య ఆజ్ఞను తన శిష్యులకు ఈ విధమైన ప్రార్థన నేర్పిచ్చాడు :

"కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి . పరలకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా ఋణాష్టులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము". ఆమెన్ (మత్త 6:9-13)

క్రీస్తు తనను తానూ మహిమపరచుకొనక తన ఆత్మీయ తండ్రి అయినా దేవునిని మహిమపరచియున్నాడు, పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది" (యోహాను 4:34)

కాబట్టి తన తండ్రి ప్రేమను ప్రజల యెడల ఈ విధముగా తెలియపరచెను, క్రీస్తు ప్రతి వారిని స్వస్థపరిచి, ప్రతి రోగమును బాగుచేసి, ప్రతి దెయ్యము పట్టిన వారికి విడుదల ఇచ్చ్హి, మృతిపొందిన వారిని తిరిగి లేపి, తన ప్రేమను ఈ విధముగా వెల్లడిపరచియున్నాడు. తన పరిహారముచొప్పున మన ప్రతి పాపమును కడిగి తన ప్రియా బిడ్డలుగా చేసియున్నాడు. దేవునియొక్క ప్రేమ తన కుమారుడైన క్రేస్టుద్వారా తెలియపరచాడు. కనుక ఎవరైతే ఆయనయందు విశ్వాసముంచి ఆయన యందు నమ్మకము కలిగియుందురో వారికి ఆయన నిత్యజీవమును దయచేసియున్నాడు. మనము కూడా క్రీస్తువలె కృపాకలిగిన వారుగా ఉండాలని తన కృపను మనయెడల చూపియున్నాడు.

విమోచనముపొందిన తన శిష్యులవలె , మనమీద తన ఆత్మను ఉంచి తన కృపకొరకు పాత్రులముగా చేసియున్నాడు. పౌలు చెప్పినట్టుగా తనప్రేమను మనపట్ల ఈ విధముగా చూపించెను, "ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది" (రోమా 5:5)

క్రీస్తు పరిశుద్దాత్మ మనము పూర్ణ హృదయముతో, పూర్ణఆత్మతో, పూర్ణబలముతో ఆయనను సేవించి సంతోషముతో ఆనందముతో ఆయనను ఘనపరచుట మనకు నేర్పించును. ఆత్మా మనలను క్రీస్తు జీవించునట్లు మనము జీవించునట్లు నేర్పును. దేవుడు మంకు పిరికి ఆత్మా ఇవ్వలేదు అయితే తన శక్తిచేత నింపి ఆయనను ఘనపరచునట్లు మనకు సహాయము చేసెను.

ప్రియా చదువరి .
ఇక్కడ వ్రాయవడిన ప్రతి వాక్యమును కంఠస్థము చేసి వాటి ప్రకారము జీవించినయెడల నీవు దేవుని ప్రేమచేత నింపబడి యుందువు. కనుక దేవుని ఆత్మా నీ మీద ఉండునట్లు ఆయనకు ప్రార్థన చేయుము.


దేవుని ఆజ్ఞలను ఆయన వాగ్దానములను నీవే ఇంకా చదవాలనుకుంటున్నావా ?

నీవు క్రీస్తుని ధ్యానించాలనుకుంటే ఈ విధమైన ఐదు వందల దేవుని ఆగని పత్రికలను నీకు పంపుటకు మేము సిద్ధముగా ఉన్నాము. నీవు దేవుని ఆత్మతో నింపబడాలని ఉద్దేశము కలిగిఉన్నట్లైతే ఆయన నీ ఉద్దేశమును నెరవేర్చును.


దేవునిని మనుస్యులను ప్రేమించునట్లు నీ స్నేహితులకు నేర్పించు.

దేవుని ప్రేమకు ప్రతి రూపమైన ఈ ప్రేమను నీ పొరుగువారికి నీ మిత్రులకు పంచుటకు ఈ పత్రికలూ నీకు పంపుటకు మేము సిద్ధముగా ఉన్నాము. దయవుంచి నీకు ఎన్ని పత్రికలూ అవసరమో మాకు తెలియపరచగలవు.

మా చిరునామా
WATERS OF LIFE
P.O. BOX 60 05 13
70305 STUTTGART
GERMANY

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on September 21, 2018, at 12:27 PM | powered by PmWiki (pmwiki-2.3.3)