Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Tracts -- Tract 02 (God, be Merciful to Me a Sinner!)
This page in: -- Armenian -- Baoule -- Burmese -- Chinese -- Dagbani? -- Dioula -- English -- French -- German? -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Japanese -- Korean -- Lingala -- Maranao -- Nepali? -- Peul? -- Somali -- Spanish -- Sundanese -- TELUGU -- Thai -- Turkish? -- Twi -- Uzbek -- Yoruba

Previous Tract -- Next Tract

చిన్న పత్రికలు - పంచడము కొరకు బైబిల్ వాక్యములు

చిన్న పత్రిక 2 -- దేవా పాపినైన నన్ను కరుణించు!


ఒక గ్రుడ్డి బోధకుడు తన దేశములో కొన్ని గృహాలను దర్శించే సమయములో , తన దగ్గర ఉన్న బైబిల్ గ్రంధాన్ని చదువుతూ ఉన్నాడు , ఆ సమయంలో అక్కడ ఉన్న వారందరూ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు , ఎందుకంటే తనకు చూపు లేదు కనుక తన చేతి వ్రేళ్ళ ద్వారా ఒక లిపి ద్వారా ముద్రించ బడినటువంటి బైబిల్ గ్రంధాన్ని అతను చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారందరు అయన నోటి నుంచి వస్తూ ఉన్న వాక్యాన్ని శ్రద్దగా వింటున్నారు . ఆ గ్రుడ్డి బోధకుడు ఈ విధముగా చదవడం ప్రారంభించాడు .

"ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి , వారిలో ఒకడు పరిసయ్యుడు , ఒకడు సుంకరి , పరిసయ్యుడు నిలువబడి దేవా , నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మానుషేలనైనను ఈ సుంకరివలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను . వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదనంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నన్నని తనలోతాను ప్రార్తించుచుండెను . అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు , దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను" (లూకా 18:10-13)

ఆ బోధకుడు చదవడం ముగించిన తరువాత అక్కడ ఉన్న ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు " ఇక్కడున్న ప్రతిఒక్కరు మిమ్ములను మీరు పరీక్షించుకోండి , ఇక్కడున్న పరిసయ్యుని వాలే పోలి ఉన్నామా ? లేక సుంకరి వాలే ఉన్నామా ? . పరిసయ్యుడు అంటున్నాడు నేను చోరులను , అన్యాయస్తులను , వ్యభిచారులు వాలే ఉండక వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచూ , నా సంపాదనంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నాను ?"

అయితే సుంకరి ప్రార్థించే సమయములో ఎటువంటి శబ్దము చేయక తనలో తానూ , ప్రార్థిస్తున్నాడు " దీనులైన వారు ప్రార్థించుటకు అవకాశము కలిగించిన దేవునికి స్తోత్రము కలుగును గాక , సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు తన కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు . పాపినైనా నన్ను కరుణించు ". కాబట్టి ఈ ఇద్దరిలో నీవు ఎవరిని పోలి ఉన్నవో ఒక్కసారి ఆలోచించు.

అక్కడున్న ప్రజలను బట్టి ఆ గ్రుడ్డి బోధకుడు ఈ విధముగా చెప్పడం మొదలుపెట్టాడు . " దేవుడు బండలాంటి హృదయము కలిగి , గర్వముతో తమ హృదయములను , మనసులను మార్చుకొని ఉంటారో అలాంటివారు దేవుని సత్యమును తెలుసుకొనక , దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండక దేవుని ప్రేమకు దూరమై వారు చేసినది తరుచు జ్ఞాపకముంచుకొని ఒక విధమైన స్వమనస్తత్వము కలిగి ప్రార్థించెదరు . నేను నిజముగా దేవునికి కృతజ్ఞతా స్త్రోత్రము చెల్లించుచున్నానా ? లేక నన్ను నేను ఘనపరుచుకుంటున్నానా ? అని తనకు తానూ ప్రశ్నించుకోవాలి .

అక్కడున్న వారిలో ఒక యవ్వనస్తుడు లేచి ఆ గ్రుడ్డి బోధకుడిని ఈ విధముగా అడగడం మొదలుపెట్టాడు "మనమెందుకు ప్రార్థించాలి ? ప్రార్థన ద్వారా ఏమైనా ప్రయోజనము ఉన్నదా ? మన ప్రార్థనను ఎవరు వింటారు ? . బోధకుడు సమాధానమిస్తూ " చూపు కలిగిన వాడు భూమి తరువాత ఏమి ఉన్నదో చూడగలడా ? భూమి గుండ్రముగా ఉన్నాడని నమ్మి దాని తరువాత ఏమి ఉన్నదో ఎరుగడు . ఒకడు కైరో నుంచి పారిస్ లేదా కాసాబ్లాంకా నుంచి టోక్యో కు ఫోన్ చేస్తే అవతలి వారిని ప్రత్యక్షంగా చూడకపోయినా వారి స్వరమును వింటారు . కనుక తగ్గించుకొనబడి , ప్రేమ కలిగి తమ హృదయములను దేవునికి సమర్పించి యదార్ధమైన ప్రార్థన చేయువారి మోర ను విని వారికి తగిన సమాధానమును దేవుడు దయచేయగలడు .

బోధకుడు మరల వాక్యమును ధ్యానిస్తూ , " చోరులను క్షమించి వారిని తమ జీవితములనుండి పరిశుద్ధతమైన తన వైపు నడిపించిన దేవునికి స్తోత్రములు . ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడి మీద తన సమస్త భారమును మోపి తన ప్రభువుగా , తన దేవునిగా ఉంది , ఆత్మయందు శక్తియందు ,బలముయందు దేవుడైన ఆయనకు స్తోత్రము ". అలాగే తన పాపములకు న్యాయము తీర్చు దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయన యందు సంపూర్ణ నమ్మకము ఉంచి , తన ప్రభువుగా తన పాపమునుబట్టి తీర్పు తీర్చు పరిశుద్దుడుగా తనను తానూ తగ్గించుకొని తన విశ్వాసమును కాపాడుకొంటూ , దేవుని పరిశుద్ధతకు సమర్పించుకొని , తీర్పు కంటే దేవుని కరుణ గొప్పదని యెరిగి తన దోషములను క్షమించ గలడని తెలుసుకొని , ఈవిధముగా మొరపెడుచున్నాడు . 'దేవా, పాపినైనా నన్ను క్షమించు!' "

పశ్చాత్తాపమునుబట్టి గ్రుడ్డి బోధకుడు చెప్పడం సాగిస్తున్నాడు " నేరము చేసిన పాపాత్ముడు ప్రార్థిస్తూ ,నేను పాపినే కాక అపవిత్రమైన వాడను , మలినమైన వాడనై దేవుని ద్వారా ద్వేషించబడిన వాడినై , దేవుని దృష్టియందు చెడ్డవాడినై ఉన్నాను". అని తనను తానూ రిక్తునిగా తగ్గించుకున్నాడు.

సమాజములో చాల మంది , మేము పరిశుద్ధులమని , నీతి న్యాయములు కలిగిన వారమని , తమకు తాము గౌరవము తెచ్చుకొని ఉంటారు . అయితే ఎవరైతే దేవుని సన్నిధిలో నిలుచుండి తమకు తాము దేవునికి సమర్పించుకుంటారో , వారు దేవుడు తప్ప ఎవరును నీతిమంతుడు లేదని తెలుసుకొందురు". తన తప్పిదములు గ్రహించి దేవుని చేత క్షమాపణ పొంది , తన స్వభావమును మార్చుకొని తన జీవితమును మార్చుకొని ఈ సుంకరివలె ఉండెదరో ఆలాంటి వారిని దేవుడు ఎంతగానో దీవిస్తాడు . ఎవరైతే తమ పాపములకు క్షమాపణ పొంది వారి జీవితములను మార్చుకొందురో వారి యెడల దేవుని కరుణ ఉండగలదు .

అప్పుడు అక్కడున్న ప్రజలను చూసి ఆ గ్రుడ్డి బోధకుడు ఈ విధముగా అడుగుతున్నాడు . " మరియ కుమారుడైన యేసు యొక్క తీర్పు ఈ విషయములో ఏ విధముగా ఉన్నదో తెలుసుకోవాలనుకున్నారా ? . అప్పుడు తన పరిశుద్ధ గ్రంధాన్ని తెరచి తన చేతి వ్రేళ్ళ ద్వారా లిపిని ఈ విధముగా చదువుతున్నాడు .

అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును".( లూకా 18:14)

ప్రియా చదువరి ,
నిన్ను నీవు పరిశీలించుకో , నీ మంచి పనులను బట్టి , నీ అతిశయమును బట్టి , నీ ప్రవర్తనను బట్టి తృప్తికలిగి ఉంటున్నావా ? లేక నీ పాపమును బట్టి , నీ దోషములను బట్టి నీ జీవితమును బట్టి సిగ్గు పడుచున్నావా ? జాగ్రత్త ఎవరైతే గర్వముకలిగి , హెచ్చించబడి ఉండెదరో వారు క్రమముగా పడిపోయెదరు . అయితే తమను తాము తగ్గించుకొని , పశ్చాత్తాపహృదయము కలిగి ప్రభువు వైపు మళ్ళేదరో , వారి యెడల దేవుని ప్రేమ , కృప మరియు ఆయన కరుణ వారి పట్ల ఉండును.

పశ్చాత్తాప ప్రార్థన
వ్యభిచారము చేసి పాపము చేత నింపబడి , ఒక స్త్రీ యొక్క పెనిమిటి మరణానికి కారకుడైన , ప్రవక్త దావీదు ప్రార్థించినట్టుగా.

"దేవా నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివెవుము . నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము . నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమేలాప్పుడు నాయెదుట నున్నది . నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ ద్రుష్టిఎదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడువుగా అగపడుదువు . నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను . నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు .నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము .ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును . నా పాపములకు విముఖుడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము . దేవా , నాయందు శుద్ధహృదయము దలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టింపుము . నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము .నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము . అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను భోధించెదను పాపులును నీ తట్టు తిరుగుదురు . దేవా , నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును . ప్రభువా , నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము . నీవు కోరువాడవు కావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు . విరిగినమనస్సె దేవునికిష్టమైన బలులు దేవా . విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు". (కీర్తన 51:1-17 ).


దేవుని వాక్య ధ్యానము

దేవుని యొక్క పరిశుద్ధతాను , ఆయన యొక్క ప్రేమను తెలుసుకోవాలనుకుంటే . మా చిరునామాకు వ్రాసినయెడల మీకు ఉచితముగా ఈ పత్రికను పంపుటకు సిద్ధముగా ఉన్నాము .


మీ ఇరుగు పొరుగున వారికి ఈ సువార్త రక్షణ వాక్యమును పంచుకోగలరు

ఒకవేళ మీకు ఈ పత్రిక ద్వారా మార్పు పొందిన వారైతే , మీ స్నేహితులకు , మీ ప్రియులకు , మీ సంబంధీకులకు ఈ పత్రికను అందజేయాలనుకుంటే , మీకొరకు మితమైన ఈ పత్రికలను పంపుటకు మేము సిద్ధముగా ఉన్నాము . దయచేసి మీ చిరునామా వ్రాయుట మరువవద్దు . మీ సమాధానముకొరకు ఎదురుచూస్తూ ఉంటాము .

మా చిరునామా
WATERS OF LIFE
P.O. BOX 60 05 13
70305 STUTTGART
GERMANY

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on September 20, 2018, at 11:53 AM | powered by PmWiki (pmwiki-2.3.3)