Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 018 (The Law, or the Conscience Condemns Man)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)
2. యూదులకు దేవుని ఉగ్రత బయలుపరచుట (రోమీయులకు 2:1 - 3:20)

b) ధర్మశాస్త్రము లేక మనసును మనిషి ఖండించుట (రోమీయులకు 2:12-16)


రోమీయులకు 2:12-16
12 ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందు దురు. 13 ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. 14 ధర్మ శాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 15 అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు 16 దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మను ష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. 

రోమా సంఘములో రెండు గుంపులు కలవు: క్రైస్తవులైనటువంటి యూదులు, మరియు గ్రీకు రోమా నుంచి వచ్చిన విశ్వాసులు. మొదటి వారు పాత నిబంధన ప్రకారముగా వారి ఆచారములు బట్టి నడుచుకొని వాటి జ్ఞానము కలిగి ఉన్నవారు. అయితే క్రైస్తవులు వారు జీవితములను గురించిన సమాచారం తెలియదు కనుక వారు క్రీస్తు శక్తి కలిగిన ఆత్మయందు నడుచుకొన్నవారు.

పౌలు చెప్పినట్లు దేవుడు వారిని మరియు వారి ధర్మశాస్త్రమును ఖండించును, ఎందుకంటె అది పరిశుద్దముకలిగి లేదు కనుక. దేవుని వాక్యము వినుట రక్షణలోనికి నడిపించదు, మరియు ఆత్మీయ ఆలోచనలు, ప్రార్థనలు చాలవు, అయితే తగ్గింపు కలిగిన హృదయమును దేవుడు కోరుకొనుచున్నాడు. తన మాట ద్వారా మరియు తన వాక్యము ద్వారా మన జీవితాలు సంపూర్ణముగా మార్చబడి ఉండాలని అతను కోరుకొనుచున్నాడు. యూదులు తమ ప్రతి పాపమును బట్టి వారి ధర్మశాస్త్ర ప్రకారముగా ఖండించబడతారు. ఎందుకంటె ప్రతి దోషము కూడా దేవుని వ్యతిరేకమైనదే.

ఎప్పుడైతే పౌలు ఈ సత్యములను వ్రాసి ఉన్నదో, తన హృదయములో క్రైస్తవ యూదులు వాదించుట వినెను: "మాకు ధర్మశాస్త్రము లేదు, మరియు మాకు పది ఆజ్ఞలు కూడా లేవు: కనుక ఆ తీర్పు దినమందు మాకు తీర్పు తీర్చుటకు దేవుడెవరు? మేము ఆ తీర్పుదినము నుండి విడిపించబడినవారము.

అప్పుడు వారికి అతను ఈ విధముగా సమాధానము చెప్పెను, దేవుడు అన్ని సమయాలలో ఒకేవిధముగా ఉంటాడు, ఒకవేళ వారు ధర్మ శాస్త్రమును ఖండించి, లేక పది ఆజ్ఞలను వినక మరియు వాగ్దానము కలిగి, దేవుని ప్రేమను తెలుసుకొనలేక ఉందురు; సృష్టికర్త ప్రతి ఒక్కరిలో అతని దగ్గరకు వెళ్లే మనసును ఉంచాడు. ఈ హెచ్చరిక ఒకవేళ అప్పుడప్పుడు మౌనముగా ఉండవచ్చు. అయితే ఇది నీకు నీ తప్పిదములను స్పష్టముగా తెలియజేస్తుంది. అప్పుడు నీ యందు ఉండు కష్టము తొలగి పోవును. ఈ విధమైన దేవుని రూపము నీలో మౌనముగా ఉండదు. మరియు దేవుని కృప ద్వారా తప్ప నీకు విశ్రాంతి దొరకదు. కనుకనే అనేకులు చాల బలహీనతగా కనపడతారు, ఎందుకంటె వారి మనస్సాక్షిగా వారు జీవించారు అయితే ఈ లోక ఆశలను బట్టి జీవించి ఉంటారు కనుక ఎప్పుడు తప్పు చేయువారుగా ఉంటారు. నీ మనస్సాక్షిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతకలిగి ఉన్నావా? నీ మనసుక్షి ప్రకారముగా ఉండి దేవుని ప్రేమకొరకు చనిపో, అప్పుడు అది నిన్ను దేవుని నడిపింపులో నిన్ను నడిపించి నీయందు దేవుని ఉద్దేశములు మరియు కార్యములను ఇచ్చును. అప్పుడు నీవు చివరి తీర్పు దినమునందు పడిపోవు, ఎందుకంటె నీ హృదయమందు దేవునితో సమాధానము కలిగి జీవించావు కనుక.

ఒకవేళ నీవు ఇంకా నీకు ఇష్టమొచ్చినట్లు జీవించి దేవుని వాక్యమునకు క్రీస్తునకు వ్యతిరేకముగా ఉండి, నీ మనశ్శక్తి ప్రకారముగా ఉండకున్నట్లైతే అప్పుడు నిన్ను నీవు ఆ చివరి తీర్పు దినమునుంచి విడిపించుకొనలేవు. అది నిన్ను పరీక్షించి నిన్ను ఖండించును. కనుక నీకు పరిష్కారము దొరకదు అయితే సువార్తకు కట్టుబడి ఉండుము, ఎందుకంటే దేవుడే న్యాయాధి పతి అని నీకు చూపించును. కనుక క్రీస్తు దగ్గరకు వచ్చినట్లైతే నీకు విశ్రాంతి దొరుకును.

క్రీస్తు చేతులలో చివరి తీర్పు దినము ఇవ్వబడుతున్నదని నీకు తెలుసా? ఈ న్యాయాధిపతి యొక్క పూర్తి పేరు, "క్రీస్తు" మాత్రమే కాదని అయితే " యేసు " అని కూడా నీకు తెలుసా? ఈ రెండు నామములకు గల అర్థము ఏమనగా, "యేసు" అనునది ఆయన వ్యక్తిగత పేరు, "క్రీస్తు" అనునది అతని కార్యమును తెలుపునది. యేసు దేవుని ప్రవర్థనచేత మరియు అతని బహుమానములచేత నింపబడినవాడు, కనుక అతనికి సంపూర్ణ అధికారము కలదు, మరియు రక్షణను బట్టి మరియు తీర్పును బట్టి శక్తి కలిగిన వాడు.

అయితే పౌలు వ్రాసినట్లు దేవుడు క్రీస్తును బట్టి ఈ లోకమును ఖండించి అందులోని ప్రతి రహస్యములను బయలు చేయును. కనుక పౌలు యొక్క సువార్తలలో ఏమి బయలుపరచబడినదో అని తెలుసుకొనుట మనకు చాల ప్రాముఖ్యమైనది. మరియు పౌలు తన సువార్తలో చివరిదిగా దేవుని తీర్పు గురించి వ్రాసి ఉన్నాడు.

ప్రార్థన: ప్రభువా నాకు నేను తెల్సినదాని కంటే మరియి ఎక్కువగా నన్ను నీవు తెలుసుకొన్నావు. నా ప్రతి కార్యములు నీకు మరుగై లేవు. నా ప్రతి పాపమును ఒప్పుకొని నీ ప్రియకుమారుడైన యేసు దగ్గరకు వాటిని తెచ్చి ఉన్నాను. కనుక నన్ను క్షమించు ఒకవేళ నేను నా మనస్సాక్ధిని విననియెడల. లేక నీ స్వరమును నేను కావలసిగా నిర్లక్ష్యముచేస్తే నన్ను క్షమించు. నీ ప్రేమను నేను పండుకొని వాటిని తరులకు పంచుటకు నీ శక్తిని నాకు దయచేయుము.

ప్రశ్నలు:

  1. తీర్పు దినమందు దేవుడు అన్యులతో ఏవిధముగా వ్యవహరించును?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:35 AM | powered by PmWiki (pmwiki-2.3.3)