Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 003 (Identification and apostolic benediction)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
ప్రారంభము: అభివాదం, దేవునికి కృతజ్ఞత మరియు "దేవుని నీతి" పైన అవధారణము ఈ పత్రిక ముఖ్య ఉద్దేశము

a) ఆశీర్వాదమునకు ఆనవాలు (రోమీయులకు 1:1-7)


రోమీయులకు 1:2-4
2 దేవుని సువార్తనిమిత్తము ప్రత్యే కింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది.  3 మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక,  4 దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను. 

ఒక పంట పండుటాకు ముందు ఆ భూమి ఏవిధముగా అయితే పొడిగా మారుతుందో అదేవిధముగా స్రువర్త అనునది కూడా విశ్వాసుల జీవితములో ఫలింపలాగున మరియు ఆనందముగా శక్తి కలిగి ఉండులాగున సహాయము చేయును. కనుక ఒక గొప్ప రహస్యమైన క్రీస్తు కార్యము యేదనగా సువార్తే. కనుక నీవు ఒక పుస్తకమును నమ్ముటకు పిలువబడలేదు అయితే అదులో ఉన్న చరిత్రను బట్టి విశ్వసించుటకు పిలువబడినావు. కొన్ని వేళా సంవత్సరాల క్రితమే దేవుడు తన ప్రవక్తల ద్వారా, కన్యకా గర్భమందు పరిశుద్దాత్మ శక్తి చేత దేవుని కుమారుడు జన్మిస్తాడని చెప్పియున్నాడు. తోరా ఈ విధమైన ప్రవచనములచేత పూర్తిగా నింపబడినది. కనుకనే ప్రతి ప్రవక్త కూడా తన ప్రవచనము ద్వారా పుట్టబోవు శిశువు దేవుని కుమారుడని నమ్మిరి. కనుక ఎవరు ఈ పరిశుద్ధ దేవుడిని వ్యతిరేకిస్తారు, ఎందుకంటె అతను తనను గూర్చి తన పరిశుద్దతను గూర్చి ప్రకటించి మనలను పైకి లేపాడా? కనుక క్రీస్తు వచ్చినప్పటి నుంచి దేవుడి కనికరము గలవాడని, కృప కలిగిన వాడని, మరియు ప్రేమ కలిగిన తండ్రి అని మనము అర్థము చేసుకోగలం: కనుకనే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు.

కనుక దేవుని కుమారుడు nijamaina మనిషిగా ఉండి, అతను దావీదు వంశము నుంచి వచ్చి, ప్రవక్తలు కీర్తనాకారులు ప్రవచించి నాట్లు అతను పరలోకమునుంచి వచ్చి దేవుని మహిమ కొరకు ఉందును అని (2 సమూయేలు 7:14). ఈ అవతారంలో క్రీస్తు బలహీనమైన చర్మమును ధరించెను కనుక మన వలె ప్రతి చోట హింసించబడెను.

అయినప్పటికీ అతను పాపరహితుడుగా ఉండెను, ఎందుకంటె మరణమునకు అతని పైన అధికారము లేకపోయెను,కనుక పరిశుద్ధాత్మచేత అతను పాపములేని వాడుగా ఉండెను. క్రీస్తు తన శక్తిని ఈ లోకమునకు మరియు అతనిని చూస్తున్నామనుషులకు తన పునరుత్తనము ద్వారా చూపెను. కనుక ఈ గొప్ప అద్భుతము ద్వారా దేవుడు యేసు కుమారత్వమును అంగీకరించి అతనిని తన కుడిపార్శ్యమున కూర్చుండుటకై అభిషేకించెను కనుక ఇప్పుడు అతను మనందరి కొరకు ఒక రాయబారిగా ఉండి దేవునితో: " ఆకాశమందే కానీ భూమి యందె కానీ సమస్త అధికారము నాకు ఇయ్యబడెను" అని చెప్పెను, మరియు అతను తన తండ్రితో పాటు ఉండి పరిశుద్ధాత్మను కలిగి ఉండి దేవునితో సదాకాలము ఉండెను".

కనుక ఈ విధమైన శక్తిని యేసు పౌలుకు ఇచ్చినప్పుడు అతను సంఘములలోనికి పరిగెత్తుకుని వెళ్లెను; కనుక క్రీస్తు ఈ దినాలలో కూడా ఎవరైతే నిజమైన నూతన జీవితము కలిగి ఉంటారో వారు క్రీస్తుతో కూడా జీవము కలిగి ఉంటారు. " యేసు క్రీస్తు మన ప్రభువు" అనే మాటకు క్రైస్తవము ప్రారంభమైనది మొదలుకొని మన విశ్వాసమును బట్టి చెప్పబడిన మాట. ఈ మాటలో పరిశుద్దాత్మ మరియు శక్తి కలిగిన రక్షణ మరియు నిరీక్షణకు బత్తిన రహస్యములు ఉన్నవి.

ప్రార్థన: ప్రభువా నీ ప్రేమ ద్వారా నీవు నీవు మానవునిగా జన్మించి పాపమును జయించి మరణమును జయించినందుకు నీకు కృతజ్ఞతలు. మమ్ములను నీ పరిశుద్ధాత్మచేత నింపి నీ రాజ్య విస్తరణము చేత మమ్ములను నీ రాజ్యములోనికి మార్చుము. మేము నీతి కలిగి న్యాయము కలిగి మంచి నడవడిక కలిగి ఉండునట్లు చేయుము అప్పుడు ఇతరులకు మేము నీ యొద్దకు నడిపించుటకు ఒక మార్గముగా ఉండెదము.

ప్రశ్నలు:

  1. క్రీస్తు దేవుని కుమారుడు అనే మాటకు గల అర్థము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:00 AM | powered by PmWiki (pmwiki-2.3.3)